ఉప్పు కొరత లేదు | salt stock ok ..no tentions | Sakshi
Sakshi News home page

ఉప్పు కొరత లేదు

Published Mon, Nov 14 2016 9:42 PM | Last Updated on Fri, Nov 9 2018 5:34 PM

salt stock ok ..no tentions

కొత్తపల్లి : 
జిల్లాలో ఉప్పు కొరత లేదని వద్దంతులు నమ్మవద్దని  జిల్లా పౌర సరఫరాల అధికారి కృష్ణారావు అన్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో కొంత మంది ఉప్పు కొరతను సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే సమాచారం రావడంతో సోమవారం పలు కిరాణా షాపులను తనిఖీ చేశారు. నిల్వలను పరిశీలించారు. అధిక రేట్లకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే ఉప్పు తయారీ ఎక్కువగా జరుగుతుందన్నారు. అలాగే చేపలను నిల్వ చేసే ఉప్పును విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అధిక రేట్లకు విక్రయిస్తే 80083 01431కు ఫో¯ŒS చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఆయన వెంట ఏఎస్‌వో పి.సురేష్, ఎంఎస్‌వో తాతారావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement