ఉప్పు తగ్గించండిరా బాబోయ్‌! ఏటా 25 లక్షలమందికి ముప్పు | Cutting Down On Salt Could Save 25 Lakhs Lives Per Year Says WHO | Sakshi
Sakshi News home page

ఉప్పు తగ్గించండిరా బాబోయ్‌! ఏటా 25 లక్షలమందికి ముప్పు

Published Fri, May 17 2024 12:26 PM | Last Updated on Fri, May 17 2024 1:39 PM

Cutting Down on Salt Could Save 25 lakhs Lives Per Year Says WHO

ప్రపంచవ్యాప్తంగా మే 17న  వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే  జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్‌ కిల్లర్‌ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం  వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని  డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్‌ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని  ప్రాణాపాయం నుంచి  కాపాడవచ్చని  కూడా పేర్కొంది.

పెద్దలు సగటున   రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల  మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.

డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండి
ప్రాసెస్ చేసిన  ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా  తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని  సూచించింది.  ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని  డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు  డైనింగ్ టేబుల్ నుండి  తొలగించాలంటూ సలహా ఇచ్చింది.  కమర్షియల్‌ సాస్‌లు,  ఫుడ్స్‌ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు  పొందవచ్చని వివరించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement