శ్రీదేవి అందం కాపాడుకోవడం కోసం ఫాలో అయిన డ్రైట్ అత్యంత ప్రమాదకరమైంది. వైద్యలు సైతం వద్దని వారించిన ఆమె చనిపోయేంత వరుకు ఆ డైట్ ఫాలో కావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సైతం చెబుతున్నారు. ఆమె అందం కోసం చేసిన డైట్ ఏంటీ? అంత ప్రమాదకరమైందా? వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించే ఈ కథనం.
టాలీవుడ్ నటి శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువుగా ఉండే డైట్ ఫాలో అయ్యేది. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఒక రకంగా కారణమైంది. డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కవుగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు కూడా. అయినా ఆమె చనిపోయేంత వరకు కూడా అలా ఉప్పులేకుండానే తినడంతో అదికాస్తా లో బీపీకి దారితీసిందని, ఆమె ఆకస్మిక మరణానికి అది కూడా ఒక కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు.
ఇలా అస్సలు వద్దు..
మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం, తదితరాల ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమయ్యే అత్యంత ప్రధానమైన ఖనిజాల్లో ఒకటి. ఇది సెల్యూలార్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఒకవేళ ఉప్పుని ఆహారంలో పూర్తిగా స్కిప్ చేస్తే ఎలక్టోలైట్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చి ఒక్కసారిగా మైకం కమ్మి స్ప్రుహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా లోబీపీ రావడమే గాక అనే రకాల దుష్ప్రభావాలను ఎదర్కొనక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎదురయ్యే దుష్ప్రభావాలు..
శరీరానికి సరిపడ సోడియం అందనట్లయితే నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతారు. ఒక మనిషి శరీరంలో ఉండవల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్‌కి 135 మిల్లీక్వివలెంట్స్(ఎంఈక్యూ/ఎల్) కంటే తక్కువుగా ఉంటే దాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బడం తోపాటు రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం కమ్మడం, కళ్లు తిరిగడం వంటివి ఎదర్కొంటారు.
ఈ హైపోనాట్రేమియా కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి అంత త్రీవ స్థాయిలో ఉండకపోవచ్చు. మందులతోనే క్యూర్ అవ్వొచ్చు. కొందరికి ఇది తీవ్ర స్థాయిలో ఉండి..మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కొసారి మెదడులో నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడి చనిపోవచ్చని వైద్యలు విక్రమ్‌జిత్ సింగ్ చెబుతున్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గిస్తే ఎటువంటి సమస్య లేదుగానీ ఏదో అందం కోసం అని ఉప్పు లేకుండా ఆహరా పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం ప్రతి రోజు ఐదు గ్రాములు ఉప్పు వినియోగించొచ్చని నొక్కి చెబుతోంది. ఇంతకు మించి తక్కువగా వాడితే కోమాలోకి వెళ్లిపోయి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల దయచేసి సినీతారలు దగ్గర నుంచి సామాన్యుల వరకు మన శరీరానికి కావాల్సినంత ఉప్పుని తీసుకోవడమే సర్వవిధాల మంచిది.
(చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..)
Comments
Please login to add a commentAdd a comment