ఉప్పు తక్కువైతే కూరకి రుచి రాదు. ఉప్పు ఎక్కువైతే కూర తినడానికి పనికి రాదు. అలా అని తినకుండా పారేయాల్సిన పని లేదు. ఇలా చేసి ఉప్పదనం తగ్గించుకోవచ్చు. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చెంచాల పాలు కలిపితే ఉప్పదనం తగ్గుతుంది. పెరుగు కలిపినా, మీగడ కలిపినా కూడా ఉప్పదనం తగ్గడమే కాదు, కొత్త రుచీ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ కానీ, టొమాటో పేస్ట్ కానీ కలపడం ఇంకో మార్గం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి, నూనెలో వేయించి కూరలో కలిపేసినా ఉప్పు తగ్గు ముఖం పడుతుంది.
చపాతీ పిండిని ఉండలుగా చేసి, ఉప్పు ఎక్కువైన కూరలో ఉడికించి తీసేస్తే ఉప్పదనం పోతుంది. బంగాళాదుంప ముక్కని గానీ, ఓ బ్రెడ్ స్లైస్‌ని గానీ కూరలో వేస్తే అధికంగా ఉన్న ఉప్పును పీల్చేసుకుంటాయి. కొద్దిగా కొబ్బరి లేక కొబ్బరిపాలు కలిపితే ఉప్పు తగ్గడంతో పాటు మంచి కమ్మదనం వస్తుంది. కూరలో పులుసు ఉంటే ఒంపేసి, మరికొని నీళ్లు కొంచెం చక్కెర వేసి ఉడికిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్ని మార్గాలున్నాయి.. ఉప్పెక్కువయిందని కూరను çపక్కన పెట్టేయనవసరం లేకుండా!
Comments
Please login to add a commentAdd a comment