హార్ట్‌బీట్‌తో చార్జింగ్! | Harnessing power from beating hearts | Sakshi
Sakshi News home page

హార్ట్‌బీట్‌తో చార్జింగ్!

Published Sun, Jan 26 2014 5:47 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

హార్ట్‌బీట్‌తో చార్జింగ్! - Sakshi

హార్ట్‌బీట్‌తో చార్జింగ్!

వాషింగ్టన్: మన గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తుల కదలిక వంటి వాటి ఆధారంగా.. స్వల్పస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. అతి సన్నని ‘లెడ్ జిర్కోనిక్ టైటనేట్’ పట్టీలు, కదలికను విద్యుత్‌గా మార్చే రెక్టిఫయర్‌లను ఈ పరికరంలో ఉపయోగించారు. హృద్రోగులకు అమర్చే పేస్‌మేకర్‌ను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేసుకోగలిగేలా.. ప్రస్తుతం ఈ పరికరాన్ని రూపొందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి అమర్చే ‘హార్ట్‌రేట్ మానిటర్లు, పేస్‌మేకర్లు, న్యూరల్ సిమ్యులేటర్లు..’తో పాటు శరీరంలో అమర్చే అనేక వైద్య పరమైన ఇంప్లాంట్లకు అవసరమైన విద్యుత్‌ను ఈ పరికరంతో పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement