
ఉప్పుతో గుండెకు ముప్పే!
రోజుకు 13.7 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తిన్నవారందరి గుండెలు ముప్పు ముంగిటే ఉన్నాయట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్‌లో హృద్రోగ నిపుణులంతా కలిసి చెప్పిన మాట ఇది. 25 నుంచి 64 ఏళ్ల వయసున్న 4,630 మంది స్త్రీ, పురుషులను పరీక్షించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చామని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ పరిశోధకుడు పెక్కా జోసిలాటి తెలిపారు. నిజానికి మనిషికి రోజుకు సగటున 6.8 గ్రాముల ఉప్పు సరిపోతుందని, అంతకు మించి తీసుకుంటే బీపీ మాత్రమే పెరుగుతుందని ఇప్పటిదాకా భావించేవారు. అయితే ఇలా బీపీ పెరగడం వల్ల గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.