కిచిడి తిని పిల్లలు, పెద్దలతో సహా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బాగ్‌పత్‌లోని నానానా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ దేవాలయం వసంత నవరాత్రి సందర్భంగా జరిగిన విందులో కిచిడి తిని 20 మంది పిల్లల తోసహ కొందరు పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసుల, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాదితులను ఆస్పత్రికి తరలించారు.
వారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, మిగతా పిల్లలు, పెద్దల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్‌కే చౌదరి మాట్లాడుతూ..ఆలయంలోని కిచిడి తిని రెండు డజన్ల మందికి పైగా ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అలాగే పిల్లల బాగుగాలు చూసేందుకు ఇద్దరు శిశు వైద్యులను నియమించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment