khichdi
-
వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..
ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు.మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. -
సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిపోవడంతో 41 మంది కూలీలు గత 9 రోజులుగా దానిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం (నవంబర్ 20) ఆరు అంగుళాల కొత్త పైప్‌లైన్ ద్వారా మొదటిసారిగా బాధితులకు ఘన ఆహారాన్ని అధికారులు అందించగలిగారు. రెస్క్యూ టీమ్ ఈ పైపు ద్వారా వారికి బాటిళ్లలో వేడి కిచిడీని పంపింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం అందకపోవడంతో వారు నీరసించిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ అనే కుక్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం కిచిడీని తయారు చేశారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్ తెలిపారు. తాము కిచిడీ మాత్రమే పంపుతున్నామని, తమకు అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నామని హేమంత్ పేర్కొన్నారు. బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్ధామ్ ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. 41 మంది కూలీలు లోపల చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం పంపిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల సహకారంతో చార్ట్‌ను సిద్ధం చేశామన్నారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne — ANI (@ANI) November 20, 2023 -
కిచిడి తిని 21 మంది అస్వస్థత
కిచిడి తిని పిల్లలు, పెద్దలతో సహా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లోని నానానా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ దేవాలయం వసంత నవరాత్రి సందర్భంగా జరిగిన విందులో కిచిడి తిని 20 మంది పిల్లల తోసహ కొందరు పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసుల, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాదితులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, మిగతా పిల్లలు, పెద్దల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి మాట్లాడుతూ..ఆలయంలోని కిచిడి తిని రెండు డజన్ల మందికి పైగా ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అలాగే పిల్లల బాగుగాలు చూసేందుకు ఇద్దరు శిశు వైద్యులను నియమించినట్లు తెలిపారు. (చదవండి: పానీపూరీలు అమ్ముకుంటున్న వైద్యురాలు.. ఎందుకంటే..) -
కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్ ఘాఘ్ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్!) -
మోదీకి ఇష్టమైన కిచిడిని వండిన ఆస్ట్రేలియా ప్రధాని
Scott Morrison Celebrate India-Australia Trade Deal: భారత్ ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌తో జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మోదీకి ఇష్టమైన కిచిడిని వండి సెలబ్రెట్ చేసుకున్నారు. ఆయన వంటకాలకు సంబంధించిన ఫోటోలను మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.."భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాను ఇలా సెలబ్రెట్ చేసుకున్నాని చెప్పారు. ఈ రాత్రికి భారతీయ వంటకాలను తయారు చేస్తున్నాని చెప్పారు. తాను వండటానికి ఎంచుకున్న కూరలన్నీ గుజరాత్‌కి చెందినవే. అంతేకాదు అందులో నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడి కూడా ఉంది" అని చెప్పారు. అదీగాక మోదీ ఎన్నోసార్లు ఇంటర్యూల్లో తనకు కిచిడి అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు కూడా. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం అయిన కిచిడి వండటం అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. ఏప్రిల్ 2న భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి. అంతేగాక ఈ ఒప్పందంలో 95 % భారతీయ ఉత్పత్తులకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఎగుమతులను బిలియన్ డాలర్ల మేర పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అదీగాక ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్లు, బొమ్మలు, పాదరక్షలు, తోలు వస్తువులతో సహా కీలకమైన ఆస్ట్రేలియన్ మార్కెట్లలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం భారత్‌ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చగలదు. View this post on Instagram A post shared by Scott Morrison (@scottmorrisonmp) (చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం) -
వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ..
గువాహటి: రోజురోజుకీ దొంగతనం కేసులు ఎక్కువైపోతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లు కంట పడితే చాలు ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనానికి వచ్చిన వారు చప్పుడు చేయకుండా సైలెంట్‌గా పని కానిచేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో వంట వండుకుంటూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విచిత్ర ఘటన అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంటికి తాళం వేసి ఉండటంతో విలువైన వస్తువులు దొంగిలించేందుకు దొంగ లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మూటగట్టాడు. అయితే ఇంతలోనే దొంగకు ఆకలి వేయడంతో కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ వండుకోవటం మొదలుపెట్టాడు. కానీ వంట చేసే సమయంలో సౌండ్స్ రావడం అతని కొంప ముంచింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటింటి నుంచి శబ్దాలు రావడం పక్కింటి వారికి అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తాపీగా కిచిడీ వండుకుంటున్న దొంగను పట్టుకున్నారు. చదవండి: వైరల్ వీడియో: ప్యాంట్‌పై బురద, ఊగిపోతూ ఏం చేసిందంటే.. కాగా ఈ దొంగతనం ఘటన సోమవారం చోటుచేసుకోగా ఈ విషయాన్ని అస్సాం పోలీసులు చమత్కారంగా ట్వీట్ చేశారు. ‘కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. గువాహటి పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చదవండి: RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం The curious case of a cereal burglar! Despite its many health benefits, turns out, cooking Khichdi during a burglary attempt can be injurious to your well being. The burglar has been arrested and @GuwahatiPol is serving him some hot meals. pic.twitter.com/ehLKIgqcZr — Assam Police (@assampolice) January 11, 2022 -
ఖిచడీచప్పుడు లేకుండా గుటుక్కు!
ఆకేసి పప్పేసి నెయ్యేసీ బువ్వపెట్టి... అంటూ రకరకాలు కలిపి ఆకుమీద వేశాకే అది మృష్టాన్నం అవుతుంది. కానీ ఖిచిడీ అలా కాదు... పప్పు నెయ్యి బియ్యం... ఇంకా ఎన్నెన్నో సంభారాలన్నీ కలిపి గిన్నెలో వేసేసి వండేస్తే చాలు... అన్నీ కలగలిసి అదే ఖిచిడీ అవుతుంది. ఆ ఆహారం సంపూర్ణమవుతుంది. అప్పుడే అన్నప్రాశన చేసిన పిల్లాడి నుంచి మొదలుకొని అర్జెంటుగా ఆఫీసుకెళ్లాల్సిన పెద్దాళ్ల వరకు... పచ్చడీ కూరా చెట్నీ ఉన్నా బెంగలేదు... లేకున్నా పర్వాలేదు. విడివిడిగానైనా, కలివిడిగానైనా కలుపుకోకుండానూ, కలుపుకొనైనా రుచిరుచిగా వడివడిగా తినగలిగేది ఖిచిడీ! అన్నట్టు... మామూలు ఖిచిడీలే ఎందుకు...? చూడగానే మింగాలి అనిపించే పాలక్, బెంగాలీ... తినేసి బ్రేవున త్రేన్చాలనిపించే సాబుదానా, చెనాదాల్!! వీటన్నింటినీ వండేద్దాం...! (ఖి)చడీచప్పుడూ లేకుండా గుటుక్కుమనిపిద్దాం!! రండి... ముందుగా వంట దినుసులు అందుకోండి. సాబుదానా ఖిచిడీ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు నీటిని వడ కట్టి సగ్గుబియ్యాన్ని పక్కనుంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసేసి, చేతితో మెత్తగా మెదపాలి ►వేయించిన పల్లీలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి ►ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఉడికించిన మెదిపిన బంగాళ దుంప, పంచదార, ఉప్పు వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ►తయారుచేసి ఉంచుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని జత చేసి ఐదారు నిమిషాల పాటు వేయించాలి ►బాగా ఉడికిన తరువాత దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి ప్లేట్లలో వేడివేడిగా అందించాలి. బెంగాలీ ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 2; లవంగాలు – 3; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; క్యాలీఫ్లవర్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 5 కప్పులు. తయారీ: ►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పాన్‌లో పొట్టు పెసర పప్పును వేసి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించి, దింపి చల్లారాక, తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి నీరు వడ కట్టేయాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి ►అల్లం తురుము, పసుపు, మిరప కారం, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి ►బంగాళ దుంప తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి బాగా మెత్తబడేవరకు కలుపుతుండాలి ►వేయించిన పొట్టు పెసర పప్పు జత చేసి మరోమారు వేయించాలి ►వడ కట్టిన బియ్యం జత చేయాలి ’ ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలియబెట్టి, మూత పెట్టాలి ’ ఉడికిన తరవాత దింపేయాలి ’ పెరుగు, అప్పడాలతో వేడివేడిగా సర్వ్ చేయాలి. పాలక్ ఖిచిడీ కావలసినవి: పాలకూర తరుగు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పెసర పప్పు – అర కప్పు; బాస్మతి బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; బంగాళ దుంప తరుగు – పావు కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – ఒకటి; లవంగాలు – 2; ఏలకులు – 2; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు. తయారీ: ►ఒక పాత్రలో బియ్యం, పెసర పప్పు వేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి ►బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడేవరకు వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాక, పాలకూర పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ►నానబెట్టిన బియ్యం, పెసర పప్పు వేసి, బాగా కలిపి, నాలుగు కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టి, కుకర్ మూత ఉంచాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆనియన్ రైతా, సింపుల్ వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి. ఓట్స్ ఖిచిడీ కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; బిర్యానీ ఆకు – 1; టొమాటో తరుగు – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; బంగాళదుంప తరుగు – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పొట్టు పెసర పప్పు – అర కప్పు (శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి); ఓట్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – రెండున్నర కప్పులు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►తరిగిన కూరగాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మెత్తబడే వరకు వేయించాలి ►పెసర పప్పు జత చేసి, మరోమారు వేయించాలి ►ఓట్స్ జత చేయాలి ∙పసుపు, మిరప కారం వేసి, బాగా కలిపి, రెండున్నర కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మూత తీసి కొత్తిమీరతో అలంకరించి, రైతా లేదా ఏదైనా ఊరగాయతో వేడివేడిగా అందించాలి. (ఈ విధంగా జొన్నలు, సజ్జలు, రాగులతో కూడా తయారుచేసుకోవచ్చు) తామర గింజలు – గోధుమరవ్వ ఖిచిడీ కావలసినవి: తామర గింజలు – పావు కప్పు; గోధుమ రవ్వ – అర కప్పు.; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 8; కొత్తిమీర – చిన్న కట్ట; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; జీలకర్ర – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ : ►ముందుగా రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►రవ్వ వేసి బాగా కలియబెట్టి ఉడికించాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►ఉప్పు, నిమ్మ రసం జత చేయాలి ►ఒక పాత్రలో ఉడికించిన రవ్వ, వేయించిన మసాలా మిశ్రమం వేసి బాగా కలపాలి ►చివరగా తామర గింజలు జత చేసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ ఖిచిడీ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు – మూడు కప్పులు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి) ; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి ; పాలు – ఒక కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►స్వీట్‌కార్న్ ముద్ద వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►పాలు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి, సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు కార్న్ మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. సెనగ పప్పు ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; ఇంగువ – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి లేదంటే వేడి నీళ్లలో అర గంట సేపు నానబెట్టాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట సేపు నానబెట్టాలి ►కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక, మిరప కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి ►సెనగ పప్పు జత చేసి బాగా కలిపి, ఒక కప్పుడు నీళ్లు పోసి, మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి (పప్పు పొడిపొడిలాడేలా ఉడికించాలి) ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిగా పొడిపొడిలా ఉండేలా ఉడికించాలి ►ఉడికించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసి కలపాలి ►ఆనియన్ రైతాతో లేదా సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటుంది. నాన్–వెజ్ అవధి గోష్ కుర్మా కావల్సినవి: మటన్ ముక్కలు – 250 గ్రా.లు; దాల్చిన చెక్క – చిన్నముక్క; లవంగాలు – 6; యాలకులు – 6; చిరోంజి పప్పు – 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పు (నానబెట్టి, పొట్టు తీయాలి) – పావు కప్పు; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లుక; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్; కారం – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; గరం మసాలా – టీ స్పూన్; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ తరుగు – ముప్పావు కప్పు; రోజ్ వాటర్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన ఉంచాలి ►తగినన్ని నీళ్లు పోసి చిరోంజిçపప్పు, బాదంపప్పు వేసి, పది నిమిషాలు ఉడికించి, మెత్తగా నూరి పక్కన ఉంచాలి ►మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి ►మటన్ ముక్కలు వేసి 5–6 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో కప్పు టొమాటో గుజ్జు కలిపి ఉడికించి, బాదాంపప్పు మిశ్రమం, కారం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి, సన్నని మంట మీద ఉడికించాలి ►చివరగా రోజ్ వాటర్, గరం మసాలా వేసి మరికొన్ని నిమిషాలు ఉంచి, మటన్ ముక్క ఉడికిందా లేదా సరిచూసుకోవాలి ►వేడి వేడిగా పులావ్ లేదా పరాటాలోకి వడ్డించాలి. రొయ్యల కూర కావల్సినవి: రొయ్యలు – పావుకేజీ; నూనె – 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి – అర టీ స్పూన్; అల్లం – టీ స్పూన్; ఉల్లిపాయ – 1 (తరగాలి); పసుపు – పావు టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం.. జీలకర్ర – టీ స్పూన్; కొబ్బరి తరుగు పాలు – అర కప్పు; మిరియాలు – 15; కారం – టీ స్పూన్; వెనిగర్ – అర టీ స్పూన్; అల్లం – అర టీ స్పూన్; వెల్లుల్లి – అర టీ స్పూన్ తయారీ: ►ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి ►రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి ►దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి ►దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. సీమకోడి వేపుడు కావల్సినవి: బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; కారం – టీ స్పూన్; మైదా – టీ స్పూన్; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెమ్మ; నూనె – తగినంత; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►చికెన్‌ను కడిగి, వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం పిండి కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ►తర్వాత చికెన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి. ►కడాయిలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చికెన్ ముక్కలను బాగా వేయించాలి. -
‘కిచిడీ’ రాజకీయాలు
కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగువాడిగా గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. నాకు రాజకీయాలలో అపా రమైన అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు గానే బీజేపీ, కాంగ్రెస్, హిందూ, ముస్లిం, సిక్కులు, కశ్మీర్–భారతదేశం– ఇలా రకరకాల వర్గాల మధ్య భయంకరమైన రాజకీయ సంక్షోభం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని బల్లగుద్ది చెప్పగలను. దీనికి ఒకే ఒక కారణం– కిచిడీ. అదిగో, తమరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. కానీ ఇది నవ్వి మరిచిపోయే విషయం కాదనీ, ముందు ముందు ముదిరి కొంపలు ముంచ గలదని నిరూపించడానికే ఈ కాలమ్. ముందుగా కిచిడీ తయారీకి మా వంటావిడ చెప్పిన విధి విధానమిది: మొదట– బంగాళాదుంప, క్యారెట్, ఆకుపచ్చ బఠాణీలు, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వేరే చిప్పలో ఉల్లిపాయ, పచ్చిమిరప కాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరిగి పెట్టుకోండి. ఈ ముక్కల్ని జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ పప్పుతో కలిపి– నూనె, నెయ్యి – ఇదీ రహస్యం – రెండింటితో కలిపి వేయించాలి. ఇప్పుడు కుక్కర్లో బియ్యం, పెసరపప్పు, ఈ వేగిన ముక్కల్ని వేయాలి. ఒకటికి రెండు న్నర గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు, చిటికెడు పసుపు వేసి– స్టౌ వెలి గించాలి. రెండు విజిల్స్ వచ్చాక ఆపి, తయారైన పదార్థం మీద అరచెంచా నెయ్యి చిలకరించి– ప్లేట్లో ఉంచుకుని తినాలి. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చలామణికి వచ్చిన ‘జాతీయ కిచిడీ’ జన్మ రహస్యం. ఒక్క విషయం మరిచిపోకూడదు. ఇది భారతదేశపు ‘జాతీయ కిచిడీ’ కాదు. ప్రపంచ ఆహార జాబితాలో భారతదేశానికి ప్రాధాన్యం వహించే వంటకంగా దీనిని ఎంపిక చేశారు. నవంబర్ 4న ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవంలో దేశ ప్రఖ్యాత వంటగాడు సంజీవ్ కపూర్ కిచిడీని తయారు చేశారు. 7 అడుగుల విస్తీర్ణం గల వెయ్యి లీటర్ల నీరు పట్టే గుండిగలో 918 కేజీల కిచిడీని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. దీనిని 60 వేలమంది అనాధ పిల్లలకు పెట్టారు. వీరు కాక ఈ ఉత్సవాలకు వచ్చిన అతిథులకి, మన దేశంలో ఉన్న వివిధ విదేశీ కార్యాలయాలకు పంపారు. అయితే ఇది జాతీయ వంటకం కాదు. ఆహార ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్శిమ్రాట్ కౌర్ బాదల్ మాటల్లో ‘‘ఈ కిచిడీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వా’’నికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వంటకాన్ని ఈ ఉత్సవంలో చేర్చామని పేర్కొన్నారు. వెంటనే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒంటికాలుమీద లేచారు. ‘‘ఈ కిచిడీ తినడం చూసినప్పుడల్లా మనం లేచి నిలబడాలా? ప్రతీ సినీమా చూడటానికి ముందు కిచిడీ తినడం విధాయకమా? దీనిని నచ్చకపోవడం జాతీయ వ్యతిరేక చర్య అవుతుందా?’’ ఇవీ వారి మాటలు. వారి మనసులో ఇంకా జాతీయ గీతం ప్రతిధ్వనిస్తోంది. వందేమాతరానికీ, కిచిడీకీ తేడా వారి మనస్సుదాకా రాలేదు. వారి చెవుల్లో ‘కిచిడీ’ అంటే ‘వందే...’ అని ప్రతిధ్వనిస్తోంది. వారు అర్జంటుగా చెవి, ముక్కు, నాలుక నిపుణుడిని సంప్రదించాలి. ఇక కిరణ్ మన్రాల్ అనే రచయిత ‘‘నేను తీవ్రంగా దీనిని ప్రతిఘటిస్తున్నాను. బొత్తిగా జబ్బు చేశాక పత్యం పెట్టే వంటకాన్ని జాతీయ వంటకం అంటారేమిటి?’’ అని కోపం తెచ్చుకున్నారు. ఆ వరు సలోనే వారు ‘పులావ్’ని గుర్తు చేశారు. మరొకరు ఒక పాయింట్ లేవదీశారు: ‘‘అసలు యునెస్కో దీనిని జాతీయ వంటకంగా అనుమతించిందా?’’ అన్నారు. రన్వీర్ బ్రార్ అనే దేశ ప్రఖ్యాత వంటగాడు: ‘‘కిచిడీ అంటే నాకు ఇష్టమే. కానీ జాతీయ వంటకంగా ఆ ఒక్క వంట కాన్నే ఎంపిక చేయడం అన్యాయం. మన దేçశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. ఎన్నో రుచులున్నాయి. ఎన్నో వంటకా లున్నాయి. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందుకి ఒక్క కిచిడీతో చావ మంటే ఎలాగ?’’ అని వాపోయాడు. తమరు ఈ స్పందనలో రాజ కీయ దుమారాన్ని గుర్తుపట్టాలి. ఇందులో సిక్కులు, ముస్లింలు, కశ్మీరీలు, పులావ్లూ, యునెస్కోలూ– ఇన్ని చోటు చేసుకున్నాయని గ్రహించాలి. ముందు ముందు తమిళనాడు ఎడపాడి పళని స్వామి ‘కారపు పొంగల్’ని ప్రతిపాదిస్తారు. కర్ణాటక సిద్దరామయ్య– కాంగ్రెస్ కనుక – తప్పనిసరిగా ‘బిసి బెళ బాత్’ని ప్రతిపాదిస్తారు. మహారాష్ట్ర నుంచి రాజ్థాకరేగారు ‘పాఠోళీ’ అంటారు. పంజాబీ మిత్రులు– ‘సార్సోంకా సాగ్’ అనవచ్చు. బెంగాలీ సోదరులు ‘చిత్తర్ మశ్చేర్ ముయితా’ అనవచ్చు. గుజరాతీ సోదరులు డొక్లా అని కానీ తెప్లా అని కానీ అనవచ్చు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, డోక్లాం తలనొప్పు లతోపాటు ‘కిచిడీ’ సమస్య పెంచుకోవడం– రాజకీయ మేధావుల లక్షణం కాదు. ఏతావాతా– కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగు వాడిగా అలనాడు – అంటే 129 సంవత్సరాల కిందటి నుంచీ – అంటే గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. - గొల్లపూడి మారుతీరావు -
గిన్నిస్ కిచిడీ @ 918 కేజీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఇంటికీ సుపరిచితమైన కిచిడీ వంటకంతో భారత్ గిన్నిస్ రికార్డును సాధించింది. దేశరాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా–2017 కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో 50 మంది చెఫ్‌ల బృందం 918 కేజీల కిచిడీని తయారుచేసి ఈ ఘనతను సాధించింది. నవంబర్ 3 నుంచి ఆదివారం వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), గ్రేట్ ఇండియా ఫుడ్ స్ట్రీట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బియ్యం, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు, కూరగాయలతో ఈ కిచిడీని తయారుచేశారు. కనీసం 500 కేజీలు దాటితేనే గిన్నిస్ రికార్డు సొంతమయ్యే అవకాశం ఉండటంతో ఏకంగా 918 కేజీల కిచిడీని రూపొందించటం విశేషం. ఇందుకోసం 3 నెలల ముందుగానే సన్నాహకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహారశుద్ధి శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. అన్ని పోషకాలను కలిగి ఉండే ఏకైక ఆహారం కిచిడీయేనని తెలిపారు. ఈ కిచిడీని అక్షయ ఫౌండేషన్, గురుద్వారాల సాయంతో దాదాపు 60,000 మందికి పంచిపెడతామన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ పౌలినా సపిస్కా స్పందిస్తూ.. భారత్ 918 కేజీల కిచిడీని రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆహారశుద్ధి సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, యోగా గురువు బాబా రాందేవ్, డెన్మార్క్ ఆహార మంత్రి ఎస్బెన్ లుండే తదితరులు పాల్గొన్నారు. -
కిచిడి చేసిన కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కిచిడి చేశారు. వరల్డ్ ఫుడ్ ఈవెంట్ సందర్భంగా చెఫ్ ఇతియాజ్ ఖురేషి, చెఫ్ రణవీర్ బ్రార్‌లతో కలిసి ఆమె కిచిడి ప్రీపేర్ చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో ఏకంగా 800 కేజీల ధాన్యాలతో 'బ్రాండ్ ఇండియా కిచిడి'ని తయారు చేసి వరల్డ్ రికార్డు కొట్టేయాలని భారత్ చూస్తోంది. 800 కేజీల ధాన్యాలతో కిచిడిని తయారుచేసే కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. వైవిధ్యంలో దేశ ఐక్యతను సూచించే విధంగా బియ్యం, పప్పులు, ముతక ధాన్యాలు, సుగంధ ధాన్యాలతో కిచిడిని తయారుచేయనున్నారు. సీఐఐతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాకశాస్త్ర ప్రావీణ్యుడు సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. కిచిడి భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారమని, ఆరోగ్యకరమైన ఆహారంగా ఇది పరిగణించబడుతుందని ఫుల్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. వైవిధ్యంలో ఐక్యత సూచించే దేశీయ ఉన్నత సంప్రదాయానికి కిచిడి ఓ ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేడు తయారుచేసే ఈ కిచిడిని 60వేల మంది అనాధ పిల్లలకు, ఈవెంట్లో పాల్గొనే గెస్ట్‌లకు వడ్డించనున్నారు. రెసిఫీతో పాటు ఫారిన్ మిషన్‌లో ఉన్న అధినేతలందరికీ ఈ వంటకాన్ని పంచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్లు, కిచెన్లలో కిచిడి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. -
’కిచిడీ’ తుఫాన్ సద్దుమణిగింది!
టీ కప్పులో తుఫాన్ తెలుసు మనకు. కానీ కిచిడీ పాత్రలో తుఫాన్ ఎప్పుడైనా చూశామా? తాజాగా ట్విట్టర్లో అదే జరిగింది. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నట్టు కథనాలు రావడంతో ఒక్కసారిగా ట్విట్టర్లో ఇది హాట్ టాపిగ్గా మారిపోయింది. ఇదే అంశంపై నెటిజన్లు పుంఖానుపుంఖాలుగా కామెంట్లు, జోకుల వరదతో ముంచెత్తడంతో ’కిచిడీ’ వైరల్ అయింది. దీంతో కేంద్ర ఆహారశాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ దిగొచ్చి.. కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించడం లేదని స్పష్టత ఇచ్చారు. ’మీరు వండిన కల్పిత ’కిచిడీ’ చాలు. వరల్డ్ ఫుడ్ ఇండియాలో కిచిడీకి రికార్డ్ ఎంట్రీ మాత్రమే ఇవ్వబోతున్నాం’ అని ఆమె ట్విట్టర్లో తెలిపారు. అంతకుముందు నెటిజన్లు ట్విట్టర్లో ’కిచిడీ’పై చేసిన ’కిచిడీ’ అంతా ఇంతా కాదు. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నారన్న కథనాలపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చారు. ’ఎవరైనా కిచిడీ తింటున్నప్పుడు చూస్తే.. లేచి నిలబడాలా? సినిమాకు ముందు కచ్చితంగా కిచిడీ తిని తీరాలా? కిచిడీ నచ్చనివారు దేశద్రోహులేనా’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ’కిచిడీ తినడం వల్ల ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారని, రాముడు ఒకప్పుడు ప్రతిరోజూ కిచిడీ తినేవారని త్వరలోనే మెసెజ్‌లో పోటెత్తుతాయి’ అని ఓ నెటిజన్ చమత్కరించారు. Enough Khichdi cooked up on a fictitious 'National Dish’. It has only been put for a record entry in #WorldFoodIndia. — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) November 1, 2017 Do we have to stand every time we see it being eaten? Is it compulsory to eat before a movie? Is it anti-national to not like the stuff? https://t.co/MkgWEBNQlH — Omar Abdullah (@OmarAbdullah) November 1, 2017 Soon we'll witness a thread about how eating Khichdi helped someone deliver Swadeshi triplets 🙄 and how Ram used to eat Khichdi everyday. 😒 — Priyanka (@autumnrainwish) November 1, 2017 If Khichdi is being accorded the status of National Food, then Ghee, Dahi, Papad and Achaar should immediately be declared National Friends. pic.twitter.com/bLX842WL1S — Roflindian (@Roflindian) November 1, 2017 No action of this government has disturbed me more than announcement of #khichdi as National Food. Matlab Aloo-Poori kya mar gayi hai? — richa singh (@richa_singh) November 1, 2017 Khichdi is like Rahul Dravid. Never flashy or flamboyant, but it's the only thing that will rescue you when you are ill & few wickets down. — Roflindian (@Roflindian) November 1, 2017 -
కిచిడీ: ఇక ఉల్లి కోస్తే కన్నీళ్లు రావు!
ఉల్లిపాయలు లేకుంటే ఇంట్లో వంటే ఉండదు. అంటే... అది ఒక అత్యావశ్యక నిత్యావసర వస్తువు. కానీ, దాన్ని కోస్తే కన్నీళ్లొస్తాయి. రోజూ ఈ కళ్ల మంట భరించాల్సిందేనా? ఆ బాధ నుంచి తప్పించుకునే ఓ మంచి అవకాశం వచ్చింది. ఉల్లిగడ్డలు కోసేటపుడు వాటి ఘాటు కళ్లకు తగలకుండా ప్రత్యేక కళ్లద్దాలు వచ్చాయి. వీటిని పెట్టుకుని ఎంత ఘాటున్న ఉల్లిగడ్డలయినా కోసేయొచ్చు. కంటిని చుట్టూ కవర్ చేసి ఏ విధంగానూ వాటి ఘాటు కంటికి చేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. అమెజాన్.కామ్, ఇబే.కామ్‌లోకి వెళ్తే మీరు సులువుగా వీటిని కొనేసుకోవచ్చు. ధర వెయ్యి రూపాయల లోపే ఉంది. వీసా అడగని దేశాలు! మీకో విషయం తెలుసా? ప్రపంచంలో 52 దేశాలకు భారతీయులు వీసా లేకుండానే కేవలం పాస్‌పోర్ట్ చేతిలో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు. ఈ జాబితాలో మళ్లీ 28 దేశాలకు వీసా అవసరమే రాదు. మిగతా దేశాల్లో మాత్రం అక్కడ దిగాక వాళ్లే వీసా సులువుగా ఇచ్చేస్తారు. కానీ అక్కడే ఉండి ఉద్యోగం చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ వీసా ఉండాలి. ఇక నేపాల్, భూటాన్ దేశాల్లో అయితే అది కూడా మనకు అవసరం ఉండదు. మన సంగతి అలా ఉంచితే, బ్రిటనీయులు ప్రపంచంలో సుమారు 173 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉంది.