తాండూరుటౌన్, న్యూస్‌లైన్: కుడివైపున గుండె తో.. ఒకే ఊపిరితిత్తితో ఓ ఆడశిశువు జన్మించిన అరుదైన ఘటన శనివారం తాండూరులో వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం ఎన్కేపల్లికి చెందిన బోయిని సాయిలు, అమృతమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారు డు. కాగా గత నెల 28న రాత్రి అమృత మ్మ ఎన్కేపల్లిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాప ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం రాత్రి తాం డూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పాపకు గుండె కుడివైపునకు ఉందని, ఎడమ వైపు ఊపిరితిత్తి లేదని శనివారం నిర్ధారించారు. పాపను ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)లో ఉంచారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించాలని వైద్యులు సూచించారు.
అసాధారణ స్థితిలో శిశువు జననం
కుడివైపునకు గుండె ఉండటం (డెక్స్‌ట్రో కార్డి యా) ఒకే ఊపిరితిత్తితో (కంజైటైనల్ ఎజెనెసిస్ ఆఫ్ లె ఫ్ట్ లంగ్) శిశువు జన్మించడం చాలా అరుదైన విషయమని పిల్లల వైద్య నిపుణుడు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కొన్ని లక్షల జననాల్లో ఒక కేసు మాత్రమే ఇలా ఉంటుందన్నారు. తాండూరులో ఎస్‌ఎన్‌సీయూ ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండో కేసు అని ఆయన అన్నారు. గతంలో కుడివైపునకు గుండెతో ఓ శిశువు జన్మించిందన్నారు. కుడివైపునకు గుండె ఉండటం, ఒకే ఊపిరితిత్తి ఉండటంతో ఆడశిశువు పరిస్థితి విషమంగా ఉందన్నారు. శిశువు బతికే అవకాశాలు తక్కువని, మెరుగైన వైద్యం నిమిత్తం నగరానికి తరలించాలని కుటుంబీకు లకు సూచించామని జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు.
కుడివైపున గుండె.. ఒకే ఊపిరితిత్తి
Published Sun, Sep 1 2013 1:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement