ఛాతీలో నీరు చేరడాన్ని ‘ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది నీరు కావచ్చు లేదా చీము, రక్తం కావచ్చు. ఇది ఒక పక్క లేదా రెండువైపులా చేరవచ్చు. నీరు ఎక్కువగా చేరితే దాన్ని ‘మాసివ్ ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. ఇలాంటి వారిలో ఆయాసం కూడా ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి వారిలో తక్షణం ఆ నీటిని తీయాల్సి ఉంటుంది.
కారణాలు...
ఛాతీలోకి నీరు చేరడం అనేది హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్య, లివర్ సమస్యలను సూచిస్తుంది. చీము చేరడం అనేది ఊపిరితిత్తులకు గాని, ప్లూరల్ స్పేస్‌కు గానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఉదా: నిమోనియా, టీబీ ఇన్ఫెక్షన్లు. సాధారణంగా మొదటిదశలో అది చీము అవునా, కాదా అన్నది కనుక్కోవడం కుదరదు. పరీక్షలకు పంపాక మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యను ట్రాన్స్‌డేటివ్ లేదా ఎగ్జూడేటివ్ అని విభజిస్తారు.
ట్రాన్స్‌డేటివ్ నీరు చేరడమనే సమస్య సాధారణంగా మందులతోనే తగ్గిపోతుంది. అయితే ఎగ్జుడేటివ్ నీరు చేరడమనే సమస్యలో దాని దశని బట్టి చికిత్స మారుతుంటుంది. ఈ సమస్యకు నిమోనియా కారణమై, నీరు కొద్దిగానే ఉంటే, సాధారణంగా అది యాంటీబయాటిక్స్‌తో తగ్గి΄ోతుంది. కానీ చీము చాలా ఎక్కువగా ఉంటే, వెంటనే ఛాతీలోకి గొట్టం వేసి దాన్ని డ్రైయిన్ చేసేయాలి (ఆ చీమును బయటకు ప్రవహింపజేయాలి... అంటే తొలగించాలి).
ఒకసారి గొట్టం వేశాక చీము రోజుకు ఎంత పరిమాణంలో డ్రైయిన్ అవుతోంది అన్న అంశం మీద దాన్ని తీసేయడం ఆధారపడి ఉంటుంది. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి, అక్కడ తేనెతుట్టెలాగా మారిపోతుంది. అలాంటి దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. గొట్టం వేసి, ఆ తేనెతుట్టె లాంటి దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని మూడు రోజుల పాటు లోనికి పంపుతారు. అప్పటికీ లోపలి ఫైబ్రస్ పార్టిషన్స్ కరగకపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం.
ముందుగా అసలు ఈ చీము ఎందుకు చేరుతుందో కనుక్కోవాలి. అందుకోసం తగిన పరీక్షలూ, కల్చర్స్ చేయించాలి. ఇన్ఫెక్షన్ అదుపు చేయడానికి అవసరమైన మందుల్ని డాక్టర్లు సూచించినంత కాలం వాడాలి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరడమే కాకుండా ఊపిరితిత్తులకు కన్నం పడుతుంది. దానివల్ల గాలి లీక్ అవుతుంది.
దీన్ని ‘బ్రాంకోప్లూరల్ ఫిస్టులా’ అంటారు. ఇలాంటివారిలో ఛాతీలో గొట్టం ఎక్కువరోజులు... అంటే ఫిస్టులా మూసుకు΄ోయే వరకూ ఉంచాలి. ఇందుకు ఒక్కోసారి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. కొంతమందిలో ఆపరేషన్ ద్వారా ఫిస్టులాను రిపేర్ చేయవచ్చు. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి,అక్కడ తేనెతుట్టెలా మారి΄ోతుంది. ఈ దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. అప్పుడు గొట్టం వేసి, దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని పంపుతారు.
డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment