కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు
Published Sun, Nov 13 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
– జాయింట్ కలెక్టర్ హరికిరణ్ హెచ్చరిక
కర్నూలు (అగ్రికల్చర్): కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హరికిరణ్.. హోల్‌సేల్ వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం జిల్లాలో ఉన్న ఐదుగురు ఉప్పు హోల్‌సేల్ వ్యాపారులను డీఎస్‌ఓ కార్యాలయానికి పిలిపించారు. వారితో జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి రోజు గోదాముల్లో ఉప్పు నిల్వలు 80 శాతం ఉండాలని, ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఆర్‌పీకి మించి ఒక్క రూపాయి అదనంగా అమ్మినా రిటైల్ వ్యాపారులపై, హోల్‌సేల్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉప్పును బ్లాక్‌లో అమ్మకుండా కిరాణం షాపులకు తగిన సూచనలు ఇచ్చుకోవాలని హోల్‌సేల్ డీలర్లను ఆదేశించారు. రోజు వారీగా ఉప్పు నిల్వలపై సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ తిప్పేనాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, ఏఎస్‌ఓ రాజా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement