చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ఊపిరి పీల్చుకోలేక నరకయాతన పడుతుంటారు. పొరపాటున స్పీడ్‌గా నడిచినా లేక ఏదైనా ఆహారం తింటున్నప్పుడూ పొలమారి ఎగ ఊపిరి దిగ ఊపిరి అన్నట్లుగా ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. కొందరికి నిరంతరం ఓ సమస్యలా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు కూడా. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉనాయని చెబుతున్నారు. వాటిని వాడితే సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
వేప నూనెతో ఈజీగా బయటపడొచ్చు..
వేప నూనె రోజు రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేయండి.వేసిన తర్వాత గట్టిగా పైకి లాగితే అది నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది దాంతోపాటు లోపల ఉన్న కఫం కూడా కొట్టుకు వచ్చేస్తుంది ఇది చాలామందిలో చక్కని ఫలితం ఇచ్చిన ఆయుర్వేద సలహా అని అంటున్నారు నిపుణులు నవీన్ నడిమింటి . ఇలా చేస్తే ఆపరేషన్ కడా అవసరం ఉండదు. అలా రెండు మూడు వారాలు చేయండి ఒక వారంలోనే మీకు చాలా రిలీఫ్ కనిపిస్తుంది తర్వాత చెక్ చేసుకోండి మొత్తం కండకరిగిపోతుంది.
ఇతర ఔషధాలు..
👉స్వర్ణభ్రాకాసిందుర: ఇది ఉబ్బసం, దగ్గు, ఛాతీ వణుకు చికిత్సకు సహాయపడుతుంది. అలాగే టీబీ రోగికి కూడా వినియోగించొచ్చు.
మోతాదు : 1 గ్రా మోతాదు వసారిస్టాతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
👉వసరిష్ట (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): ఇది శ్వాసనాళ సమస్యలు, సైనసైటీస్ , గుండె ప్రభావాలలో ఉత్పత్తి చేసే దగ్గు, రక్త పిత్తానికి నమ్మకమైన నివారణ.
మోతాదు: ఆహారం తర్వాత రోజూ రెండుసార్లు - 4 చెంచాల సిరప్ సమానమైన నీటితో కరిగించి ఆహారం తర్వాత తీసుకోవాలి.
👉చ్యవన్ ప్రాష్ (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): గొప్ప నరాల టానిక్. ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది, యవ్వనంగా ఉంచుతుంది. మోతాదు: 1.5 టీస్పూన్ బ్రోన్‌ఫ్రీ తర్వాత రోజుకు రెండుసార్లు వాడాలి.
👉మహాలక్ష్మివిలసరస: ఉబ్బసం కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు. మోతాదు : 1 గ్రా . రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు సాయంత్రం) తేనెతో వాడాలి. త్వరగా కోలుకోవటానికి చ్యవన్ ప్రాష్‌ని, వసరిష్టలతో పాటు లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సలహా.
👉లోహాసవ: మోతాదు: భోజనం తర్వాత 10ఎంఎల్ మోతాదులో నీటి సమాన పరిమాణంతో తీసుకోవాలి.
👉హేమమృతరాస: మోతాదు: వైద్యుడు దర్శకత్వం వహించినట్లు రోజుకు రెండుసార్లు చ్యవనప్రసాతో లేదా పరిక్షారిస్తాతో ద్రక్షారిస్తా / వసరిష్టతో కలిపి వాడాలి. సీతోపలాది
👉చూర్ణ: మోతాదు: 2 గ్రా నుంచి 3 గ్రా. రోజుకు రెండుసార్లు కండ చెక్కెరతో వాడాలి. బ్రాన్‌ఫ్రీ: శ్వాసనాళ రుగ్మతలపై పనిచేస్తుంది. మోతాదు: ఒక టాబ్లెట్ రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి.
పై మందులను మూడు నెలల కాల పరిమితితో తీసుకున్నచో గొప్ప ఫలితాలు లభించును. శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావొచ్చు.. అలాంటి వారికి మరికొంత సమయం మందులు వాడవలసి ఉంటుంది.. తాము చెప్పే నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా.. చెప్పిన కాలపరిమితి వరకు ఈమందులను వాడితే మీరు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప ఫలితాలని మీరే స్వయంగా చూస్తారని చెబుతున్నారు నవీన్ నడిమింటి
-ఆయుర్వేద వైద్యుడు నవీన్ నడిమింటి
(చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!)
Comments
Please login to add a commentAdd a comment