కొవ్వులు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటుంటాం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే కొవ్వుల్లాగే ఇవీ హానికరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల గుండె జబ్బులు పెరిగే ముప్పు ఉంటుంది. అలాగే డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు పెరగడం వల్ల కూడా గుండెకూ, మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది.
ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి...
- ట్రైగ్లిజరైడ్స్‌ను అదుపులో ఉంచుకోండి.
- కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా... అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు.
- తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.
- డ్రైఫ్రూట్స్‌లో పీచుట్రైగ్లిజరైడ్స్‌ను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాటిని తరచూ తీసుకోవడం మంచిది. అయితే అందులోనూ జీడిపప్పు వంటి కొవ్వులు ఒకింత ఎక్కువగా ఉండే నట్స్ కంటే కొవ్వు తక్కువగా ఉండే బాదం వంటివి మేలు చేస్తాయి.
- భోజనానికి మందుగా వెజిటబుల్ సలాడ్స్, భోజనంలో భాగంగా తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడం కూడా మంచిది. వీటిలోని పీచుపదార్థాలూ ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. పీచు ఎక్కువగా ఉండేలా... పొట్టుతీయని తృణధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్ వంటి ధాన్యాలు), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి.
- ఆహారంలో వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. అంటే కేవలం రుచికోసం చాలా కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే వూంసాహారం (వేటమాంసం, రొయ్యలు, చికెన్ స్కిన్ వంటివి) చాలా పరిమితంగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తగ్గించాలి.
- స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి.
- ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి.
- ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ∙పొగతాగడం పూర్తిగా వూనేయాలి.
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి.
- వారంలో కనీసం వుూడుసార్లు చేపలు తీసుకోవడం మంచిది. అయితే వాటిని కేవలం ఉడికించి వండాలి. లేదా గ్రిల్ చేసినవి తీసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసినవి వద్దు.
Comments
Please login to add a commentAdd a comment