ప్రపంచ దేశాల సదస్సులో నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులతో దేశానికి ముప్పు పొంచి ఉందని, వీటిని నియంత్రించకపోతే వేల కోట్లు మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరించారు. ‘ఆరోగ్యంపై భవిష్యత్ కార్యాచరణ-ఉమ్మడి కృషి’ అనే అంశంపై రెండ్రోజులపాటు ఢిల్లీలో జరిగిన ప్రపంచ దేశాల సదస్సు బుధవారం ముగి సింది. ఇందులో అపోలో ఆస్పత్రులు, పీహెచ్‌ఎఫ్‌ఐ (పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా)లతో పాటు వివిధ దేశాల ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఎన్‌సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్- అంటువ్యాధులు కాని గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం) జబ్బులేనని స్పష్టం చేశారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఇది పెనుముప్పుగా పరిణమించిందన్నారు. భారత్‌లో 80 శాతం మంది ఎన్‌సీడీ జబ్బులవల్లే మరణిస్తున్నారన్నారు. ఎన్‌సీడీ లాంటి జీవనశైలి జబ్బుల కారణంగా పదేళ్లలో ప్రపంచ దేశాలు 4.70 కోట్ల డాలర్ల భారాన్ని మోయాల్సి వస్తుందని అంచనా వేశారు. వీటిని నియంత్రించకపోతే.. 2030 నాటికి భారత్‌లో మధుమేహ రోగుల సంఖ్య 10.1 కోట్లకు, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారి సంఖ్య 21.4 కోట్లకు చేరుకుంటుం దని తెలిపారు. ఎన్‌సీడీ జబ్బులతో మరణిస్తున్న వారి లో 25 శాతం మందిని రక్షించుకునేందుకు ఆస్కారముందన్నారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, అపోలో ఆస్పత్రుల అధినేత డా.ప్రతాప్ సి. రెడ్డి పాల్గొన్నారు.
భారత్‌కు రోగాల ముప్పు!
Published Thu, Mar 6 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement