
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్ ఘాఘ్ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.
చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్!)
Comments
Please login to add a commentAdd a comment