lungs
-
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
ఛాతీలో నీరు చేరితే...?
ఛాతీలో నీరు చేరడాన్ని ‘ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది నీరు కావచ్చు లేదా చీము, రక్తం కావచ్చు. ఇది ఒక పక్క లేదా రెండువైపులా చేరవచ్చు. నీరు ఎక్కువగా చేరితే దాన్ని ‘మాసివ్ ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. ఇలాంటి వారిలో ఆయాసం కూడా ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి వారిలో తక్షణం ఆ నీటిని తీయాల్సి ఉంటుంది. కారణాలు... ఛాతీలోకి నీరు చేరడం అనేది హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్య, లివర్ సమస్యలను సూచిస్తుంది. చీము చేరడం అనేది ఊపిరితిత్తులకు గాని, ప్లూరల్ స్పేస్‌కు గానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఉదా: నిమోనియా, టీబీ ఇన్ఫెక్షన్లు. సాధారణంగా మొదటిదశలో అది చీము అవునా, కాదా అన్నది కనుక్కోవడం కుదరదు. పరీక్షలకు పంపాక మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యను ట్రాన్స్డేటివ్ లేదా ఎగ్జూడేటివ్ అని విభజిస్తారు. ట్రాన్స్డేటివ్ నీరు చేరడమనే సమస్య సాధారణంగా మందులతోనే తగ్గిపోతుంది. అయితే ఎగ్జుడేటివ్ నీరు చేరడమనే సమస్యలో దాని దశని బట్టి చికిత్స మారుతుంటుంది. ఈ సమస్యకు నిమోనియా కారణమై, నీరు కొద్దిగానే ఉంటే, సాధారణంగా అది యాంటీబయాటిక్స్‌తో తగ్గి΄ోతుంది. కానీ చీము చాలా ఎక్కువగా ఉంటే, వెంటనే ఛాతీలోకి గొట్టం వేసి దాన్ని డ్రైయిన్ చేసేయాలి (ఆ చీమును బయటకు ప్రవహింపజేయాలి... అంటే తొలగించాలి). ఒకసారి గొట్టం వేశాక చీము రోజుకు ఎంత పరిమాణంలో డ్రైయిన్ అవుతోంది అన్న అంశం మీద దాన్ని తీసేయడం ఆధారపడి ఉంటుంది. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి, అక్కడ తేనెతుట్టెలాగా మారిపోతుంది. అలాంటి దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. గొట్టం వేసి, ఆ తేనెతుట్టె లాంటి దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని మూడు రోజుల పాటు లోనికి పంపుతారు. అప్పటికీ లోపలి ఫైబ్రస్ పార్టిషన్స్ కరగకపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం. ముందుగా అసలు ఈ చీము ఎందుకు చేరుతుందో కనుక్కోవాలి. అందుకోసం తగిన పరీక్షలూ, కల్చర్స్ చేయించాలి. ఇన్ఫెక్షన్ అదుపు చేయడానికి అవసరమైన మందుల్ని డాక్టర్లు సూచించినంత కాలం వాడాలి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరడమే కాకుండా ఊపిరితిత్తులకు కన్నం పడుతుంది. దానివల్ల గాలి లీక్ అవుతుంది. దీన్ని ‘బ్రాంకోప్లూరల్ ఫిస్టులా’ అంటారు. ఇలాంటివారిలో ఛాతీలో గొట్టం ఎక్కువరోజులు... అంటే ఫిస్టులా మూసుకు΄ోయే వరకూ ఉంచాలి. ఇందుకు ఒక్కోసారి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. కొంతమందిలో ఆపరేషన్ ద్వారా ఫిస్టులాను రిపేర్ చేయవచ్చు. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి,అక్కడ తేనెతుట్టెలా మారి΄ోతుంది. ఈ దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. అప్పుడు గొట్టం వేసి, దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని పంపుతారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ (చదవండి: -
ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా...
పొత్తి కడుపు కొవ్వును తగ్గించి, ఛాతీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడానికి మత్సా్యసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కఠినమైన విధానం కూడా ఉంది. కానీ, సులువుగానూ ఈ పోజ్‌ను సాధన చేయవచ్చు. త్వరగా శారీరక, మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని సాధన ఎలా అంటేమ్యాట్పైన వెల్లకిలా పడుకోవాలి.అరచేతులను నేలపైన బోర్లా ఉంచాలి. కాళ్లను నిటారుగా ఉంచి, పాదాలను స్ట్రెచ్ చేస్తూ సాధ్యమైనంత వరకు వంచాలి. తుంటి భాగాన్ని కొద్దిగా ఎత్తి, పిరుదుల కింద చేతులను ఉంచాలి. తల వెనుక మెడ భాగాన్ని సాగదీస్తూ, నేలపైకి వంచాలి. బరువు ఎక్కువ లేకుండా భంగిమను సరిచూసుకోవాలి. అదే విధంగా వెన్ను భాగాన్ని కూడా కొంత పైకి ఎత్తాలి. ఈ భంగిమ చేప మాదిరి ఉంటుంది కాబట్టి దీనిని ఫిష్ పోజ్ అంటారు. నిదానంగా 5 శ్వాసలు తీసుకుంటూ, వదలాలి. తర్వాత తలను యధాస్థానంలో ఉంచి, వెన్నెముకను చాప మీద నిదానంగా ఉంచాలి. ఆ తర్వాత పాదాలను యధాస్థానంలోకి తీసుకొని, చేతులను తుంటి నుంచి బయటకు తీసి, విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల.... ∙ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది. ఊపిరితిత్తులు సాధ్యమైనంతవరకు ప్రాణ వాయువును పీల్చి, కొంత సమయం ఉంచగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. వెన్ను, మెడ భాగాలు స్ట్రెచ్ అవడం వల్ల వాటి బలం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు నిపుణుల సాయం తీసుకోవడం మేలు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి..-జి.అనూష,యోగా గురు -
‘ఊపిరితిత్తు’లకు చిల్లు!
ఎండి పగుళ్లిచ్చిన నేల. నీటిచుక్క ఆనవాలు కూడా లేని తీరాల్లో బారులు తీరిన బోట్లు. కొంతకాలంగా బ్రెజిల్‌లోని ప్రధాన నదులన్నింట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలివి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వీటి దెబ్బకు ఈ సీజన్లో దాదాపుగా ప్రతి నదీ రికార్డు స్థాయిలో కుంచించుకుపోయింది. రాజధాని బ్రెజీలియాతో పాటు పలు ప్రధాన నగరాలు వరుసగా 140 రోజులుగా వాననీటి చుక్కకు కూడా నోచుకోని పరిస్థితి! దేశంలో 60 శాతానికి పైగా వరుసగా రెండో ఏడాది కరువు గుప్పెట్లో చిక్కింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి చందంగా విషమిస్తున్నాయి. ఫలితంగా 1950 తర్వాత అతి పెద్ద కరువుతో బ్రెజిల్ అల్లాడుతోంది. దీన్నిప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెజాన్ వర్షారణ్యాలకు పుట్టిల్లయిన బ్రెజిల్లో ఈ అనూహ్య పరిస్థితి సైంటిస్టులను ఆందోళనపరుస్తోంది. అయ్యో.. రియో... అమెజాన్ ఉపనదుల్లో అతి పెద్దదైన రియో నెగ్రో అయితే ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నదిలో నీటిమట్టం కొద్ది నెలలుగా ఏకంగా రోజుకు ఏడంగుళాల చొప్పున తగ్గిపోతూ కలవరపెడుతోంది. దాంతో నలుపు రంగులో నిత్యం అలరించే అపార జలరాశి మాయమై ఏకంగా నదీగర్భమే బయటపడింది. రియో నిగ్రోలో కలిసే సొలిమెస్ నదిదీ ఇదే దుస్థితి. దాని నీటిమట్టం ఈ నెలలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ రెండు నదులు కలిసిన మీదట అమెజాన్‌గా రూపొందుతాయి. వీటిలో నిత్యం తిరగాడే రవాణా నౌకలు కొంతకాలంగా నదీగర్భాల్లోని విస్తారమైన ఇసుకలో కూరుకుపోయి కని్పస్తున్నాయి. సొలిమెస్ తీరాన ఉండే టెఫ్ సరస్సులో కూడా నీళ్లు దాదాపుగా నిండుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ సరస్సు ఊహాతీతంగా చిక్కిపోయిన తీరు పర్యావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది రికార్డు ఎండలు, కనీవినీ ఎరగని కరువు దెబ్బకు ఈ సరస్సులో 200కు పైగా డాలి్ఫన్లు మృత్యువాత పడ్డాయి. ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా కనీసం రోజుకొకటి చొప్పున డాల్ఫిన్లు మరణిస్తున్నాయి. మరో నెలన్నర దాకా ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఫలితంగా బ్రెజిల్ చరిత్రలోనే తొలిసారిగా జల వనరుల్లో అత్యధికం పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దారుణ పర్యవసానాలు బ్రెజిల్లో నదులు, సరస్సులు అడుగంటితే పర్యవసానాలు దారుణంగా ఉండనున్నాయి. ఆహారం మొదలుకుని రవాణా దాకా అన్నింటికీ వీటిపైనే ఆధారపడే స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్ర్ గుయ్మే ర్స్. ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎన్న డూ చూడలేదని చెప్పుకొచ్చారు. నదీ ప్రవాహాలు దాదాపుగా ఎండిపోతున్న పరిస్థితులు చరిత్రలో బహుశా ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తీవ్రమైన వేడి పరిస్థితులు అమెజాన్ అడవులతో పాటు పొరుగునే ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చిత్తడి నేలలైన పంటనల్స్లో కూ డా కార్చిచ్చులకు కారణంగా మారుతున్నాయి.అమెజాన్. ఈ పేరు వింటూనే సతత హరితారణ్యాలు, అపారమైన జీవవైవిధ్యం, అంతులేని జలవనరులు గుర్తుకొస్తాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా అమెజాన్‌కు పేరు. కానీ వాటికిప్పుడు నిలువెల్లా చిల్లులు పడుతున్నాయి. ప్రపంచ నదుల్లోకెల్లా పెద్దదైన అమెజాన్ క్రమంగా కుంచించుకుపోతోంది. దాని ప్రధాన జల వనరులైన అతి పెద్ద ఉపనదులన్నీ కనీవినీ ఎరగనంతగా ఎండిపోతున్నాయి. అమెజాన్ పరీవాహక ప్రాంతాల్లో ప్రధాన దేశమైన బ్రెజిల్లో ఈ ధోరణి కొట్టిచి్చనట్టుగా కాన్పిస్తోంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలనే గాక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులను కూడా ఎంతగానో కలవరపెడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ కారణమేమిటి?కరువు పరిస్థితులకు దారి తీసే ఎల్ నినో గతేడాది బ్రెజిల్‌ను అల్లాడించింది. ⇒ ఈ ఏడాది దాని తీవ్రత తగ్గినా దేశవ్యాప్తంగా వాతావరణంలో వేడి పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అసాధారణ వేడి పరిస్థితులు సమస్యను మరింత పెంచుతున్నాయి. ⇒ అమెజాన్ అంతటా విచ్చలవిడిగా కొనసాగుతున్న అడవుల నరికివేత తాలూకు దుష్పరిణామాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. ⇒ పచ్చదనం విపరీతంగా తగ్గిపోతుండటంతో ఎండలు పెరుగుతున్నాయి. వానల క్రమం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ⇒ అమెజాన్ బేసిన్లో గతేడాది వచ్చిన తీవ్ర కరువుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్వర్క్ తేల్చింది. ⇒ బ్రెజిల్లో జరుగుతున్నది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల తాలూకు స్థానిక ప్రభావమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. -
సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్ వేపింగ్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్? సిగరెట్స్ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్..?వేపింగ్ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్ ఎడిక్షన్కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
అనారోగ్యంలోనూ.. టాపర్‌గా దివ్యాంశ్!
అన్ని రకాలుగా బాగా ఉండి కూడా కొందరూ విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోలేక చతికిలపడుతుంటారు. పైగా ఏవేవో సాకులు చెబుతుంటారు. తల్లిదండ్రులు సమస్త సౌకర్యాలు కల్పించి.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండి కూడా ఉత్తీర్ణులు కాలేకపోతుంటారు. అలాంటి వారికి ఈ విద్యార్థే స్ఫూర్తి. తీవ్రైమన అనారోగ్యంతో బాధపడుతూ కూడా ప్రతిష్టాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ పరీక్షలో సత్తా చాటి ప్రథమ ర్యాంక్‌లో నిలిచాడు. అతడే దివ్యాంశ్. హర్యానాలోని చర్కీ దాద్రీకి చెందిన దివ్యాంశ్ అతను న్యూమోథొరాక్స్(తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య)తో బాధపడుతున్నాడు. ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకున్న కొద్ది రోజులకు డెంగ్యూ బారిన పడ్డాడు. అతడికి సపర్యలు చేసి..చేసి అమ్మ అనారోగ్యం పాలయ్యింది. అయినా ఆ అడ్డంకులనన్నింటిని పక్కన పెట్టి మరీ ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌పై దృష్టిసారించేవాడు. అయితే అనారోగ్యం కారణంగా సిలబస్‌లో తన తోటి విద్యార్థుల కంటే కాస్త వెనుకబడ్డాడు. అతనికి వారితో వేగం అందుకోవడానికే దాదాపు పది రోజులు పట్టింది. అలాగే సహా విద్యార్థులు, ఉపాద్యాయుల మార్గదర్శకంలో మరింతగా కష్టపడి చదివాడు దివ్యాంశ్. అతని కృషి ఫలించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ పారామెడికల కోర్సుల ప్రవేశానికి పెట్టే ప్రతిష్టాత్మ నీట్ పరీక్షలో ఏకంగా 720 మార్కులు స్కోర్ చేయడమే గాక ప్రథమ ర్యాంకులో నిలిచాడు. అతడు వైద్యపరమైన సవాళ్లను దాటుకుంటూ కఠినతరమైన నీట్ పరీక్షలో ప్రథమ ర్యాంక్‌లో నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. పైగా గెలవాలన్న తపన ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా జయించొచ్చని చాటి చెప్పాడు. ఇక్కడ దివ్యాంశ్ ఫేస్ చేసిన న్యూమోథొరాక్స్ అంటే ఏంటంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోతే దాన్ని న్యూమోథోరాక్స్ అని అంటారు. ఈ ప్రాంతంలో గాలి చేరితే ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఊపిరి తిత్తులు పనిచేయకుండా పోతాయి. దీని కారణంగా పదునైన ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు రోగులు. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే మాత్ర చర్మ రంగు కూడా మారిపోతుంది. ఎవరికి వచ్చే ప్రమాదం ఉందంటే..ఆకస్మిక ఛాతీ గాయం, దీర్ఘకాలిక ఊరితిత్తుల సంబంధ వ్యాధులు, ఆస్తమా, దగ్గు, క్షయ వంటి వాటితో బాధపుడుతున్న వారిలో ఈ న్యూమోథోరాక్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.చికిత్స:సమస్య తీవ్రతను అనుసరించి వైద్యులు చికిత్స అందించడం జరుగుతుంది. ఒక్కోసారి మాత్రం కొద్దిపాటి సర్జరీ కూడా చేయాల్సి రావొచ్చని చెబుతున్నారు.(చదవండి: రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!) -
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు. -
ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు!
ఊపిరితిత్తుల్లో బొద్దింక! అదెలా సాధ్యం అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం వైద్యులే ఆ బొద్దింకను గుర్తించి కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కేరళకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మాములుగానే తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ సమస్య ఉన్నటుండి ఒకరోజు మరింత దారుణంగా ఉంది. ఇక అతడు తాళ్లలేక ఆస్పత్రిని ఆశ్రయించాడు. శ్వాసకోశ సమస్యలున్న ఆ వ్యక్తి ఆస్పత్రి చేరేటప్పటికీ పరిస్థితి మరింత దిగజారి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడమే చాల కష్టతరమయ్యింది. ఎందువల్ల ఇలా జరిగింది? అని పల్మనాలజీ వైద్య బృందం అతడికి పలు వైద్య పరీక్షలు చేశారు. చివరికి స్కానింగ్‌లో సుమారు 4 సెంటిమీటర్ల బొద్దింక ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల అతడి శ్వాసకోశ సమస్యలు మరింత జఠిలంగా మారాయని తెలుసుకున్నారు. ఇక వెంటనే వైద్యులు దాదాపు ఎనిమిది గంటలు శ్రమించి అతడికి సర్జరీ చేసి ఊపరితిత్తుల్లో ఉన్న బొద్దింకను తొలగించారు. అయితే ఇలా బొద్దింక వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. మరీ అతని ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా చేరిందని వైద్యులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆ రోగికి ఉన్న శ్వాసకోస సమస్యలు కారణంగా మెడలో శ్వాసనాళం అమర్చి దాని గుండా ఆక్సిజన్ని తీసుకునే ఏర్పాటు చేశారు వైద్యులు. అయితే అతడు రాత్రి పడుకునేటప్పుడూ ఆ ట్యూబ్‌ని మూసేయడం మరిచిపోవడంతో బొద్దింక లోపలకి ప్రవేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు డాక్టర్లు. (చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!) -
చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త!
'చలిగా ఉండే ఈ సీజన్లో ఎంత వ్యాయామం చేసినా వెంటనే చెమట పట్టనందున ఎంతసేపైనా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అనేది ఫిట్నెస్ ఫ్రీక్ల ఆసక్తి. అయితే ఈ సీజన్లో ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ తాలూకు ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. చలికాలంలో ‘ఇన్వర్షన్’తో పాటు ఈ ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ల ప్రభావంతో ఊపిరితిత్తుల మీదా, ఆ అంశం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలుంటాయి. అందుకే చలిలో చెమట పట్టదనీ, అలసట రాదనీ వ్యాయామాలు చేసేవాళ్లూ, అలాగే చల్లటి వాతావరణంలో హాయిగా ఆరుబయట తిరగాలనుకునే వాళ్లు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్లెవల్ ఓజోన్’ ప్రభావమేమిటో, అది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.' రోడ్డు మీద పొగలు చాలా ఎక్కువగా వెలువరుస్తూ వాహనాలు వెళ్లాక.. చాలాసేపటివరకు ఆ పొగ చెదిరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ పొగనుంచి పయనించే వాహనదారులంతా కాసేపు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం కూడా సహజమే. మామూలుగానే ఉండే ఈ పరిస్థితికి తోడు.. శీతకాలంలోని చలివాతావరణంలో ఈ పొగ మరింత ఎక్కువ సేపు అలముకుని ఉంటుంది. ఇందులో పొగమంచూ, కాలుష్యం కలిసిపోయి ఉండటం వల్ల ‘స్మాగ్’ అనే కాలుష్య మేఘం చాలాసేపు కొనసాగుతూ.. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’లనే వాతావరణ అంశాలు ఈ ‘స్మాగ్’ను, దాంతో సమస్యలనూ మరింత తీవ్రతరం చేస్తాయి. ఇన్వర్షన్ అంటే.. మామూలుగా ఎత్తుకుపోయిన కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఎత్తులకు వెళ్లినకొద్దీ నిర్ణీతమైన రీతిలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని ‘ల్యాప్స్ రేట్’ అని కూడా అంటారు. ఇది వాతావరణ సహజ నియమం. కానీ కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. అంటే.. నేలమీదనే బాగా చల్లగా ఉండి, పైభాగంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సహజ వాతావరణ నియమానికి భిన్నంగా ఉండటం వల్లనే.. ఈ ప్రక్రియకు ‘ఇన్వర్షన్’ అని పేరు. కాలుష్యమేఘంతో ఊపిరితిత్తులూ, ఓవరాల్ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఇలా.. ముక్కు ముందుగా ఓ ఏసీ యూనిట్లా పనిచేస్తుంది. అతి చల్లటి గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా తొలుత ముక్కులోకి వెళ్లిన గాలి కాస్తంత వేడిగా మారి, దేహ ఉష్ణోగ్రతకు కాస్త అటు ఇటుగా సమానంగా ఉండేలా మారాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంత చల్లటిగాలి ఊపిరితిత్తులకు నష్టం చేయకుండా ఉండేందుకే ముక్కు ఈ పనిచేస్తుంది. కానీ గాల్లోని రసాయనాల వల్ల తొలుత ముక్కులోని సున్నితమైన పొరలపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో ముక్కులో మంటగా అనిపిస్తుంది. అలర్జీలూ కనిపిస్తాయి. అటు తర్వాత గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే ట్రాకియా, బ్రాంకియాలో ఇరిటేషన్ రావచ్చు. కాలుష్యాలను ముక్కు చాలావరకు వడపోసినప్పటికీ, కొన్ని లంగ్స్‌లోకి వచ్చేస్తాయి. వాటిని బయటకు పంపేందుకు ఊపిరితిత్తుల్లో మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్ అనే నిర్మాణాలు కొవ్వొత్తి మంటలా కదులుతూ కాలుష్యాలను పైవైపునకు నెడుతుంటాయి. సీలియరీ ఎస్కలేటర్స్ పని మాత్రమే కాకుండా.. అక్కడ కొన్ని స్రావాలు (మ్యూకస్) ఊరుతూ, అవి కూడా కాలుష్యాలను బయటకు నెడుతుంటాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్లరక్త కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌లనుంచి మాత్రమే కాకుండా కాలుష్యాల బారి నుంచీ చాలావరకు కాపాడుతుంటాయి. సన్నటి వెంట్రుకల్లాంటి కదులుతూ ఉండే ఈ సీలియాలు అలల్లా వేగంగా కదలడం ద్వారా శ్వాస వ్యవస్థలోకి చేరిన కాలుష్య పదార్థాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియా, ఇతర కణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఈ సీలియా సమర్థంగా పనిచేయడానికి వీటి చుట్టూ ఉత్పత్తి అయ్యే మ్యూకస్‌తో శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లెమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. కాలుష్యాల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గళ్ల/తెమడలా పడటం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్లగా ఉండటం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ సీజన్లో ఊపిరితిత్తులతో పాటు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సినవి.. కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతవరకు సూర్యుడు బాగా పైకొచ్చి చలి తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. ఈ సీజన్లో వాకింగ్, ఇతర వ్యాయామాలను కాలుష్యం లేని చోట మాత్రమే చేయాలి. లేదా చలికాలంలో కేవలం ఇన్డోర్ వ్యాయామాలకు పరిమితమైతే మేలు. ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలో భాగంగా సీలియాలు సమర్థంగా పనిచేయడానికి గాలిలో తేమ బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా తొలుత ఆవిరిపట్టడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. తెమడ / గళ్ల (స్పుటమ్)ను బయటకు తెచ్చేందుకు దోహదపడే దగ్గును మందులతో అణచకూడదు. మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు క్రమంగా దగ్గును తగ్గించేలా చేసే మందులు వాడాలి. దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు.. ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు కఫాన్ని పలచబార్చే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), ఆస్తమా వంటి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవల్ ఓజోన్ అంటే.. వాతావరణం పైపొరల్లో ఓజోన్ లేయర్ ఉంటుందనీ, అది ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. భూమి మీదా ఓజోన్ ఉంటుంది. దీన్ని ‘స్మాగ్ ఓజోన్’ లేదా ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులతో పాటు మరికొన్ని రసాయనాల చర్యల వల్ల ఆవిర్భవిస్తుంది. కొంతమేర సూర్యరశ్మి కూడా ఈ కాలుష్యమేఘం ఆవరించేందుకు దోహదపడుతుంది. ఫలితంగా.. పొగ, మంచు (ఫాగ్ ప్లస్ స్మోక్) కలిసి ఉండే స్మాగ్‌తో పాటు ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ కూడా కలసిపోతుంది. దీనికి తోడు వాతావరణంలోని నల్లటి నుసి, ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్), పుప్పొడీ.. ఇవన్నీ కలగలసి దట్టమైన కాలుష్య మేఘం ఏర్పడుతుంది. వాతావరణంలోని ఇన్వర్షన్తో ఏర్పడ్డ చల్లదనం కారణంగా ఈ కాలుష్యమేఘం చాలాసేపు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ కాలుష్యంలోంచి ప్రయాణాలు చేసేవారిలో.. తొలుత అక్కడి కాలుష్య రసాయనాలో ముక్కులో ఇరిటేషన్, ఆ తర్వాత ఊపిరి తిత్తులూ దుష్ప్రభావానికి లోనవుతాయి. ముక్కు, శ్వాసమార్గంలో మంట, ఊపిరి తేలిగ్గా అందకపోవడం, శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలూ, వృద్ధుల్లో కొంతమేర ప్రాణాపాయం కలిగే అవకాశాలూ లేకపోలేదు. మరికొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయడం లేదా ఆస్తమా ఉన్నవారిలో ఇది అటాక్‌ను ట్రిగ్గర్ చేయడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. - డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఇవి చదవండి: మావాడు ఎవరితోనూ కలవడండీ -
తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి బ్రెస్ట్ ఇంప్లాంట్..!
ఇంతవరకు మహిళలు తమ అందం కోసం లేదా ఇతర కారణాల వల్ల బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంటుంది. కానీ ఇలా ఓ మనిషి ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఓ వ్యక్తికి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియను నిర్వహించారు. ఇంతకీ ఎందువల్ల ఇలా చేశారు ఏంటీ ? తదితరాల గురించి చూద్దాం! అమెరికాలో సెయింట్ లూయిస్‌కు చెందిన 34 ఏళ్ల డేవీ బాయర్ తనకున్న చెడు అలవాట్ల కారణంగా రెండు ఊపిరితిత్తులు దారుణంగా పాడైపోయాయి. ఎంతలా అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురై చీముతో నిండి ఉన్నాయి. అతడు 21 ఏళ్ల వయసు నుంచే రోజూకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగేసేవాడు. ఆ దురఅలవాటే అతడి ఊపిరితిత్తులను పూర్తిగా హరించేశాయి. చివరికి తీవ్రమైన ఫ్ల్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పలు వైద్య పరీక్షలు చేయగా అతని ఊపిరితిత్తులు దారుణంగా పాడైనట్లు గుర్తించారు. దీంతో ఎంత వరకు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని ఎక్స్‌రే తీసి చూడగా..ఇంకేమి మిగిలి లేదని తేలింది. ఆ ఊపిరితిత్తులు పూర్తిగా ద్రవంలా మారిపోవడం ప్రారంభించాయని గుర్తించారు. దీంతో అతడికి తక్షణమే ఊపిరితిత్తుల మార్పిడి చేయక తప్పదని నిర్ణయించారు వైద్యులు. ఇదొక్కటే మార్గమని లేకపోతే ప్రాణాలతో రక్షించటం అసాధ్యమని అతనికి తెలిపారు. అతని ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేలా రెండు ఊపిరితిత్తులను తొలగించి కృత్రిమ ఊపిరితిత్తులను (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ లేదా ECMO, అవసరమైన వారికి శ్వాసకోశ మద్దతులో భాగంగా) ఉపయోగించారు. అదే టైంలో అతని గుండె పదిలంగా ఉండి సజీవంగా ఉండాలంటే..ఛాతీ కుహరంలో డీడీ బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయక తప్పలేదు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..అతని ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సదుపాయంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?
చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ఊపిరి పీల్చుకోలేక నరకయాతన పడుతుంటారు. పొరపాటున స్పీడ్‌గా నడిచినా లేక ఏదైనా ఆహారం తింటున్నప్పుడూ పొలమారి ఎగ ఊపిరి దిగ ఊపిరి అన్నట్లుగా ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. కొందరికి నిరంతరం ఓ సమస్యలా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు కూడా. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉనాయని చెబుతున్నారు. వాటిని వాడితే సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం. వేప నూనెతో ఈజీగా బయటపడొచ్చు.. వేప నూనె రోజు రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేయండి.వేసిన తర్వాత గట్టిగా పైకి లాగితే అది నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది దాంతోపాటు లోపల ఉన్న కఫం కూడా కొట్టుకు వచ్చేస్తుంది ఇది చాలామందిలో చక్కని ఫలితం ఇచ్చిన ఆయుర్వేద సలహా అని అంటున్నారు నిపుణులు నవీన్ నడిమింటి . ఇలా చేస్తే ఆపరేషన్ కడా అవసరం ఉండదు. అలా రెండు మూడు వారాలు చేయండి ఒక వారంలోనే మీకు చాలా రిలీఫ్ కనిపిస్తుంది తర్వాత చెక్ చేసుకోండి మొత్తం కండకరిగిపోతుంది. ఇతర ఔషధాలు.. 👉స్వర్ణభ్రాకాసిందుర: ఇది ఉబ్బసం, దగ్గు, ఛాతీ వణుకు చికిత్సకు సహాయపడుతుంది. అలాగే టీబీ రోగికి కూడా వినియోగించొచ్చు. మోతాదు : 1 గ్రా మోతాదు వసారిస్టాతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 👉వసరిష్ట (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): ఇది శ్వాసనాళ సమస్యలు, సైనసైటీస్ , గుండె ప్రభావాలలో ఉత్పత్తి చేసే దగ్గు, రక్త పిత్తానికి నమ్మకమైన నివారణ. మోతాదు: ఆహారం తర్వాత రోజూ రెండుసార్లు - 4 చెంచాల సిరప్ సమానమైన నీటితో కరిగించి ఆహారం తర్వాత తీసుకోవాలి. 👉చ్యవన్ ప్రాష్ (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): గొప్ప నరాల టానిక్. ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది, యవ్వనంగా ఉంచుతుంది. మోతాదు: 1.5 టీస్పూన్ బ్రోన్ఫ్రీ తర్వాత రోజుకు రెండుసార్లు వాడాలి. 👉మహాలక్ష్మివిలసరస: ఉబ్బసం కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు. మోతాదు : 1 గ్రా . రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు సాయంత్రం) తేనెతో వాడాలి. త్వరగా కోలుకోవటానికి చ్యవన్ ప్రాష్ని, వసరిష్టలతో పాటు లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సలహా. 👉లోహాసవ: మోతాదు: భోజనం తర్వాత 10ఎంఎల్ మోతాదులో నీటి సమాన పరిమాణంతో తీసుకోవాలి. 👉హేమమృతరాస: మోతాదు: వైద్యుడు దర్శకత్వం వహించినట్లు రోజుకు రెండుసార్లు చ్యవనప్రసాతో లేదా పరిక్షారిస్తాతో ద్రక్షారిస్తా / వసరిష్టతో కలిపి వాడాలి. సీతోపలాది 👉చూర్ణ: మోతాదు: 2 గ్రా నుంచి 3 గ్రా. రోజుకు రెండుసార్లు కండ చెక్కెరతో వాడాలి. బ్రాన్ఫ్రీ: శ్వాసనాళ రుగ్మతలపై పనిచేస్తుంది. మోతాదు: ఒక టాబ్లెట్ రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి. పై మందులను మూడు నెలల కాల పరిమితితో తీసుకున్నచో గొప్ప ఫలితాలు లభించును. శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావొచ్చు.. అలాంటి వారికి మరికొంత సమయం మందులు వాడవలసి ఉంటుంది.. తాము చెప్పే నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా.. చెప్పిన కాలపరిమితి వరకు ఈమందులను వాడితే మీరు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప ఫలితాలని మీరే స్వయంగా చూస్తారని చెబుతున్నారు నవీన్ నడిమింటి -ఆయుర్వేద వైద్యుడు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
థాయ్ ప్రిన్స్‌కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్‌లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్‌కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్‌లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్‌లాండ్‌లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
Health: మడమల నొప్పి వేధిస్తోందా? వెనక్కి నడిచే అలవాటుంటే.. లంగ్స్‌కి!
Walking Backwards- Health Benefits: వెనక్కు నడవడం లెక్కకు తిరోగమన సూచనగా కనిపిస్తుందేమోగానీ... హెల్త్‌కు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనకలవాటైన నడక కంటే వెనక్కు నడిచే ప్రక్రియ మరింత సవాలుగా మారుతుంది. మెదడుకు మరింత ఎక్కువ పని పడుతుంది. బ్యాలెన్స్ చేయడం, నడిచేప్పుడు కాళ్లు సరిగ్గా పడటం, పక్కలకు సరిగా తిరగడం వంటి వాటి నియంత్రణ మరింత కష్టమవుతుంది. 40 శాతం శక్తి ఎక్కువగా దాంతో దేహానికీ, మెదడుకూ శ్రమ పెరిగి, శారీరక కదలికలు చురుకుగా మారడానికి, మెదడుకు మరింత పదును పెరగడానికి అవకాశముంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. మామూలు నడకతో పోలిస్తే వెనక్కు నడవడంలో 40 శాతం శక్తి ఎక్కువగా వినియోగమవుతుందని, దాంతో అంతే సమయంలో మరింత ఎక్కువ వ్యాయామం సమకూరుతుందనీ, లంగ్స్‌కు ఆక్సిజన్ కూడా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలివే! వెనక్కి నడక వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ నివారితం కావడం, కాలి కండరాల బలం, సామర్థ్యం పెరగడం, కీళ్ల ఆరోగ్యం పెంపొందడం, ప్లాంటార్ ఫేసిౖయెటిస్తో వచ్చే మడమల నొప్పి తగ్గడం, దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడేవారి నొప్పి నుంచి ఉపశమనంతో పాటు వేగంగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే వెనక్కు నడిచే ఆరోగ్య ప్రక్రియకోసం పరిసరాలతో బాగా పరిచయం ఉన్న గదిలోనే (ఇన్‌డోర్‌లో) అలవాటైన చోట నడుస్తూ, మధ్యన ఎలాంటి అంతరాయాలూ లేకుండా చూసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు చెందిన క్లినికల్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అధ్యాపకుడు జాక్మెక్ నమారా. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు.. Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం -
Hypersensitivity Pneumonia: పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..!
మనలో చాలామందికి నిమోనియా గురించి తెలుసు. ‘హైపర్సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట కొత్తగా అనిపించవచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది అనేక నిమోనియాల సమాహారం అని అనుకోవచ్చు. రైతులు గరిసెల్లో వడ్లూ, ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, గడ్డి వామి పేర్చే సమయంలో వచ్చే వాసనలు పడనప్పుడు ఒక రకం నిమోనియా వస్తుంది. దాన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనప్పుడు ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అంటూ మరో ఆరోగ్య సమస్య ఎదురవుతుంది. అంతేకాదు... పెద్దసంఖ్యలో పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఇది రావచ్చు. గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ, వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్లో ఈ ముప్పు మరింత ఎక్కువ. ఈ సమస్యపై అవగాహన కలిగించేందుకే ఈ కథనం. వృత్తి కారణంగానో లేదా ఇల్లు మారడం వల్లనో ఓ కొత్త వాతావరణంలోకి వెళ్లాం అనుకొండి. అప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందకపోవడం, ఆయాసపడటం జరగవచ్చు. అందుకు కారణం అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి పదార్థాలు ఉండటం. అవి ఊపిరితిత్తుల (లంగ్స)పై కలిగించే దుష్ప్రభావం వల్ల వచ్చే సమస్యే ‘హైపర్ సెస్సిటివిటీ నిమోనైటిస్’. ఇది కొందరిలో తక్షణం సమస్యగా కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. మరికొందరిలో దీర్ఘకాల సమస్యగానూ పరిణమించవచ్చు. ఇదెంత సాధారణమంటే మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఇది కనిపిస్తుంటుంది. ఎందుకొస్తుంది? మన పరిసరాల్లోని దాదాపు 300 రకాల పదార్థాలు, రేణువులు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణం కావచ్చు. కొంతమందికి కొన్నింటితో అలర్జీ కలగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆ అలర్జెన్స్‌ను స్థూలంగా వర్గీకరించినప్పుడు నాలుగు రకాలుగా రావచ్చు. అవి... ఫార్మర్స్ లంగ్ : ఇది ముఖ్యంగా రైతుల్లో కనిపిస్తుంది. పంట కోశాక ధాన్యాన్ని గరిసెల్లో (గాదెల్లో) నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, బయట గడ్డివాముల్లాంటివి పేర్చాల్సిరావడం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: కొందరు జీవనోపాధి కోసం... అంటే ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు కోళ్లూ, బాతుల వంటి పక్షుల్ని పెంచుతుంటారు. మరికొందరు హాబీగా పక్షుల్ని పెంచుతారు. ఇంకొందరు సరదాగా పక్షులకు ఆహారం వేస్తుంటారు. వాటి వాసనతోనూ, విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అంటారు. హ్యుమిడిఫయర్స్ లంగ్ : కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో ఉండాల్సిరావచ్చు. ఆ తేమ కారణంగా అక్కడ పెరిగే ఫంగస్తోనూ, వాటి స్పోరులతో (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) సరిపడనప్పుడు ఇది వస్తుంది. నిత్యం ఎయిర్కండిషనర్లో ఉండేవారి కొందరికి ఆ చల్లటివాతావరణం సరిపడక కూడా రావచ్చు. అందుకే దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అంటారు. హాట్ టబ్ లంగ్ : కొందరు హాబీగా లేదా ఆరోగ్యం కోసం ‘స్పా’ల వంటి చోట్ల నీటి తొట్టెల్లో స్నానాలు చేస్తుంటారు. మరికొందరు ఇన్హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటి ఆవిర్లను పీలుస్తుంటారు. అయితే ఆ నీరు నిల్వ ఉండటం లేదా ఆ పాత్రను సరిగా కడగకపోవడంతో అపరిశుభ్రంగా ఉండటం, తొట్టిస్నానాల విషయంలో... వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం, అక్కడ అలర్జెన్స్ పెరగడంతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. లక్షణాలు ఈ సమస్య ఏదో ఒక సమయంలో (అక్యూట్‌గా)నైనా రావచ్చు. అంటే సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్‌గా) బాధించవచ్చు. ∙ ఊపిరి అందకపోవడం ∙తీవ్రమైన ఆయాసం ∙జ్వరం ∙చలితో వణకడం ∙ఒళ్లునొప్పులు ∙తలనొప్పి ∙కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ∙గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం...గాలికి గమ్యం అయిన గాలిసంచిలో అడ్డంకులు (ఎగ్జుడస్) ఉండవచ్చు. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ∙ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం మారిపోవడం, కంగారుగా ఉండటం, అయోమయం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటల పాటు వేధించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే... కొందరిలో అది తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా ఎడతెరిపిలేకుండా లక్షణాలు బాధించవచ్చు. నిర్ధారణ పరీక్షలు ∙తొలుత స్టెతస్కోప్‌తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షిస్తారు. lఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ తీస్తారు. ∙శ్వాసప్రక్రియ సరిగా ఉందా అని లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి ‘లంగ్ ఫంక్షన్ టెస్ట్’ చేస్తారు. ∙ఏవైనా అలర్జెన్స్ కారణంగా అలర్జీ ఉందేమో తెలుసుకోడానికి యాంటీబాడీస్ రక్తపరీక్ష చేస్తారు. ∙బ్రాంకోస్కోప్ సహాయంతో నోటి నుంచి లేదా ముక్కు నుంచి లంగ్స్‌కు గాలి వెళ్లే దారులను పరీక్షిస్తారు. ఇది వోకల్ కార్డ్స్, విండ్‌పైప్ వంటి చోట్లకు వెళ్లి అక్కడేమైనా అసాధారణతలు ఉన్నాయా అని పరీక్షిస్తుంది. ∙ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘కైరో లంగ్ బయాప్సీ’ (దీన్ని కార్డియోథొరాసిక్ సర్జన్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం జరుగుతుందంటే...? ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయం కలిగినట్లుగా గాట్లవంటివి రావచ్చు. దీన్నే ‘స్కారింగ్’ అంటారు. ఇక అవి తమ స్వాభావిక సాగేగుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా పేర్కొంటారు. నివారణ ∙సమస్య నిర్ధారణ అయినప్పుడు అసలు ఏయే అలర్జెన్ కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి నుంచి బాధితులను పూర్తిగా దూరంగా ఉంచాలి. ∙సమస్య వచ్చిన రైతులు ధాన్యం నిల్వ చేసే గరిసెలు, గాదెలు, గిడ్డంగులతో పాటు గడ్డివాములు, పశువుల కొట్టాల్లో గడ్డి వేసే చోట్లకూ, పశువులు తినివదిలేసిన వృథా గడ్డిని పడేసే పెంటకుప్ప/ పేడదిబ్బ / ఎరువు దిబ్బలకు దూరంగా ఉండాలి. ∙పౌల్ట్రీరంగంలో పనిచేసేవారు కోళ్లగూళ్లకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ∙సరదగా పక్షులు పెంచుకునేవారు వాటి నుంచి దూరంగా ఉండాలి. వాటికి దాణా వేయకుండా ఉండటం, అవి రెట్టలేసే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ∙çపరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లలో / ఆఫీసుల్లో / కార్యక్షేత్రాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఇండ్ల పరిసరాల్లో కుళ్లుతున్న / కుళ్లడానికి ఆస్కారం ఉన్న పదార్థాలను (అంటే కుళ్లుతున్న పండ్లు, ఖాళీచేసిన కొబ్బరిబొండాల వంటివి) పడవేయకూడదు. ∙తేమగా ఉండి, ఫంగస్ పెరిగేందుకు ఆస్కారం ఉండే పరిసరాల నుంచి దూరంగా ఉండాలి. ∙ఏసీలో ఉండేవారు తరచూ ఫిల్టర్లను శుభ్రం చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙స్థోమత, అవకాశం ఉన్నవారు వీలైతే గాలిలో తేమను తెలుసుకునే ఉపకరణం ‘హైగ్రోమీటర్’ను కొనుగోలు చేసి, తామున్న ప్రదేశంలో 50 శాతానికి మించి తేమ ఉంటే అక్కడికి దూరంగా వెళ్లిపోవాలి. ∙నిల్వనీళ్లలో తొట్టిస్నానం వద్దు. ∙సువాసన ద్రవ్యాలు కలిపిన నీటి ఆవిర్లను పీల్చడం వంటివి చేయకూడదు. ∙నిల్వ ఉన్న నీళ్లు ఇంటిలోకి లీక్ అవుతూ ఉంటే, ప్లంబర్ల సహాయంతో వెంటనే రిపేరు చేయించాలి. ∙పరిసరాలెప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గోడలు తడిగా, తేమతో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. lపొగతాగే అలవాటు / ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. చికిత్స ∙అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి రావచ్చు. lయాంటీ హిస్టమైన మందులను ఇవ్వాల్సి రావచ్చు. ∙ఊపిరి అందేలా ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసేందుకు ‘బ్రాంకోడయలేటర్స్’ ఇవ్వాల్సి రావచ్చు. ∙జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తుంటే దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ ఇవ్వాల్సి రావచ్చు. ∙రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సి రావచ్చు. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగా, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, పీచులాగా (ఫైబ్రస్) అయిపోతే ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు. -
ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తులకు చిన్న కోతతోనే శస్త్రచి కిత్స చేసే ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా పేరుపొందిన రోబో టిక్ సర్జరీ నిపుణులు స్పెయిన్‌కు చెందిన డిగో గొన్జాల్స్ రివాజ్, రొమేనియాకు చెందిన ముగురేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యుడు మంజునాథ్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఆసియా లోనే తొలిసారిగా ఒకే చిన్న కోతతో చేసే సర్జరీని అందుబాటులోకి తెచ్చా మన్నారు. ఊపిరితి త్తులకు ఇన్ఫెక్షన్లు, కేన్సర్ సోకినప్పుడు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేస్తే వేగంగా కోలుకుంటారని తెలిపారు. చిన్నపాటి గాయమే కావడం వల్లే ఏ వయసువారికైనా ఈ విధానంలో శస్త్రచికిత్స చేయవ చ్చని.. ఇటీవల ఊపిరి తిత్తుల కేన్సర్‌తో బాధప డుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి అపోలో ఆస్పత్రిలో విజయ వంతంగా ఈ శస్త్రచికిత్స చేశామని వెల్లడిం చారు. రోబోటిక్ వైద్య సేవలు సమీప భవిష్యత్తులో విస్తరించ నున్నాయని వైద్యులు తెలిపారు. -
మనుషుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్
లండన్: భూగోళాన్ని ముంచెత్తుతున్న ప్రమాదకరమైన ప్లాస్టిక్ భూతం ఇప్పుడు మనుషుల శరీరంలోకి సైతం చొరబడుతోంది. మనుషుల ఉపరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను ఇంగ్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్ హల్కు చెందిన హల్‌యార్క్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు గుర్తించారు. గాలితోపాటు ప్రాణాంతక ప్లాస్టిక్ రేణువులను సైతం మనం పీలుస్తున్నామని వారు చెప్పారు. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ తిష్ట వేస్తే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సముద్రాలు, కొండలు, భూమి అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. వ్యర్థాల్లోకి చేరిన పెద్ద ప్లాస్టిక్ వస్తువులు చిన్నచిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలోకీ మారుతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ ప్లాస్టిక్ రేణువులను వాటర్ ఫిల్టర్లు కూడా అడ్డుకోలేవు. చివరకు ఇవి పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. 13 లంగ్ టిష్యూ నమూనాలను పరీక్షించగా, 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయని çపరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ సైన్స్‌లో ప్రచురించనున్నారు. జీవించి ఉన్న మనుషుల ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లను గతంలోనే గుర్తించినప్పటికీ.. ఊపిరితిత్తుల అంతర్భాగాల్లో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అని సైంటిస్టులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయని, అందులోకి ప్లాస్టిక్ రేణువులు చేరితే శ్వాసలో సమస్యలు వస్తాయన్నారు. -
ఎక్మో ఎలాంటి సందర్భాల్లో వాడతారో తెలుసా?
ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం. ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు. ఎలా పని చేస్తుంది? ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్‌గా)వాడుతారు. ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్‌ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు. అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా? పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు. ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు. ‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్‌ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్‌గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్‌గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరెవరిలో... ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్‌గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు. అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సక్కెస్ రేటు తక్కువా? సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్‌కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి. అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క. కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ -
నోరు తెరిస్తే వింత శబ్దం.. ఛాతిలో నొప్పి.. 11 నెలల తర్వాత వీడిన మిస్టరీ
కోల్‌కతా: దాదాపు 11 నెలల క్రితం ఓ కుర్రాడు అనుకోకుండా ప్లాస్టిక్ విజిల్ మింగాడు. తల్లిదండ్రులకు చెప్తే కొడతారనే భయంతో జరిగిన దాని గురించి వారికి చెప్పలేదు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా కుర్రాడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడసాగాడు. స్థానిక వైద్యులు ఎవరు బాలుడి అసలు సమస్యను గుర్తించలేకపోయారు. చివరకు ఓ డాక్టర్ సలహాతో జిల్లా ఆస్ప్రతికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గమనించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసి.. విజిల్‌ని తొలగించారు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్ ప్రాంతానికి చెందిన రైహాన్ లస్కర్(12) అనే కుర్రాడు 2021, జనవరిలో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడు. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత రైహాన్ జీవితంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైనా మాట్లాడదామని నోరు తెరిస్తే.. విజిల్ ఊదినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ వచ్చేది. ఇక ఈత కొడదామని వెళ్తే ఎక్కువ సమయం నీటిలో ఉండలేకపోతుండేవాడు. ఛాతిలో నొప్పితో బాధపడడేవాడు. ప్రారంభంలో రైహాన్ తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!) ఆ తర్వాత రైహాన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండేవాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపిస్తే.. వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) అక్కడ రైహాన్ పరిస్థితిని గమనించిన సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం అరుణాభా ఆధ్వర్యంలో వైద్యులు గురువారం రైహాన్‌కు ఆపరేషన్ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్! -
గాలి నుంచి ఆక్సిజన్ వచ్చేదెలా?
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద జీవులకు ఆక్సిజనే కీలకం. ఆక్సిజన్ అందకుండా కొన్ని నిమిషాల పాటు కూడా బతకలేం. మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను సంగ్రహించి, శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుంటాం. కానీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు.. శరీరానికి ఆక్సిజన్ సరిగా అందక, ప్రత్యేకంగా అందించాల్సి వస్తుంది. గాలిలో ఆక్సిజన్ ఉండగా మళ్లీ ఎందుకు అందించడం అనే సందేహాలు రావొచ్చు. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 0.9శాతం ఆర్గాన్, మిగతా 0.1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 21%ఆక్సిజన్‌నే గ్రహించాల్సి ఉంటుంది. అదే 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటే.. మరింత మెరుగ్గా శరీరానికి అందుతుంది. శ్వాస సరిగా ఆడనివారికి ఆక్సిజన్ పెట్టడానికి కారణమిదే. సాధారణ గాలిలో నుంచి నైట్రోజన్ వాయువును తొలగించేస్తే.. మిగిలే గాలిలో 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్లు ఇదే పనిచేస్తాయి. ఈ సాంకేతికతను ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’గా పిలుస్తారు. పీఎస్ఏ ప్లాంట్లు పనిచేసేదిలా.. 1. సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరిస్తారు. 2. గాలిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. అందులో తేమను తొలగిస్తారు. 3. దుమ్ము, ధూళి లేకుండా ఫిల్టర్ చేస్తారు. 4. ఒక చిన్నపాటి ట్యాంకు (ఎయిర్ బఫర్) మీ దుగా అడ్సార్ప్షన్ ట్యాంకులకు పంపుతారు. 5. అడ్సార్ప్షన్ స్టేజీలో రెండు ట్యాంకులు ఉంటాయి. వాటిల్లో జియోలైట్గా పిలిచే ప్ర త్యేక పదార్థాన్ని నింపి ఉంచుతారు. వేర్వేరు వాయువులను పీల్చుకునేందుకు వేర్వేరు జియోలైట్లు ఉంటాయి. నైట్రోజన్‌ను పీల్చేం దుకు ‘జియోలైట్ 13’ను వాడుతారు. ముం దుగా ఒక ట్యాంకు (ఏ)లోకి తీవ్ర ఒత్తిడితో ఉన్న గాలిని పంపుతారు. అందులోని జియోలైట్ నైట్రోజన్‌ను పీల్చుకుంటుంది. 93–95 శాతం ఆక్సిజన్‌తో కూడి న గాలి మిగులుతుంది. దీనిని ఆక్సిజన్ ట్యాంకుకు పంపుతారు. తర్వాత ట్యాంకు (ఏ)లో నుంచి వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. ఇదే సమయంలో మరో ట్యాంకు (బి)లో నైట్రోజన్ పీల్చుకునే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత మ రో ట్యాంకులో ఉత్పత్తవుతూ ఉండటం వల్ల.. నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 6. ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వార్డులకు సరఫరా చేస్తారు. 7. వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. -
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది: విజయవంతంగా శస్త్రచికిత్స
కర్నూలు (హాస్పిటల్): పొరపాటున మింగిన నీడిల్ (సూది) ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ఆధునిక పరికరాలతో ఆ సూదిని తొలగించి ఆయువు పోశారు. వివరాలను గురువారం ఎన్ఆర్ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ బి.జయప్రకాశ్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు పశువులకు వేసే సూదిమందు ఇచ్చే నీడిల్ (సూదిని) నోటిలో పెట్టుకుని పరధ్యానంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ సూది పొరపాటున గొంతులోకి వెళ్లింది. దీంతో అతను ఉక్కిరిబికిరి అయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అత్యాధునిక వైద్యపరికరాలైన టెలిస్కోపిక్ బ్రాంకోస్కోప్ ద్వారా చాకచక్యంగా ఆ సూదిని బయటకు తీశారు. ఇప్పటివరకు తాను నిర్వహించిన చికిత్సల్లో ఇది ఎంతో క్లిష్టమైందని డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
మనిషి మనీషిగా మారాలంటే..?
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత? ►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది. ►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి. ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు. మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే. – బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు -
ఆర్నెల్లు సమస్యలు వేధిస్తాయి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మూడు నుంచి ఆరు నెలల పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై పీఐబీ నిర్వహించిన వెబినార్‌లో ఊపిరితిత్తులు, టీబీ నిపుణులు డాక్టర్ నిఖిల్ నారాయణన్ బాంటే, న్యూట్రిషనిస్ట్ ఇషా కోస్లాలు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో పోస్ట్ కోవిడ్–19 లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్ నిఖిల్ నారాయణన్ తెలిపారు. 50 నుంచి 70 శాతం మంది స్వల్ప, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారని, మూడు నుంచి ఆరునెలల పాటు ఈ ఇబ్బంది ఉంటోందని తెలిపారు. అయితే మధ్యస్థ, తీవ్రస్థాయి కరోనాతో బాధపడిన వారే ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిఖిల్ వివరించారు. పోస్ట్ కోవిడ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు... ► నీరసం/అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, విపరీతంగా చెమట పట్టడం, కీళ్ల నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, నిద్రలేమి, మానసికంగా కుంగుబాటు, నిరాశ, ఆందోళన. పోస్ట్–కోవిడ్–19 లక్షణాలకు కారణం ► 1. వైరస్ సంబంధిత: కరోనా ఒక్క ఊపిరితిత్తుల పైనే కాదు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. కాలేయం, మెదడు, కిడ్నీలు ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో శరీరం పూర్తిస్థాయిలో మహమ్మారి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. ► 2. రోగనిరోధక శక్తి సంబంధిత: శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే రోగనిరోధక శక్తి హైపర్ యాక్టివ్ అవుతుంది. వైరస్‌తో పోరాటంలో భాగంగా పలు రసాయనాలు ఉద్భవించి అవయవాల్లో మంట పుట్టిస్తుంది. కొంతమంది రోగుల్లో ఈ మంట దీర్ఘకాలం ఉంటుంది. ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు: ► త్రొంబోఎంబాలిజం: పోస్ట్–కోవిడ్–19లో ఎక్కువ భయపడాల్సిన లక్షణం. రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని బట్టి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ లక్షణాలు ఐదు శాతం రోగుల్లోనే కనిపించాయి. ► పల్మోనరీ ఎంబాలిజం: ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలను ముందుగా తెలియజేస్తుంది. రక్తపోటు తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► డీ–డైమర్ స్థాయి ఎక్కువ: కరోనా తీవ్రమైన లక్షణాలున్న రోగులు, అధిక డీ–డైమర్ స్థాయి ఉన్న వారికి ఆసుపత్రిలో ఉన్న వారు 2 నుంచి 4 వారాలపాటు చికిత్స సమయం, ఆ తర్వాత కూడా రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకే ఈ చికిత్స పొందాలి. ► దీర్ఘకాలిక దగ్గు: పోస్ట్–కోవిడ్–19లో ప్రధానమైన వ్యాధుల్లో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. పొడి దగ్గు వచ్చే రోగులకు శ్వాస వ్యాయామాలు సిఫార్సు చేయాలి. ► పక్కటెముకల్లో నొప్పి: పోస్ట్–కోవిడ్‌లో తరచుగా దగ్గు కారణంగా నొప్పులు కనిపిస్తాయి. దీర్ఘకాలిక దగ్గు వల్ల ఛాతీ దిగువ భాగంలో ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పులు రావచ్చు. ఈ లక్షణాలు గుర్తించడం ఎంతో అవసరం. ► పల్మోనరీ ఫైబ్రోసిస్: పోస్ట్ కోవిడ్‌లో మరో ప్రధానమైన లక్షణం. కరోనా నుంచి ఊపిరితితుత్తులు రికవరీ అయ్యే క్రమంలో మచ్చలు ఏర్పడతాయి. పది శాతం మంది రోగులు దీర్ఘకాలం ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తోంది. 70 శాతంపైగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగుల్లో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ రోగుల్లో కూడా పల్మోనరీ ఫైబ్రోసిస్ ఒక శాతం మందిలోనే వెలుగుచూసింది. మోడరేట్, తీవ్ర లక్షణాలతో ఆక్సిజన్ థెరపీ తీసుకున్న వారిలో కోలుకున్న నెలరోజుల తర్వాత ఊపిరితిత్తులు పూర్తిగా పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే దానిపై పరీక్ష చేయించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నవారు ఛాతినొప్పి వస్తే గుండెపోటు వస్తోందని భయపడుతున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో మూడు శాతం కన్నా తక్కువ మందికే గుండెపోటు వచ్చింది. పోషణ నిర్వహణ సూచనలు ► కరోనా కారణంగా మరణించిన వారిలో 94 శాతం మంది సహ అనారోగ్యాల కారణంగానే మరణించారని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషా కోస్లా తెలిపారు. తగిన ఆహారం తీసుకొని రోగనిరోధక శక్తి కాపాడుకోవాలని ఆమె సూచించారు. మసాలాలు లేకుండా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రెండు పూటలా ఆహారంలో తప్పకుండా ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ► జింకు, విటమిన్–సి, డి, బి కాంప్లెక్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరం తిరిగి శక్తిపొందడానికి ఇవెంతో ఉపకరిస్తాయి. ► రెయిన్బో డైట్ ఎంతో అవసరం. ఇవి ఏయే జన్యువులు పనిచేయాలి. వేటిని అణచివేయాలనేది త్వరగా గుర్తిస్తాయి. వేర్వేరు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రంగురంగుల ఆహారం కనీసం ఒక భోజనంలోనైనా తీసుకోవాలి. రక్షిత ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ– ఇన్ఫ్లమేటరీ, కోల్డ్‌ప్రెస్డ్ ఆయిల్స్, పసుపు, అల్లం, టీ ఉండాలి. ► హైడ్రేషన్: శరీరం డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. -
చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో
పంజాబ్‌లో సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేసింది. నా ట్రీట్మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. ఛంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్‌కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్స్‌గ్రేషియాపై విమర్శలు డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు. Grateful to Punjab CM @capt_amarinder for supporting the treatment of DSP Harjinder Singh, after his recovery from #COVID...1/2 — DGP Punjab Police (@DGPPunjabPolice) June 2, 2021 మూడువారాల తర్వాత.. ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్ సింగ్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్‌కు డిపార్ట్మెంట్ తరపున లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు -
Coronavirus : టీకాతో ఊపిరితిత్తులు భద్రం
సాక్షి, హైదరాబాద్: కరోనా సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మరింత రక్షణ చేకూరుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని, టీకా తీసుకున్నాక మళ్లీ కోవిడ్ వచ్చినా పెద్దగా ప్రమాదమేమీ లేకుండా బయటపడొచ్చని స్పష్టం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేసిన పరిశీలనలో వ్యాక్సిన్ ప్రయోజనాలను గుర్తించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ విభాగాధిపతి కిరణ్ మాదల, రేడియాలజీ విభాగాధిపతి మధుసూదన్, రేడియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ తదితరుల బృందం ఈ పరిశీలన నిర్వహించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సివియారిటీ స్వల్పంగా ఉందని, తీసుకోని వారిలో సగం మంది వరకు ఇబ్బందిపడ్డారని వారు గుర్తించారు. పరిశోధన సాగిందిలా.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏప్రిల్ ఒకటి నుంచి 26వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 206 మందిని ఎంపిక చేసి పరిశోధన చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. వ్యాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ బారినపడిన 180 మంది ఒక గ్రూప్‌గా.. 26 మంది కోవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు (ఈ 26 మంది 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 2 వారాల తర్వాత వైరస్ బారినపడ్డవారు) మరో గ్రూప్‌గా ఉన్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి, వైరస్‌తో నెలకొన్న పరిణామాలపై వైద్య బృందం నెలరోజుల పాటు నిశితంగా అధ్యయనం చేసింది. పరిశీలనకు తీసుకున్న వారిలో సగటు వయసు 50 ఏళ్లుకాగా.. కనిష్ట, గరిష్ట వయసు 28–80 సంవత్సరాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురణ నిజామాబాద్ వైద్య కళాశాల బృందం చేసిన పరిశోధన నివేదికను ప్రఖ్యాత ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో ఈ వారం ముద్రించారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో లాభాలపై మరింతగా లోతైన పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు. ఎవరి పరిస్థితి ఏమిటి? వ్యాక్సిన్ తీసుకున్న 26 మందిలో ఎలాంటి దుష్ప్ర భావాలు తలెత్తలేదు. 26 మందికి సీటీ స్కాన్ తీయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే సీటీ పాజిటివ్ వచ్చింది. మిగతా 23 మందిలో నెగిటివ్‌గా వచ్చింది. అంటే ఆ ముగ్గురికి మాత్రమే ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ వెళ్లింది. మిగతావారిలో వెళ్లలేదు. వీరిలో సీటీ సివియారిటీ స్కోర్ 0.8లోపే ఉంది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో వైరస్ వ్యాప్తి మూడు రకాలుగా ఉంది. 40 మందిలో మైల్డ్‌గా, 70 మందిలో మోడరేట్‌గా, 50 మందిలో సివియర్‌గా ఉన్నట్లు గుర్తించారు. 89 శాతం మందిలో సీటీ స్కాన్ లో ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో దాదాపు 120 మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పెద్దగా ఇన్ఫెక్షన్ లేదు. వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో 85 మందికి ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. ఇందులో కొందరిని ఐసీయూకు తరలించి, చికిత్స చేశారు. కాగా.. ఈ పరిశీలనలో పూర్తిగా సీరియస్ అయి చనిపోయినవారిని పరిగణనలోకి తీసుకోలేదు. చదవండి: ఏపీలో 103, తెలంగాణలో 123 -
ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పెరుగుతుందా?
హైదరాబాద్: రోగులు పడక మీద బోర్లా పడుకోవడం వల్ల, లేదా టేబుల్‌కు ఛాతీని ఆనించి ఉంచడం వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదులు పెరుగుతాయి. ఇలా రోగికి ఆక్సిజన్ అందించే ప్రక్రియను ‘అవేక్ ప్రోనింగ్’ లేదా ‘ప్రోన్ వెంటిలేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుంది.. ‘ఆక్సిజనేషన్’ ఎక్కువగా జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఆక్సీమీటర్ మీద 80 ఉన్న రోగికి (ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. దాని సారాంశం ఏమిటంటే.. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమై ఆక్సిజన్ మీద ఉన్న ఒక పేషెంట్‌కు అక్కడి డాక్టర్లు ఆక్సిజన్ ఇస్తున్నారు. ఇంతలో పెద్ద డాక్టర్లు వచ్చి... ఆక్సీమీటర్ మీద 80 ఉన్న రోగికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం లేదనీ, సదరు రోగిని బోర్లా పడుకోబెట్టడం వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పాళ్లు పెరుగుతాయని చెప్పి, ఆక్సిజన్ తొలగించారన్నది) ఇది ఉపయోగపడుతుందనడం మాత్రం అవాస్తవం. అలాంటివారికి ఆక్సిజన్ పెట్టి తీరాలి. సాధారణంగా రోగులు తమ ఆక్సిజన్ మోతాదులను ఆక్సీమీటర్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ విలువ 95 కొలత ఉండటం అవసరం. అంతకంటే కొంత తగ్గి... ఏ తొంభై నాలుగో, తొంభై మూడో ఉన్నప్పుడు ఇలాంటి చర్య పనికి వస్తుందిగానీ.. బోర్లా పడుకోవడం అనే ప్రక్రియ వల్ల గణనీయంగా ఆక్సిజనేషన్ పెరగదు. ఇలాంటి పోస్ట్‌లను నమ్మడం వల్ల రోగికి ముప్పే తప్ప... ప్రయోజనం ఉండదని రోగులు, ప్రజలు గ్రహించడం అవసరం. - డాక్టర్ ముఖర్జీ సీనియర్ కార్డియాలజిస్ట్ చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరమా? -
ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి
మిషెగావ్: అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో పొందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలోని మిషెగావ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మరణంగా అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. అయితే అవయవ మార్పిడి చికిత్స అందించిన వైద్యుడికి కూడా కరోనా సోకింది. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఊపిరితిత్తులు అందుబాటులో ఉన్నాయని సమాచారం రావడంతో వైద్యులు వెంటనే వివరాలు సేకరించారు. ఊపిరితిత్తుల మార్పిడికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమెకు ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స విజయవంతంగా చేశారు. అయితే మార్పిడి చేసిన 61 రోజులకు ఆమె మరణించండం వైద్యులు షాకయ్యారు. సక్రమంగా చికిత్స అందించినా ఎందుకు ఇలా అయ్యిందని మొత్తం చికిత్స విధానమంతా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికి ఊహించని సమాధానం లభించింది. ఊపిరితిత్తులు ఇచ్చిన దాతకు కరోనా సోకిందనే విషయం తెలిసింది. ఆ కరోనా ఇంకా ఊపిరితిత్తుల్లో నిక్షేపమై ఉంది. అవయవదానం పొందిన మహిళకు కూడా కరోనా సోకింది. అంతర్గతంగా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో విస్తరించి ఆమె ప్రాణం తీసిందని వైద్యులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. -
ఊపిరితిత్తులను ఇలా కాపాడుకుందా..!
ఊపిరితిత్తులు ఎప్పుడూ శ్వాసిస్తూ ఉంటాయి. కాబట్టి బయటి నుంచి కాలుష్యాలూ కరోనా వైరస్సులూ కలగలిసి దెబ్బతీసే అవకాశాలు ఎక్కువే. అయితే వాటి రక్షణ కోసం ఏర్పటైన వ్యవస్థ మన దేహంలోనే ఉంటుంది. ముక్కునుంచే మొదలయ్యే రక్షణ... శ్వాసం కోసం తీసుకునే గాలి ప్రవేశించే ప్రవేశద్వారమైన ముక్కు నుంచి రక్షణ వ్యవస్థ మొదలైపోతుంది. ముక్కులో ఉండే వెంట్రుకలు పెద్ద కాలుష్యపు కణాలను (పార్టికల్స్‌ను) చాలావరకు అక్కడే కట్టడి చేస్తాయి. దానికి తోడు ముక్కు ఓ ఎయిర్కండిషనర్లా కూడా పనిచేస్తూ ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బయటి గాలిని ముక్కు ఒకింత చల్లబరిచాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా జాగ్రత్త తీసుకుంటుంది. అలాగే వాతావరణం బాగా చల్లబడే ఈ సీజన్లో ఆ చలిగాలి ప్రవేశించకుండా, దాంతో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు బాగా సంకోచించుకుని పోకుండా అదే ముక్కు జాగ్రత్తపడుతుంది. ఈ సీజన్లో చలిగాలిని కాసింత వేడిగా మారాకే ముక్కు గాలిని లోనికి పంపుతుంది. ఇలా మన ముక్కు ఊపిరితిత్తులకు దాదాపుగా ఒకేలాంటి ఉష్ణోగ్రత ఉన్న గాలిని అందజేస్తుంది. నిర్మాణమే అద్భుతం... ముక్కు చివరన ఉండే వాయునాళం (ట్రాకియా) మొదటి అంతస్తు అనుకుంటే ఊపిరితిత్తుల చివరి అంచెలో ఉండే ఆల్వియోలస్ అనే గాలిగదిది చివరి అంతస్తు. ఇలా మన శ్వాస వ్యవస్థలో 28 అంతస్తులుంటాయి. లంగ్స్‌కు ప్రతిరోజూ 16 వేల లీటర్ల గాలి అందుతున్నప్పుడు... కేవలం ఒక కిలో కంటే కాస్తంత ఎక్కువ బరువు ఉండే ఊపిరితిత్తుల్లో ఇంత పెద్దమొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఎయిర్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చివరి అంతస్తు అయిన ఆల్వియోలైలో అతి సన్నగా చీలిన రక్తనాళాలుంటాయి. ఆల్వియోలైకు చేరినప్పుడు ద్రవంలా ఉండే రక్తం... ఒక పల్చని పేపర్షీట్లా మారి అలా నిలబడిపోతుంది. అప్పుడు ఆ 28వ అంతస్తులో బయటి ఆక్సిజన్ దేహానికి అంది, శరీరంలోని కార్బన్‌డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. ఇలా వెళ్లే క్రమంలో ఊపిరితిత్తులను బయటి కాలుష్యాల నుంచి రక్షించడానికి సన్నటి సీనియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ వెలుగుతున్న కొవ్వొతి మంట చివరిభాగంలా, ఒక్కోసారి కొరడా ఝుళిపించినట్లుగా కదులుతూ గాలిలోని పొగ, కాలుష్యాలను బయటకు పంపిస్తుంటాయి. సాధారణంగా మన శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ తయారవుతూ ఉంటుంది. అలాగే కాలుష్య పదార్థాలను బయటకు నెట్టివేసే సీలియా సక్రమంగా పనిచేయడానికి వీటి చుట్టూ పలచని మ్యూకస్ ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. అందుకే మన ముక్కు ఉపరితలం వద్ద ఉంటే మ్యూకస్ ఎప్పుడూ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. ఇలా మ్యూకస్‌తో కలిపి కాలుష్యాలను బయటకు నెట్టేసే చర్య కారణంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియరీ వ్యవస్థల నిర్మాణాన్ని మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అని కూడా అంటుంటారు. ఇలా అవి శరీరంలోకి వచ్చే పదార్థాలను (ఫారిన్ బాడీ) బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్‌నుంచి మనల్ని కాపాడతాయి. చలికాలంలో మరింత జాగ్రత్త అవసరం... ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఉదయం వేళ మినహా గాలి పొడిగా ఉంటుంది. (అందుకే ఈ సీజన్లో ఒంట్లో ఉన్న తేమను వాతావరణం బయటకు లాగేస్తూ ఉన్నందుకే ఒళ్లు, చర్మం, పెదవులు పగిలినట్లుగా అయిపోతాయి. దాన్ని అరికట్టేందుకే మనం వాజిలెన్ వంటివి రాస్తూ ఒంట్లోని తేమను బయటకు పోకుండా రక్షించుకుంటూ ఉంటాం). గాలిలో తేమ తక్కువగా ఉండి, గాలి పొడిగా ఉండటంతో దాని ప్రభావం సీలియరీ వ్యవస్థ మీద కూడా పడి అది దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఈ పొడిదనం కారణంగా మ్యూకస్ ఎండిపోయి చిక్కగా మారి కాలుష్యాలను బయటికి నెట్టడం కూడా కష్టమవుతుంది. పొగతాగే అలవాటుతోనూ, కొన్నిసార్లు కొన్ని రకాల మందులు వాడటం ద్వారా (ఉదాహరణకు ఎట్రోపిన్ వంటివి), మద్యపానంతో కూడా మన ఊపిరితిత్తుల సొంత రక్షణ వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నామని గ్రహించి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ఏం చేయాలి? మనం ఈ కరోనా సీజన్లో వాడే మాస్క్ చలిగాలిని నేరుగా ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చాలావరకు కాపాడుతుంది. అలాగే కాలుష్యాలనూ అరికట్టగలుగుతుంది. కాబట్టి ఇటు కరోనా నివారణతో పాటు ఊపిరితిత్తుల రక్షణకూ మాస్క్ ఉపయోగపడుతుందని గ్రహించి... తప్పక వాడాలి. ∙సీలియా బాగా పనిచేయడానికి గాలిలో తేమ పెంచాలి. ఇందుకోసం తరచూ ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలు చేపడితే అది తేమను పెంచడంతో పాటు ఈ సీజన్లో శ్వాసనాళాలు కుచించుకుపోకుండా చూస్తూ... ఊపిరితిత్తులకు గాలి ధారాళంగా అందేందుకూ దోహదపడుతుంది. ∙పెదవులతో పాటు గాలి ప్రవేశ ద్వారమైన ముక్కు చివరల వద్ద ఉండే చర్మం కూడా ఈ సీజన్లో పగిలే అవకాశం ఉన్నందున, అక్కడి చర్మం సెన్సిటివ్‌గా మారకుండా అక్కడ కూడా వాజిలెన్ రాయడం మంచిది. ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే మానేయాలి. -
లంగ్స్ కుదేలే...!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మొదట్లో.. దాని లక్షణాలేంటో, అదెలా సోకుతుందో తెలియక వైద్యనిపుణులు, పరిశోధ కులు తల్లడిల్లారు. అయితే త్వరలోనే దీనిపై భారతీయ వైద్యులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పల్మొనాలజీ, ఇతర రంగాల వైద్యులు స్పష్టత సాధించి మహమ్మారి కట్టడిలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వివిధ స్థాయిల్లో మెరుగైన చికిత్స విధానాలను అవలంబిస్తూ, రోగులు ఏ లక్షణాలు, ఆరోగ్య సమస్యలతో వస్తే ఎలాంటి చికిత్స అందించాలి?, ఏ మందుల కాంబినేషన్ వాడాలనే దానిపై స్పష్టత సాధించారు. కోవిడ్ మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపుతోంది. ఆ దిశగా చికిత్స అందించిన క్రమంలో తమకెదురైన అనుభవాలను, ముఖ్య విషయాలను శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, డాక్టర్ వి.వి.రమణ›ప్రసాద్ ‘సాక్షి’తో పంచుకున్నారు. అవేమిటో వారి మాటల్లోనే.. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం శరీరంలోని కణాల్లోకి వైరస్ ప్రవేశానికి ఆంజియో టెన్సిన్–కన్వర్టింగ్ ఎంజైమ్స్ (ఏసీఈ–2) రిసెప్టర్స్ కారణం. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఏసీఈ–2 రిసెప్టర్స్ ఎక్కువ. గుండె, ఇంటెస్టీన్స్, కిడ్నీలు, టెస్టికల్స్లోనూ ఇవి తగు మోతాదులో ఉంటాయి. అందువల్లే కరోనా కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతున్నాయి. ఆపై గుండె, రక్తనాళాలు, కిడ్నీలు, మెదడుపై కొంత ప్రభావం పడుతోంది. వైరస్ నుంచి కోలుకున్నాక కూడా చాలామందిని కోవిడ్ సమస్యలు పీడిస్తున్నాయి. దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు 3 నుంచి 6 నెలలు పడుతోంది. దీర్ఘకాలం కొనసాగే కోవిడ్ సమస్యలతో లంగ్స్ ఫైబ్రోసిస్‌తో ఊపిరితిత్తులు, గుండె సంబంధ రుగ్మతలు పెరుగుతాయి. ఐసీయూ చికిత్స నుంచి బయటికొచ్చాక పేషెంట్లను ‘క్రిటికల్ ఇల్నెస్ న్యూరోపతి’ సిండ్రోమ్ బాధపెడుతోంది. వైరస్ ప్రభావంతో గుండెలయల్లో హెచ్చుతగ్గులు, గుండె కండరాల టిష్యూ గట్టిపడి కార్డియోమైయోపతి ఏర్పడి గుండెకు రక్తాన్ని పంప్ చేయడం కష్టమవుతుంది. తాజా సమాచారం ప్రకారం..కోవిడ్‌తో మెదడుకు సంబంధించి వైరల్ ఎన్సిఫిలిటీస్, గులియన్ బారి డిసీజ్‌తో పాటు పాలిన్యూరోపతి, సెరబ్రల్ స్ట్రోక్స్ సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా పేషెంట్లలో దాదాపు సగం మందికి మూత్రంలో రక్తం లేదా ప్రొటీన్ కనిపించడం ద్వారా కిడ్నీ డామేజ్ ప్రారంభదశ మొదలవుతోంది. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, యశోద ఆస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్ ఇక్కడ రెమ్‌డెసివిర్ బాగానే పనిచేస్తోంది పశ్చిమ దేశాల్లో ‘రెమ్‌డెసివిర్’ పనితీరుపై డబ్ల్యూహెచ్‌వో పెద వి విరిచినా.. హైదరాబాద్‌లో ఇది బా గానే పనిచేసింది. వైరస్ తీవ్రత పెరిగేకొద్దీ వెంటిలేటర్ అమర్చాల్సిన పరిస్థితి నుం చి ఇది పలువురిని కాపాడింది. ఇక, కోవిడ్ వచ్చి తగ్గాక కొందరు 12 వారాల తర్వాత, కొందరు నెలలోనే అకస్మికంగా వస్తున్న జ్వరం, దగ్గు, ఆయాసాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. శరీరంలో ఇంకా ఇన్ఫెక్షన్ మిగలడం వల్లే ఇలా జరుగుతోంది. వైరస్‌లో ఆర్ఎన్ఏ పికప్ అయిన నెల తర్వాత కూడా కొందరికి పాజిటివ్‌గా రిపోర్ట్లు వస్తున్నాయి. లంగ్ ఫైబ్రోసిస్ వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి 24 గంటలపాటు ప్రాణవాయువునివ్వాలి. కొన్ని కేసుల్లో ‘లంగ్ ట్రాన్స్‌ప్లాంట్’ కూడా చేయా ల్సి వస్తోంది. ఊపిరితి త్తులు పాడై, ఇతర ట్రీట్మెంట్లు పనిచేయని వారికి పోస్ట్–కోవిడ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. చలికాలంలో ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లతో ఆస్తమా, బ్రాంకైటీస్, కిడ్నీ, టీబీ, షుగర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం ఎక్కువుంటుంది. వీరు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు తీసుకోవాలి. - డాక్టర్ వి.వి.రమణప్రసాద్, కిమ్స్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్ ‘సెకండ్ వేవ్’ వస్తే కష్టమే స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్ వస్తే చాలా కష్టం. నవం బర్, డిసెంబర్లలో కేసులు పెరగొచ్చు. మరో 6 నెలల పాటు రెండింతల జాగ్రత్తలు అవసరం. మాస్క్‌లు, ఇత ర జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇప్పటికీ 30% మంది మాస్క్‌లు సరిగా ధరించట్లేదు. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకునేపుడు మాస్క్‌లు తీసేస్తున్నారు. అటువంటప్పుడే వైరస్ సోకే అవకాశాలెక్కువ. పెద్ద వయస్కులు, గుండె, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు ఇళ్లలోనూ మాస్క్‌లు ధరించాలి. దసరా సందర్భం గా ఎంతమేరకు ఇన్ఫెక్షన్ పెరిగిందో ఇంకా స్పష్టత రాలేదు. దీపావళి, కార్తీకమాసం సందర్భంగా వైరస్ వ్యాప్తికి అవకాశాలెక్కువ. కరోనా తగ్గిపోయినట్టుగా భావిస్తున్న 30–40 ఏళ్లలోపు వారు బయట ఇన్ఫెక్ట్ అయి.. ఇళ్లలోని పెద్దలు, అనారో గ్య సమస్యలున్న వారికి అంటించే ప్రమాదం ఎక్కువుం ది. ఇక, నరాలపై ప్రభావం చూపే ‘గులియన్ బారీ సిం డ్రోమ్’తో కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. చర్మంపై దద్దుర్లు, గ్యాంగ్రిన్, రక్తనాళాలు మూసుకుపో యి పేగులకు సరిగా రక్తప్రసారం జరగకపోవడం వంటివి బయట పడుతున్నాయి. ఇమ్యూనిటీ తగ్గిపోయి యూరిన్, బ్లడ్, టీబీ, ఇతర ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. కొం దరిలో ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లి ‘లంగ్ ట్రాన్స్‌ప్లాంట్’ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. –డా.విశ్వనాథ్ గెల్లా, ఏఐజీ, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మొనాలజీ -
షాకింగ్.. లెదర్ బాల్లా గట్టిగా మారిన ఊపిరితిత్తులు
బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్ బాల్ కన్నా స్ట్రాంగ్‌గా మారినట్లు శవపరీక్షలో తెలిసింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఒకరు కరోనా బారిన పడి మరణించారు. ఈ క్రమంలో అతడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. దానిలో సంచలన విషయాలు తెలిశాయి. సదరు వ్యక్తి మరణించిన 18 గంటల తర్వాత కూడా అతడి గొంతు, ముక్కులో నుంచి సేకరించిన స్వాబ్ శాంపిల్స్‌లో వైరస్ ఉనికిని గుర్తించారు. ఈ సందర్భంగా శవపరీక్ష నిర్వహించిన ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ, రోగి ఊపిరితిత్తులు "తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయి".. రక్త నాళాలలో గడ్డలు ఏర్పడ్డాయని తెలిపారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి శవపరీక్ష వ్యాధి పురోగతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని తెలిపారు. అక్టోబర్ 10న ఈ శవపరీక్ష నిర్వహించామన్నారు. ఇది పూర్తి కావడానికి 1.10గంటల సమయం పట్టిందన్నారు డాక్టర్ రావు. (చదవండి: వ్యాక్సిన్ మొదట వారియర్స్‌కే! ) కరోనాతో మృతి చెందిన రోగి శరీరం.. అతడి మరణం తర్వాత కూడా వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉందని నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక డాక్టర్ రావు శవ పరీక్ష నిర్వహించడం కోసం సదరు రోగి ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశ మార్గాలు, ముఖం, మెడపై చర్మం నుంచి ఐదు శాంపిల్స్‌ని తీసుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో ముక్కు, గొంతులో నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అంటే కోవిడ్ రోగి శరీరం మరణం తర్వాత వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉందన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చర్మం మీద నుంచి సేకరించిన శాంపిల్స్ నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇక కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ శవపరీక్ష నిర్వహించినట్లు డాక్టర్ రావు తెలిపారు. రోగి మరణించిన సమయంలో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్లో ఉన్నారని.. మృత దేహాన్ని తీసుకెళ్లలేదన్నారు. ఇక ఇటీవల కాలంలో అమెరికా, ఇటలీలో శవపరీక్ష నివేదికలలో కనిపించిన ఫలితాలకు.. తాను నిర్వహించిన పరీక్ష ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు డాక్టర్ రావు. దీన్ని బట్టి చూస్తే.. భారతదేశంలో కనిపించే వైరస్ జాతులు భిన్నంగా ఉన్నాయన్నారు. -
కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది?
కరోనా అంటే అలాగ.. కరోనా అంటే ఇలాగ. మాస్కు వేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. దగ్గొస్తది.. తుమ్మొస్తది. ఇలా కోవిడ్–19 గురించి ఎవరైనా అడిగితే చాలు. గడగడా చెప్పేస్తాం. మరి అదే కోవిడ్–19 మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది అని అడిగితే.. అదీ.. అదీ.. అంటూ నీళ్లు నమిలేవాళ్లే ఎక్కువ. ఇక అలా నమలాల్సిన పని లేదు. ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి. ఇదిగో ఇలా చేస్తుంది అని చెప్పేయండి. అలా చెప్పాలంటే.. ఓసారి దీనిపై లుక్కేసుకోండి మరి.. -
ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?
మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? అని మనం చాలాసార్లు అనుకుంటాంగానీ మనిషన్న వాడు ఒక్కసారి కూడా దగ్గకుండా ఉంటాడా? అని అనుకోం. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి! ఊపిరితిత్తుల అంతరాళాల నుంచి వెలువడే పేలుడు లాంటి దగ్గును నిభాయించుకోవటం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఇదే జరిగిందనుకోండి. నిజానికి దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో మొదలు కాదు. మనం ఊపిరి తీసుకునే క్రమంలో గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకునేటప్పుడే మొదలవుతుంది. ఛాతీ, కడుపు, డయాఫ్రంలలోని కండరాలు ఒక్కసారి కుంచించుకుపోతాయి. మామూలుగానైతే ఇది మన ముక్కులు, నోటి నుంచి గాలిని బయటకు తోస్తాయి కానీ కొండ నాలుక అడ్డుగా ఉంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. కొండ నాలుక తెరుచుకోగానే ఈ ఒత్తిడితో కూడిన గాలి మొత్తం నోటి ద్వారా వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ వెలువడతాయి. ఒకవేళ మనిషికి దగ్గు అనేది రాకపోతే కొండనాలుక మూతపడదు కాబట్టి ఊపిరితిత్తులు, అన్నవాహికలో గాలి చిక్కుకుపోదు. ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ ఉండవు. భలే ఉందే ఇది.. ఇలాగే జరిగితే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది చిక్కు. దగ్గు అనేది లేకపోతే మన గొంతు, శ్వాస వాహికలను చికాకుపెట్టే దుమ్ము, ధూళి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. వాటితోపాటు వచ్చే బ్యాక్టీరియా కూడా అక్కడే మకాం వేస్తుంది. వేగంగా అనారోగ్యం బారిన పడిపోతాం. ఆ విషయం మీకు తెలియను కూడా తెలియదు. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ అవుతుంది. శ్వాస ఆగిపోతుంది. దీంతో జనాలు దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నిలిచిపోతారు. అంటే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందన్నమాట. ఇది మళ్లీ మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు దారితీస్తుంది. పనిచేయబుద్ధి కాదు. ఉత్పాదకత తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. మీకు తెలుసా? ఒక వ్యక్తి రోజులో కనీసం 11సార్లు దగ్గుతారట. మన మనుగడకు దగ్గు ఎంత ముఖ్యమైనదంటే వైద్యులు ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల్లోని కఫాన్ని బయటకు తోసేసేందుకు రోగులతో బలవంతంగా దగ్గిస్తున్నారు. దీనికి అసిస్టివ్ కాఫ్ అని పేరు. అదృష్టం ఏమిటంటే కనురెప్పలు మూసినంత సహజంగా మనం దగ్గగలగడం. కావాల్సినప్పుడు ఆన్/ఆఫ్ చేయలేకపోవడం. కాబట్టి... దగ్గు వచ్చిందనుకోండి... ముఖానికి ఏదో ఒకటి అడ్డుపెట్టుకొని ఖళ్లు ఖళ్లు మనిపిస్తే సరి! అయితే వీలైనప్పుడల్లా చేతులు కడుక్కోవడం మరిచిపోకండి సుమా! -
బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్..
కోల్‌కతా: సాధారణంగా చిన్న పిల్లలు పెన్నుక్యాప్లను నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటడం చూస్తాం. కానీ, కొన్ని సార్లు పెన్నక్యాప్లు వారి శరీరంలోకి పోయి చాలా ప్రమాదకరంగా మారిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్నుక్యాప్ ఉండటంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని గారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడ్ని.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డా.అరుణాభా సేన్‌గుప్తా బాలుడికి సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ రిపొర్టు పరిశీలించగా.. బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌క్యాప్ ఉన్నట్లు తేలింది. నవంబర్‌లో తమ బాలుడు పెన్‌క్యాప్ మింగినటట్లు తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు అతన్ని స్థానిక నర్సింగ్ హోంకి తీసుకువెళ్లారు. ఆ నర్సింగ్ హోం డాక్టర్లు.. బాలుడి శరీరంలో పెన్‌క్యాప్ ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మాములుగా వైద్యం చేసి పంపించారు. పెన్‌క్యాప్ బాలుడి శరీరంలో ఉంటే ప్రాణాలతో ఉండేవాడు కాదని ఆ వైద్యులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక బాలుడ్ని ఆ తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. కానీ ఆ బాలుడికి రోజురోజుకి దగ్గు, జలుబు ఎక్కువ కావటంతో అతని తల్లిండ్రులు గురువారం స్థానిక ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో ఉన్న పెన్క్యాప్ను శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించామని డాక్టర్ అరుణాభాసేన్ గుప్తా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
కాఫ్ & క్లూస్
గాలిని నిరంతరం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని మళ్లీ వదిలేసే ప్రక్రియే శ్వాసక్రియ. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో... అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి ఆ గ్లాటిస్నుంచి ఒక్కసారిగా బలంగా నోటి నుంచి బయటకు రావడాన్ని ‘దగ్గు’ అంటారు. అది ఒకే ఒకసారి రావచ్చు. లేదా అలా వస్తూనే ఉండవచ్చు. దగ్గులో రకాలు... తడి దగ్గు : మన ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి జరిగే చోట తడిగా ఉంచేందుకు కొన్ని స్రావాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ స్రావాలు మామూలుగానైతే బయటకు రావు. ఏవైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా జరుగుతుంటే దగ్గుతో పాటు అవి బయటకు వస్తుంటాయి. అలా వచ్చేదాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. పొడి దగ్గు : దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. తడి, పొడి దగ్గులను బట్టి కొన్ని వ్యాధులను తొలిదశలో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొడి దగ్గు వస్తుంటే వ్యాధి శ్వాసకోశనాళాల తొలి భాగం (అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్–వే)లో ఉందని, తడి దగ్గు అయితే ఊపిరితిత్తుల్లోపల వ్యాధులు (బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా) ఉండవచ్చునని డాక్టర్లు ఒక అంచనాకు వస్తుంటారు. రాత్రీ – పగలూ తేడాను బట్టి... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కొన్ని వ్యాధిలను అనుమానించవచ్చు. రాత్రి వేళల్లో దగ్గు వస్తుంటే అది అలర్జీ కారణంగా వస్తుందని అనుమానించవచ్చు. మధ్యాహ్నం పూట దగ్గు ఎక్కువగా ఉంటే దానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చని ఊహిస్తారు. తెమడను బట్టి... తడి దగ్గు వచ్చే సమయంలో బయటకు వచ్చే తెమడ /కళ్లె (స్ఫుటమ్/ఫ్లెమ్) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు ►ఆకుపచ్చరంగులో తెమడ ఉంటే... సూడోమొనాస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు. ►పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్సిల్లా నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ►ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. ►నలుపు రంగులో ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. మరెన్నో జబ్బులకు సూచిక... దగ్గుతో అలర్జీ, టీబీ, నిమోనియా వంటి జబ్బులని అనుమానించవచ్చు. అలాగే... ►ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోయే ప్లూరల్ ఎఫ్యూజన్ ►కీళ్ల నొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ►కీళ్లకు సంబంధించిన లూపస్ అరిథమెటోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. క్యాన్సర్లలో... స్వరపేటిక, ఊపిరితిత్తులు, నోటికి సంబంధించి క్యాన్సర్లలో మొదటి లక్షణంగా దగ్గు కనిపించవచ్చు. చికిత్స ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు కనిపించగానే చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటేనే అది లోపలేదో తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి ఒక సూచన. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో దగ్గు ఎడతెరిపిలేకుండా వస్తుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో దగ్గును ప్రేరేపించే కేంద్రాన్ని ఉపశమింపజేయడానికి కోడిన్ వంటి మందులు ఉపయోగిస్తారు. వయసును బట్టి.. దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు... ►పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్ల కావచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్టాయ్స్లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ►గొంతు, ముఖంలో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లు, శ్వాసనాళంలోని కింది భాగమైన బ్రాంకైలలో వైరల్ ఇన్ఫెక్షన్తో దగ్గు రావచ్చు. ►పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే మనమంతా ‘కోరింత దగ్గు’ (ఊఫింగ్ కాఫ్) అంటుంటాం. అంతేకాదు... మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గురావచ్చు. ►పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని ‘సైనోసిస్’ అంటారు. దగ్గుతో పాటు ఈ లక్షణం కనిపిస్తే దాన్ని గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స అందించాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమాలో పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదటగా దగ్గు కనిపిస్తుంటుంది. పెద్దల్లో వచ్చే దగ్గు... పొగతాగడం వల్ల : పొగతాగేవారిలో ఊపిరితిత్తులోకి అనేక విషపూరితమైన రసాయనాలు వెళ్తాయి. పొగతాగడం అలవాటయ్యాక తొలి సిగరెట్లోలా వెంటనే దగ్గు రాకపోయినా, సుదీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగులో తెమడ కూడా పడుతుంటుంది. అలర్జీతో : పెద్దల్లో తగ్గు వస్తుంటే అది అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ఇన్ఫెక్షన్లతో : టీబీ వ్యాధి ఉన్నవారిలో దగ్గు ప్రధానంగా కనిపిస్తుంది. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మంది దేహాల్లో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా ఇన్ఫెక్షన్లతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి బయటపడుతుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు వస్తూ, కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) పెరుగుతుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు అది టీబీ వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే... వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని తగిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. నిమోనియా: ఈ కారణంగా వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే కొన్ని మందులు వాడుతున్నప్పుడు వారిలో కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందులు ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి మందులు మార్చాల్సి ఉంటుంది. వృద్ధుల్లో... వయసు పెరుగుతున్న కొద్దీ మనలో తెమడను బయటకు పంపించే శక్తి (కాఫ్ రిఫ్లక్స్) తగ్గుతుంది. దాంతో తెమడ శ్వాసనాళంలోనే ఇరుక్కుపోవడంతో వృద్ధుల్లో దగ్గు చాల సాధారణంగా కనిపిస్తుంటుంది. నివారణ ఇలా... ►మన పరిసరాలను, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ►పొగతాగే దురలవాటును పూర్తిగా మానేయాలి. ►సరిపడని వారు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి. ►పక్కబట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. ►పుస్తకాల అరలను సాధ్యమైనంతవరకు మూసి ఉంచాలి ►వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి
చలికాలం వచ్చిందంటే చాలమంది చిన్నపిల్లలకు ఇబ్బంది. ఆ పిల్లల తల్లిదండ్రులకూ వణుకు. కారణం... ఈ వాతావరణంలో పిల్లల్లో ఆస్తమా మరింత పెచ్చరిల్లుతుంది. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వస్తుంది. అప్పుడప్పుడూ ఎటాక్ చేస్తూ ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఈ సీజన్లో మరిన్ని ఎక్కువసార్లు, మరింత తీవ్రతతో కనిపించేందుకు అవకాశాలెక్కువ. అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమా... ఈ సీజన్లో అయితే సరిపడని వాతావరణంతోనూ వస్తుంది. ఆస్తమాపై అవగాహనకు, దానిని నియంత్రణలో ఉంచుకునేందుకే ఈ కథనం... ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. దాంతో సెన్సిటివ్‌గా మారిపోతాయి. ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామన్నా ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్పవచ్చు. ఇలా ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాసమార్గాలు మూసుకు పోయినట్లుగా అవుతాయి. ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేక శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సీజన్లో చల్లటి వాతావరణంలోని గాలిలో మంచు కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతో పాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతో పాటు... ఈ మ్యూకస్ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. కారణాలు: ఆస్తమాకు ప్రధాన కారణం జన్యుపరమైనవని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. అయితే ఇటీవల జన్యుపరమైన కారణాలేమీ లేకుండానే ఇది వస్తోందంటూ కూడా మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక మనకు సరిపడని వాతావరణం దీన్ని ట్రిగ్గర్ చేస్తుందనేది చాలామందికి తెలిసిన విషయమే. మనం శ్వాసించే సమయంలో ఏదైనా మనకు సరిపడని పదార్థం (దీన్ని అలర్జెన్ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ రియాక్షన్‌కు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ రియాక్షన్ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని... ►గదుల్లోపల (ఇన్‌డోర్స్‌లో)ఉండే అలర్జెన్స్ (ఉదా... పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ►ఆరుబయట ఉండే అలర్జెన్స్: పుప్పొడి, బూజు వంటి పదార్థాలు. ►పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే పొగ ►ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు కొన్ని ట్రిగరింగ్ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ రియాక్షన్ జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు బయటపడుతున్నాయని ఒకటి రెండుసార్లు గమనించాక తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఆయా పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. చికిత్స సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. రెండు రకాల చికిత్స ... ►దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. వీటిని రోజూ తీసుకోవాలి. ►తక్షణ ఉపశమనం కోసం: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడానికి దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాలి. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అనీ అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ►మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ►ఇప్పుడు ఆస్తమాకు ఇమ్యూనోథెరపీ చికిత్స కూడా అందుబాటులో ఉంది. చివరగా... కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గిపోదు. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అందుకే పిల్లలకు ఆస్తమా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంగీకరించి, దీర్ఘకాలం పాటు చికిత్సకు సిద్ధపడాలి. ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్‌తో నిత్యం ఫాలోఅప్‌లో ఉండాలి. ఆస్తమా లక్షణాలు ►దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి. ►శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ►ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం ►హాయిగా ఊపిరి అందకపోవడం, సాఫీగా ఊపిరాడకపోవడం ►పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ►కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిగరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి. నిర్ధారణ ఆస్తమా నిర్ధారణ కాస్తంత కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలో వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి ఉంటాయి. దాంతో ఆయా లక్షణాలు ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ►రైనైటిస్ ►సైనసైటిస్ ►ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ►వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ►స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ►బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి... ►ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు. ►ఇక మూడేళ్లు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లిదండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమాను గుర్తించడం అటు తల్లిదండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఒకింత కష్టమవుతుంది. చిననపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
లంగ్స్‌లో ఏదో బయటిపదార్థం ఇరుక్కుంది...
మా ఫ్రెండ్ కూతురికి తొమ్మిదేళ్లు. ఏడాది నుంచి తరచూ దగ్గు, నిమోనియాతో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాం. కొన్నాళ్లు మందులు వాడినా ఫలితం లేకపోయేసరికి సిటీలో పల్మునాలజిస్ట్కు చూపించాం. ఆయన పరీక్షలన్నీ చేసి, ఊపిరితిత్తుల్లో ఏదో బయటివస్తువు (ఫారిన్‌బాడీ) ఉన్నట్లు నిర్ధారణ చేశారు. చాలా ఆలస్యం జరిగినందువల్ల వీలైనంత త్వరగా బ్రాంకోస్కోపీ ద్వారా దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలనీ, కుదరకపోతే సర్జరీతోనే తొలగించాల్సి వస్తుందని తెలిపారు. దయచేసి బ్రాంకోస్కోపీ అంటే ఏమిటో వివరంగా తెలియజేయగలరు. చాలా మందికి భోజనం చేస్తుండగా పొరబాటున శ్వాసనాళంలోకి లేదా ఊపిరితిత్తుల్లోకి ఆహారపదార్థాల వంటి ఫారిన్‌బాడీస్ చేరుతుంటాయి. చూడ్డానికి ఇది చిన్న సమస్యగా అనిపించినా, చివరకు ఆ పరిణామమే ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఎంతోమందికి జరుగుతుంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆటల్లో భాగంగా పిన్నీసులు, బలపాల వంటి వాటిని మింగేస్తూ ఉంటారు. అవి కాస్తా శ్వాసనాళాల్లో ఇరుక్కుంటాయి. ఇవన్నీ అప్పటికప్పుడు తీవ్రమైన ఇబ్బంది కలిగించకపోయినా, దీర్ఘకాలంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు కనిపించే లక్షణాలు కూడా సాధారణ దగ్గును పోలి ఉండటంతో చికిత్స కూడా పక్కదారి పడుతుంటుంది. అయితే ఈ సమస్యను కచ్చితంగా కనిపెట్టగలిగే పరీక్ష ఒక్కటే. అదే బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ సహాయంతో ఊపిరితిత్తులకు గాలి చేరవేసే శ్వాసనాళాలను, అందులోని గాలి గొట్టాలను స్పష్టంగా పరీక్షించవచ్చు. ఈ భాగాల్లో ఇరుక్కుపోయినా ఆహారపదార్థాటలను లేదా ఇతర వస్తువులను కనిపెట్టి, వెంటనే బయటికి తీసుకువచ్చేందుకు సహాజం చేసే టూ ఇన్ వన్ ప్రక్రియ బ్రాంకోస్కోపీ. అంటే దీని వల్ల ఇటు పరీక్ష, అటు చికిత్స రెండూ జరుగుతాయన్నమాట. దీనితో చేసే ఈ చికిత్సను రిజిడ్ బ్రాంకోస్కోపిక్ ఫారిన్ బాడీ రిమూవల్ అంటారు. ఊపిరితిత్తుల్లో ఇలా ఇరుక్కునే వాటిలో ఆహారపదార్థాలకు సంబంధించి... పల్లీలు, కూరగాయలు, మాంసం ముక్కల వంటి ఆర్గానిక్స్ అనీ, లోహపు ముక్కలు, పిన్నీసులు, చెక్కముక్కలు, బలపాల వంటి వాటిని నాన్ ఆర్గానిక్ ఫారిన్‌బాడీస్ అని అంటారు. ఆర్గానిక్ రకమైన పదార్థాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. ఇవి సాధారణ వాతావరణంలోలాగే శ్వాసనాళాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా కుళ్లిపోతాయి. వాటి సైజు పెరుగుతుంది. వాటిన నుంచి రసాయనాలు విడుదలై కెమికల్ న్యుమొనైటిస్ అనే తీవ్రమైన సమస్య మొదలవుతుంది. అదే నాన్ ఆర్గానిక్ ఫారిన్‌బాడీస్ ఇలా కుళ్లిపోవు. కానీ చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ ఊపిరితిత్తుల్లో కొంతభాగానికి గాలి చేరక నిమోనియా సమస్య వస్తుంది. అయితే వీటిని ఎక్స్‌రేలో కనిపెట్టవచ్చు. కానీ ఆర్గానిక్ పదార్థాలు ఎక్స్–రేలో కనిపించవు. కానీ ఆ పదార్థం పక్కనున్న ఊపిరితిత్తుల్లోని కొంతభాగం ఎక్స్‌రేలో నల్లగా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ భాగాన్ని బ్రాంకోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. బ్రాంకోస్కోపీ రెండు రకాలు. వయసు, ఇరుక్కున్న పదార్థం సైజులను బట్టి మత్తు ఇచ్చి లేదా మత్తు ఇవ్వకుండా చేస్తారు. మత్తు ఇచ్చి చేసేది రిజిడ్ బ్రాంకోస్కోపీ. మత్తు ఇవ్వకుండా చేసే ఎండోస్కోప్ పద్ధతిని ఫెక్సిబుల్ బ్రాంకోస్కోపిగా చెబుతారు.బ్రాంకోస్కోపీకి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. దగ్గు, నిమోనియా పదే పదే తిరగబెడుతున్నా లేదా మందులకు లొంగక ఇబ్బంది పెడుతున్నా ఆలస్యం చేకుండా వైద్యులను కలవాలి. క్యాన్సర్ గడ్డను సైతం ఈ ప్రక్రియతో తొలగించవచ్చు. మీ ఫ్రెండ్ కూతురి సమస్యకు ఇంటర్వెన్షనల్ పల్మునాలజీ చికిత్స ఎంతగానో సహాయపడుతుంది. చాలావరకు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. వీలైనంత త్వరగా బ్రాంకోస్కోపీ చికిత్స అందించండి. ఇది చాలా సురక్షితం. ఎలాంటి సైడ్ఎఫెక్టులు కూడా ఉండవు. డా. వై. గోపీకృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్, -
‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటే ఏమిటి?
మా నాన్నగారు ఎక్కువగా పొగతాగుతుంటారు. ఆయనకు ఊపిరితిత్తుల క్షయ వచ్చింది. అయితే చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని అత్యంత సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండో శ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండో శ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. సిలికోసిస్‌కు చికిత్స ఏమిటి? నా వయసు 57 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడి దగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. రుతు సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదు... ఎందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి.పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఎరిథ్మియా అంటే ఏమిటి? ఎందుకొస్తుంది?
మా బావ వయసు 42 ఏళ్లు. సిగరెట్లు కాలుస్తాడు గానీ, మద్యం అలవాటు లేదు. కానీ అప్పుడప్పుడు మైకం కమ్మినట్టు కనిపిస్తాడు. కొద్దికాలంగా ఛాతీలో అప్పుడప్పుడు నొప్పి అంటున్నాడు. తరచు శ్వాస తీసుకోడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొన్నిసార్లు స్పృహ తప్పుతున్నాడు. దాంతో సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపించాం. పరీక్షలన్నీ చేసి కార్డియాలజిస్ట్‌ను కలవమన్నారు. ఆయన కొన్ని టెస్ట్‌లు చేసి గుండె ఎక్కువగా కొట్టుకుంటోంది. అరిథ్మియా వ్యాధి అని నిర్ధారణ చేశాడు. హైదరాబాద్ వెళ్లిఎలక్ట్రోఫిజియాలజిస్ట్ను కలవమన్నారు. మాకు గాభరాగా ఉంది. అసలీ గుండెజబ్బు ఏమిటి? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా? ఆందోళనలో ఉన్నాం. దయచేసి వివరంగా తెలియజేయండి. మన గుండెకు ప్రత్యేకమైన విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండె సంకోచవ్యాకోచాలు చెందాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతీసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే గుండెలోని విద్యుత్ చర్యలే గుండె స్పందనలను ప్రేరేపిస్తుంటాయన్నమాట. గుండె కొట్టుకోడాన్ని నిర్ణయించే విద్యుత్ ప్రేరణలలో హెచ్చుతగ్గులు ‘ఎరిథ్మియా’కు దారితీస్తాయి. అంటే గుండె ఎక్కువగానో లేదా తక్కువగానో కొట్టుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయాన్నీ కలిగించవచ్చు. గుండె రక్తాన్ని సరఫరా చేసే తీరిది... గుండె పూర్తిగా కండర నిర్మిత అవయవం. ఇది శరీర భాగాలకు ప్రతిరోజూ 16,000 లీటర్లకు పైగా రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. శరీరపు మూలమూలా ఉన్న అతి చిన్న రక్తకేశనాళికల (క్యాపిల్లరీస్) వరకూ చేరే విధంగా రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంటుంది.గుండె కుడి–ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలోని వాటిని ఏట్రియా అని, కింద ఉన్న వాటిని వెంట్రికల్స్ అని అంటారు. శరీరంలోని వివిధ అవయవాల నుంచి గుండెకు వచ్చిన రక్తం... దాని కుడి ఏట్రియమ్‌లోకి చేరుతుంది. తర్వాత దాని కిందనే ఉన్న కుడి వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. రక్తం అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్‌లో శుద్ధి అవుతుంది. శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియమ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎడమ వెంట్రికల్కు చేరుకుంటంది. ఎడమ వెంట్రికిల్ శుద్ధ రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండెలో సంకోచ వ్యాకోచాలు ఓ క్రమపద్ధతిలో పూర్తిగా లయబద్ధంగా జరగాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రేరణ మొదట కుడి ఏట్రియమ్లో ‘సైనల్ నోడ్’ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి విద్యుత్ తరంగాలు తీగలాంటి ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికల్స్కు ప్రవహించి అవి సంకోచించేటట్లు చేస్తుంది. దాంతో రక్తం అన్ని శరీర భాగాలకు పంప్ అవుతుంది.విద్యుత్ ప్రేరణలతో ఈ విధంగా ఒక చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ ప్రరసణ ప్రక్రియలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పంనల్లో లోటుపాట్లకు కారణం అవుతుంది. దీనివల్ల గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడమో (ఈ కండిషన్‌ను టాకికార్డియా అంటారు) లేదా తక్కువ సార్లు ప్రతిస్పందించడమో (దీన్ని బ్రేకికార్డియా అంటారు) జరుగుతుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు సైనల్ నోడ్, ఏవీనోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండె అతి వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా దెబ్బతింటుంది. దాంతో మైకం కమ్మినట్టుగా ఉంటుంది. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య నిర్ధారణ ఇలా... గుండెకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అది సాధారణ స్థాయికంటే ఎక్కువసార్లో లేదా చాలా తక్కువ పర్యాయాలో కొట్టుకుంటుంది. ఎలక్ట్రోఫిజియాలజీలో గుండె విద్యుత్ వ్యవస్థ పనితీరును సమీక్షించే పరీక్షలు నిర్వహించి, గుండె స్పందనల్లో అసాధారణ స్థితి ఏదైనా ఉందేమో తెలుసుకుంటారు. గుండెలోకి వెళ్లే రక్తనాళాల ద్వారా కాథటర్లు, వైర్ ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టడం ద్వారా దాని విద్యుత్ చర్యలను పరిశీలించగలుగుతారు. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులకు కారణాలు ఏమిటో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తిలో గుండె పనితీరును మళ్లీ మాములు దశకు (నార్మల్కు) తెచ్చేందుకు అవసరమైన చికిత్సా వ్యూహాన్ని నిర్ణయిస్తారు. అందుబాటులో మంచి చికిత్స... మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బావగారికి వచ్చిన సమస్యను చక్కదిద్దే ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం ఎంతగానో అభివృద్ధి చెందింది. గుండె విద్యుత్‌క్షేత్రంలో లోటుపాట్లను సరిదిద్దే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అరిథ్మియాకు సాధారణ మందులతో చికిత్స చేస్తారు. గుండె స్పందనలు సాధారణ స్థితికి చేరుకునేందుకు వేర్వేరు మందులను సిఫార్సు చేసి, వాటితో గుండె ఏ మేరకు సాధారణ స్థితికి చేరుకుంటుదో పరిశీలిస్తారు. క్యాథటర్ అబ్లేషన్, కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ అనే ప్రక్రియలను అనుసరిస్తారు. అవసరాన్ని బట్టి కార్డియోవర్టర్, డిఫిబ్రిలేషన్, పేస్‌మేకర్ వంటి ఇంప్లాంట్స్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలో వచ్చే విపరీత వ్యత్యాసాల వల్ల ఏర్పడే అనారోగ్యాలకు ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీతో సరైన చికిత్స అందుబాటులో ఉంది. దీంతో గుండె సమస్యలు వచ్చిన ఆ వ్యక్తి ఎలాంటి రాజీ లేకుండా పూర్తిస్థాయిలో సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
లూపస్ అంటే?
లూపస్ అనే ఈ వ్యాధిని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అని కూడా అంటారు. ఇది ప్రతి వెయ్యిమందిలో ఒకరికి వస్తుంది. ఇది ఆఫ్రికన్–అమెరికన్స్‌తో పాటు ఆసియా వాసుల్లో ఎక్కువ. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే వ్యాధిగ్రస్తుల్లో మహిళలు–పురుషుల నిష్పత్తి 9:1గా ఉంటుంది. ఇది 15 నుంచి 45 ఏళ్ల మధ్యవయసు వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా వ్యాధి వస్తుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధినిర్ధారణకూ, చికిత్సకూ సుమారు మూడేళ్లపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో ప్రజలతోపాటు చాలామంది వైద్యుల్లోనూ ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, రుమటాలజిస్టుల కొరత వల్ల వ్యాధి ముదిరాక మాత్రమే చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లూపస్ అంటే గ్రీకు భాషలో తోడేలు (వూల్ఫ్) అని అర్థం. ఒకప్పుడు వైద్యం అందుబాటులో లేని సమయంలో వ్యాధిగ్రస్తుల ముఖం తోడేలును తలపించేది. కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. లక్షణాలు: ►జుట్టు ఎక్కువగా రాలడం ►ముఖం మీద సీతాకోకచిలుక ఆకృతితో ముక్కుకు ఇరువైపులా ఎర్రటి మచ్చలు రావడం ►నోట్లో పుండ్లు పడటం ∙కీళ్లనొప్పులు ►కీళ్లవాపులు ∙విపరీతమైన అలసట ►జ్వరం వస్తూ, తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు వ్యాధిగ్రస్తుల్లో ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ కాకుండా చికిత్స అలస్యం అయితే... క్రమేణా ఈ వ్యాధి శరీరంలోని ఇతర ►అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది. లూపస్ వ్యాధి వల్ల మన రక్తకణాలు బాగా తగ్గిపోవచ్చు. (ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాలు, హీమోగ్లోబిన్ కౌంట్ తగ్గవచ్చు). ఇతర కీలక అవయవాలపై వ్యాధి దుష్ప్రభావాలు ఇలా... మూత్రపిండాలు ప్రభావితమైతే లూపస్ నెఫ్రైటిస్ అనే సమస్య, మెదడు ప్రభావితమైతే ఫిట్ ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం (ప్లూరల్ ఎఫ్యూజన్), ఊపిరితిత్తుల్లో కొబ్బరిపీచు వంటి పదార్థం వృద్ధి కావడం (లంగ్ ఫైబ్రోసిస్/ఐఎల్‌డీ), గుండె ప్రభావితమైతే దానిచుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్ ఎఫ్యూజన్), గుండె వేగంగా కొట్టుకోవడం (మయోకారై్డటిస్), హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. లూపస్‌లో రకాలు 1. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్: ఇది సాధారణంగా మనం ఎక్కువగా చూసే లూపస్. శరీరంలోని ఏ భాగమైనా దీనివల్ల ప్రభావితం కావచ్చు. 2. డిస్కాయిడ్ లూపస్: ఇది ముఖం మీద, తలపైన, మెడమీది చర్మాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చర్మంపై మందమైన పొరల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. 3. సబ్ ఎక్యూట్ క్యుటేనియస్ లూపస్: చర్మంపై సూర్మరశ్మి సోకిన ప్రాంతంలో తీవ్రమైన ఎర్రని మచ్చలు వస్తాయి. 4. నవజాత శిశువుల లూపస్ (నియోనేటల్ లూపస్): లూపస్ ఉన్న తల్లులకు పుట్టిన నవజాత శిశువులకు వచ్చే అరుదైన లూపస్ ఇది. ఈ శిశువుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చి, కొద్దివారాల్లోనే పూర్తిగా నయమవుతాయి. చాలా కొద్దిమందిలో హార్ట్ బ్లాక్ రావచ్చు. 5. మందులతో వచ్చే లూపస్ (డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్): చాలా అరుదుగా కొన్నిరకాలపై మందుల వల్ల లూపస్ లక్షణాలు రావచ్చు. కానీ ఆ మందులు ఆపేసిన తర్వాత లక్షణాలూ పూర్తిగా తగ్గిపోతాయి. హైడ్రాలజైన్, ప్రొకైనమైడ్, ఐసోనియాజిడ్ వంటి మందుల వల్ల అరుదుగా ఇలా జరగవచ్చు. వ్యాధినిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ►క్రియాటినిన్ ►లివర్ ఎంజైమ్‌ల పరీక్షలు ►ఈఎస్ఆర్ ►సీఆర్పీ ►మూత్రపరీక్ష ►ఏఎన్ఏ టెస్ట్ ►డీఎస్–డీఎన్ఏ టెస్ట్ ►ఏఎన్ఏ ప్రొఫైల్ ►ఛాతీ ఎక్స్‌రే ►స్కానింగ్ వంటి పరీక్షలు చేసి డాక్టర్లు లూపస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇంకొన్ని ముఖ్యమైన పరీక్షలు ►యాంటీస్మిత్ యాంటీబాడీస్ ►యాంటీఫా ►స్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ►యాంటీ రో–యాంటీబాడీ ►యాంటీ లా–యాంటీబాడీ ►సీరమ్ కాంప్లిమెంట్స్ ∙24 గంటల మూత్రపరీక్ష లూపస్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్)లో సమతౌల్యం లోపించినప్పుడు మనల్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధకత మన శరీరంపైనే దాడి చేయడం వల్ల లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. జన్యువులు, పరిసరాలు, హార్మోన్ల వంటి అంశాలు ఈ వ్యాధికి కారణం అవుతుంటాయి. ఒక్కోసారి సూర్మరశ్మి అధికంగా సోకడం వల్ల, వైరస్–బ్యాక్టీరియాల వల్ల కూడా లూపస్ వ్యాధి తీవ్రతరం కావచ్చు. చికిత్స ఆధునిక చికిత్సతో లూపస్ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మందులు మొదలుపెడితే, వారు పూర్తిగా కోలుకొని, సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. ఇక మందులు వాడేవారు ఒక్కసారిగా లూపస్ మందులు ఆపితే చాలా ప్రమాదం. రుమటాలజిస్టుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మందుల మోతాదు తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా రుమటాలజిస్టులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. లూపస్ వ్యాధిలో వాడే సాధారణ మందులు ►హైడ్రాక్సి క్లోరోక్విన్ ►ఎజథయోప్రిన్ ►మిథోట్రెక్సేట్ ►కార్టికోస్టెరాయిడ్స్ ►సైక్లోఫాస్ఫమైడ్స్ ►మైకోఫినొలేట్ ►టాక్రోలిమస్లతో పాటు సన్‌స్క్రీన్ ఆయింట్మెంట్లు వాడాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ చికిత్సలు: ►ఐఆర్ఐజీ థెరపీ ►పాస్మాఫెరిసిస్ ►రిటాక్సిమాబ్ ►ఎక్మోథెరపీ లూపస్ వ్యాధి... కొన్ని ముఖ్యమైన విషయాలు : ►లూపస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు, సోకదు ►లూపస్ వ్యాధిని త్వరగా గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చు ►లూపస్ వ్యాధిగ్రస్తులు మందులు వాడుతూ పూర్తిస్థాయి సాధారణ జీవితం గడపవచ్చు ►క్రమంతప్పకుండా రుమటాలజిస్టులను సంప్రదించి మందులు వాడాలి ►ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయితే సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది. శరీరం, ►మనసుపైన ఒత్తిడి తగ్గించి, మనసును ఉల్లాసంగా ఉంచే పనులు చేయాలి. లూపస్ వ్యాధిని ఎదిరించి పోరాడిన కొందరు ప్రముఖులు ►సెలీనా గోమేజ్ ►లేడీ గాగా (సింగర్, నటి) ►టోనీ బ్రాక్స్టన్ (గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్) ►నిక్ కేనన్ (రేపర్, నటుడు) ►సీల్ (బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్) ►క్రిస్టెన్ జాన్స్టన్ (మోడల్) డాక్టర్ వి. శరత్ చంద్రమౌళి క్లినికల్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ లూపస్ రోగుల్లో గర్భధారణ అసాధ్యంకాదు లూపస్ వ్యాధిగ్రస్తుల్లో గర్భధారణ జరగడం, ఆ గర్భాన్ని కాపాడటం అటు రోగికీ ఇటు రుమటాలజిస్ట్కీ ఒక పెద్ద సవాలు. ఈ వ్యాధి ప్రభావం తల్లి మీదనే కాకుండా శిశువుపైన కూడా ఉంటుంది. చాలా మంది అపోహ పడే విధంగా ఈ రోగులు గర్భం దాల్చకూడదనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే గర్భం దాల్చడానికి ముందు జబ్బు తీవ్రత, మూత్రపిండాల మీద, గుండెపైన, మెదడుమీద దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి, దాని దుష్ప్రభావాలు మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి కీలకమై అవయవాల మీద ఉన్నట్లయితే... తాత్కాలికంగా గర్భధారణను (ప్రెగ్నెన్సీని) ప్లాన్ చేసుకోకూడదు. అయితే ఇది కేవలం ‘‘తాత్కాలికంగా మాత్రమే’’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం ఉంది. జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం నిలబడకపోవచ్చు. అంతేగాక వారిలో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనే ప్రతికూల కణాల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల మాయలో రక్తం గడ్డకట్టి శిశువుకి ప్రాణవాయువు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. గర్భధారణ సమయంలో జబ్బు తీవ్రత పెరగడం, అధిక రక్తపోటు, తరచూ గర్భస్రావాలు, ప్రీ–ఎక్లాంప్షియా (గర్భవతిగా ఉన్న సమయంలో రక్తపోటు పెరగడం, మూత్రంలో ప్రోటీన్లు వృథాగా పోవడం), మూర్చ (ఫిట్స్), నెలలు నిండకుండానే ప్రసవం కావడం (ప్రీమెచ్యుర్ డెలివరీ) లాంటి ప్రసూతి సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, గర్భాశయంలోనే మరణించడం, నియోనేటల్ లూపస్ వంటి సమస్యతో పుట్టుకతోనే బిడ్డ వ్యాధిని కలిగి ఉండటం వంటి సమస్యలూ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ రోగుల్లోని 20 నుంచి 40 శాతం గర్భిణుల్లో ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కాన్పు తర్వాతా జబ్బు తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు చాలావరకు అవకాశాలు తక్కువ అనే చెనప్పాలి. కొన్నిసార్లు జబ్బు లక్షణాలు సాధారణ గర్భిణుల్లో కనిపించే లక్షణాలనూ అనుకరిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ద్వారా రుమటాలజిస్టులు మందుల మోతాదులను అవసరం మేరకు మారుస్తారు. దీనివల్ల పిండం మీద ప్రతికూల ప్రభావాలు సాధ్యమైనంతవరకు పడకుండా రుమటాలజిస్టులు జాగ్రత్తపడతారు. అలాగే ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చినంతకాలం కూడా మందుల విషయంలో రుమటాలజిస్టులు చాలా జాగ్రత్తగా ఉంటారు . పుట్టిన శిశువుపైన కూడా లూపస్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టిన బిడ్డకు వచ్చే సమస్యను ‘నియోనేటల్ లూపస్ అంటారు. తల్లి ద్వారా పిండంలోకి వెళ్లే యాంటీబాడీస్ వల్ల తాత్కాలికంగా ఈ సమస్య ఎదురవుతుంది. చర్మం మీద ఎర్రని మచ్చలు రావడం అన్నది అతి సాధారణంగా కనిపించే లక్షణం. కామెర్లు, రక్తహీనత, రక్తకణాలు తగ్గడం లాంటివి కూడా సంభవించే అవకాశాలుంటాయి. గుండె, కాలేయం మీద కూడా దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కలిగే సమస్యలు. రుమటాలజిస్టులు, ప్రసూతి వైద్యనిపుణల మేరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విజయవంతమైన ఫలితాలు లభిస్తాయి. ఎస్‌ఎల్‌ఈ జబ్బు నిర్ధారణ అయ్యాక, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోదలచుకుంటే రుమటాలజిస్టులతో తప్పక చర్చించాలి. ఈ విషయంలో సరైన ప్లానింగ్ అన్నది అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. జబ్బుతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కీలకమైన అవయవాల మీద జబ్బు దుష్ప్రభావాలు ఉన్నప్పుడు గర్భందాల్చే ప్రయత్నాలు చేయకూడదు. జబ్బు తీవ్రతను పూర్తిగా నియంత్రించిన ఆర్నెల్ల తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. తరచూ రక్తపరీక్ష, మూత్రపరీక్ష, రక్తపోటు తనిఖీ చేసుకోవడం వంటి పరీక్షలను నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే శిశువు గుండె మీద ప్రభావం ఉందా, లేదా అన్న విషయాలను ఇప్పుడు కొన్ని ఆధునిక పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఆధునిక వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉండే ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల శిశువు ఏ రకమైన ఇబ్బందితో పుట్టినా సులభంగా వైద్యం అందించడం తేలికవుతుంది, సాధ్యమవుతుంది. లూపస్ రోగులకు గర్భధారణ అన్నది ఒక సవాల్ మాత్రమే. అంతేతప్ప అది అసాధ్యం కానేకాదు. రుమటాలజిస్టుల సలహా మేరకు, సరైన ప్లానింగ్ చేసుకొని, వ్యాధి మీద అవగాహన పెంచుకోవడంతో పాటు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో అందివచ్చిన మెరుగైన ఆధునిక వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
సిలికోసిస అంటే ఏమిటి?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. – కె. పద్మనాభరావు, విజయవాడ మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వాట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్ : సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్ : కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. ఇంత చిన్న పిల్లాడికి ఎప్పుడూ పొడిదగ్గు... పరిష్కారం చెప్పండి మా అబ్బాయి వయసు 11 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. విశ్వేశ్వరరావు, అనకాపల్లి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
కీళ్లవాతం.. కొన్ని నిజాలు
కీళ్లవాతం మనిషికి తెలిసిన జబ్బుల్లో అత్యంత పురాతనమైన, దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ప్రజలు కీళ్లవాతం వ్యాధులతో బాధపడుతున్నారు. ఐయితే చాలామంది తమ బాధల గురించి వైద్యులకు చెప్పరు. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ వచ్చే సమస్యని అంగీకరిస్తారు. మరికొంతమంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తారు. ఇవేమీ నిజం కాదు. కీళ్లవాతం అంటే... కీళ్లవాతం అంటే కేవలం కీళ్ల దగ్గర మాత్రమే ఉంటుందనీ శరీరంలో ఏ ఇతర అవయవాల మీద దాని ప్రభావం ఉండదన్నది వాస్తవం కాదు. కీళ్లవాతం అనేది ఒక సాధారణమైన పదం. కానీ కీళ్లవాత సంబంధిత వ్యా«ధుల్లో వందకు పైగా రకాలున్నాయి. సమాజంలో ఈ వ్యాధులపైన పూర్తి అవగాహన లేదు. ఈ వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్యం చేసే అర్హులైన రుమటాలజిస్టులు కూడా దేశంలో చాలా తక్కువమందే ఉన్నారు. ఈ రెండు కారణాలవల్ల ఈ వ్యాధులతో రోగికి ఎంతో నష్టం చేకూరుతోంది. అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తాయి? మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ మనలోకి ఇన్ఫెక్షన్ కలగజేసే క్రిములు చొరబడకుండా కాపాడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కంచే చేను మేసినట్లుగా ఈ రోగనిరోధక వ్యవస్థ మన సొంత అవయవాల మీదే దాడికి దిగి శరీరాన్ని నాశనం చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుందో ఆ అవయవం పనితీరు తగ్గుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా కీలు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఆటో ఇమ్యూన్ వ్యాధులలో కీళ్లనొప్పి మొదట బయటపడతాయి. కేవలం కీలు మీదే కాకుండా తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు దేనినైనా నాశనం చేసే శక్తి ఈ జబ్బులకు ఉంటుంది. జన్యుప్రవర్తన, పర్యావరణంలో జరిగే మార్పులు, అనేక రకాలైన వైరస్, ఇతర క్రిముల వల్ల ఈ జబ్బులు రావచ్చు. వీటిని గుర్తించడం ఎలా? కీళ్లవాతంలో కీళ్ల దగ్గర వాపు, నొప్పి, దృఢత్వం తగ్గడం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ జబ్బులు ఏ లక్షణాలతోనైనా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా చాప కింద నీరులా గానీ, అకస్మాత్తుగా గాని ప్రారంభం కావచ్చు. తేలికపాటిగా ఉండటం మొదలుకొని కొన్ని నిమిషాలు లేదా గంటలలోనే తీవ్రరూపం దాల్చేలా కూడా ఉండవచ్చు. దీని తీవ్రత తరచూ మారుతుంటాయి. అలాగే లక్షణాలు కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అందరిలో ఒకేలా వ్యక్తం కావు. విపరీతమైన అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం అనేవి సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత ముదిరే ముందునుంచే ఈ లక్షణాలు ఉంటాయి. యుక్తవయసులో ఉన్నవారికి తరచూ గర్భస్రావం జరగడం, పక్షవాతం రావడం, గుండెపోటు రావడం, దీర్ఘకాలంగా మానని పుండ్లు, చర్మం మీద మచ్చలు, తరచూ విరేచనాలు, నడుమూ, మెడ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొర ఏర్పడటం, నోరెండిపోవడం వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. ఈ జబ్బులు ఎవరిలో రావచ్చు? వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవి తీవ్రరూపం దాలుస్తాయి. చిన్నవారిలో, పెద్దవారిలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇవి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. సాధారణ కీళ్లవాతాలు : రుమటాయిడ్ ఆర్థరైటిస్ : ఈ జబ్బులో మన సొంత రోగనిరోధక వ్యవస్థ కీళ్ల మధ్యన ఉండే పొరపై ప్రభావం చూపి, కీళ్లను ధ్వంసం చేస్తుంది. చేతివేళ్లు, కాళ్ల వేళ్లు, మోచేతుల కీళ్లు ప్రభావితమవుతాయి. నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా చెడిపోయి వంకర్లు తిరుగుతాయి. గుండె, శ్వాసవ్యవస్థ, మెదడు, మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే అవకాశాలు 60% వరకు ఉంటాయి. ఎస్‌ఎల్‌ఈ/లూపస్: ఈ రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి ప్రవర్తిస్తుంది. శరీరంలోని చర్మం, కీళ్లు, కిడ్నీలు, రక్తకణాలు, మెదడుతో పాటు ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. దీన్ని అత్యంత తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువ. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్యసంబంధిత కారణాలతో జీవన నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే వీళ్లలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇటీవల ఈ వ్యాధి కారణంగా హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి ఉన్నవారిలో గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం, బరువు తక్కువగా పుట్టడం వంటివి కూడా తరచూ జరుగుతుంటాయి. జాగ్రన్స్ సిండ్రోమ్ : రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలోని తేమని ఉత్పత్తి చేసే గ్రంథుల మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఒంటికి కావలసిన తేమ, లాలాజలం, కన్నీరు ఉత్పత్తి తగ్గి చర్మం, నోరు, కళ్లు ఎండిపోవడం జరుగుతుంది. విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే కీళ్ల దగ్గర నొప్పి, వాపు వస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ పైన కూడా ప్రభావం పుడుతుంది. ఈ జబ్బు సాధారణంగా 40, 50 ఏళ్ల వయసులఉన్న మహిళల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తరచుగా ఇతర రుమాటిక్ వ్యాధులతో కలిసి వ్యక్తమవుతుంటుంది. మయోసైటిస్ : శరీర కదలికల్లో కండరాల భూమిక చాలా ప్రధానం. ఈ మయోసైటిస్ అనే తరహా కీళ్లవాతంలో మన రోగనిరోధక శక్తి కండరాలపై దాడిచేసి కదలకుండా మంచం పట్టేట్టు చేస్తుంది. తొలిదశలో గుర్తించకపోతే ఊపిరి తీసుకోడానికి తోడ్పడే కండరాలపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది. అలాగే చర్మం, కీళు ఊపిరితిత్తుల మీద కూడా ఈ తరహా కీళ్లవాతం ప్రభావం చూపుతుంది. ఇది చిన్నపిల్లల్లోనూ తరచూ కనిపించవచ్చు. సిస్టమిక్ స్క్లిరోసిస్ : పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు నల్లగా మారడం, చర్మం బిగుతుగా మారి పుండ్లు పడటం, చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు వేళ్లు నీలంగా, తెల్లగా మారి కుళ్లిపోవడం వంటివి తరచూ జరుగుతాయి. అలాగే దీని ప్రభావం గుండె, జీర్ణకోశం, ఊపిరితిత్తులు (ఐఎల్‌డి), కండరాలు, కీళ్ల మీద పడుతుంది. స్పాండైలో ఆర్థరైటిస్: మిగతా కీళ్లవాతాలకు భిన్నంగా ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. దీన్ని యాంకైలోజింగ్ స్పాండలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఐబిడి ఆర్థరైటిస్ అనే రకాలుగా విభజించవచ్చు. యుక్తవయసులోని పురుషుల్లో విపరీతమైన నడుమునొప్పితో, నడుము దగ్గర బిగుతుగా పట్టేసి కదల్లేని స్థితి కలిగిస్తుంది. అశ్రద్ధ చేస్తే కాలక్రమేణా వెన్నెముక వెదురు కర్రలా మారిపోయి జీవననాణ్యత కోల్పోవడం జరుగుతుంది. వీరి చర్మంపై సోరియాటిక్ మచ్చలు, కళ్లలో యువిౖయెటిస్, తరచూ విరేచనాలు కావడం, మడమల్లో విపరీతమైన నొప్పి రావడం కూడా తరచూ జరుగుతంటాయి. పిల్లల్లో కీళ్లవాతం : జువెనైల్ ఆర్థరైటిస్ అనేది పిల్లల్లో తరచూ చూసే ఒక రకం కీళ్లవాతం. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కవ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటిచూపు మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువ. -
‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అంటే..?
పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 17 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. అప్పుడప్పుడూ కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్‌ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి? – ఆర్. సురేశ్, ఆదిలాబాద్ కాఫ్ వేరియెంట్ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒకరకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్పోజ్ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్ వేరియెంట్ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు. పీరియడ్స్ సమయంలో శ్వాస అందడం లేదు..? నా వయసు 35 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. దీనికి కారణాలు ఏమిటి? పరిష్కారం చెప్పండి. – ఎల్. దీపిక, కాకినాడ రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శారీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను ప్రేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? నా వయసు 49 ఏళ్లు. నేను కొద్దికాలంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్)తో బాధపడుతున్నాను. దీనికి ఆక్సిజన్ థెరపీతో మంచి ఉపశమనం ఉంటుందని విన్నాను. – ఎన్. శంకర్రావు, గుంటూరు మీరు చెప్పినట్లు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారికి ఆక్సిజన్ థెరపీతో మంచి ప్రయోజనం ఉంటుంది. మీ శ్వాస తీసుకోవడంలో అవరోధాలు ఉన్నాయి కాబట్టి, మీరు హాయిగా ఫీలయ్యేందుకు, మీ రోజువారీ వ్యవహారాలకు అవసరమైనంతగా మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం. మీరు పీల్చుకోగలిగే ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఈ అదనపు ఆక్సిజన్ వల్ల మీ ఊపిరితిత్తుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. దాంతో మీరు పనిచేసే సామర్థ్యం, చురుగ్గా వ్యవహరించగల శక్తి మీకు చేకూరతాయి. ఆక్సిజన్ థెరపీ వల్ల మీ నిద్ర నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడటంతో పాటు మీ మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ చికిత్స చేయడం మరో విధంగా కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంటే ఆక్సిజన్ చికిత్స సీవోపీడీ కండిషన్‌ను మెరుగుపరచడంతో పాటు హార్ట్‌ఫెయిల్యూర్‌ను నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం మూడు రకాలుగా జరుగుతుంది. అవి... 1) కంప్రెస్డ్ ఆక్సిజన్‌ను తీసుకోవడం లేదా ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను కొనుగోలు చేసి ఈ చికిత్సను ఇంటివద్దనే తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్‌ను స్టీల్ లేదా అల్యూమినియమ్ ట్యాంకుల్లో భద్రపరుస్తారు. సైజ్‌లో పెద్దవిగా ఉండేవాటిని ఇంటిదగ్గర వాడుకోవచ్చు. 2) మీతో పట్టుకెళ్లగలిగేవి కూడా లభిస్తాయి. వాటిని మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడవచ్చు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికి చిన్న కంటెయినర్లు సరిపోతాయి. పైగా ఒకచోట నుంచి మరోచోటికి తేలిగ్గా తరలించవచ్చు. అయితే వీటిని చాలాకాలం పాటు నిల్వ చేసి ఉంచకూడదు. ఎందుకంటే అందులోని ఆక్సిజన్ ఆవిరైపోతుంది. 3) ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారిలో చాలామంది ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనే మెషిన్‌ను వాడతారు. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌నే సంగ్రహించి మీకు అందిస్తుంది. ఇది చవకైనదీ, పైగా దీన్ని మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపయోగించడమూ తేలికే. అయితే ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఒకింత పెద్ద సైజులో ఉంటాయి. పైగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. పైగా ఇది నడవాలంటే దీనికి విద్యుత్ సరఫరా కూడా అవసరం. దాంతో విద్యుత్ బిల్లు భారమూ అదనం. దీని నుంచి వేడి కూడా వెలువడుతుంది కాబట్టి వేసవిలో దీన్ని ఉపయోగించడం ఇబ్బందికరం. ఒకవేళ కరెంటుపోతే మెషిన్ ఆగిపోకుండా ప్రత్యామ్నాయం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు అన్నివిధాలా సరిపోయే ప్రత్నామ్నాయాన్ని ఎంచుకోండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
బాలుడి ఊపిరితిత్తుల్లో స్ప్రింగ్
ముంబాయి: మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఏడేళ్ల బాలుడు టాయ్ గన్‌లోని స్ప్రింగ్ మింగేయడంతో పరిస్థితి విషమంగా మారింది. బాలుడు ఇంటి వద్ద టాయ్ గన్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. అనుకోకుండా టాయ్గన్లోని స్ర్పింగ్ బాలుడి స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఇరుక్కుపోయింది. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత బాలుడు నిరంతరాయంగా దగ్గుతుండటంతో తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన థానేలోని ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఊపిరితిత్తుల్లో 1.5 సెంటీమీటర్ల పొడవున్న స్ప్రింగ్ ఉన్నట్లు గుర్తించారు. బాలుడు కావడంతో ఆపరేషన్ చేసి స్ప్రింగ్‌ను తీయడానికి డాక్టర్లు వెనకాడారు. బయోస్కోపీ ద్వారా స్ప్రింగ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – టి. లక్ష్మణ్‌రావు, విజయనగరం రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మావాడికి ఆస్తమా... తగ్గుతుందా? ఇప్పుడు మా కొడుకు వయసు 22 ఏళ్లు. వాడికి పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. మావాడికి ఉన్న ఉబ్బసం ఎలా తగ్గుతుంది? – మోహన్ ప్రసాద్, కొత్తగూడెం ఉబ్బసం (ఆస్తమా) అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక మొండి వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. దాదాపు 80 శాతం మంది ఆస్తమా రోగుల్లో ఈ వ్యాధి 18 ఏళ్ల లోపు వయసులోనే మొదలవుతుంది. కారణాలు : ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ మార్పులు, చల్లగాలి ∙ ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు : ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధిగ్రస్తులందరిలో ఈ లక్షణాలన్నీ ఉండాలని ఏమీ లేదు. వీటిల్లో కొన్ని లక్షణాలు మాత్రమే ఉండవచ్చు. చికిత్స : ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. హోమియో విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్, స్పాంజియా వంటి మందులను నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం
‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ప్రభుత్వాలు చట్టబద్ధంగా హెచ్చరికలు జారీ చేసే ప్రభుత్వాలు ఇకపై ‘ఇంటిని శుభ్రం చేయడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలను జారీ చేయాల్సి ఉంటుందేమో! ఇంటిని తుడవడం, గచ్చు మీద మురికిని తడిగుడ్డతో లేదా మాప్‌తో తుడవటం, గచ్చు మీద మొండి మరకలను తొలగించడానికి యాసిడ్, డిటర్జెంట్లు వంటివి వేసి రుద్దడం వంటి పనులు సైతం ఊపిరితిత్తులపై పొగతాగడంతో సమానమైన హాని కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ ఇరవై సిగరెట్లు తగలేసే పొగరాయుళ్ల ఊపిరితిత్తులు ఏ స్థాయిలో పాడైపోతాయో, రోజూ ఇంటిని శుభ్రం చేసే మహిళల ఊపిరితిత్తులు కూడా అదే స్థాయిలో దెబ్బతింటాయని నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జెన్కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారు తమ పరిశోధనలో భాగంగా 6,235 మంది మహిళలపై అధ్యయనం జరిపారు. వారిలో రోజూ ఇంటిని శుభ్రం చేసే అలవాటు ఉన్న మహిళలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే మహిళలపై వైద్య పరీక్షలు నిర్వహించగా, వారి ఊపిరితిత్తులు దాదాపు పొగతాగే వారి ఊపిరితిత్తుల మాదిరిగానే తయారైనట్లు గుర్తించారు. -
వీరు క్యాన్సర్‌ను జయించారు
క్యాన్సర్ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణం ఇదీ అని తెలియదు. ఈ వ్యాధికి గురైనవారిలో చక్కటి ఆరోగ్యవంతమైన జీవనశైలి గడుపుతూ ఉన్నవారూ ఉన్నారు... అలాగే దురలవాట్లకి లోనైనవారూ, వయసుపైబడిన వారూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా మంచి జీవనశైలితో పాటు క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం. వీలైనంతగా క్యాన్సర్‌ను ముందే పసిగట్టగలగడం. ఇప్పుడు క్యాన్సర్‌ను జయించడం అంత కష్టమేం కాదు. మనోబలం, నిబ్బరం చాలు క్యాన్సర్‌ను జయించడానికి. అలా జయించిన వారు చాలామందే ఉన్నారు. వారి స్ఫూర్తి మనలో నింపుకుంటే ఇప్పుడు క్యాన్సర్‌ను ఓడించడం సులభమే. అలా క్యాన్సర్‌ను జయించిన కొంతమంది ప్రముఖుల గురించి ఈ కథనంలో... ప్రముఖ క్రికెటర్ యువరాజ్‌సింగ్ 2011లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురైనప్పుడు అంత ఆరోగ్యవంతులకూ క్యాన్సర్ వస్తుందా అంటూ అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకొని ‘ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్’ అనే పుస్తకం రాశారు. ఇంతకు ముందులాగే అంతే ఆరోగ్యకరమైన రీతిలో, అంతే సామర్థ్యంతో క్రీడాజీవితం గడుపుతున్నారు. ఎందరికో అభిమాన నటిగా పేరుతెచ్చుకున్న మనీషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్‌కు గురయ్యారు. సర్జరీతో పాటు మిగతా చికిత్స తీసుకొని ఇప్పుడు క్యాన్సర్ మీద అవగాహన కలిగించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 16 ఏళ్ల నుంచే రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. 25 ఏళ్ల వయసులో క్యాన్సర్... మెదడు, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లోకి పాకడంతో పాటు అడ్వాన్స్డ్ దశలో టెస్టిక్యులార్ (వృషణాల) క్యాన్సర్ బయటపడ్డప్పుడు ఆయన బతకడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో అన్ని రకాల కాంబినేషన్ చికిత్స తీసుకొని ఆయన ఆ మహమ్మారిపై విజయం సాధించారు. తర్వాత ఆరుసార్లు టూర్ డిఫ్రాన్స్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఒకప్పటి సౌత్ఆఫ్రికా దేశాధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి విజేత, భారతరత్న నెల్సన్మండేలా పీఎస్ఏ పరీక్షతో ముందే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పసిగట్టి రేడియేషన్ థెరపీ తీసుకున్నారు. 1990లో ప్రోస్టేట్గ్రంథిని తొలగించుకొని, ఆ క్యాన్సర్ బారినుంచి విముక్తిపొందారు. 95 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మరణించారు. అంతేగానీ క్యాన్సర్‌తో కాదు. ప్రముఖ నటి గౌతమి, గ్రామీఅవార్డు దక్కించుకున్న పాటల రచయితా, గాయని షెరిల్ క్రౌ, ఇక జీన్మ్యూటేషన్ పరీక్షతో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టి మాసెక్టమీ చేయించుకున్న హాలివుడ్ నటి ఏంజిలినా జోలీ బ్రెస్ట్‌క్యాన్సర్ మీద విజయం సాధించిన చాలా మందిలో కొందరు మాత్రమే. ఇలా మనకు తెలిసిన ప్రముఖ విజేతలతో పాటు తెలియనివారెందరో గుండెధైర్యంతో జీవితంలోని అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, క్యాన్సర్‌కు ఎదురొడ్డి నిలిచి, దాన్ని జయించారు. వీరిలో జీన్ మ్యూటేషన్, ఇతర పరీక్షలతో ముందే ప్రమాదాన్ని గుర్తించి క్యాన్సర్ రాకుండా చికిత్స తీసుకున్న వారు కొందరైతే, మరికొందరు శరీరమంతా అది పాకినా, ఇంక ఏ విధమైన ఆశలు లేవని తేలిపోయినా... ఆ స్థితి నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నవారూ ఉన్నారు. ఇలాంటి విజేతలందరిలో ఉండే లక్షణాలు ఏమిటా అని ఆలోచిస్తే... వారికి క్యాన్సర్ ఉందని తెలిశాక కూడా కుంగిపోకుండా, మనోనిబ్బరంతో దాన్ని ఎదుర్కోవడమే. ముందుగా కొంత ఆందోళనకు గురైనా, తర్వాత వారు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, చికిత్స ఎలా తీసుకోవాలి, ఏయే జాగ్రత్తలు పాటిస్తే మంచిది, ఆహారం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి... లాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకొని డాక్టర్ సలహాలు తప్పక పాటిస్తూ, చికిత్స తీసుకుంటూనే తమ తమ రంగాల్లో తమ కృషిని కొనసాగిస్తూ... నటించిన వారూ, ఆటల్లో పాల్గొన్నవారూ, పుస్తకాలు రాసినవారూ ఉన్నారు. ఏ క్యాన్సర్ అయినా తొలిదశలో గుర్తిస్తే ఆ కణం మీద విజయం సాధించడం తేలికే. పొగాకు ఉత్పత్తులు వాడేవారికి, ఆల్కహాల్ అలవాట్లు, అధికబరువు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ అని అందరూ తెలుసుకుంటే మంచిది. క్యాన్సర్ రిస్క్ అన్నది పర్యావరణ పరిస్థితులు, వారు చేసే వృత్తి, వంశపారంపర్య లక్షణాలు, వారు వాడే ఇతర మందులు, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర అలవాట్లు... ఇలా అనేక విషయాలతో ముడిపడి ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఈ సమస్య విషయంలో అవగాహన లేమితో పాటు అపోహలు, అనవసర అనుమానాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పటి ఆధునిక వైద్యవిధానాలతో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మీద, క్యాన్సర్ మీద పట్టు సాధించగలుగుతున్నాం. అన్ని సందర్భాల్లోనూ నయం చేయడం సాధ్యం కాకపోతే, కనీసం అదుపులోకి తీసుకురాగలుగుతున్నాం. కీమో మందులలో మరింత కొత్తవి, దుష్ప్రభావాలు తక్కువగా ఉండేవి వస్తున్నాయి. సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఈ కీమో మందుల ధరలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. ఇతర శరీర భాగాల మీద చాలా తక్కువ ప్రభావం చూపే రేడియేషన్ థెరపీలు అందుబాటులోకి వచ్చేశాయి. వీఎమ్‌ఏటీ, సైబర్‌నైఫ్ వంటి రేడియో రోబోటిక్ సర్జరీలతో దుష్ఫలితాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక సర్జరీలు, శరీరభాగాలను తొలగించినప్పుడు చేసే రీకన్స్ట్రక్టివ్ సర్జరీలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మనం చేయాల్సిందల్లా... క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొనడం, అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించడం, చికిత్స, మందులు సరిగా తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం, యోగా, ధ్యానం, మంచి వ్యాపకాల వంటివి ప్రాక్టీస్ చేయడం, నలుగురితో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఇలా చేస్తే అన్ని విధాలా మంచిది. క్యాన్సర్ అని తెలియగానే మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్‌కు గురయ్యేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యాపకాలు పెంపొందించుకొని, మంచి చికిత్స తీసుకుంటే మీరూ క్యాన్సర్‌ను జయించవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!
ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ ప్యారిస్ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జర్మనీ, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు. -
గుండెమ్మ కథ
ఏ వయసుకు ఆ ముచ్చట ఉన్నట్టే ఏ వయసు గుండెకు ఆ వయసు ముచ్చటుంటుంది. ఈ కథలో ఉన్న సమస్యలకు కొన్నిసార్లు సర్దుకుపోవాలి. కొన్నిసార్లు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు పోరాడి గెలవాలి. తెలుసుకున్నోళ్లే తెలివైనోళ్లు. గుండెసవ్వడిలో విపినించే అపశ్రుతల కథే... ఈ ‘గుండె’మ్మ కథ. పుట్టకముందే వెంటాడే గుండెజబ్బులు పిండదశలో ఉన్న శిశువు గుండెకు సైతం కొన్ని సమస్యలు రావచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి... డక్టస్ ఆర్టీరియోసిస్: గుండె కుడివైపు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే పల్మునరీ ట్రంక్, ఎడమవైపు నుంచి అయోర్టా అనే రక్తనాళాల మధ్య ఒక చిన్న పైప్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. దీన్ని డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. బిడ్డ పుట్టగానే ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే. బిడ్డ ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన 72 గంటల్లో ఈ డక్టస్ ఆర్టీరియోసస్ కనెక్షన్ కూడా మూసుకుపోవాలి. ఒకవేళ అలా మూసుకోకపోతే వచ్చే సమస్యను పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ (పీడీఏ) అనే గుండెజబ్బు (కంజెనిటల్ హార్ట్ డిసీజ్)గా పరిగణిస్తారు. ఇది గుండెజబ్బు నెలలు నిండకుండానే పుట్టే బిడ్డల్లో ఎక్కువ. సాధారణంగా దానంతట అదే సర్దుకుంటుంది. కొద్దిమందిలో ఆపరేషన్ అవసరం కావచ్చు. ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా కేథెట్ ట్రీట్మెంట్, కాయిల్స్ లేదా అంబరెల్లా ద్వారా సరిచేయవచ్చు. పిండ దశలోనే శిశువులో గుండె స్పందనల లయ (రిథమ్) సమస్యలు: పిండదశలో గర్భస్థ శిశువు గుండె స్పందనలను నార్మల్ అని చెప్పే సంఖ్యలు చాలా ఉన్నాయి. పిండం గుండె నిమిషానికి 120 నుంచి 160 వరకు కొట్టుకోవడం నార్మల్, కనిష్ఠంగా 90 సార్లు కొట్టుకున్నా అదీ నార్మలే. కొన్నిసార్లు తల్లికి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించినప్పుడు గర్భస్థ పిండంలోని గుండె స్పందనలో మార్పులు ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను ఫీటల్ కార్డియాక్ అరిథ్మియా అంటారు. గుండె వేగం చాలా ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ఫీటల్ టాకికార్డియా అనీ, గుండె వేగం మరీ తక్కువగా ఉంటే ఫీటల్ బ్రాడీకార్డియా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కాబోయే తల్లికి మందులు ఇవ్వడం ద్వారా ఫీటల్ కార్డియాక్ అరిథ్మియా పరిస్థితిని అదుపులోకి తేవచ్చు. కోఆర్కటేషన్ ఆఫ్ ఆర్టా: గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు మధ్యలో సన్నబడడం వల్ల వచ్చే రుగ్మత ఇది. అయితే ఈ రక్తనాళాలు సన్నబడిపోయినా చికిత్స చేయడం సాధ్యమే. కొందరిలో అసలు ఆ రక్తనాళాలే రూపొందవ#. అలాంటి సవుస్యను అట్రిసియా అంటారు. ఈ కండిషన్‌కు చికిత్స అందించడం ఇంకా ప్రయోగదశలోనే ఉంది. ఇవేగాక ప్రధాన వాల్వ్‌లు సన్నబడటం (పల్మునరీ వాల్వ్ స్టెనోసిస్ /అయోర్టిక్ స్టెనోసిస్) లాంటివి ఎన్నో గుండె రుగ్మతలు ఉన్నాయి. బిడ్డ పుట్టాక వచ్చే కొన్ని గుండెజబ్బులు... ఇందులోనూ చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి... ఏఎస్డీ : గుండె పై గదుల మధ్య గోడలో... అంటే ఏట్రియాల మధ్య ఒక రంధ్రం ఉంటుంది. దీన్నే ఫొరామెన్ ఒవేల్ అంటారు. ఇది ఇలా ఉండటం సహజం. సాధారణంగా బిడ్డ పుట్టాక 48 గంటల నుంచి 72 గంటల్లోపు ఈ ఫొరామెన్ ఒవేల్ మూసుకుపోతుంది. ఈ రంధ్రం మూసుకోకపోతేనే సమస్య. పుట్టుకతో వచ్చే ఈ సమస్య ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ). అయితే దీన్ని పిండంలోనే వచ్చే సమస్య అంటూ చెప్పడానికి వీల్లేదు. వీఎస్డీ: కింది గదుల వుధ్య ఉండే గోడలో చిల్లు ఉంటే దాన్ని వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ అనవచ్చు. నిజానికి ప్రతి చిన్నారిలోనూ పుట్టే వరకూ కింది గదుల వుధ్య గోడలో రంధ్రం ఉంటుంది. పుట్టిన 48–72 గంటల్లోపు అది దానంతట అదే పూడుకుపోతుంది. ఆ రంధ్రాన్నే స్మాల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) అంటారు. అందుకే దాన్ని ఆ దశలో డిఫెక్ట్‌గా పరిగణించరు. అప్పటికీ వుూసుకోకపోతేనే సవుస్య. చాలా మందిలో వీఎస్డీ లక్షణాలు కనిపించకపోవచ్చు. బిడ్డ 6 నుంచి 8 వారాల దశలో గుండె స్పందనల్లో తేడా కనిపించవచ్చు. వీఎస్డీ ఓ మోస్తరు నుంచి పెద్దగా (లార్జ్) ఉన్నప్పుడే హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చిన్న సర్జరీతో చక్కబడుతుంది. టెట్రాలజీ ఆఫ్ ఫాలో: పుట్టుకతోనే నీలంగా పుడతారు. అందుకే వీళ్లను బ్లూబేబీస్ అంటారు. పిల్లలు నీలంగా వూరే ఈ జబ్బును మెుదట నీల్స్ (స్టెన్సన్) కనుక్కున్నారు. లూÄ ూస్ ఆర్థర్ ఫాలో అన్న ఫిజీషియన్ పేరుమీద ఫాలోస్ టెట్రాలజీ అని పేరు పెట్టారు. బిడ్డల్లో కనిపించే లక్షణాలు : ∙ఛాతీలో నొప్పి ∙గుండె విఫలం కావడం ∙చిన్నారి నీలంగా మారడం ∙స్పృహతప్పి పడిపోవడం / కళ్లు తిరగడం ∙గుండె స్పందనల్లో మార్పు ∙గుండె దడ యుక్తవయసులో గుండెజబ్బులు చిన్నపిల్లల్లో నిద్రాణంగా ఉండే కొన్ని గుండెజబ్బులు పెద్దయ్యాక... అంటే యుక్తవయసులోనే వారిని గుండెజబ్బుల పేషెంట్స్‌గా మార్చివేస్తున్నాయి. ఉదాహరణకు రువూటిక్ హార్ట్ డిసీజెస్. ఇది రెండు దశాబ్దాల కిందట ఎక్కువగా ఉండేది. అదృష్టవశాత్తు క్రమేపీ తగ్గుతోంది. తక్కువ ఆర్థిక–సావూజిక స్థాయి (లో సోషియో–ఎకనమిక్) కుటుంబాల్లో తక్కువ స్థాయి జీవన ప్రవూణాల వల్ల (లివింగ్ స్టాండర్డ్) వల్ల ఈ గుండెజబ్బులు వస్తాయి. స్టెప్టోకోకల్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల గొంతునొప్పి, టాన్సిల్స్ వచ్చిన కేసుల్లో ఈ తరహా గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీరిలో కీళ్లనొప్పులు కూడా ఉంటాయి. నిజానికి అది గొంతునొప్పే అయినా శరీరంలో వేరే చోట్ల దాని ప్రభావం పడుతుంది. ఇది వుుఖ్యంగా గుండె కవాటాలను (వాల్వ్స్‌ను) ప్రభావితం చేస్తుంది. చిన్న పిల్లలప్పుడు వచ్చే ఈ సవుస్య వాళ్లు యుక్తవయస్కులయ్యాక గుండెజబ్బులున్న వారిగా వూర్చేస్తుంది. తొలిదశలో వుందులతో చికిత్స చేసినా ఎప్పటికైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కవాటాల (వాల్వ్స్) సర్జరీలు అవసరం పడతాయి. యువతలో వచ్చే మరికొన్ని... ఇటీవల హైస్కూళ్లు కాలేజీ దశలోనే... అథ్లెట్లు తమ సమస్యను గుర్తెరగక అధిక వ్యాయామాలతో అకస్మాత్తుగా మరణిస్తున్నారు. అందుకే ఎక్కువ శారీరక శ్రమ ఉండే ఆటల్లో పాల్గొనే పిల్లలు డాక్టరును సంప్రదించాకే కొనసాగించాలి. యుక్తవయసులో... హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (హెచ్‌సీఎమ్) : ఇది అనువంశీకంగా వచ్చే వ్యాధి. ఇందులో గుండె కండరం మందంగా మారిపోతుంది. దాంతో గుండెకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో తేడా కారణంగా గుండెలయలో మార్పులు (అరిథ్మియా) వచ్చి, గుండె స్పందనలు లయబద్ధంగా సాగవు. దాంతో హెచ్‌సీఎమ్ కారణంగా 30 ఏళ్ల వారు అకస్మాత్తుగా మృతి చెందవచ్చు. ఇది అథ్లెట్లలో ఎక్కువ. కరొనరీ ఆర్టరీ అబ్నార్మాలిటీస్ : గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ధమనుల్లో తేడా ఉంటుంది. వ్యాయామం సమయంలో ముడుచుకుపోవడం లేదా నొక్కుకుపోవడం జరుగుతుంది. దాంతో గుండెకు రక్తం అందక మృత్యువాత పడవచ్చు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్ : ఈ సమస్యకూడా అనువంశీకంగానే వస్తుంది. ఇందులోనూ గుండె లయలో తేడాలు వచ్చి అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఇవే గాక గుండె కండరానికి వచ్చే ఇన్ఫ్లమేషన్లు, గుండె విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన బ్రుగాడా సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా యువతలో అకస్మాత్తు మరణాలకు దారితీయవచ్చు. ఇక ఆటల్లో భాగంగా ఛాతీ భాగంలో అకస్మాత్తుగా తగిలే పెద్ద దెబ్బ వల్ల కొమోషియో కార్డిస్ అనే కాస్త అరుదైన గుండె సమస్య కూడా వచ్చి అది కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. యువతలో ఎంత తరచుగా అంటే... ఇది ఇటీవల ఎక్కువైంది. ప్రతి 50వేల గుండెపోటు మరణాల్లో ఒకటి స్కూలు లేదా కాలేజీ పిల్లలదే ఉంటోంది. వేర్వేరు వయసుల్లో వచ్చే గుండె సమస్యలు! గుండె జబ్బులు అనగానే సాధారణంగా పెద్ద వయసు వారే కళ్ల ముందు మెదులుతారు. కానీ గుండెజబ్బులకు ఏ వయసువారూ అతీతం కాదు. పుట్టకముందు పిండ దశలో ఉన్న శిశువులు మొదలు... నూరేళ్ల వయసు వరకు అందరికీ వివిధ రకాల గుండెజబ్బులు వస్తుంటాయి. వివిధ వయసుల్లో ఉన్న మహిళలు–పురుషులు, పిల్లల్లో కనిపించే కొన్ని ప్రధానమైన గుండెజబ్బులను తెలుసుకోవడం, గుండెపోటు నివారణ, చికిత్సలపై తగిన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. వేర్వేరు వయసుల మహిళల్లో వేర్వేరు వయసులో ఉన్న మహిళల్లో వేర్వేరు కారణాల వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి. చిన్న వయసులోని యువతుల్లో... : జీవనశైలి సమస్యల వల్ల చిన్న వయసులో ఉన్న యువతుల్లో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. 15 – 16 ఏళ్ల యువతుల్లో శారీరక శ్రమలోపించడంతో గుండె జబ్బులు వస్తున్నాయి. యువతుల్లో 6 నుంచి 19 ఏళ్ల వయసులోని 15 శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఇక విదేశీ పోకడలను అనుకరిస్తూ ఇటీవలే పట్టణ ప్రాంతాల్లోని యువతుల్లో పొగాకు వినియోగం పెరుగుతుండటం కూడా గుండెజబ్బులకు కారణమవుతోంది. మధ్యవయస్కులైన మహిళల్లో : మెనోపాజ్ దశకు చేరుకోవడం అనే అంశం మధ్యవయస్కులైన మహిళల్లో గుండె సమస్యలకు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)గా మారుతోంది. మెనోపాజ్ రానివాళ్లతో పోలిస్తే మెనోపాజ్ వచ్చిన మహిళల్లో గుండెజబ్బులు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మెనోపాజ్ రాకముందు రుతుక్రమం వచ్చే మహిళల్లోని ఈస్ట్రోజెన్ గుండెజబ్బులను రాకుండా నివారిస్తోంది. ►ప్రతి ఏటా మన దేశంలోని 45 – 64 ఏళ్ల మధ్య వయసు మహిళలు 88,000 మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ►65 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు సగం మంది ఎనిమిదేళ్ల వ్యవధిలో గుండెపోటు వచ్చి మృతిచెందుతున్నారు. ►మహిళల్లో 55 ఏళ్ల తర్వాత అధికరక్తపోటు సమస్య దాదాపు 90 శాతంమందిలో కనిపిస్తోంది. అది కూడా గుండెజబ్బులకు ఒక ప్రధాన కారణం. ►ఇక 45 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో కొలెస్ట్రాల్ పాళ్లు 200 ఎంజీ/డీఎల్‌కు మించి ఉండటం కూడా ఒక కారణం. వయసు పైబడిన మహిళల్లో : 65 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో గుండె ధమనులు పెళుసుబారినట్లు మారిపోవడం వల్ల వచ్చే అధెరోస్కి›్లరోసిస్ సమస్య నిశ్శబ్దంగా గుండెజబ్బులకు కారణమవుతోంది. ►ప్రతిఏటా 65 ఏళ్లు పైబడిన 3,72,000 మంది మహిళలు దేశంలో గుండెపోటుకు లోనవుతున్నట్లు ఒక అంచనా. అలాగే 70 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చిన వాళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. గుండెపోటు వచ్చిన కొన్ని వారాల వ్యవధిలోనే గుండెపోటు వారిని కబళిస్తోంది. మహిళల్లో గుండెజబ్బులు.. కొన్ని ఆందోళనకరమైన అంశాలు ►మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చిన మహిళలోఓ్ల దాదాపు 23 శాతం మంది ఏడాదికే మళ్లీ హార్ట్ఎటాక్తో చనిపోతున్నారు. ►మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చిన మహిళల్లోని దాదాపు 35 శాతం మందిలో మళ్లీ ఆరేళ్లలో రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ►మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన మహిళల్లోని సగం మంది ఆరేళ్ల వ్యవధిలోనే మళ్లీ హార్ట్ఫెయిల్యూర్స్తో ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ►సాధారణంగా మన పురుషాధిక్య సమాజంలో ఇంటి యజమాని పురుషుడే కావడం, మహిళ జీవనోపాధి లేకపోవడం (బ్రెడ్ విన్నింగ్ మెంబర్ కాకపోవడం)తో వివక్ష కారణంగా చికిత్స తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. పురుషుల గుండెపోట్లలో... ఒకింత వయసు పెరిగిన పురుషుల్లో సాధారణంగా గుండెకు రక్తాన్ని చేరవేసే కరొనరీ రక్తనాళాలు మృదుత్వం కోల్పోయి పెళుసుబారడం, సన్నబారడం (అథెరోస్కి›్లరోసిస్), రక్తనాళాల్లో కొవ్వు చేరి, రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల గుండెపోటు వస్తోంది. ఇటీవల యువతలోనూ ఇవి కనిపిస్తున్నాయి. యువతలో ఒకటి రెండు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే వయోవృద్ధుల్లో రెండు నుంచి మూడు ప్రధాన నాళాల్లో అడ్డంకులు రావడం కనిపిస్తుంటుంది. ►రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్తం సరిగా అందని కండిషన్‌ను ‘కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అంటారు. గుండెపోటుకు ఇది ప్రధాన కారణం. కొన్ని అధ్యయనాల ద్వారా... చిన్నప్పుడు కరొనరీ ధమనుల్లో తేడాలు (అబ్నార్మాలిటీస్) ఉన్నవారిలో 4% మందికి, ఇంకెక్కడో గడ్డకట్టిన రక్తపుముద్ద (క్లాట్) ప్రవాహంలో కొట్టుకుపోతూ కరొనరీ ధమనుల్లోకి చేరడంతో 5% మందిలోనూ... రక్తం గడ్డకట్టే వ్యవస్థలో లోపాల వల్ల ఇంకో 5% మందిలో చిన్న వయసులోనే గుండెపోటు వస్తోందని తేలింది. ►కరొనరీ ధమనుల ఇన్ఫ్లమేషన్, ఛాతీలోని గడ్డలకు రేడియేషన్ థెరపీ తీసుకోవడం, ఛాతీలో బలమైన గాయాలు కావడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అంశాలతో ఆరు శాతం మంది యువత చాలా చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం జరుగుతోంది. ►యాభై ఏళ్లు పైబడిన వారిలో వాల్వ్ సమస్యల్లో ముఖ్యంగా మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ సమస్యల్లో భాగంగా లీక్ కావడం, సన్నబడటం జరగవచ్చు. ఇలాంటి కొందరిలో సర్జరీ లేకుండా ట్రాన్స్కెథటర్ చికిత్స (రిపేర్ లేదా రీప్లేస్మెంట్) ద్వారా లీకేజీని సరిచేయడం సాధ్యం. పురుషులు / మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. నివారణకు సులువైన మార్గాలు... ►అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అధ్యయనాలలో నమ్మకంగా తెలిసిన ఫలితాలివి. పైగా ఆచరించడం చాలా తేలిక. ఇష్టంగా, సంతోషంగా అనుసరించవచ్చు. మొక్కజొన్నల్లోని క్రోమియమ్ గుండెజబ్బులను తగ్గిస్తుంది. స్వీట్ కార్న్‌లోని క్రోమియమ్ ఎంత ఎక్కువైతే గుండెజబ్బు అవకాశాలు అంత తగ్గుతాయి. ఈ విషయాన్ని అమెరికా లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్నారు. ►వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓవర్‌కోట్ ధరించండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా శరీరాన్ని వెచ్చబరచడానికి రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణంలో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుదల హార్ట్ఎటాక్ వచ్చే అవకాశాలను రెండు శాతం పెంచుతుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థ ఒక అధ్యయనంలో కనుగొన్నది. ►మీకు కీవీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తరచూ తినండి. కీవీ ఫ్రూట్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. ఒక మందులా రక్తాన్ని పలచబార్చేందుకు ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... మందు కాకపోయినా కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. (ఇప్పుడు భారత్‌లోని చాలా మార్కెట్స్‌లో కీవీ పండ్లు లభ్యమవుతున్నాయి). ►ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్ పుష్కలంగా తీసుకోవడం అవసరమని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది. క్యాల్షియమ్ కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్. పాలు తాగడం ఒక తేలికైన మార్గం. ►ప్రతిరోజూ 60 ఎం.ఎల్. దానిమ్మ జ్యూస్ తాగేవారికి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తాగేవారిలో ఒక ఏడాది తర్వాత రక్తనాళాల్లో అడ్డంకులు చాలావరకు తగ్గుతాయని ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ►రోజూ మనం మూడు పూటల్లో తీసుకునే ఆహార పరిమాణాన్నే ఆరుపూటలుగా విభజించుకొని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెబుతోంది. ►మీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినడం మంచిదే. ఎందుకంటే... మన వైటమిన్ సప్లిమెంట్లను చల్లబరచి తినడం వల్ల దానిలోని ప్రభావం దీర్ఘకాలికమవు తుందట. అందువల్ల గుండెజబ్బులు తగ్గుతాయని యూఎస్‌కు చెందిన ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ రెండుపూటలా బ్రష్ చేసుకోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా 70 శాతం తగ్గుతుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ కలిగించే బ్యాక్టీరియా వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా అదేమేరకు తగ్గుతాయని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. ►చికెన్ సలామీ (మన భాషలో చెప్పాలంటే చికెన్ షేర్వాతో గ్రేవీ ఎక్కువగా ఉండే కోడి కూర)లో కాస్తంత నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు వెల్లడించారు. అంటే మాంసాహార ప్రియులు రెడ్‌మీట్, వేట మాంసం కంటే తేలిగ్గా ఉండే చికెన్‌ను... అందునా షేర్వాతో ఉండేలా తినడం వల్ల మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు. (వాస్తవానికి చికెన్ సలామీ రెసిపీని అమెరికన్స్ మష్రూమ్స్, ఉల్లి పుష్కలంగా వేసి గ్రేవీగా అయ్యేలా చేసుకుంటారు.) ►అప్పుడప్పుడూ తీసుకునే డార్క్ చాక్లెట్స్ గుండెజబ్బుల రిస్క్ తగ్గించుకునే ఒక రుచికరమైన మార్గం. చాక్లెట్‌లోని కోకోలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం రక్తనాళాలు గరుకుగా మారి రక్తం గడ్డగట్టే గుణాన్ని (అథెరోస్కీ›్లరోసిస్ను) గణనీయంగా తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బార్సెలోనా పరిశోధకులు చెబుతున్నారు. ►కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం మంచిది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వెనిల్లా ఫ్లేవర్‌తో లభ్యమయ్యే యోగర్ట్ తింటే... అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారిస్తాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ పేర్కొంటోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం పూట కనీసం అరగంట పడుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే రిస్క్ 30 శాతం తగ్గుతుందన్నది జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక. దీర్ఘకాలంగా నిద్రను అణచుకుంటూ ఉంటే, గుండె స్పందనల్లో లయతప్పే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితినే ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్ (పీవీసీఎస్) అంటారు. ►ఒత్తిడిని, దాంతో కలిగే రక్తపోటును తగ్గించుకోవడం అన్నది గుండెజబ్బుల నివారణలో చాలా ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. రోజూ కేవలం ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా ఒత్తిడి కారణంగా కలిగే హైపర్‌టెన్షన్ తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నివేదికలు చెబుతున్నాయి. ►ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు ఆరుబయట నడవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 26 శాతం తగ్గుడమే గాక... దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక సమర్థమైన మార్గమని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. ►యోగా, ధాన్యం వంటి ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటాయి. దాంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండెజబ్బుల నుంచి నివారణ దొరుకుతుంది. అంతేకాదు... గుండెజబ్బులు ఉన్నవారు సైతం త్వరగా కోలుకోవడం జరుగుతుంది. డా. సూర్యప్రకాష్ గుల్ల సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్!
హార్ట్ అండ్ లంగ్ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 22 ఏళ్లు. ఇంజనీరింగ్ పూర్తిచేసి కాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీలో నొప్పి– తీవ్రమైన అసౌకర్యం, గుండెదడ, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఇక్కడి డాక్టర్లకు చూపిస్తే ఏవో పరీక్షలు చేసి వాడికి పీపీహెచ్ అనే వ్యాధి ఉందని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయయని చెబుతున్నారు. ఏవో మందులు రాశారుగానీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడితోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? వాడు మా ఒక్కగానొక్క కొడుకు. వాడిని రక్షించుకునే మార్గం సూచించండి. – పి. అంజమ్మ, నకిరేకల్ మీ అబ్బాయికి వచ్చిన వ్యాధి ప్రైమరీ పల్మునరీ హైపర్‌టెన్షన్. దీని సంక్షిప్త రూపమే ఈ పీపీహెచ్. అరుదైన ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి రక్తనాళాల వెడల్పు తగ్గి ఇరుకుగా తయారవుతాయి. తీవ్రమైన ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోయి, ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి కలుగుతుంది. అయితే అంతమాత్రం చేత ఆశలన్నీ వదులుకోనవసరం లేదు. ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల వల్ల, కొత్త మందుల ఆవిష్కరణ వల్ల, అవయవ మార్పిడిలో నూతన శస్త్రచికిత్స మెళకువలు అభివృద్ధి చెందడం వల్ల పీపీహెచ్‌కు ఇప్పుడు నమ్మకమైన చికిత్స అందుబాటులో ఉంది. దాని ద్వారా రోగి జీవితకాలాన్ని పొడిగించవచ్చు. పీపీహెచ్ రావడానికి స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కొన్ని కుటుంబాలలో పీపీహెచ్ ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలో ఏటా పది లక్షల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. పీపీహెచ్ మొదటిదశలో డాక్టర్లు నిర్వహించే సాధారణ వైద్యపరీక్షల్లోనే ఈ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రం పీపీహెచ్ లక్షణాలు... గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతల్లాగా కనిపించి కాస్త తికమకపెడతాయి. కానీ మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి సాధారణ వైద్యపరీక్షలతోనే ఈ వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. దీన్ని బట్టి బహుశా అది ప్రాథమిక దశలోనే ఉండి ఉండాలి. అలాగైతే మందులతోనే దానికి చికిత్స చేయివచ్చు. కొన్ని జాగ్రత్తలతో అతడు సాధారణ జీవితం గడపవచ్చు. ఒకవేళ ఇందుకు భిన్నంగా మీ అబ్బాయికి వ్యాధి ముదిరి ఉన్నా నిరాశపడాల్సిన పనిలేదు. గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడవచ్చు. పైగా మీ అబ్బాయి యువకుడు అయినందువల్ల గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే పీపీహెచ్ వల్ల ఒక బాలిక గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా తిన్నా... కంబైన్డ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఆమెకు మా హాస్పిటల్లోనే అవయవమార్పిడి చేసి రక్షించగలిగాం. మూడు నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆ బాలిక ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అక్కడ ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేస్తారు. పరిస్థితిని చూసి చికిత్స ప్రారంభించవచ్చు. ఒకవేళ గుండె, ఊపిరితిత్తులు మార్చాల్సిన అసవరం వస్తే డాక్టర్లు గుర్తించిన వెంటనే ఆ అవయవాల కోసం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాత లభించేంతరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆందోళన చెందకుండా మీరు మీకు దగ్గర్లోని పెద్ద హాస్పిటల్స్‌లోని గుండెనిపుణులకు చూపించుకొని వారి సూచన మేరకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోండి. డాక్టర్ పి.వి. నరేశ్ కుమార్ సీనియర్ కార్డియో–థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. పాపకు తరచూ జలుబు.... ఎందుకిలా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా జరగడం లేదంటూ ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం కేవలం తాత్కాలికమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. – రమాసుందరి, శ్రీకాకుళం మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
త్రీడీ ఊపిరితిత్తులు!
న్యూయార్క్: మానవుడి ఊపిరితిత్తుల్లాగా పని చేసే అతిచిన్న త్రీడీ అవయవాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శ్వాస కోస సంబంధ వ్యాధు లపై మరింత అవగాహన పొందేందుకు ప్రయో గశాలల్లో అభివృద్ధి చేసిన ఈ అవయవాలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మానవుడి ప్లురిపొటెంట్ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్ (లంగ్స్)ను అభివృద్ధి చేశారు. మానవుడి దేహంలోని ఊపరితిత్తుల మాది రిగా వీటిలో నిర్మాణాలను ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) సోకినపుడు ఊపిరిత్తులు ఏ విధంగా స్పందిస్తాయో అదే విధంగా ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్ కూడా స్పందించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ ఆర్గనాయిడ్స్ వివిధ రకాల నూతన ఔషధాలను పరీక్షించడానికి ఉపయోగపడ తాయని కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ హాన్స్ విలియమ్ పేర్కొన్నారు. -
ఆరు రోజులు లంగ్స్ లేకుండానే..!
టొరంటో: తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు కెనడా వైద్యులు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ప్రాణం పోశారు. ఇందుకోసం వారు అవలంభించిన విధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరైన సమయంలో ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి దాతల నుంచి లంగ్స్ దొరక్కపోవడంతో సుమారు ఆరు రోజులపాటు ఓ మెషిన్ ద్వారానే మహిళకు కృత్రిమ శ్వాస అందించారు. ఇది వైద్య చరిత్రలో చాలా అరుదైన చికిత్సగా.. దీనికి సంబంధించిన వివరాలను టొరంటో జనరల్ ఆసుపత్రి వర్గాలు ఇటీవల మీడియాతో వెల్లడించాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ మూలంగా మెలిస్సా బినాట్(32) అనే మహిళ ఊపిరితిత్తులు చెడిపోయాయి. దీనికి తోడు స్వైన్ ఫ్లూ కూడా సోకడంతో ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఆ సమయంలో దాతలు లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఆమె బ్రతకడం కష్టమే అని వైద్యులు తేల్చేశారు కూడా. అయితే చివరి ప్రయత్నంగా పూర్తిగా పాడైపోయిన ఆమె ఊపిరితిత్తులను తొలగించి.. దాతలు దొరికేవరకు 'నోవాలంగ్'గా పిలిచే కృత్రిమ ఊపిరితిత్తుల ద్వారా ఆమెకు శ్వాస అందించారు. ఈ విధానంలో కొద్ది సమయం వరకు పేషెంట్‌కు శ్వాస అందించడం ఓకేగానీ.. సుమారు ఒక వారం పాటు బినాట్ ఈ మెషిన్‌పై ఆధారపడి ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం ఓ దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ఆమెకు అమర్చారు. ప్రస్తుతం బినాట్ కోలుకొని తన రెండేళ్ల కూతురు ఒలీవియాతో ఆడుతోంది. -
ఆస్తమా... ఉంటే ఏంటి?
ప్రతిభకు... ఆస్తమా అడ్డంకి కాదు.పాటవానికి...అది ప్రతిబంధకం కాదు.సామర్థ్యానికి మోకాలడ్డదు.చిన్నప్పుడు వస్తేతగ్గే అవకాశాలు ఎక్కువ.పెద్దయ్యాక వచ్చినానియంత్రణలో ఉంచుకుంటేప్రాబ్లం ఉండదు.కాబట్టి... ఉంటే ఏంటి?అని ధీమాగా అనుకుంటే...నిశ్చింతగా ఎదుర్కోవచ్చు.నిర్భయంగా ఉండిపోవచ్చు.ఒకవేళ ‘ఉంటే ఏంటి?’అని సమాచారంతెలుసుకోవాలనుకుంటేఈ కథనం చదవండి. అవగాహన పెంచుకోండి. ఆస్తమా ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) కలిగించే వ్యాధి. ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయునాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లి, మళ్లీ బయటకు వదలడానికి అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సెన్సిటివ్‌గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై మనం ముట్టుకుందామంటే ముట్టనివ్వని విధంగా మారడం అన్నమాట. దాంతో ఊపిరితిత్తులకు దారితీసే నాళాల కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీని వల్ల కూడా ఊపిరి అందదు. మనకు సరిపడని వాటిని పీల్చుకున్నప్పుడు మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. దాంతో వాయునాళాలు ఉబ్బడంతో పాటు దాని లోపల కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అది గాలి మార్గాన్ని మరింతగా మూసేస్తుంది. దాంతో గాలి పీల్చడమూ, వదలడమూ కష్టమవుతుంది. వేర్వేరు దేశాల్లో... వేర్వేరు విస్తృతితో... వేర్వేరు దేశాల్లో ఆస్తమా విస్తృతి భిన్నంగా ఉంది. దిగువ స్థాయి ఆదాయ వర్గాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆస్తమా విస్తృతితో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కాస్త నిలకడగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 33.4 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉండగా దాదాపు ఏటా 2,50,000 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితుల్లో పదోవంతు మంది మనదేశంలోనే ఉన్నారు. ఇది ఏ వయసు వారిలోనైనా వస్తుంది. అయితే సాధారణంగా ఇది బాల్యంలోనే మొదలవుతుంది. దీని తీవ్రతను పరిశీలించిన దాదాపు 15 అధ్యయనాలలోని విశ్లేషణల ఆధారంగా ప్రపంచంలోని పిల్లల్లో 14 శాతం మందికి ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని 5 – 11 ఏళ్ల పిల్లల్లో 10% నుంచి 15% మంది చిన్నారులు ఆస్తమా కనిపిస్తోంది. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల తర్వాత ఆస్తమా లక్షణాలు బయట పడతాయి. అయితే చాలా చిన్నపిల్లల్లో అటు తల్లితండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఆస్తమా వస్తే దాన్ని గుర్తించడం ఒకింత కష్టం అవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు చిన్నపిల్లల్లో అసలే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక పడిశం, జలుబు లాంటి వాటితో ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అది ఆస్తమా వల్ల కలిగిన పరిణామమా, లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కష్టమవుతుంది. కారణాలు / నివారణ ఆస్తమాకు మూలకారణం ఇంకా పూర్తిగా తెలియదు. జన్యుపరమైన కారణాలతో పాటు వాతావరణం ఇది వచ్చేందుకు దోహదం చేస్తుందని స్పష్టమైంది. మనం శ్వాసించే సమయంలో ఏదైనా సరిపడనిది (దీన్ని అలర్జెన్ అని పిలుస్తారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ ప్రతిచర్యకు దోహదపడే అంశాల్లో కొన్ని... ► గదుల్లో ఉండే ఇండోర్ అలర్జెన్స్ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో పుష్కలంగా ఉండే దుమ్ముధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ► ఆరుబయట ఉండే అలర్జెన్స్: (ఉదాహరణకు పుప్పొడి, గాలితో పాటు విస్తరించే బూజు వంటి పదార్థాలు). ►పొగాకు పొగ ► రసాయనాలు, వాటి వాసన, ఘాటైన స్ప్రేలు కొందరిలో కారణం కావచ్చు. వాయు కాలుష్యం... ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా ఎక్కువగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పి నివారణకు వాడే నాన్–స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇటీవల నగరీకరణకు దోహదపడే అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు తేలింది. కారణాలకు దూరంగా ఉంటే నివారణ కూడా సాధ్యమవుతుంది. అలర్జెన్స్కూ, ట్రిగర్స్కూ దూరంగా ఉండటమే నివారణ. నివారించడం అంటే జబ్బుకు దూరంగా ఉండటమే. అంటే ఇంచుమించు జబ్బు లేకుండా ఉండటమే. లక్షణాలు ► దగ్గు ... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం లేదా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు మరింతగా పెరుగుతుంది. ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► ఛాతీ పట్టేసినట్లుగా బిగుతుగా మారడం ► ఊపిరి హాయిగా అందకపోవడం ► పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ► కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. ► పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటి గాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిVýæ్గరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వెంటనే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను ప్రేరేపిస్తాయి. చికిత్స చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... ► దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ► తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ► మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మందు వృథా కాకుండా ఉండటంతో పాటు... ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ విధిగా ఉపయోగించాలి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ► కేవలం మందులు ఇవ్వడం లేదా చికిత్స మాత్రమే ఆస్తమాను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడదు. దాంతోపాటు ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తుపట్టి, వాటినుంచి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రతిస్తూ ఉండటం వంటి అంశాలెన్నో కలగలిస్తేనే ఆస్తమా నియంత్రణలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆస్తమా – సెలబ్రిటీ బాధితుల్లో... కొందరు ప్రముఖులు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, షరాన్‌స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా వంటి ప్రముఖులు ఆస్తమాతో బాధపడ్డవారిలో ఉన్నారు. బాలివుడ్ దిగ్గజం రాజ్కపూర్నూ ఆస్తమా బాధించింది. జెరోమ్ బెట్టిస్ అనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు ఆస్తమాతో బాధపడ్డవాడే. అలాగే నాన్సీ హాగ్షెడ్ ఆస్తమా ఉన్నప్పటికీ స్విమ్మింగ్‌లో ఒలింపిక్‌లో 3 బంగారు పతకాలు సాధించింది. అయితే వారి ప్రఖ్యాతికీ, ప్రతిభకూ అది ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. ఆస్తమా – ఆహారం ఆస్తమా ఉందా? ఇలా తినండి! ► కిస్మిస్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి కాయ, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటా కెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ► బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. ► వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. ఇలా కూడా తీసుకోవచ్చు... ► పాలలో పసుపు కలుపుకొని తాగడం, ఒక స్పూన్ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకుంటే సమస్య ఉపశమనంతో పాటు నివారణకు కూడా దోహదం చేస్తుంది. ► పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని పాక్షికంగా మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందనీ, అదే ట్రిగర్ అనీ తెలిస్తేనే దాన్ని మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి ‘సి’ విటమిన్‌ను అందించి, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రతించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. అపోహతోనే దూరంగా ఉంటే కొన్ని పోషకాలనుంచి దూరమైనట్లే. ► ఇక బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే, అది భవిష్యత్తులో ఆస్తమా నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి ఆస్తమాను పెంచుతాయి... ఉప్పు తగ్గించాలి. ► రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్ వంటివి మానేయాలి. ఆస్తమా – నిర్ధారణ నిర్ధారించడం అంత ఈజీ కాదు ఆస్తమా నిర్ధారణ చాలా కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా ఆస్తమాను అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలోని వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి పోతాయి. దాంతో సదరు లక్షణాలు నిర్దిష్టంగా ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా, లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ∙ రైనైటిస్ ∙ సైనసైటిస్ ∙ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ► వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ► స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ► బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ► రెస్పిరేటరీ సింటాక్టికల్ వైరస్ (ఆర్ఎస్వి) ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయిస్తారు. అవి... ► ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్రైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా నిర్ధారణ చేస్తారు. ►ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లితండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. ఇంత చిన్న పిల్లల్లో ఆస్తమాను నిర్ధారణ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు : కొన్ని ట్రిVýæ్గరింగ్ అంశాలతో పిల్లల్లో ఆస్తమా వెంటనే కనిపిస్తుంటే.. అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. అలర్జీ వల్ల కలిగే ఆస్తమా విషయంలో ఇది మొదటి ప్రాధాన్య పరీక్ష (గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్). ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ ప్రతిక్రియ (రియాక్షన్) జరుగుతుందేమోనని గమనిస్తారు. ఇది చాలా సంక్షిప్తంగా, వేగంగా జరిగిపోయే నిర్దిష్టమైన పరీక్ష. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది.కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. డా. అపర్ణా రెడ్డి పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
కొద్దిగా నడిచినా ఆయాసం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 44. నాకు కొంతకాలంగా కొద్దిదూరం నడిస్తేనే ఆయాసంగా, ఛాతీ బరువుగా అనిపిస్తోంది. నేను పని చేసేది ఫ్యాక్టరీలో కావడం వల్ల, పైగా నాకు పొగతాగే అలవాటున్నందువల్ల ఇది గుండెకు సంబంధించిన వ్యాధి అనుకుని పరీక్షలు చేయిస్తే, అన్ని రిపోర్టులూ నార్మల్‌గానే వచ్చాయి. అయినా నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రమణారెడ్డి, పటాన్చెరు, హైదరాబాద్Z ఊపిరితిత్తులకు హాని కలిగి శ్వాస తీసుకోవడంలో తలెత్తడాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడి) అంటారు. సాధారణంగా మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా ట్రకియా అనే నాళాన్ని చేరుతుంది. ట్రకియా చివరి భాగంలో రెండు నాళాలుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి ఊపిరితిత్తులతో ప్రవేశించి, కొన్ని వేలసంఖ్యలో ఉన్న అతి సన్నని నాళాలుగా విభజింపబడతాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఈ నాళాలు మిక్కిలి చిన్న గాలి తిత్తులుగా ఏర్పడతాయి. వీటిపై చిన్న రక్తనాళాలు ప్రయాణిస్తుంటాయి. గాలి వాయుతిత్తుల వరకు చేరినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్తనాళాలకు చేరుతుంది. అదే సమయంలో రక్తనాళాలలో కార్బన్ డై ఆక్సైడ్ ఈ వాయుతిత్తులను చేరుతుంది. తద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు వెలుపలికి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఎక్స్ఛేంజ్ అంటారు. ఈ వాయుద్వారాలు, గాలి తిత్తులు సాగే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి గాలి పీల్చుకున్న సమయంలోనూ, వదిలినప్పుడూ ఒక గాలిబుడగలా పని చేస్తాయి. దీర్ఘకాలికంగా ధూమపానం చేయడం వల్ల గాలితిత్తులు, వాయుద్వారాలు దెబ్బతిని వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతర కారణాలు: ఎక్కువగా కాలుష్యవాయువులను పీల్చడం, వృత్తి రీత్యా కొన్ని పొగలను, రసాయనాలను, దుమ్మును పీల్చవలసి రావడం, జన్యుపరమైన కారణాలు. లక్షణాలు: శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తరచు దగ్గు, ఊపిరి తీసుకున్నప్పుడు గురగురమనే శబ్దాలు వినిపించడం, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి. జాగ్రత్తలు: పొగతాగే అలవాటు వుంటే వెంటనే మానివేయడం ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు దూరంగా ఉండటం, అవి శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కుకు మాస్క్ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శారీరక తత్వాలను బట్టి, కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కాళ్ల వాపులు... సమస్య ఏమిటి? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితేనే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. - రవికిశోర్, విజయవాడ సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు. నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. - గోపాలరావు, నెల్లూరు కాలేయం కొవ్వును నిల్వ చేసి ఉంచుతుంది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం) , కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
బాబుకు ఆస్తమా... తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది. ఎప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా? - నాగరాజు, గుంటూరు ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది. కారణాలు: దుమ్ము, ధూళి, కాలుష్యం వాతావరణ పరిస్థితులు, చల్లగాలి వైరస్లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ పొగాకు పెంపుడు జంతువులు సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు పుప్పొడి రేణువులు వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు: ఆయాసం దగ్గు రాత్రిపూట రావడం గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధి నిర్ధారణ : ఎల్ఎఫ్టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు. చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ చెయ్యి వణుకు... తగ్గడం ఎలా? న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఏదైనా పనిచేసేటప్పుడు నా కుడి చెయ్యి వణుకుతూ ఉంది. ఈ మధ్య మాట కూడా వణుకుతోంది. నా సమస్యకు పరిష్కారం ఉందా? - రామచంద్రరావు, నిడదవోలు మీరు ఎసెన్షియల్ ట్రెమర్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఏదైనా పనిచేస్తున్నప్పుడు... అంటే... కాఫీ తాగేటప్పుడు, పెన్నుతో రాసేటప్పుడు.. ఇలా ఏదైనా పనిచేస్తున్నప్పుడు చేయి వణుకుతూ ఉంటుంది. టెన్షన్ ఎక్కువైనా, పని ఒత్తిడి పెరిగినా ఇలా వణకడం పెరగవచ్చు. వణుకు కొద్దిమాత్రంలో ఉంటే మందులు వాడాల్సిన పని లేదు. అయితే ఎక్కువగా వణకుతుండేవారిలో ప్రొపనలాల్, ప్రిమిడోన్ అనే మందులు వాడటం ద్వారా ఆ సమస్యను తగ్గించవచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను కలిసి, తగిన మందులు తీసుకోండి. మీ సమస్య తీవ్రత తగ్గుతుంది. నా భర్త వయసు 56 ఏళ్లు. మద్యం అలవాటు ఉంది. ప్రతిరోజూ తాగుతారు. ఒక్కోసారి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. మద్యం తాగకపోతే వణుకు వస్తుంటుంది. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి. - సులోచన, వరంగల్ మద్యం తాగేవారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఇంటాక్సికేషన్తో ఫిట్స్ రావచ్చు. చీప్‌లిక్కర్‌కు అలవాటు పడిన వారిలో కొంతమందికి ఒక్కసారిగా మానేయడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. మద్యం ఆపేసిన కొద్దిమందిలో రెండురోజులు పొంతనలేకుండా మాట్లాడటం, ఉమ్మివేయడం వంటివి చేస్తుంటారు. దీన్ని డెలీరియమ్ ట్రెమర్స్ అంటారు. దీన్ని మందులతో తగ్గించవచ్చు. అయితే మద్యం జోలికి పోకుండా క్రమం తప్పకుండా టాబ్లెట్స్ తీసుకునేలా చూడాలి. కొంతమందిలో మందులతో ఈ అలవాటును మాన్పించలేకపోతే ‘డీ-అడిక్షన్’ సెంటర్లో ఉంచి చికిత్స అందించాలి. మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌నూ, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స అందేలా చూడండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
నేను మీ థైరాయిడ్‌ని..
ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టు ఆవరించుకొని పింక్ రంగులో ఉంటాను. నేను కేవలం 20 గ్రాములు మాత్రమే తూగుతాను. ఒక గ్రామును 28,00,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో ఒక రోజులో అంత పరిమాణంలోనే హార్మోన్ స్రవిస్తాను. నా చిన్న సైజ్నూ, నేను వెలవరించే హార్మోన్ మోతాదును చూసి నా పనితీరును తక్కువ అంచనా వేయకండి. నేనెంతో ప్రధానమైన భాగాన్ని. నేను ఆనంద్ థైరాయిడ్‌ను. ఒకవేళ ఆనంద్ పుట్టేనాటికి నేను పని ప్రారంభించకపోయి ఉంటే ఆనంద్ మందపాటి పెదవులతో, చప్పిడి ముక్కుతో, వెర్రిబాగులవాడిగా ఉండిపోయేవాడు. నిత్యం ఒకేలా శక్తిని వెలువరించే కొలిమిని... నేను నిప్పు రగిలించే కొలిమిలా పనిచేస్తుంటా. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా ఆనంద్‌లోని వందల కోట్ల కణాలన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటా. ఆ కొలిమిలో కణికలెప్పుడూ ఆరిపోకుండా ఒకేలా రగిలిస్తుండటం లాంటి పనే నేనూ కణాల విషయంలో చేస్తుంటా. నా పనితీరు ఒకింత తగ్గితే ఆనంద్ ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపిస్తూ, ఒళ్లంతా ఊబకాయంతో, మందగించిన కదలికలతో, మందకొడిగా అయిపోతాడు. ఒకవేళ నా పనితీరుగానీ ఒకింత పెరిగిందా... అతడిలో తోడేలుకు ఉన్నంత ఆకలి ఉంటుంది. కానీ ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపోతుంది. అతడి కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా అవుతాయి. అతడి గుండె రేసులో పాల్గొన్నట్లుగా దౌడు తీస్తుంటుంది. చిన్న స్థలంలో పెద్ద రసాయన కర్మాగారాన్ని ఆనంద్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులలాగే నేను అత్యంత చిన్న ప్రదేశంలో నెలకొల్పిన పెద్ద రసాయన కర్మాగారంలా పనిచేస్తుంటాను. ఆ కర్మాగారంలో అత్యంత సంక్లిష్టమైన రసాయనాలు ఉత్పిత్తి అవుతాయి. నానుంచి ఉత్పత్తి అయ్యే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లోని మూడింట రెండోవంతు అయోడిన్ ఉంటుంది. అందుకు నాకు కావాల్సిన అయోడిన్ పరిమాణం ఒక గ్రాములోని ఐదువేలవ వంతు. అంటే ఒక గ్రామును ఐదు వేల భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో అయోడిన్ కావాలి. ఇంత చిన్న మొత్తంలోనే అయినప్పటికీ నాకు అందాల్సిన అయోడిన్ అందకపోతే ఆనంద్ శక్తితో చురుగ్గా ఉండటానికి బదులు బలహీనంగా, నిస్సత్తువగా అయిపోయేవాడు. ఇక నాలోని రసాయనాల నిర్మాణాల సంక్లిష్టత గురించి చెబుతూ, నన్ను నేను పొగుడుకుంటూ మీకు బోరు కొట్టించను. కానీ కొన్ని విషయాలను చెప్పాల్సిందే. నాకు కావాల్సిన అయోడిన్‌ను నేను ఆనంద్‌లోని జీర్ణమైన అయోడైడ్స్నుంచి తయారు చేసుకుంటాను. ఆ తర్వాత అది టైరోసిన్ అనే అమైనో యాసిడ్‌తో జతగూడుతుంది. ఈ జంట నుంచి రెండు రకాల ప్రధాన హార్మోనులుగా రూపొందుతుంది. అవి రెండూ ఆనంద్ రక్తప్రవాహంలో కలిసి ఆనంద్ దేహంలోని మారుమూల ప్రాంతాలకూ వెళ్తుంటాయి. మోతాదు అతి తక్కువ... శక్తి చాలా ఎక్కువ... నాలోని హార్మోన్ల మోతాదు అతి తక్కువ అయినా చాలా శక్తిమంతమైనవి. అందుకే వాటిపై అదుపు ఉండేలా చూస్తుంటాను. నాలోని స్రావాలను ఉత్పత్తి చేయడానికి, వాటి పాళ్లను నియంత్రించడానికి మరో రెండు గ్రంథులు నాకు సహాయం చేస్తుంటాయి. అందులో ఒకటి ఆనంద్ మెదడులో ఉండే హైపోథెలామస్. అది పిట్యుటరీ అనే మరో గ్రంథిని ప్రేరేపిస్తుంది. పిట్యుటరీ నుంచి నన్ను ప్రేరేపించేందుకు థయోట్రోపిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయమని నన్ను ఆదేశిస్తుంది. దాంతో నేను పని మొదలుపెడతాను. నాలోని హార్మోన్ స్రావం మొదలు కాగానే పిట్యుటరీకి సిగ్నల్ అందుతుంది. దాంతో అది తన పని పూర్తయినట్లు గ్రహించి థైరోట్రోపిన్ను ఆపేస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి అందే ఫీడ్‌బ్యాక్ ద్వారా ఒకరిని ఒకరం నియంత్రించుకుంటూ ఉంటాం. అయోడిన్ లభ్యమయ్యే వనరులివే... సముద్రపు చేపలూ (సీఫుడ్), సముద్రానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీనదాలు (గ్లేషియర్స్) ఉన్నచోట నివసించేవారు సముద్రపు ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందుకంటే అక్కడ ప్రవహించే హిమనీనదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకుపోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. కొత్త కణాలకు అవసరమైన కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం వల్ల నా అయోడిన్ ఆకలి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒరిజినల్‌గా ఉండే 20 గ్రాముల నుంచి నా బరువు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి అయోడిన్లోపం వల్ల వచ్చే అయోడిన్ డిఫెషియెంట్ గాయిటర్ / నాన్ టాక్సిక్ గాయిటర్ సమస్య వల్ల కూడా నా పరిమాణం పెరగవచ్చు. కానీ సాధారణంగా చాలా సందర్భాల్లో అది అంత ప్రమాదకరం కాదు. అయితే అలా పెరిగే సమయాల్లో అది వాయునాళాన్ని నొక్కేస్తూ పోతే మాత్రం ప్రమాదమే. అదీ అదృష్టం... అదృష్టవశాత్తు మిగతా ఎండోక్రైన్ గ్రంథులతో పోలిస్తే నాకు వచ్చే సమస్యలను తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోసారి నేను మరీ చురుగ్గా పనిచేస్తుంటే ఆనంద్‌కు చికిత్స చేసే డాక్టర్లు రేడియోయాక్టివ్ అయోడిన్‌తో చికిత్స చేయవచ్చు. ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ సాధారణ అయోడిన్లాగే నన్ను చేరుతుంది... ఆ తర్వాత నాపై ఉక్కుపాదం మోపుతుంది. నా అతి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అయితే కొద్ది వారాల్లోనే తర్వాత ఆ అయోడిన్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ పదార్థాలు తగ్గిపోతాయి. అందుకే నేను ఓవర్‌యాక్షన్ చేసే సమయంలో చాలా మంది ఈ చికిత్స మార్గాన్నే అనుసరిస్తారు. అయితే కొంతమందిలో మాత్రం నన్ను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించాల్సి రావచ్చు. అలాంటప్పుడు నేను స్రవించే హార్మోన్‌ను భర్తీ చేయడానికి జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు. నా పనితీరులో మార్పు వచ్చిందని డాక్టర్లు గ్రహించడం ఎలా? నేను వ్యవహరించే తీరులో మార్పులు వచ్చినప్పుడు ఆనంద్ వేళ్లు వణుకుతుండవచ్చు. నిద్రలోనూ, ఆకలి విషయంలోనూ మార్పులు రావచ్చు. బరువు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆనంద్ ముఖం ఉబ్బవచ్చు. అతడి కదలికలు మందగించవచ్చు. అప్పుడు కొన్ని రక్త పరీక్షలు చేస్తే నా పనితీరులో వచ్చే మార్పులు తెలుస్తాయి. దాంతో అతడికి అవసరమైన చికిత్స అందించవచ్చు. పెరిగినా తగ్గినా ప్రమాదమే.. నేను కాస్త మందకొడిగా పనిచేస్తున్నాననే అంశానికి కొన్ని లక్షణాలు / కొండగుర్తులున్నాయి. అది వారసత్వంగా కావచ్చు లేదా కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. అలాంటి సందర్భాల్లో నా హార్మోన్ల ఉత్పాదన తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. దానికి కారణాలు తెలియదు. ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి నుంచి నన్ను ప్రేరేపించే హార్మోన్లు తగ్గడమూ దీనికి కారణం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా నేను పనిచేస్తుంటా. నాకు అందాల్సిన అయోడిన్ తగ్గినప్పుడు అమాంతం ఎలా పెరుగుతానో, ఇలాంటప్పుడూ ఒక్కోసారి అలా పెరగవచ్చు. ఇలాంటప్పుడు నేను టాక్సిక్ గాయిటర్‌గా పెరుగుతాను. విచిత్రంగా ఒక్కోసారి నాకు అందే అయోడిన్ పాళ్లు పెరిగిపోయినా ఈ పరిస్థితి వస్తుంది లేదా ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి మీద కణితి పెరిగినప్పుడూ ఈ దుస్థితి దాపురిస్తుంది. దాంతో థైరోట్రోపిన్ పాళ్లు పెరిగిపోతాయి. నాకు వచ్చే క్యాన్సర్ కూడా ఒక్కోసారి ఆనంద్‌కు అనారోగ్యం తెస్తుంది. ఇలాంటప్పుడు ఆ అనారోగ్యం నాకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కలకూ పాకుతుంది. ఇలాంటి సందర్భాల్లో సర్జన్స్ శస్త్రచికిత్స చేసి, నన్ను తొలగిస్తారు. కొన్ని సార్లు నన్ను నిద్రపుచ్చడానికో లేదా నా పరిమాణం కుంచించుకుపోయేలా చేయడానికో మందులు ఇస్తారు. ఒత్తిడి ఎక్కువైతే ఇవీ దుష్ర్పభావాలు... నేను నరాలపై ప్రభావం చూపే గ్రంథినని, నా పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతాయని మీకిప్పటికి తెలిసే ఉంటుంది. ఇది మీకు తెలిస్తే జీవితంలో ఒత్తిడి వల్ల నాలోని హార్మోన్లు ఎక్కువగా ఎందుకు స్రవిస్తాయో మీకిప్పుడు తేలికగా అర్థమవుతుంది. జీవితాల్లో కనిపించే వ్యథ, కుటుంబ సభ్యులు దూరం కావడం వంటి అమితమైన బాధ, వ్యాపారంలో నష్టం, సీరియస్ యాక్సిడెంట్, వైవాహిక జీవితం వల్ల కలిగే మనోవేదన... ఇలాంటి తీవ్రమైన విచారం కలిగించే అంశాలన్నీ హైపోథెలామస్ను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. అది ఎక్కువగా పనిచేస్తే, దాని స్రావాలతో నేనూ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో నా స్రావాలు నియంత్రణ లేకుండా పోతే... అది ఆనంద్‌ను అస్థిమితానికి గురిచేస్తుంది. అది చాలు ఆనంద్‌ను మానసిక రోగిగా మార్చేయడానికి. డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
పొగ మానండి... ప్రయోజనాలు పొందండి
యాంటీ టుబాకో డే స్పెషల్ పొగతాగే అలవాటు మానేసిన కొద్ది గంటల నుంచే దాని వల్ల కలిగే ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. అవి ఇంచుమించుగా ఇలా... ⇒వారంలో... వాసనలు తెలియడం, నాలుకకు రుచులు తెలియడం మరింత పెరుగుతుంది. ⇒మూడు నెలల్లో ... ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం పెరుగుతుంది. ⇒ ఎనిమిది గంటల్లోనే... పొగతాగడం వదిలేసిన ఎనిమిది గంటల్లోనే వారి శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ⇒ఏడాదిలో... జేబుకు కత్తెర పడటం ఆగుతుంది. సంవత్సర కాలంలోనే అతడికి దాదాపు రూ. 50,000 వరకు ఆదా అవుతుంది. ⇒ ఐదు రోజుల్లో... ఒంటిలోని నికోటిన్ తగ్గి శరీరం పరిశుభ్రం అవుతుంది. ⇒పన్నెండు నెలల్లో... గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. ⇒పన్నెండు వారాల్లో ... ఊపిరితిత్తులు తమను తమంతట తామే పరిశుభ్రం చేసుకుంటాయి. ⇒ఐదేళ్లలో... స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. డాక్టర్ ఎస్.ఏ. రఫీ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ సిగరెట్లో ఎన్నెన్ని విషాలో...! ⇒బ్యాటరీలో ఉండే క్యాడ్మియం అనే హానికర పదార్ధం ⇒కొవ్వొత్తిలోని వ్యాక్స్ ⇒పారిశ్రామిక వ్యర్థాల్లోని టాల్విన్ అనే విషపదార్థం ⇒క్రిమిసంహారక మందుల్లో ఉండే విషం ⇒టాయిలెట్ క్లీనర్స్‌లో ఉండే రసాయనాలు ⇒వంటగ్యాస్ లేదా లైటర్స్లో ఉండే మండే పదార్ధమైన బ్యూటేన్ ⇒కుళ్లే పదార్ధాలలాంటి దుర్వాసననే వెలువరించే మిథేన్ వాయువు ⇒ఆర్సినిక్ విషం ⇒కార్బన్ మోనాక్సైడ్ ⇒ఇంధనాల్లో ఉండే వ్యర్థాలు ఆల్కహాల్ అలవాటు, ఆత్మహత్యలు, ఎయిడ్స్, నిషేధిత మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వల్ల సంభవించే మరణాలకంటే పొగతాగే అలవాటు వల్ల కలిగే మరణాలు చాలా ఎక్కువ. పొగ తాగడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై దుష్ర్పభావం పడుతుంది. ఈ దురలవాటు వల్ల ఊపిరితిత్తులకు సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు వస్తే... ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించే సంపాదన కంటే జబ్బుకు గురైతే తన వ్యాధులను నయం చేసుకునేందుకు అతడు చేయాల్సిన ఖర్చు అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం మేలు. -
ఆపరేషన్‌కు అరగంట ముందు...
ఆగిన సాయి గుండె జీవన్‌దాన్‌కు ఉపయోగపడని అవయవాలు అంతులేని శోకం తన బిడ్డ మరణించినా నలుగురుబిడ్డలకు బతుకు నివ్వాలనుకున్న ఆ పేద తల్లికి దేవుడు ఆ తృప్తినీ మిగల్చలేదు. మరో అరగంటలో తన బిడ్డ శరీర భాగాలతో నలుగురికి ఆయుష్షు లభిస్తుందని భావించిన ఆ తల్లికి అంతులేని శోకమే మిగిలింది. విడవలూరు కామాక్షి సెంటర్‌కు చెందిన వెంకటరమణమ్మకు విధి తీరని దుఃఖాన్ని కలిగించింది. సాక్షి ప్రతినిధి - నెల్లూరు: విడవలూరులో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో గంగపట్నం రవీంద్ర (35), అతని కొడుకు సాయి (8) తీవ్రంగా గాయపడ్డారు. భర్త, బిడ్డను బతికించుకోవడానికి వెంకటరమణమ్మ, వారి బంధువులు ఎంతో ఆరాట పడ్డారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి నారాయణ వైద్య కళాశాలకు వీరిని తరలించారు. తన భర్త, బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ ఇల్లాలు కోటి దేవుళ్లను వేడుకుంది. అయితే బిడ్డ బతికే పరిస్థితి లేదనే విషయం మంగళవారం సాయంత్రం డాక్టర్లు బంధువుల ద్వారా వెంకటరమణమ్మకు తెలియజేశారు. బిడ్డ ఎలాగూ చనిపోతాడని, అతని శరీరంలోని గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు తీసి నలుగురు బిడ్డలకు ఆయుష్షు పోద్దామని డాక్టర్లు ఆ తల్లిని కోరారు. సాయి బతకడనే విషయం చెప్పడంతో కుప్పకూలిన ఆమెను బంధువులు అవయవదానం చేయడానికి అంగీకరింప చేశారు. తన శోకం నలుగురు తల్లులకు ఆనందం ఇస్తుందనే ఉదారతతో పుట్టెడు దుఃఖంలో కూడా కొడుకు అవయవదానానికి ఆ తల్లి అంగీకరించింది. చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రిలో ఊపిరి తిత్తులు, గుండె కోసం ఎదురు చూస్తున్న చిన్నారులకు, విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో లివర్ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న మూడేళ్ల చిన్నారికి సాయి లివర్‌ను పంపడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. నారాయణ వైద్య కళాశాలలో కిడ్నీల దాత కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు కిడ్నీలు దానం ఇవ్వడానికి వైద్యులు సంకల్పించారు. దీంతో పాటు నెల్లూరు మోడరన్ ఐకేర్ సెంటర్‌కు సాయి నేత్రాలు పంపడానికి సంకల్పించారు. జీవన్‌దాన్ సంస్థ సహకారంతో ఈ అవయవాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆయా ఆసుపత్రులకు నుంచి వైద్య బృందాలు నారాయణ వైద్య కళాశాలకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 1.30 గంటలకు ఆపరేషన్ చేసి సాయి శరీర భాగాలను వేరు చేసి గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాలకు చేరవేయడానికి అనువుగా ట్రాఫిక్‌ను ఆపివేయడానికి పోలీసుల సహకారం కూడా కోరారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న సమయంలో కృత్రిమ శ్వాస మీద ఉన్న సాయి గుండె రాత్రి 1 గంటకు పని చేయడం ఆగిపోయింది. దీంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సంతృప్తీ మిగల్లేదు బిడ్డ తనకు దూరమైనా అతని శరీర భాగాలు నలుగురికి జీవం ఇస్తాయని ఆశించిన సాయి తల్లి వెంకటరమణమ్మకు ఆ సంతృప్తి కూడా మిగల్లేదు. బిడ్డ గుండె ఆగిపోయిందని, శరీర భాగాలు తీయాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి శోకాన్ని ఆపడం బంధువుల తరం కాలేదు. ఒక వైపు భర్త ప్రాణాపాయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు బిడ్డ చనిపోయాడు. ఈ పరిస్థితి కూలీ నాలీ చేసుకుని బతికే ఆ కుటుంబానికే ఎందుకు వచ్చిందని బంధువులు సైతం కంట తడిపెట్టారు. బుధవారం ఉదయం బిడ్డ దేహాన్ని తీసుకుని బంధువులు, తల్లి విడవలూరు వెళ్లారు. ఆ బిడ్డకు అంత్యక్రియలు పూర్తి చేయించారు. మద్యం మత్తే ఆ కుటుంబానికి శాపం వళ్లు తెలియకుండా మద్యం సేవించి ద్విచక్ర వాహనం మీద ఆదివారం సాయంత్రం విడవలూరు నుంచి నెల్లూరు వైపు ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చిన కొడవలూరు మండలం వేగూరుకు చెందిన షేక్ దస్తగిరి రోడ్డుపక్కనే ఉన్న రవీంద్ర, అతని కొడుకు సాయిను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో దస్తగిరి, అతని వెనుక కూర్చుని ఉన్న మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. చావు బతుకుల్లోకి వెళ్లిన తండ్రీ, కొడుకులు ఆసుపత్రికి చేరారు. ఏడేళ్లు నిండకుండానే చిన్నారి సాయి బతుకు చాలించాడు. తండ్రి రవీంద్ర విషమ పరిస్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. -
నేను మీ కాలేయం
ఆనంద్ ప్రతిరోజూ అద్దంలోకి ముఖం పెట్టి పళ్లు పరీక్షించుకుంటాడు. తల దువ్వుకుంటాడు. జుట్టు సర్దుకుంటాడు. కనిపించే వీటిని పక్కనబెట్టి అప్పుడప్పుడూ కనిపించని లోపలి అవయవాలైన గుండె, కిడ్నీల గురించి ఆలోచిస్తాడు. నేనైతే ఆనంద్ కుడిపైపు ఛాతీ పైభాగపు ఎముకల కింద గుట్టుగా ఉంటూ, పొట్టకు అవసరమైన పనులు ప్రధానంగా చేస్తుంటా. కాళ్లూ, చేతులు కదపాలన్నా, ఆట ఆడాలన్నా, గోలు కొట్టాలన్నా నేనే. కండరంతో పరుగుతీయాలన్నా, తిన్నది అరగదీయాలన్నా నేనే చేయాలి.కానీ నా ఉనికే తెలియదు. అతడిలో నేను ఉన్నాననే ఆలోచనే అతడికి రాదు. కానీ అతడి ఒంటిలోపలి భాగాల్లో అతి పెద్ద అవయవాన్ని నేనే. దాదాపు కిలోన్నర తూగుతాను. ఆ నేనే... కాలేయం. ఇంగ్లిష్‌లో లివర్. ఉనికిలో ఎంత సెలైంటో పనిలో అంత వైబ్రెంట్! జీవక్రియల్లో ఎక్స్పర్ట్. కాలం పరంగా కాన్స్టాంట్. పని అందుకోవడంలో ఇన్స్టాంట్! ఇంతెందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంద్ ఏ పని చేసినా అందులో నా వాటా ఉంటుంది. పని మానేస్తే పైకే...! శరీరంలో అత్యంత సంక్లిష్టమైన భాగాలు అని చెప్పుకునే పరిస్థితి వస్తే... నన్ను చూసి ఆనంద్ గుండె, ఊపిరితిత్తులు కాస్త సిగ్గుపడాల్సిందే. ఓ జాబితాగా రాయాల్సి వస్తే నేను చేసే పనులు దాదాపు ఐదొందలకు పైమాటే. నేను గానీ పని మానేస్తే ఆనంద్ పని అంతేసంగతులు. నాకు ఏడు సెం.మీ. చాలు నేను చేసే పనులన్నింటినీ బయట చెయ్యాలంటే ఎకరాల కొద్దీ స్థలం కావాలి. అందులో ఒక పే...ద్ధ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి. నేను చేసే అత్యంత సరళమైన పనికోసమే ఇది కావాలి. ఇక సంక్లిష్టమైన పనులకు ఎంత కావాలో మీరే ఊహించుకోవచ్చు. అంతెందుకు... నేను చేసే అంత్యంత సంక్లిష్టమైన పనులు ఈ ప్రపంచంలోని ఏ కెమికల్ ఫ్యాక్టరీ కూడా చేయలేదు. నేను దాదాపు వెయ్యికి పైగా ఎంజైములను ఉత్పత్తి చేస్తాను. అవి దేహంలోని రసాయన చర్యలకు తోడ్పడతాయి. ఆ చర్యల ద్వారా ఒక రకం పదార్థం మరో రకంగా మారేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు ఆనంద్ వేలు పొరబాటున తెగిందనుకోండి. నేను రంగంలోకి దిగకపోతే వేలంతా రక్తసిక్తం. ఆనంద్‌కు మరణం తథ్యం. అప్పుడు నేను రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ పుట్టిస్తా. రక్తాన్ని గడ్డకట్టిస్తా. ఆనంద్ ప్రాణాలకు నా యాంటీబాడీస్ అడ్డేస్తా. అలాంటి యాంటీబాడీస్‌ను మరెన్నో పుట్టించి ఎన్నోన్నో అనర్థాలు రాకుండా కాపాడుతుంటా. జీర్ణక్రియ... నా పనితీరుకు నిదర్శనక్రియ ఆనంద్‌కు మాంసాహారం అంటే ఇష్టం. అందులో ఉండేవన్నీ ప్రోటీన్స్. జీర్ణమయ్యే క్రమంలో అవి ముక్కలవుతూ అమైనోయాసిడ్స్‌గా రూపొందుతాయి. ఆ పదార్థం యధాతథంగా రక్తంలో కలిస్తే మాత్రం ఆనంద్ అంతే సంగతులు. ఎందుకంటే అది సైనైడ్ అంతటి విషపూరితం. శత్రువుల్లాంటి ఆ అమైనో యాసిడ్స్‌ను నేను మేని మిత్రులుగా మార్చేస్తా. వాటి నైజాన్ని హ్యూమనైజం చేసేస్తా. ఇక నేను చేసే మరోపని ఏమిటంటే... కాస్త ఆకుపచ్చగానూ, మరికాస్త పసుపపచ్చగానూ ఉండే, చాలా చేదైన బైల్‌ను ఉత్పత్తి చేస్తా. నాలో ఉత్పత్తి అయిన ఈ జీర్ణరసం మొదట గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి మరింత గాఢమవుతుంది. కడుపు, పేగులకు మధ్య ఉండే చిన్న సంచిలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిన్నపేగుల్లోని జారిపోతుంది. మనం తిన్న ఆహారపు ముద్దల్ని అక్కడ జీర్ణం చేస్తుందది. ఈలోపు ఆహారనాళంలోని కొవ్వులను కడిగేస్తుందీ బైల్‌జ్యూస్. ఇందులోనూ రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బిలురుబిన్ (ఇది ఎరుపు రంగులోని బైల్). రెండోది బైలివెర్డిన్ (ఇదేమో ఆకుపచ్చ బైల్). అప్పుడప్పుడూ ఈ రంగు పదార్థాల్లో ఏవైనా రక్తంలో కలిస్తే కామెర్ల రూపంలో బయటకు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించాయంటే... నా పనితీరులో ఏదో తప్పు జరుగుతుందని గుర్తించాలి. ఈ తప్పు మూడు రకాలుగా జరగవచ్చు. మొదటిది... మలేరియా సూక్ష్మజీవి ఒంట్లోకి ప్రవేశించడం లేదా ఎర్రరక్తకణాలు అతిగా నాశనమవుతూ రక్తహీనత వచ్చి ఉండవచ్చు. అప్పుడు... నేను తొలగించే వేగం కంటే నాశనమయ్యే ఎర్రరక్తకణాల వ్యర్థాలు ఎక్కువగా ఉంటే అవి రక్తంలోకి చేరుకుని కామెర్ల రూపంలో కనిపించవచ్చు. రెండోది... గాల్‌బ్లాడర్ నుంచి పేగులకు వచ్చే మార్గంలో ఏదైనా అడ్డుపడటం వల్ల బైల్ వెనక్కు ప్రవహించి, అది రక్తంలో కలిసి కామెర్లుగా ప్రయుక్తం కావచ్చు లేదా బైల్ ప్రవాహ మార్గాల్లో కొవ్వు అడ్డం పడటం వల్ల కూడా కామెర్లు కనిపించవచ్చు. ఇక మూడోది... నా కణాలకు.. అంటే కాలేయ కణాలకు హెపటైటిస్ లేదా ఏదైనా ఇతర వ్యాధులు సోకి వాటికి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అదే జరిగితే నాకూ ఇబ్బంది. ఆనంద్‌కూ ప్రమాదం. అతి ఉంటే మితి చేస్తా... అతడి శరీరంలో అతిగా ఉండకూడని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఉండాల్సిన పరిమాణంలోకి మార్చేస్తా. అతి పరిమితులను తెలుసుకొని... అదనాలను వదిలిస్తా. ఒంట్లోని విషపదార్థాలను యూరియాగా మార్చేస్తా. మూత్రపిండాల్లోకి పంపేస్తా. ఆనంద్‌లోని అడ్రినల్ గ్రంథులు... శరీరంలో లవణాలను ఉండేలా చూస్తాయి. ఉండాల్సిన వాటికంటే అవి అదనంగా ఉంటే ఆనంద్ ఉబ్బిపోతాడు. అందుకే నేను వాటిని నాశనం చేస్తా. ఇల్లూడ్చినట్టే... నేను ఒళ్లూడుస్తుంటా... ఆనంద్ తన ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకున్నట్టే... అతడిలోని వ్యర్థాలను ఊడ్చేస్తుంటాను నేను. ఎప్పటికప్పుడు కొత్తవి పుడుతుండటంతో ప్రతి సెకండ్‌కూ ఆనంద్ ఒంట్లో కోటి ఎర్రరక్తకణాలు చనిపోతూ ఉంటాయి. వాటిని భస్మం చేసే బాధ్యత నాదే. ఆ భస్మాన్ని తిరిగి ఉపయోగించి మళ్లీ కొత్త రక్తకణాలను పుట్టించే పనికూడా నాదే. పెరిగే కొవ్వును చూసుకోవాలి... ఆనంద్ వయసు పెరుగుతోంది. ఈ వయసులో కొవ్వు కూడా పెరుగుతుంటుంది. ఇది నాలోనూ జరుగుతుంటుంది. నాలో నార్మల్‌గా పనిచేసే కణాల స్థానంలో కొవ్వు పేరుకుంటూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది కొన్నిసార్లు రక్తప్రవాహానికి అడ్డురావచ్చు. కొన్ని అంతర్గత అవయవాలను దెబ్బతీయవచ్చు. అప్పుడు నా ఆకృతి, నా స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. నేను జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. ఇది కొన్నిసార్లు ఆర్సెనిక్ వంటి విష ప్రభావాల వల్ల లేదా కొన్ని వ్యాధుల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ వల్ల (అంటే రోజుకు 350 ఎం.ఎల్. కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల) కూడా సిర్రోసిస్ రావచ్చు. సిర్రోసిస్ లక్షణాలివే... ఆనంద్ ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉన్నా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు నా పనితీరును తెలుసుకోడానికి మంచి మంచి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నాలోకి బ్రోమ్సల్ఫాలియేన్ అనే ఒక రంగు పదార్థాన్ని (డై)ని లోపలికి పంపిస్తారు. నా పనితీరు బాగుంటే 45 నిమిషాల్లో అంతా బయటకు పంపేస్తాను. ఇదిగాక బైలురుబిన్ వంటి పిగ్మెంట్ మోతాదులు రక్తంలో ఎంత ఉన్నాయో పరీక్ష చేసి, నాలోని అనారోగ్యాన్ని కనుగొంటారు. ఆనంద్ ఆ పరిస్థితికి రాలేదు. కానీ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలావరకు ఆహార నియమాలు పాటిస్తూ, ప్రోటీన్లు తీసుకుంటూ, మామూలు మందులతోనే మళ్లీ నన్ను నార్మల్ చేయడానికి అవకాశం ఉందిప్పుడు. నన్ను కాపాడుకోవడం ఎలా? నన్ను కాపాడుకోవడం చాలా సులువు. ఆనంద్ బరువు పెరుగుతుంటే... నేనూ బరువు పెరుగుతున్నానన్నమాటే. ఆ పెరిగే బరువును అదుపు చేసుకోవాలి. ఆల్కహాల్‌కు పూర్తిగా దూరం కావాలి. తగినన్ని విటమిన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బి’ విటమిన్ తీసుకోవడం ప్రధానం. ఇన్పుట్స్: డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ ఫుడ్డును ఫ్యూయల్‌గా మార్చేది నేనే... ఆనంద్ గోల్ఫ్ ఆడాలన్నా, కాలిబంతి ఆటలో గోల్ కొట్టాలన్నా... ఆ కండరాలకు అవసరమైన శక్తిని ఇవ్వడానికి తోడ్పడేదీ నేనే. తిన్న పదార్థాలు గ్లూకోజ్‌గా మారతాయి. తగినంత శక్తి కోసం చక్కెరలు మండుతాయి. కండరం కదులుతుంది. ఆటకు అవసరమైన ఎనర్జీ అందుతుంది. ఈ ప్రక్రియలో కండరం అలసిపోతే లాక్టిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంది. అ లాక్టిక్ యాసిడ్ వృథాపోకుండా మళ్లీ దాన్ని గ్లైకోజెన్‌గా మార్చి నిల్వ ఉంచుతాను నేను. ఆనంద్ పనిచేస్తున్నప్పుడు మళ్లీ ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి అతడికి అవసరమైన శక్తిని అందిస్తాను. నయాపైసా కూడా వృథాగా ఖర్చుకాకుండా ఆపే ఇల్లాలిలా ఒంటిలోని రేషన్‌ను చక్కగా నిత్యం అందేలా మేనేజ్ చేస్తుంటాను. శక్తి అపారం.. అదే శాపం-అదే వరం! నాలోని శక్తి అపారం. నాలోని దాదాపు 85 శాతం కణాలు పూర్తిగా నాశనమైనా నా పనితీరులో మార్పురాదు. నా అద్భుత శక్తే నాకు అభిశాపమవుతుంది. అంటే కేవలం నా సామర్థ్యం 15 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు గానీ లక్షణాలు బయటకు కనిపించవు. దాంతో ఆనంద్‌కు నా హెచ్చరికలు వినిపించే వేళకు లేదా నా పని తగ్గడం వల్ల కలిగే లక్షణాలు కనిపించే వేళకు జరగాల్సిన నష్టం జరగవచ్చు. ఇక ఈ అంశమే కొన్ని సార్లు వరం కూడా. మిగతా ఏ అవయవానికీ లేని అద్భుత శక్తి నాకు మరొకటి ఉంది. నాలో 60 శాతం భాగాన్ని తొలగించినా నేను మళ్లీ మునుపటి పరిమాణానికి పెరుగుతాను. విషాల పాలిటి అడ్డుగోడ... . విషాల నీడ కూడా ఆనంద్ ఒంట్లో పడకుండా చూసే అడ్డుగోడను నేను. రోజూ సిగరెట్ తాగుతూ నికోటిన్ అనీ, కాఫీ తాగుతూ కెఫిన్నీ, తింటూ ఇంకొన్ని పాయిజన్లను ఒంట్లోకి యధేచ్ఛగా వదిలేస్తుంటాడు ఆనంద్. అవి గుండెకు చేరకుండా నేను గోడలా అడ్డు ఉంటా. ఆనంద్ మద్యం తాగుతుంటాడు. కాక్టెయిల్స్ తీసుకుంటూ కబుర్లాడుతుంటాడు. అతడు అలా పరమానందం పొందుతుంటే అందులోని ప్రమాద కారకాలపై అప్పటికప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిహరిస్తుంటాను. ఆల్కహాల్ ప్రవేశించగానే దాన్ని నీళ్లుగా చేసి, మూత్రంలా మార్చేస్తా. కార్బన్డైఆక్సైడ్లా మార్చి ఊపిరి తీసుకునే సమయంలో బయటకు పోయేలాచూస్తా. ఇలా అన్ని విషాలను విరిచేస్తా. అన్ని మోతాదులనూ సరిచేస్తా. గుండెకు సేఫ్టీ వాల్వ్ గుండెకు ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తా. నా పైనుంచే ఆనంద్ గుండెలోకి హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం వెళ్తుంటుంది. అలా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో అదొక బలమైన అలలా వెళుతూ ఉంటుంది. ఆ రక్త ప్రవాహం నాలోంచే జరుగుతుంటుంది. హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం కనీసం ఆరు నుంచి పది సెకండ్ల వ్యవధి పాటు నాలోంచి వెళ్తుంది. ఆ టైమ్ నాకు చాలు. తక్షణమే తరంగవేగాన్ని తగ్గిస్తా. నెత్తురునంతా నేను మెత్తటి స్పాంజ్‌లా అద్దేస్తా. అలా నాలోకి ఇంకేలా చేస్తా. నా ఎగ్జిట్ వెసెల్స్ నుంచి కొంత కొంత రక్తాన్నే పంపిస్తా. అలా గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా చూస్తా. కాసేపు ఆ రక్తభారాన్ని నేనే మోస్తా. గుండెకు ఎంత వస్తే సౌకర్యమో అంతే రక్తాన్ని సరఫరా చేస్తా. -
బీట్రూట్తో ఊపిరి
పరిపరి శోధన ఊపిరితిత్తులకు బీట్రూట్తో ఎనలేని మేలు కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ప్రతిరోజూ గ్లాసుడు బీట్రూట్ రసం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని బ్రిటన్‌లోని టన్‌బ్రిడ్జ్ జాతీయ ఆరోగ్య సేవల ట్రస్టుకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సయ్యద్ హుస్సేన్ చెబుతున్నారు. బీట్రూట్ రసంలోని విటమిన్లు రక్తానికి తగినంత ఆక్సిజన్ అందేలా చేస్తాయని ఆయన చెబుతున్నారు. బీట్రూట్ రసం తీసుకోవడం ద్వారా తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురయ్యేవారు తేలికగా ఊపిరి తీసుకోవడమే కాకుండా, త్వరగా కోలుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. -
బేరియాట్రిక్ సర్జరీతో...
మందులు వాడకుండానే బీపీ, షుగర్ అదుపులోకి వస్తాయా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా విపరీతంగా తుమ్ములు, జలుబు, ఆయాసంతో సరిగా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆస్తమా అయి ఉండవచ్చన్నారు. ఈ వయసు వారిలో కూడా ఆస్తమా వస్తుందా? ఒకవేళ ఆమెకు ఆస్తమానే అయితే దానికి హోమియోలో మందులున్నాయా? దయచేసి సలహా చెప్పగలరు. - డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యకే ఆస్తమా అని పేరు. ఊపిరితిత్తులలో గాలి పోయే మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. కారణాలు: చల్లటి వాతావరణం, దుమ్ము, ధూళి, పొగ, ఫంగస్, వాతావరణ కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటు వాసనలు. ఎలా వస్తుందంటే..? ఆస్తమా వ్యాధి ప్రధానంగా అలర్జీకి సంబంధించింది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. కొంతమందిలో వ్యాధినిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీలు వాటితో పోరాటం చేసి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లోకి శ్లేష్మం చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. లక్షణాలు: ఎడతెరపిలేని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, జ్వరం. జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన. నిర్ధారణ: వంశానుగత చరిత్ర, అలర్జీకి సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, స్పైరోమెట్రీ, ఛాతీ ఎక్స్‌రే. జాగ్రత్తలు: రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి, ఒంటికి సరిపడని ఆహారానికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణ ంలో తిరగకుండా ఉండటం. పాజిటివ్ హోమియో చికిత్స: ఆస్తమాకు హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి, శరీర తత్వాన్ని బట్టి నిపుణులైన వైద్యుని ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు వెంటనే మీ అమ్మగారిని మంచి హోమియోవైద్యుని దగ్గరకు తీసుకెళ్లండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. 110 కిలోల బరువు ఉంటాను. నాకు బీపీ, షుగర్ అదుపులోకి రావడం లేదు. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చని నా స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే, ఆ శస్త్రచికిత్స తర్వాత మందులు వాడకుండానే బీపీ, షుగర్లు అదుపులోకి వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు. - కె.ఎల్.ఎన్. రాజు, వరంగల్ మీరు మీ వయసు, బరువు తెలిపారు గానీ... మీ ఎత్తు తెలపలేదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే ప్రమాణాలను బట్టి చూసినప్పుడు, మీ బరువు వల్ల మీకు హాని జరిగే అవకాశాలు ఎక్కువని తేలితే బేరియాట్రిక్ సర్జరీ నిర్వహిస్తాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే కడుపుపై పెద్ద పెద్ద కోతలు పెట్టి ఆపరేషన్ చేస్తారని మీరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అత్యాధునిక కీహోల్ విధానంలో తక్కువ కోతతో బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించవచ్చు. ఈ విధానం చాలా సురక్షితం. కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేస్తే, రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత మీరు బరువు తగ్గడంతో పాటు, మీ బీపీ, షుగర్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధుమేహం పూర్తిగా అదుపులోకి రాకపోయినా మందులు వాడటం చాలా వరకు తగ్గుతుంది. మీ బీఎంఐతో పాటు ఇతర ఆరోగ్యపరిస్థితులను బట్టి మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమా, కాదా అని వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మీకు బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అయితే అత్యాధునిక సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. ఒకవేళ మోకాలి మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? తగిన సలహా ఇవ్వండి. - మంజరి, వనపర్తి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తారు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. మోకాలి మార్పిడి సర్జరీకి సుమారు 1.5 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు ఖర్చవుతుంది. మోకాలి కీలు మార్పిడి కోసం ఉపయోగించే మెటీరియల్ మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. నా వయసు 29 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - సోమరాజు, రాజోలు మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. -
ఊపిరి బిక్కిరి
కాలుష్యం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది... ఊపిరితిత్తుల్లో ఊపిరాడకుండా చేస్తోంది. రోజుకు 22 వేల సార్లు ఊపిరి తీసుకుంటాం... ప్రతిశ్వాసా విషశ్వాసే. ఏం చేయగలం? ఎంతసేపని ఊపిరి బిగపట్టగలం? కొన్ని చర్యలు మన పరిధిలో లేవు. కొన్ని జాగ్రత్తలు మాత్రం మన చేతుల్లోనే ఉన్నాయి.మీ ప్రశ్నలకు ఈ కథనమే కొన్ని సమాధానాలిస్తుంది. స్వేచ్ఛగా గాలి పీల్చుకోండి. సంతోషంగా జీవించండి. ఊపిరాడితేనే మనం బతకగలం. ఊపిరి స్వచ్ఛంగా ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఉండగలం. అయితే, ఆధునికత మనం పీల్చుకునే గాలిలోని స్వచ్ఛతను హరించేస్తోంది. దుమ్మూ ధూళీ కలగలసిన గాలి మన ఊపిరితిత్తుల్లోకి చేరి, ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు గాలిని మరింతగా కలుషితం చేసి పారేస్తుంటే, స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతోంది. నగరాలే కాదు, ఒక మోస్తరు పట్టణాలు, పల్లెలు కూడా వాయుకాలుష్యం బారిన పడుతున్నాయి. కలుషితమైన గాలిని పీల్చడం వల్లనే పసిపిల్లలు దగ్గు జలుబులు మాత్రమే కాదు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మితిమీరిన కాలుష్యానికి గురైన వారు ఊపిరితిత్తుల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకూ బలవుతున్నారు. సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతీ యువకుల్లో సైతం చాలామంది శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నారంటే, వయసు మళ్లిన వృద్ధుల పరిస్థితి చెప్పేదేముంది? కాలుష్యాల బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సెల్ఫ్‌డిఫెన్స్ గాలి ద్వారా చేరే కాలుష్యాలను అరికట్టేందుకు మన ఊపిరితిత్తులు సెల్ఫ్‌డిఫెన్స్ చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు తుమ్ము కూడా ఒక ఆత్మరక్షణ చర్యే. ఏదైనా సరిపడని పదార్థాలు గాలిలో కలసి లోపలికి చేరితే, ఊపిరితిత్తులు వెంటనే వాటిని తమ్ముల ద్వారా బయటకు పంపిస్తాయి. ఇంట్లో దుమ్ము దులిపేటప్పుడు తుమ్ములు రావడం అందరికీ అనుభవమే. అంతేకాదు, ఊపిరితిత్తులు ఉత్పత్తి చేసే మ్యూకస్ అనుక్షణం ఎగువకు ప్రయాణిస్తూ, కాలుష్యాలను ముక్కు నుంచి వెలుపలకు పంపేస్తుంది. కాలుష్యాలు ఎక్కువగా ముక్కులోకి చేరితే, ఊపిరితిత్తులు కూడా మ్యూకస్‌ను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తాయి. ఇదే కఫంగా వెలువడి, కాలుష్యాలను బయటకు పోయేలా చేస్తుంది. పొల్యూషన్‌తో పరేషాన్ వాతావరణంలో ఉండే 21 శాతం ఆక్సిజన్‌లో మన ఊపిరితిత్తులు తీసుకునేది కేవలం 5 శాతమే. ఈ ఆక్సిజన్‌తో పాటే వచ్చే కాలుష్యాలను ఊపిరితిత్తుల్లోని సెల్ఫ్‌డిఫెన్స్ మెకానిజం శాయశక్తులా వెలుపలకు పంపేస్తూ ఉంటుంది. అయితే, గాలిలో ప్రతినిత్యం చేరే అత్యంత సూక్ష్మ ధూళికణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికల్స్), ఇతర పదార్థాలు కూడా ఊపిరి తిత్తుల్లోకి చేరుతుంటాయి. ఇవే పలు వ్యాధులకు కారణమవుతుంటాయి. ఇలాంటి కాలుష్యాలు కొందరిలో ఆస్తమా (ఉబ్బసం) కలిగించవచ్చు. మరికొందరిలో నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు.నగరాల్లోనే కాదు, పల్లెల్లోనూ స్థానిక కారణాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడవచ్చు. ఒక్క నిమోనియాలోనే కాలుష్యాన్ని బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు రైతులు ధాన్యాన్ని నిల్వచేసే చోట గింజలపై ఉండే తేమ కారణంగా థర్మోయాక్టినోమైసిటిన్ అనే ఫంగస్ ఏర్పడి, ఒకరకం నిమోనియా వస్తుంది. కోళ్లు, బాతుల వంటి వాటి పెంపకం చేపట్టే చోట్ల కూడా, వాటి మీదుగా వచ్చే గాలిలో క్లెమీడియా అనే సూక్ష్మజీవులు కలవడం వల్ల మరో రకం నిమోనియా వస్తుంది. గొర్రెల మంద మీదుగా ఒక రకమైన వాసనతో వచ్చే గాలిలో కాక్సియల్లా అనే సూక్ష్మజీవులు కలవడం వల్ల కూడా ఇంకో రకం నిమోనియా వస్తుంది.పట్టణాల్లో నిర్మాణ పనులు జరిగే చోట, గనుల తవ్వకాలు జరిగే చోట సన్నటి ధూళికణాలు గాలిలో చేరి, సిలికోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తాయి.చాలాకాలం వాడని ఏసీలు, కూలర్లలో లెజినెల్లా అనే సూక్ష్మజీవులు పెరిగి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు ముదిరి, దీర్ఘకాలంలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ)కి దారితీసే అవకాశాలూ ఉంటాయి. నివారణ మార్గాలు గాలిలోకి వెలువడే కాలుష్యాలను మనం తక్షణమే నివారించలేకపోవచ్చు. అయితే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలుష్యాన్ని క్రమేణా అదుపులోకి తేవడం దుస్సాధ్యమేమీ కాదు. మనం ఉండే ఇళ్లలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. చాలాకాలం మూసి ఉంచిన గదుల్లోకి వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని వెళ్లడం మంచిది. చాలాకాలం వాడకుండా ఉన్న కూలర్‌ను బయటకు తీసినప్పుడు కాసేపు ఆరుబయట దాన్ని ఆన్‌చేసి ఉంచి, ఆ తర్వాతే దానిని వాడాలి. లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం వంటివి చేసేటప్పుడు ముక్కు దగ్గర ఏదైనా అడ్డు పెట్టుకోవాలి. పొగతాగే అలవాటుంటే, వెంటనే మానేయాలి. పొగరాయుళ్లందరూ తమ అలవాటును మానేస్తే ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మరణాలను నివారించవచ్చు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడేచోట వాహనాల ఇంజన్‌ను ఆపేయాలి. దీనివల్ల ఇంధన వృథాను అరికట్టడమే కాదు, కర్బన కాలుష్యాన్నీ చాలా వరకు తగ్గించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కారు వాడే బదులు, కార్ పూలింగ్ వంటి ప్రక్రియల ద్వారా నలుగురూ కలిసి ఒకే కారులో ప్రయాణించవచ్చు. దీనివల్ల ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యనూ చాలావరకు నివారించవచ్చు. వ్యక్తిగత వాహనాల బదులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కింద నడిపే బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించడం వల్ల కూడా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. ఒకేచోట ఎక్కువమంది గుమిగూడటాన్ని నివారించడం ద్వారా గాలితో వ్యాపించే స్వైన్‌ఫ్లూ, హెచ్1ఎన్1 వంటి చాలా వైరల్ వ్యాధులను నివారించవచ్చు.జనావాసాల్లో చుట్టుపక్కల మొక్కలు పెంచడం ద్వారా కూడా వాతావరణ కాలుష్యాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. బాడీలో ఏసీ మెకానిజం ఊపిరితిత్తులకు సహజంగానే సామర్థ్యం చాలా ఎక్కువ. కాబట్టే మన పరిసరాలు కాలుష్య కాసారాల్లా మారిపోయినా మనం ఇంకా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. అయితే, పరిసరాల్లోని కాలుష్యం ఊపిరితిత్తుల సామర్థ్యానికి మించినప్పుడే మనకు సమస్యలు మొదలవుతాయి. వెలుపలి నుంచి ఊపిరితిత్తులోకి చొరబడే కాలుష్యాలను తిరిగి బయటకు నెట్టేసే ప్రక్రియ మన శ్వాస వ్యవస్థలో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ముక్కు నుంచి మొదలైన శ్వాస వ్యవస్థ ఎయిర్ కండిషనర్‌లా పనిచేస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, మనం లోపలకు పీల్చుకునే గాలిని ముక్కు చల్లబరుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే, ఆ గాలిని వెచ్చబరుస్తుంది. అలా మన ముక్కు ఊపిరితిత్తులకు ఒక స్థిరమైన ఉష్ణోగ్రతలో గాలిని సరఫరా చేస్తూ ఉంటుంది. మల్టీస్టోరీడ్ సిస్టమ్ మన శ్వాసవ్యవస్థ ఒక బహుళ అంతస్థుల నిర్మాణం. ఇందులో మొత్తం 28 అంతస్థులు ఉంటాయి. ఊపిరికి తొలిమెట్టు ముక్కు. అక్కడి నుంచే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రయాణం మొదలవుతుంది. ముక్కులోని వెంట్రుకలు కాస్త పెద్దపరిమాణంలో ఉండే కలుషిత కణాలను అడ్డుకుంటాయి. ప్రతిరోజూ మనం 22 వేల సార్లు శ్వాసిస్తాం. సగటున 16 వేల లీటర్ల గాలిని పీలుస్తాం. మన ఊపిరి తిత్తుల బరువు 1.3 కిలోలు. రెండు తెమ్మెలుగా (లోబ్స్) ఉండే ఊపిరితిత్తుల్లో 30 కోట్ల గాలిగదులు, 60 కోట్ల రక్తనాళాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలన్నింటినీ కలిపి లెక్కిస్తే, వాటి పొడవు 2400 కిలోమీటర్లు ఉంటుంది. ఊపిరితిత్తుల వైశాల్యం దాదాపు ఒక టెన్నిస్ కోర్టు అంత (70-100 చదరపు మీటర్లు) ఉంటుంది.ముక్కు చివర ఉండే వాయునాళం (ట్రాకియా) శ్వాసవ్యవస్థలోని మొదటి అంతస్తు అయితే, ఊపిరితిత్తుల్లోని గాలిగది (ఆల్వియోలై) చిట్టచివరి అంతస్తు. శ్వాసవ్యవస్థలోని 14వ అంతస్తు నుంచే ఊపిరితిత్తుల్లోని నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి.చివరి అంతస్తు అయిన ఆల్వియోలైకి గాలి చేరినప్పుడు, అక్కడ ద్రవంలా ఉండే రక్తం పల్చని కాగితం పొరలా ఏర్పడి, గాలి మార్పిడికి వీలుగా అలా నిలుచుని ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఆక్సిజన్ శరీరంలోని కణాలకు అంది, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళుతుంది.గాలి మాత్రమే శ్వాసవ్యవస్థలోని చివరి అంతస్థు చేరేందుకు వీలుగా ఊపిరితిత్తుల్లోని సన్నటి సీలియో అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు సహకరిస్తుంటాయి. శ్వాసవ్యవస్థలో ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. ఊపిరితిత్తుల్లోని సీలియోలు ఒక క్రమపద్ధతిలో కదులుతూ, మనకు సరిపడని దుమ్ము, ధూళి కణాలను ఎస్కలేటర్లపైకి ఎక్కించి, బయటకు పంపేస్తూ ఉంటాయి. లంగ్ థింగ్స్ మన ఊపరితిత్తులు రెండూ సమాన పరిమాణంలో ఉండవు. కుడివైపు ఊపిరితిత్తి కాస్త పెద్దగా, ఎడమవైపు చిన్నగా ఉంటాయి. మృతశిశువులను పరీక్షించేటప్పుడు ఆ శిశువు చనిపోయే పుట్టిందా లేక పుట్టాక చనిపోయిందా తెలుసుకునేందుకు శవపరీక్ష సమయంలో ఊపిరితిత్తులను నీటిలో వేస్తారు. అవి నీటిలో మునిగితే బిడ్డ చనిపోయే పుట్టిందని, అవి నీట్లో తేలితే పుట్టిన తర్వాత చనిపోయిందని నిర్ధారిస్తారు.మన ప్రాచీన ఆయుర్వేద నిపుణులు శ్వాసక్రియకు ఊపిరితిత్తులే కీలకం అని గుర్తించారు. ఆస్తమాను వారు ‘తమకశ్వాస’గా వ్యవహరించేవారు. పొగరాయుళ్లు నిత్యం దాదాపు 4 వేల రసాయనాలను ఊపిరితిత్తులకు చేరవేస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల్లోని సీలియా సాధ్యమైనంత వరకు వాటిని శుభ్రం చేస్తూ పోతున్నా, తారు వంటి ప్రమాదకర పదార్థాలు ఊపిరితిత్తుల్లో పోగుపడుతూనే ఉంటాయి. పొగతాగడం మానేస్తే... అలా మానేసిన ఐదు గంటల్లోనే ఊపిరితిత్తులు తమలోకి చేరిన కాలుష్యాలను శుభ్రం చేయడం ప్రారంభిస్తాయి. కొంతకాలాన్ని కాలుష్యాలన్నింటినీ క్రమంగా బయటకు పంపేస్తాయి. అందువల్ల పొగతాగే అలవాటును ఎప్పుడు మానేసినా మంచిదే. -
ఉబ్బసం కాదు.. చేప ముల్లు
కొచ్చి: సుధీర్ఘకాలంగా శ్వాస వ్యాధితో బాధపడుతున్నవ్యక్తికి ఎట్టకేలకు విముక్తి లభించింది. తొలుత ఉబ్బసం వ్యాధి అనుకున్నడాక్టర్లు చివరకు ఊపిరతిత్తుల్లో చేప ముల్లు ఉందని గమనించారు. కేరళకి చెందిన 37ఏళ్ల వ్యక్తికి 7 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన చేప ముల్లుని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆండ్ రిసెర్చ్ డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి బయటకి తీశారు. 'శ్వాస వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 2009 నుంచి రెగ్యులర్ చెక్అప్ కి వచ్చేవాడు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవాడని అనుకున్నాము. కానీ చివరకు చేప ముల్లు ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు గమనించాము. కుడి వైపు ఉన్న ఊపిరితిత్తు కింద భాగం నుంచి 1.5 సెం.మీX 1.4 సెం.మీ కొలత ఉన్న ముల్లును శస్త్ర చికిత్స చేసి తీసి వేసాము. ముల్లు చుట్టు పేరుకు పోయిన చీమును తొలగించాము. శస్త్ర చికిత్స అనంతరం ఆ వ్యక్తి సులువుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఊపిరితిత్తుల్లోనే ముల్లు ఇరుక్కొని ప్రాణాపాయ పరిస్థితినుంచి బయట పడటం చాలా అరుదైన విషయం' అని డాక్టర్లు అన్నారు. -
ఈసారి విశాఖ నుంచి చెన్నైకి..
విశాఖపట్టణం: అవయవ దానానికి ఈసారి విశాఖ వేదికైంది. స్థానిక కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 29 సంవత్సరాల ఆలపాటి సూర్యనారాయణ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే ఈసారి మృతుని గుండె అవయవమార్పిడికి పనికి రాదని డాక్లర్లు తేల్చడంతో .. లివర్, ఊపిరిత్తిత్తులను, కిడ్నీలు, కార్నియాలను సేకరించారు. వీటిలో లివర్, కిడ్నీలను స్థానిక, అపోలో, కేర్ అసుపత్రిలోని పేషెంట్లకు అమర్చనున్నారు. కాగా ఊపిరితిత్తులను చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమరో వ్యక్తికి రెండు ఊపిరితిత్తులను అమర్చనున్నారు. ప్రత్యేక ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
కంప్యూటర్ చిప్‌కు, గుండెకు ఒకే శక్తి!
వాషింగ్టన్: కంప్యూటర్ మెమరీ చిప్‌లు పనిచేయాలంటే విద్యుత్ కావాలి.. గుండె, ఊపిరితిత్తులు పనిచేసేందుకు జీవశక్తి కావాలి.. కానీ ఇవన్నీ కూడా ఒకే తరహా శక్తితో పనిచేస్తున్నాయని మీకు తెలుసా? గుండె, ఊపిరితిత్తులే కాదు.. జంతువుల శరీరంలో సంకోచ, వ్యాకోచాలు జరుపుతూనే ఉండే అవయవాలన్నీ ఆ తరహా శక్తితోనే పనిచేస్తాయని.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుడు జింగ్యూ లీ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. సాధారణంగా కంప్యూటర్ తెరలు, మెమరీ చిప్‌లు, సెన్సర్లు ‘ఫెర్రో ఎలక్ట్రిక్ స్విచ్చింగ్’ విధానంలో పనిచేస్తాయి. అంటే విద్యుత్ క్షేత్రం ప్రసరించినప్పుడు ఫెర్రో పదార్థాల్లోని ధనావేశం రుణావేశంగా మారుతుంది. ఆ క్షేత్రం తొలగినప్పుడు తిరిగి ధనావేశంగా మారుతుంది. ఇదే తరహాలో జీవకణాల్లో ఉండే ఎలాస్టిన్ అనే ప్రొటీన్ కూడా విద్యుత్ క్షేత్రానికి అనుగుణంగా ధన, రుణావేశా స్థితుల్లోకి మారుతుందని తాము గుర్తించినట్లు జింగ్యూ లీ చెప్పారు. -
హార్ట్‌బీట్‌తో చార్జింగ్!
వాషింగ్టన్: మన గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తుల కదలిక వంటి వాటి ఆధారంగా.. స్వల్పస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. అతి సన్నని ‘లెడ్ జిర్కోనిక్ టైటనేట్’ పట్టీలు, కదలికను విద్యుత్‌గా మార్చే రెక్టిఫయర్లను ఈ పరికరంలో ఉపయోగించారు. హృద్రోగులకు అమర్చే పేస్‌మేకర్‌ను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేసుకోగలిగేలా.. ప్రస్తుతం ఈ పరికరాన్ని రూపొందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి అమర్చే ‘హార్ట్‌రేట్ మానిటర్లు, పేస్మేకర్లు, న్యూరల్ సిమ్యులేటర్లు..’తో పాటు శరీరంలో అమర్చే అనేక వైద్య పరమైన ఇంప్లాంట్లకు అవసరమైన విద్యుత్‌ను ఈ పరికరంతో పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పొగచూరిన చట్టం
ఒంగోలు, న్యూస్‌లైన్: బస్టాండ్లు..రద్దీ ప్రదేశాలు..ఆస్పత్రి ఆవరణలు.. ప్రభుత్వ కార్యాలయాలు ప్రదేశం ఏదైతేనేమి..గుప్పుగుప్పు మంటూ పొగవదిలే వారు అడుగడుగునా కనబడుతుంటారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదన్న నిబంధనలు ఎక్కడా అమలవడం లేదు. కాట్పా -2003 (సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రోడక్ట్స్ యాక్ట్) లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని స్పష్టం చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడం ద్వారా పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.కేసుల నమోదుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. 40 రకాల ముఖ్యమైన ప్రదేశాల్లో పొగతాగరాదని చట్టం చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం వల్ల తాగే వ్యక్తి కన్నా..దాని ద్వారా వెలువడే పొగ పీల్చడం వల్ల సమీపంలోని వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ధూమపానం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఎక్కువగా దెబ్బతింటాయి. శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు..ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తోడవుతాయి. దేశంలో ఏటా పొగాకు ఉత్పత్తుల వాడకం ద్వారా అనారోగ్యం పాలై మరణించే వారి సంఖ్య పది లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ధూమపానం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ప్రకటనల కోసం 2013 డిసెంబర్లో రూ 45 కోట్లను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదని పెద్ద పెద్ద హోర్డింగ్‌ల రూపంలో ప్రకటనలు ఏర్పాటు చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లాలో పరిస్థితి ఇదీ... బహిరంగ ప్రదేశాలలో పొగతాగే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. మండలాల్లో సంబంధిత మెడికల్ ఆఫీసర్లు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. వీరితోపాటు ఈ చట్టాన్ని పోలీసుశాఖ కూడా అమలుచేయవచ్చు. అయితే 2011 మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హడావుడి చేసిఏడుగురికి జరిమానా విధించారు. ఆ తరువాత ఆ ఊసేలేదు. ఇక పోలీసు శాఖ కొత్తపట్నం బీచ్ ఒడ్డున సిగిరెట్ తాగుతున్న ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను 2008లో సస్పెండ్ చేసింది. అదే సంవత్సరం ట్రైనీ డీఎస్పీగా వచ్చిన దామోదర్ బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించారు. ఆయన జిల్లా నుంచి వెళ్లిన తరువాత తిరిగి ఈ చట్టాన్ని అమలుచేసేవారే లేరంటే అతిశయోక్తి కాదు. చీరాల వంటి పలు ప్రాంతాల్లో చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే నడిరోడ్డుపై పొగతాగుతూ కనిపిస్తుండడం నిత్యకృత్యం. ఒంగోలు నగరంలోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ ధూమపానం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోం ది. కనీసం పొగతాగితే జరిమానా విధిస్తామనే ప్రకటనలు జిల్లాలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించకపోతుండటం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల్లో ఏ ఒక్కరూ ఈ చట్టం ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయకపోతుండటంతో యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సినిమాహాళ్లలో కొంత మేరకు ధూమపాన నిషేధం అమలవుతోంది. ఈ చట్టం అమలుపై ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
ఇవీ వాసన చూస్తాయ్!
న్యూయార్క్: ఘుమఘుమలాడే కాఫీ సువాసనలు జలుబు కారణంగా ముక్కును చేరలేకున్నాయా..? ఏం ఫర్లేదు. ఊరిపితిత్తుల సాయం తీసుకోండి. ఆశ్చర్యపోతున్నారా..! ఊపిరితిత్త్తుల్లోని ఒక రకం కణాలకు ముక్కువలే కాఫీ, సిగరెట్ వాసనలను పసిగట్టే శక్తి ఉందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, ముక్కులోని వాసన గ్రాహకాలకు.. ఊపిరితిత్తుల్లోని గ్రాహకాలకు మధ్య తేడా ఉందట. ముక్కులో వాసన గ్రాహకాలు నాడీకణాల పొరల్లో ఉంటే.. ఊపిరితిత్తుల్లో మాత్రం శ్వాస మార్గంలో ఉంటాయి. వీటినే పల్మనరీ న్యూరోఎండోక్రైన్ కణాలంటారు. ఇవి మెదడుకు నాడీ సంకేతాలను పంపడానికి బదులుగా ఆ వాసనను గ్రహించేందుకు వీలు కల్పిస్తాయి. దీంతో సమీపంలో ఎవరైనా సిగరెట్ ఊది పారేస్తుంటే.. వెంటనే పల్మనరీ ఎండోక్రైన్ కణాలు హార్మోన్లను విడుదల చేస్తాయి. దాంతో శ్వాసమార్గం మూసుకున్నట్లు అవుతుందని వాషింగ్టన్ యూనివర్సిలోని జీవశాస్త్రం ప్రొఫెసర్ యెహుదా బెన్ షహర్ తెలిపారు. -
నికోటిన్ దుష్ర్పభావాల పొగాకు..!
అగ్నికి ఆజ్యం తోడైతే మంట మరింత పెరుగుతుంది. మరి ఆ అగ్నికి విషం తోడైతే? అది స్టైలిష్ సిగరెట్‌గా మారుతుంది. దాంతో జీవితం ఫూలిష్‌గా కాలిపోతుంది. ఇంత ఫ్యాషనబుల్‌గా జీవితాలను తగలబెట్టుకోడానికి మనం ఏటా రూ. 24 లక్షల కోట్లు తగలేస్తున్నాం. స్టైలే డెవిలై కబళిస్తుంటే... ప్రతి పది సెకన్లకు ఒకరం చొప్పున నికరంగా పొగాకుకు బలవుతున్నాం. పొగాకు గురించి చాలాసార్లు చాలామంది చెప్పారు, చదివారు, విన్నారు. అయితే వాటితో పాటు కొన్ని అంతగా వినని వాటినీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సిగరెట్ నుంచి రక్షించుకోవడం ఎంతగా అవసరమో చెప్పడానికే ఈ కథనం. జీవితం పొగచూరిపోవడానికి ఈజీ మార్గం... పొగాకు. ఆ విషాన్ని పెట్టెలో దాచి మరీ జాగ్రత్తగా జేబులో పెట్టుకుని తిరుగుతుంటాం. ఆ విషాన్ని అగ్గితో రగిలించి స్వీకరిస్తాం. అగ్నికి ఆజ్యం తోడయ్యే బదులు ఇక్కడ మనం అగ్నికి గరళం తోడయ్యేలా చేస్తాం. అగ్గిపుల్లతో మంట పెచ్చరిల్లుతుంది. అది సిగరెట్‌కు తాకగానే జీవితం కునారిల్లుతుంది. దాన్ని ఎందుకు వదలాలో తెలుసుకోడానికి తోడ్పడే కొన్ని ప్రధాన విషయాలివి... మీకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ ఆయుధాలను అమ్ముతూ మనుగడ సాగిస్తున్న అమెరికా మరో విషయంలోనూ ముందంజలో ఉంది. ఈ వాణిజ్యం ద్వారా అది దేశాల మధ్య చిచ్చు పెడుతుంటే... ఈ బిజినెస్ ద్వారా అది దేహాలకు ముప్పు తెస్తోంది. అదే సిగరెట్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రఖ్యాత సిగరెట్ బ్రాండ్లలో 70 శాతం అమ్మకాలు అమెరికన్ బ్రాండ్స్ అయిన మార్ల్బోరో, కూల్, క్యామెల్ సిగరెట్స్వే. ఇలా ఆయుధాల బాటలోనూ, సిగరెట్ల చేటు లోనూ అమెరికా తన అగ్రాధిపత్యాన్నీ, అగ్రరాజ్యాధి-పైత్యాన్నీ చాటుకుంటూనే ఉండటం విశేషం. సిగరెట్లో ఆర్సినిక్, ఫార్మాల్డిహైడ్, లెడ్, హైడ్రోజన్ సైనైడ్, నైట్రోజెన్ ఆక్సిడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి 43 రకాల తెలిసిన కార్సినోజెన్లు (క్యాన్సర్ కారకాలు) ఉన్నాయి. ఇక పేరు తెలియని హానికర రసాయనాలు దాదాపు 4000 రకాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం వంటి అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు. బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి జబ్బులూ రావచ్చు. ఆ తర్వాత వారికి సెకండరీ ఇన్ఫెక్షన్గా నిమోనియా వస్తే మృత్యువుకు గెస్ట్ అయినట్లే. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ప్రపంచంలోని ఏదోమూల ఎవరో ఒకరు పొగాకు వల్లనే చనిపోతున్నారు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో చనిపోయేవారిలో కనీసం 35% మంది నేరుగా స్మోకింగ్ వల్ల ప్రభావితమై మృతిచెందేవారే. మీరు సిగరెట్ పొగను పీల్చిన 10 సెకండ్లలో అందులోని నికోటిన్ మెదడును చేరుతుంది. సిగరెట్ తాగేవారి ప్రతి అవయవంలోనూ నికోటిన్ ఉంటుంది... అంటే ఒకవేళ తల్లికి పొగతాగే అలవాటుంటే ఆమె చనుబాలలో కూడా చేరుతుంది. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. సిగరెట్లో 20 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది డయాబెటిక్ రోగులకు ఈ విషయం తెలియదు. అలాగే చక్కెరను కాల్చి పీల్చితే కలిగే దుష్పరిణామాల గురించి ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే... అది నేరుగా చక్కెరను తీసుకోవడం కంటే చాలా ప్రమాదమని. చాలామంది ‘లైట్’ సిగరెట్స్ తాగితే అందులో రసాయనాల ఘాటు, జరగాల్సిన కీడు చాలా లైట్‌గా ఉంటాయని నమ్ముతారు. సిగరెట్‌ను లైట్‌గా చేయడానికి పొగాకును కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి సూపర్ హీట్ వద్ద మండించాలి. అప్పుడది మామూలు పొగాకు పొడికి బదులుగా పఫ్డ్ మెటీరియల్‌గా మారిపోతుంది. (పఫ్డ్ మెటీరియల్‌ను వివరించాలంటే... ఉదాహరణకు నీళ్లకూ, నురగ కూ ఉన్న తేడాతోనూ, బియ్యానికీ, మరమరాల కూ ఉన్న తేడాతోనూ పోల్చుకోవచ్చు). అప్పుడు అలా మారిన దాన్ని కాగితపు గొట్టంలోకి ఎక్కిస్తారన్నమాట. లైట్ అంటే దాని తాలూకు ప్రభావం లైట్‌గా ఉంటుందన్నది మన అపోహ మాత్రమే. నిజానికి దాన్ని మరింత విషపూరితమైన కార్బన్‌డయాక్సైడ్‌తో మరింత అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి మరింత విషపూరితం చేస్తున్నామన్న సత్యాన్ని మరిచిపోతున్నాం. లైట్ సిగరెట్ లో పొగాకు ఫ్లేక్స్ మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల పొగ మరింత ఘాటుగా, నేరుగా, బలంగా ఊపిరితిత్తులకు తాకుతుంది. మీరు ఈ కింది మాట వింటే... ఆహా సిగరెట్ చేసే మేలెంతో కదా అని ‘పొగాకులో కాలేస్తారు’. ఆ తర్వాత కాలు కాలినట్లు కాస్త ఆలస్యం గా గ్రహిస్తారు. అదేమిటం టే... పొగ తాగేవారిలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే అబ్బా, ఆహా... అనుకోకండి. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎంత త్వరగా పనిచేస్తుందో, అంత త్వరగా బలహీనపడిపోతుంది. సిగరెట్ తాగడం మొదలుపెట్టాక... లోపలికి పీల్చుకునేవి విష పదార్థాలు కావడంతో వాటితో పోరాడటానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఉపక్రమిస్తుంది. అయితే అదేపనిగా సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతుండటం వల్ల అది బలహీనపడుతుంది. అందుకే సిగరెట్ తాగేవారిలో ఇమ్యూనిటీ వేగంగా ప్రతిచర్య జరిపి వేగంగా బలహీనపడి అంతేవేగంగా నిర్వీర్యమైపోతుంది. అదే పొగతాగనివారిలో ఇమ్యూనిటీ కాస్తంత ఆలస్యంగా మేలుకున్నా... బలంగా, ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ జరగాల్సిన దానికంటే ఆలస్యంగా జరుగుతుంది. అంటే జీర్ణమయ్యే ఆహారం ఉండాల్సిన వ్యవధికంటే ఎక్కువసేపు పేగుల్లో ఉంటుంది. దీనివల్ల కుళ్లాల్సిన దానికంటే ఎక్కువగా కుళ్లుతుంది. ఫలితంగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ఇంకేటప్పుడు... అందులోకి వెళ్లాల్సిన దానికంటే అధికమోతాదులో విషాలు ప్రవేశిస్తుంటాయి. విషపూరితమైన రక్తకణాలు మెదడుకు చేరడంతో అది పనిచేయాల్సిన దానికంటే ఆలస్యంగా పనిచేస్తూ క్రమంగా తన పనితీరును మందకొడిగా మార్చేసుకుంటుంది. గర్భవతులకు ఒకసారి ఎక్స్-రే తీయించాల్సి వస్తేనే డాక్టర్లు వద్దని నిరాకరిస్తుంటారు. అయితే ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగితే... అది దాదాపు 2000 ఛాతీ ఎక్స్-రేలు తీయించుకున్న దాని దుష్ర్పభావంతో సమానం. పొగాకు మొక్కలో హార్మలా అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది భ్రాంతులను కలగజేసే రసాయనం. అయితే మనం సిగరెట్ తాగేప్పుడు అలా భ్రాంతులు కలగకపోవడానికి కారణం... సిగరెట్ తయారీలో పొగాకు ను ప్రాసెస్ చేసే సమయంలో హార్మలాను తొలగించడమే. కానీ ఎంతో కొంత స్వల్ప మోతాదుల్లో అది మెదడుకు చేరుతుండటం వల్ల హార్మలాతో కలిగే హార్మ్ అంతా ఇంతా కాదు. అలా కాల్చగా కాల్చగా కొన్నేళ్ల తర్వాత సిగరెట్ దుష్ర్పభావం మన శరీరంపై పడుతుందని మీకు ఇప్పటివరకూ ఒక నమ్మకం ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు సరికొత్త పరిశోధనల వల్ల తెలుస్తున్న సత్యం ఏమిటంటే... సిగరెట్ తాగిన 15 నుంచి 30 నిమిషాల లోపు అందులో ఉండే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీయేహెచ్) ప్రభావం శరీరంలోని కణాలన్నింటి పైనా పడుతుంది. అందువల్ల డీఎన్ఏ స్వరూపం మారుతుంది. డీఎన్ఏ స్వరూపం మారడం అంటేనే క్యాన్సర్ అన్నమాట. ఈ పని మొట్టమొదటి సిగరెట్‌తోనూ జరగవచ్చు. అయితే ఇన్ని సిగరెట్లు కాల్చాక కూడా ఇంకా మీపై పీఏహెచ్ల ప్రభావం పడలేదంటే అది మీ అదృష్టమే. పడేలోపే ఆ అలవాటును మానుకోండి. ఇన్ని కారణాలతో తక్షణం నిర్వీర్యం చేసి... క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలనూ శక్తిహీనం చేసేసి, ఆ తర్వాత మెల్లగా ప్రాణాలను తీసేసే సిగరెట్‌ను వదులుకోండి. అది ప్రాణాల ను మెలివేయకముందే... దాన్ని వెలివేయండి. అలవాటు మానేశానంటూ గర్వంగా మీసం మెలివేయండి. -నిర్వహణ: యాసీన్ ఇవీ టాపింగ్స్: ఆహారపదార్థాలకు మరింత రుచిని ఆపాదించడానికి రుచికరమైన వాటిని వాటి పైన పూస్తారు. ఈ ప్రక్రియనే వంటల్లో టాపింగ్ అంటారు. అలాగే పొగాకును టాపింగ్ చేయడానికి... లవంగ నూనె, ఆప్రికాట్ స్టోన్, నిమ్మనూనె, లావెండర్‌నూనె, డిల్సీడ్ నూనె, కోకా, క్యారట్ నూనె, బీట్ జ్యూస్, ఓక్, రమ్, వెనీలా, వెనిగార్‌లను పైపూత పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇది తెలిశాక కూడా మీరు సిగరెట్ తాగగలరా...? సిగరెట్‌కు ఫ్లేవర్ (రుచి, వాసన) ఆపాదించడానికి దానికి ‘యూరియా’ ను జతచేస్తారు. యూరియాతో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పొగాకులోని ముతకదనం తగ్గి, ఘాటు మరింతగా పెరగాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. మీకు తెలుసా? మన శరీరానికి విషపూరితం అంటూ మూత్రం ద్వారా మన కిడ్నీలు బయటకు పంపేది ఈ యూరియా అనే వ్యర్థాన్నే. అంటే మన మూత్రంలో ఉండే పదార్థాన్నే సిగరెట్‌కు రుచి తేవడానికి ఉపయోగించి మళ్లీ శరీరంలోకి పంపిస్తున్నారన్నమాట. మార్ల్బోరో కోసం పనిచేస్తే... జీవితమే బోర్లా! వేన్ మెక్ క్లారెన్, డేవిడ్ మెక్ క్లీన్... వీళ్లిద్దరూ సదరు కంపెనీ యాడ్ కోసం పనిచేసే రోజుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా ‘మార్ల్బోరో మ్యాన్’ అంటూ ఆదరంగా పిలిచేవారు. ఎందుకంటే కౌబాయ్ గెటప్‌లో, రగ్డ్గా, రఫ్‌గా దేన్నైనా తట్టుకోగల ధీరులుగా, వీరులుగా ఆ కంపెనీ యాడ్స్‌లో వాళ్లను చూపించేవారు. యాడ్స్ తయారీలో భాగంగా వారు రోజూ సిగరెట్లు తాగాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే... ఆ ఇద్దరూ తమ కాంట్రాక్ట్ ముగిశాక... పదేళ్లలోపే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే... డేవిడ్ మెక్‌క్లీన్ చావుకు సిగరెట్ల కంపెనీయే కారణమంటూ కుటుంబసభ్యులు కేసు కూడా పెట్టారు. మృత్యువును వడపోసి మరీ తెచ్చే ‘ఫిల్టర్’... పొగతాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యసమస్యలేమీ రావంటూ కొందరు చమత్కారంగా చెప్పేమాట అక్షరాలా వాస్తవం. కాకపోతే కాస్త నెగెటివ్‌గా. ఎందుకంటే వారు వృద్ధాప్యం వచ్చేవరకు ఉండరు కదా..! ఇక స్మోకింగ్ అనే దురలవాటు వల్ల వ్యక్తులు ఎంత త్వరగా చనిపోతున్నారన్నది సైంటిస్టులు గణాంకాలతో లెక్కగట్టారు. సగటున చూస్తే స్మోకర్లు 14 ఏళ్ల ముందుగానే చనిపోతున్నారు. అంటే పొగతాగడం మొదలుపెట్టారంటే మీ జీవితంలో 14 ఏళ్లను త్యాగం చేస్తున్నారన్నమాట. దీనికి తోడు గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక కిడ్నీ, లివర్, మెదడు సంబంధమైన జబ్బులు బోనస్. బోరిస్ ఐవాజ్ అనే హంగేరియన్ సైంటిస్ట్ 1925లో కార్క్‌తో తొలిసారి సిగరెట్ ఫిల్టర్‌ను తయారుచేసి, ఆ తర్వాత క్రేప్ పేపర్‌తో ఫిల్టర్‌ను రూపొందించి, పేటెంట్ పొందాడు. నిజానికి మామూలు సిగరెట్ లో ప్రమాదకరమైన ముతకపదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే... ఫిల్టర్ ఉన్న సిగరెట్ ద్వారా అవి మరింత వడపోతకు గురై మరింత ప్రమాదకరమైనవిగా రూపొంది మరీ ప్రాణం తీస్తాయి. విషాన్ని మరింత మేలురకమైనదిగా రూపొందించుకోడానికి పొందిన పేటెంట్ అది అని గ్రహించండి. ఇక కెంట్ అనే ఒక పాపులర్ బ్రాండ్ సిగరెట్ ఫిల్టర్ కోసం మరింత నాణ్యమైన కార్సినోజెన్ (క్యాన్సర్‌ను తెచ్చే రసాయనం) ‘క్రోసిడోలైట్ ఆస్బెస్టాస్’ను ఉపయోగించేవారు. మనం మన జీవితాల ను చాలా నాణ్యంగా తగలబెట్టుకుంటున్నామని గ్రహించి 1950లో ఆ ఫిల్టర్‌ను వాడటం మానేశారు సదరు తయారీదారులు. ప్రతికూల ప్లాసెబో ఎఫెక్ట్: మనం ఏదైనా మందు తీసుకున్న తర్వాత ఉపశమనం పొందితే, నిజానికి అది మందు కారణంగా కాకపోయినా దాన్ని మందుకే ఆపాదిస్తాం. దాన్నే ప్లాసెబో ఎఫెక్ట్ అంటారు. అలాగే సిగరెట్ తర్వాత మనం కుదుటపడినట్లుగా, రిలాక్స్‌గా ఫీలవ్వడం, చురుగ్గా మారడం... ఇవన్నీ సిగరెట్ తాలూకు ప్రతికూల ప్లాసెబో ప్రభావాలే. డాక్టర్ సునంద కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ
మనం మన లోపలి అవయవాల గురించి ఆలోచించినప్పుడు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... అంటూ చాలా వాటిపై దృష్టి పెడతామేమో గాని పాంక్రియాస్ అనే ఆ అంతర్గత అవయవం వైపు దాదాపుగా దృష్టిసారించం. ఆకృతిలో తోకలా ఉండే అది మాత్రం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. ఈ పాంక్రియాస్ ఉరఃపంజరాని(రిబ్కేజ్)కి కాస్తంత కిందగా కడుపులో ఉంటుంది. దాని పనితీరు మందగించిన కారణంగానే మనకు మధుమేహం లాంటి పాపులర్ జబ్బు వచ్చినా అది దానివల్ల్లేనని మనకు తెలియదు. కీలక అవయవం అయిన పాంక్రియాస్‌కు సోకే ఇన్ఫెక్షన్స్, కారణాలు, జాగ్రత్తలను గురించి తెలిపేదే ఈ కథనం. పాంక్రియాస్ అనేది ప్రధానంగా రెండు కీలకమైన పనులు చేస్తుంటుంది. మొదటిది మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక మనం తీసుకున్న ఆహారం శక్తిగా, అన్ని అవయవాలకూ అందడానికి గ్లూకోజ్‌గా మారే ప్రక్రియలో, రక్తంలోని ఆ గ్లూకోజ్‌ను నియంత్రిస్తూ ఉండే ప్రధాన భూమికను పాంక్రియాస్ పోషిస్తుంది. ఈ రెండు విధులను నిశ్శబ్దంగా చేసుకుపోయే ఈ అవయవంలోని కణాలకూ ఒక్కోసారి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకి, ఆ కణాలు దెబ్బతింటాయి. అలా పాంక్రియాస్‌లోని కణాలకు ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకడాన్నే ‘పాంక్రియాటైటిస్’ అంటారు. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? కడుపు పైభాగం (అప్పర్ అబ్డామిన్)లో తీవ్రమైన కడుపునొప్పితో పాంక్రియాటైటిస్‌ను గుర్తించవచ్చు. కొన్నిసార్లు కొందరిలో ఆ నొప్పి వీపు వైపునకు వ్యాపిస్తుంది. దీన్ని సాధారణ కడుపునొప్పిగా పరిగణించలేం. ఎందుకంటే చాలా తీవ్రంగా గంటలకొద్దీ వచ్చే ఆ నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు. పాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది? పాంక్రియాస్ నిర్వహించే విధుల గురించి మనకు తెలిసిందే. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే స్రావాలను అది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ స్రావాలు పేగుల్లోకి విడుదలయ్యాక, అవి వాటిమీద పని చేస్తే ఆహారం అరుగుతుంది. అప్పటివరకూ ఆ స్రావాలను నిద్రాణంగా ఉండేలా ప్రకృతి ఏర్పాటుచేసింది. కానీ కొన్ని సందర్భాల్లో అవి పాంక్రియాస్లో ఉండగానే క్రియాశీలం అయిపోయి, తమ పనిని ప్రారంభించేస్తాయి. దాంతో అప్పుడు అవి పాంక్రియాస్ కణాలనే దెబ్బతీయడం మొదలుపెడతాయన్నమాట. ఫలితంగా పాంక్రియాస్ కణాలకు వాపు, మంట వస్తాయి. అవి ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ సమష్టి పరిణామాలన్నింటినీ కలుపుకుని వైద్యపరిభాషలో ఇన్‌ఫ్లమేషన్‌గా చెప్పవచ్చు. ఇలా పాంక్రియాస్ అనే అవయవం ఇన్ఫ్లమేషన్కు గురికావడాన్నే ‘పాంక్రియాటైటిస్’గా పేర్కొంటారు. పాంక్రియాటైటిస్‌లో రకాలు పాంక్రియాటైటిస్ రుగ్మతలోనూ కొన్ని రకాలున్నాయి. అందులో రెండింటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. మొదటిది తక్షణలక్షణాలు కనిపించే పాంక్రియాటైటిస్. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఇక రెండోది... రుగ్మత దీర్ఘకాలికంగా కొనసాగే క్రానిక్ పాంక్రియాటైటిస్. క్రానిక్ పాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో కడుపునొప్పి మొదలుకొని పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే లక్షణాలన్నీ తరచూ కనిపిస్తుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్ వచ్చినవారిలో చాలామందిలో అది దానంతట అదే తగ్గిపోతుంది. కానీ క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో మాత్రం తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్నవారిలో క్రానిక్ పాంక్రియాటైటిస్ వస్తుంది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో మద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ తరహా కేసుల్లోనూ 20% నుంచి 30% మందిలో డయాబెటిస్ ఉన్నవారిలోనే ఇది కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో ఉండే తేడాలే దీనికి కారణం. పాంక్రియాటైటిస్‌కు కారణాలు పాంక్రియాటైటిస్ రుగ్మతతో బాధపడేవారికి అందుకు కారణమయ్యే అంశాలలో అతి ముఖ్యమైనది ‘ఆల్కహాల్’. పాంక్రియాటైటిస్‌తో బాధపడే ప్రతిపదిమందిలోనూ ఏడుగురు మద్యం కారణంగానే ఆ వ్యాధి బారిన పడుతుంటారు. మద్యం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి, అవి క్రమంగా పాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి. వీటి గురించి విపులంగా... గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు): పిత్తాశయంలో జీర్ణక్రియకు ఉపయోగపడే పైత్యరసం అనే స్రావాలు నిల్వ ఉంటాయి. కడుపులోని జీర్ణాశయానికి కాస్తకిందుగా చిన్నపేగులు మొదలయ్యే చోట... పిత్తాశయం తాలూకు నాళమైన బైల్ డక్ట్ నుంచి చిన్నపేగుల మొదటిభాగం (డియోడినమ్)లో కలిసి అక్కడ పైత్యరసాన్ని విడుదల చేసి, ఆహారం జీర్ణమయ్యేలా చేయడం జరుగుతుంది. పిత్తాశయం నుంచి వచ్చి, చిన్నపేగుల దగ్గర తెరచుకునే నాళం (బైల్ డక్ట్), పాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడే తెరచుకునే నాళం ఒక కూడలిలా ఉంటాయి. సాధారణంగా చిన్నపేగులోకి పైత్యనాళం నుంచి పైత్యరసం విడుదలయ్యే ఈ ప్రక్రియవల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొన్నిసార్లు కొంతమందిలో పైత్యనాళం నుంచి వచ్చే రాళ్లు ఈ కూడలిలో ఇరుక్కుపోతాయి. ఈ రాళ్ల కారణంగా ఈ స్రావాలు వెనక్కు వెళ్లి పాంక్రియాటిక్ నాళం (డక్ట్)లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు కొంతమేరకే ఈ స్రావాలను అడ్డుకునే రాళ్లు, ఒక్కోసారి పాంక్రియాటిక్ డక్ట్‌ను అడ్డుకుని పూర్తిగా మూసేస్తాయి కూడా. దాంతో ఆస్రావాలు వెనక్కు పాంక్రియాస్లోకి ప్రవేశించి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఆల్కహాల్ వల్ల: పాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణం ఆల్కహాల్ అన్నది వాస్తవం. అయితే ఇదెలా జరుగుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా బాగా మద్యం తాగిన 6-12 గంటల తర్వాత కడుపునొప్పి రూపంలో పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. కొంతమందిలోనైతే ఎంతకొద్దిమోతాదులో తాగినప్పటికీ పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. అంటే ఇలాంటివారిలో వారి పాంక్రియాస్‌కు ఆల్కహాల్ అంటే అస్సలు పడదన్నమాట. అంటే పాంక్రియాస్... ఆల్కహాల్ పట్ల సెన్సిటివిటీని కలిగి ఉంటుందని అర్థం. మరికొన్ని కారణాలు: పై కారణాలతోపాటు మరికొన్ని అంశాలు కూడా పాంక్రియాటైటిస్‌కు కారణమవుతాయి. కానీ అవి అంత సాధారణం కావు. అవి... కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ఉదాహరణకు మంప్స్ వైరస్, హెచ్ఐవీ వైరస్ల కారణంగా పాంక్రియాటైటిస్ రావచ్చు). చాలా అరుదుగా కొన్నిరకాల మందుల తాలూకు దుష్ర్పభావాలు (సైడ్ఎఫెక్ట్స్)గా కూడా పాంక్రియాటైటిస్ కనిపించవచ్చు. పాంక్రియాస్ లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా శస్త్రచిక్సిత జరిగినప్పుడు సైతం ఈ రుగ్మత రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరాన్నజీవుల కారణంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇక ఒంటిలో చాలా ఎక్కువగా కొవ్వు ఉన్న సందర్భాల్లోనూ, క్యాల్షియమ్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పాంక్రియాస్ నిర్మాణం సరిగా లేనప్పుడు కూడా ఈ జబ్బు రావచ్చు. కొన్నిసందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా అరుదనే చెప్పాలి. ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్: ఇందులో మన సొంత రోగనిరోధక శక్తి మన పాంక్రియాస్‌ను దెబ్బతీస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్ అంటారు. కారణాలు తెలియకుండా కూడా: పది పాంక్రియాటైటిస్ కేసుల్లో రెండింటికి అసలు కారణమే తెలియదు. పాంక్రియాటైటిస్ తీవ్రత సాధారణంగా అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో కడుపునొప్పి తీవ్రంగా వచ్చినప్పటికీ సాధారణంగా దుష్ర్పభావాలు పెద్దగా ఉండవు. అయితే 10 శాతం కేసుల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, ఒక్కోసారి సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. చాలా అరుదుగా మరణానికి దారితీయవచ్చు. ఒక్కోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌లో పరిస్థితి కాస్త భిన్నం. ఇందులో కడుపునొప్పి వచ్చినా చాలా సందర్భాల్లో కొద్దిగా లేదా ఓ మోస్తరుగా ఉండి నొప్పినివారణ మందులతో తగ్గవచ్చు లేదా కొంతమంది విషయంలో కొంతకాలం ఆసుపత్రిలో ఉంచడం వల్ల, ఇంజెక్షన్లతోను పరిస్థితి చక్కబడవచ్చు. కొన్నిసార్లు పాంక్రియాస్ నుంచి వెలువడవలసిన స్రావాలకు రాళ్లు అడ్డుపడుతున్నప్పుడు ఎండోస్కోపిక్ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్: దీనికి ప్రధానకారణం ఆల్కహాల్. చాలా ఎక్కువ మోతాదులో ఐదేళ్లపాటు కొనసాగిస్తుంటే, అది ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్‌కు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఆల్కహాల్ మానివేయగానే దాంతోపాటే ఈదుష్ర్పభావమూ తగ్గిపోతుంది. క్రమంగా ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్ నయమైపోతుంది. నిర్వహణ- యాసీన్ నివారణ / జాగ్రత్తలు ఎవరిలోనైనా సరే డాక్టర్లు పాంక్రియాటైటిస్ జబ్బు ఉన్నట్లుగా చెబితే, వారికి ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే తక్షణం దాన్ని మానేయాలి. దాంతో పాంక్రియాటైటిస్ కారణంగా వచ్చిన నొప్పి తగ్గిపోయి, పాంక్రియాస్ మరింత దెబ్బతినడం ఆగిపోతుంది. ఒకవేళ పాంక్రియాటైటిస్ వ్యాధి కనిపించాక కూడా మద్యం అలవాటును ఆపివేయకుండా అలాగే కొనసాగిస్తే నొప్పితీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇక పాంక్రియాస్ దెబ్బతినడం కూడా పెరుగుతుంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి అది మరణానికీ దారితీయవచ్చు. అక్యూట్ పాంక్రియాటైటిస్‌కు ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఒకవేళ ఒకసారి అక్యూట్ పాంక్రియాటైటిస్ కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు తక్షణం దాన్ని మానేయాలి. అలా కనీసం ఆర్నెల్లపాటు దూరంగా ఉండాలి. అంటే పాంక్రియాస్ మళ్లీ యథాస్థితికి రావడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇలా కాకుండా ఒకవేళ అలాగే కొనసాగిస్తే మాత్రం అది దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్కూ లేదా ప్రమాదకరమైన పరిస్థితికీ దారితీయవచ్చు. డాక్టర్ ఐతా శ్రీవేణు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ మియాపూర్, హైదరాబాద్. -
కుడివైపున గుండె.. ఒకే ఊపిరితిత్తి
తాండూరుటౌన్, న్యూస్‌లైన్: కుడివైపున గుండె తో.. ఒకే ఊపిరితిత్తితో ఓ ఆడశిశువు జన్మించిన అరుదైన ఘటన శనివారం తాండూరులో వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం ఎన్కేపల్లికి చెందిన బోయిని సాయిలు, అమృతమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారు డు. కాగా గత నెల 28న రాత్రి అమృత మ్మ ఎన్కేపల్లిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాప ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం రాత్రి తాం డూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పాపకు గుండె కుడివైపునకు ఉందని, ఎడమ వైపు ఊపిరితిత్తి లేదని శనివారం నిర్ధారించారు. పాపను ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో ఉంచారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించాలని వైద్యులు సూచించారు. అసాధారణ స్థితిలో శిశువు జననం కుడివైపునకు గుండె ఉండటం (డెక్స్ట్రో కార్డి యా) ఒకే ఊపిరితిత్తితో (కంజైటైనల్ ఎజెనెసిస్ ఆఫ్ లె ఫ్ట్ లంగ్) శిశువు జన్మించడం చాలా అరుదైన విషయమని పిల్లల వైద్య నిపుణుడు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కొన్ని లక్షల జననాల్లో ఒక కేసు మాత్రమే ఇలా ఉంటుందన్నారు. తాండూరులో ఎస్ఎన్సీయూ ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండో కేసు అని ఆయన అన్నారు. గతంలో కుడివైపునకు గుండెతో ఓ శిశువు జన్మించిందన్నారు. కుడివైపునకు గుండె ఉండటం, ఒకే ఊపిరితిత్తి ఉండటంతో ఆడశిశువు పరిస్థితి విషమంగా ఉందన్నారు. శిశువు బతికే అవకాశాలు తక్కువని, మెరుగైన వైద్యం నిమిత్తం నగరానికి తరలించాలని కుటుంబీకు లకు సూచించామని జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు.