New test
-
వేసిన ఉప్పు వెనక్కు వచ్చేస్తుంది!
ఉప్పు తక్కువైతే కూరకి రుచి రాదు. ఉప్పు ఎక్కువైతే కూర తినడానికి పనికి రాదు. అలా అని తినకుండా పారేయాల్సిన పని లేదు. ఇలా చేసి ఉప్పదనం తగ్గించుకోవచ్చు. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చెంచాల పాలు కలిపితే ఉప్పదనం తగ్గుతుంది. పెరుగు కలిపినా, మీగడ కలిపినా కూడా ఉప్పదనం తగ్గడమే కాదు, కొత్త రుచీ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ కానీ, టొమాటో పేస్ట్ కానీ కలపడం ఇంకో మార్గం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి, నూనెలో వేయించి కూరలో కలిపేసినా ఉప్పు తగ్గు ముఖం పడుతుంది. చపాతీ పిండిని ఉండలుగా చేసి, ఉప్పు ఎక్కువైన కూరలో ఉడికించి తీసేస్తే ఉప్పదనం పోతుంది. బంగాళాదుంప ముక్కని గానీ, ఓ బ్రెడ్ స్లైస్‌ని గానీ కూరలో వేస్తే అధికంగా ఉన్న ఉప్పును పీల్చేసుకుంటాయి. కొద్దిగా కొబ్బరి లేక కొబ్బరిపాలు కలిపితే ఉప్పు తగ్గడంతో పాటు మంచి కమ్మదనం వస్తుంది. కూరలో పులుసు ఉంటే ఒంపేసి, మరికొని నీళ్లు కొంచెం చక్కెర వేసి ఉడికిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్ని మార్గాలున్నాయి.. ఉప్పెక్కువయిందని కూరను çపక్కన పెట్టేయనవసరం లేకుండా! -
కేన్సర్ నిర్ధారణకు సరికొత్త పరీక్ష...
ప్రాణాంతకమైన కేన్సర్‌ను సులువుగా గుర్తించేందుకు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత లక్షణాలున్న తీగలను ధమనుల్లోకి జొప్పించడం ద్వారా వ్యాధిని చాలా తొందరగా గుర్తింవచ్చునని వీరు అంటున్నారు. కేన్సర్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం బయాప్సీనే మార్గం. రక్తపరీక్షల ద్వారా కూడా వ్యాధి నిర్ధారణకు తాజాగా కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. రక్తంలో ప్రవహిస్తూండే కేన్సర్ కణితి కణాలను ఆకర్శించే అయస్కాంత తీగను ఉపయోగించినప్పుడు మాత్రం వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టంగా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సామ్ గంభీర్ తెలిపారు. రక్తంలో అతితక్కువగా ఉండే ఈ రకమైన కణాలను ఇతర పద్ధతుల ద్వారా గుర్తించడం చాలా కష్టమని అన్నారు. ఈ కణాలకు అతుక్కుని అయస్కాంతాలకు ఆకర్శితమయ్యే నానో కణాలను తాము అభివద్ధి చేశామని.. తద్వారా అయస్కాంత తీగను ధమనుల్లోకి జొప్పించినప్పుడు కణితి కణాలు సులువుగా ఈ తీగకు అతుక్కుపోతాయని సామ్ వివరించారు. పందులపై జరిపిన ప్రయోగాల్లో ఈ పద్ధతి చక్కగా పనిచేసిందని అన్నారు. ఈ పరీక్షను కేవలం 2– నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చునని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని వివరించారు. -
ఇక నిమిషాల్లో ఎబోలా నిర్థారణ..
న్యూయార్క్: ప్రాణాంతక వ్యాధి ఎబోలా మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఓ ముందడుగు వేశారు. ఎబోలా వ్యాధి సోకిందా లేదా అనే విషయం ఇక నిమిషాల్లో తేలనుంది. ఇందుకోసం వారు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సాధారణంగా ఎబోలా వైరస్ డిసీజ్(ఈవీడీ) సోకిన వ్యక్తులకు అంతకుముందు దానిని నిర్థారించేందుకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్(ఆర్డీటీ) చేసేశారు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పనే కాక.. గంటల తరబడి సమయం వృధా అయ్యేది. కానీ అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ కు చెందిన నిరా పొల్లాక్ మాత్రం తాము చేసిన సర్వేలు, పరీక్షల్లో ఎబోలా వైరస్‌ను నిమిషాల్లో గుర్తించే వీలుకలిగిందని చెప్ఆరు. ఇందుకోసం ఆర్ఈఈబీఓవీ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట, కార్జెనిక్స్ అనే పరీక్ష నిర్వహించామని, దీనిద్వారా గతంలో కన్నా వేగంగా ఎబోలాను గుర్తించడం జరిగిందని తెలిపారు.