ఉబ్బసం కాదు.. చేప ముల్లు
కొచ్చి: సుధీర్ఘకాలంగా శ్వాస వ్యాధితో బాధపడుతున్నవ్యక్తికి ఎట్టకేలకు విముక్తి లభించింది. తొలుత ఉబ్బసం వ్యాధి అనుకున్నడాక్టర్లు చివరకు ఊపిరతిత్తుల్లో చేప ముల్లు ఉందని గమనించారు. కేరళకి చెందిన 37ఏళ్ల వ్యక్తికి 7 సంవత్సరాలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన చేప ముల్లుని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆండ్ రిసెర్చ్ డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి బయటకి తీశారు. 'శ్వాస వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 2009 నుంచి రెగ్యులర్ చెక్అప్ కి వచ్చేవాడు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవాడని అనుకున్నాము. కానీ చివరకు చేప ముల్లు ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు గమనించాము. కుడి వైపు ఉన్న ఊపిరితిత్తు కింద భాగం నుంచి 1.5 సెం.మీX 1.4 సెం.మీ కొలత ఉన్న ముల్లును శస్త్ర చికిత్స చేసి తీసి వేసాము. ముల్లు చుట్టు పేరుకు పోయిన చీమును తొలగించాము. శస్త్ర చికిత్స అనంతరం ఆ వ్యక్తి సులువుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఊపిరితిత్తుల్లోనే ముల్లు ఇరుక్కొని ప్రాణాపాయ పరిస్థితినుంచి బయట పడటం చాలా అరుదైన విషయం' అని డాక్టర్లు అన్నారు.