
సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి.
వెల్‌స్పన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment