సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కిచిడి చేశారు. వరల్డ్ ఫుడ్ ఈవెంట్ సందర్భంగా చెఫ్ ఇతియాజ్ ఖురేషి, చెఫ్ రణవీర్ బ్రార్‌లతో కలిసి ఆమె కిచిడి ప్రీపేర్ చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో ఏకంగా 800 కేజీల ధాన్యాలతో 'బ్రాండ్ ఇండియా కిచిడి'ని తయారు చేసి వరల్డ్ రికార్డు కొట్టేయాలని భారత్ చూస్తోంది. 800 కేజీల ధాన్యాలతో కిచిడిని తయారుచేసే కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. వైవిధ్యంలో దేశ ఐక్యతను సూచించే విధంగా బియ్యం, పప్పులు, ముతక ధాన్యాలు, సుగంధ ధాన్యాలతో కిచిడిని తయారుచేయనున్నారు. సీఐఐతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాకశాస్త్ర ప్రావీణ్యుడు సంజీవ్ కపూర్ పర్యవేక్షణలో ఈ వంటకాన్ని తయారుచేస్తారు.
కిచిడి భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారమని, ఆరోగ్యకరమైన ఆహారంగా ఇది పరిగణించబడుతుందని ఫుల్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. వైవిధ్యంలో ఐక్యత సూచించే దేశీయ ఉన్నత సంప్రదాయానికి కిచిడి ఓ ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేడు తయారుచేసే ఈ కిచిడిని 60వేల మంది అనాధ పిల్లలకు, ఈవెంట్‌లో పాల్గొనే గెస్ట్‌లకు వడ్డించనున్నారు. రెసిఫీతో పాటు ఫారిన్ మిషన్‌లో ఉన్న అధినేతలందరికీ ఈ వంటకాన్ని పంచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్లు, కిచెన్లలో కిచిడి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment