పట్టుబడిన నకిలీ విత్తనాల బస్తాలు
తాండూర్ (బెల్లంపల్లి): ఆంధ్రా ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రూ.1.06 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఈ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి తాండూర్ ఎస్‌ఐ కె.రవి సిబ్బందితో కలసి రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఉప్పు బస్తాల లోడ్‌తో వస్తున్న లారీని ఆపి తనిఖీలు చేశారు.
అందులో ఉప్పు బస్తాల కింద 51.50 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.1.06 కోట్ల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. లారీని తాండూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తరలించామని, పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించగా 29 క్వింటాళ్ల లూజ్ పత్తి విత్తనాలు, కావ్య అనే పేరుగల ప్యాకెట్లు 22.50 క్వింటాళ్లు గుర్తించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment