పొత్తి కడుపు కొవ్వును తగ్గించి, ఛాతీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడానికి మత్సా్యసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కఠినమైన విధానం కూడా ఉంది. కానీ, సులువుగానూ ఈ పోజ్‌ను సాధన చేయవచ్చు. త్వరగా శారీరక, మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.
ఈ ఆసనాన్ని సాధన ఎలా అంటే
మ్యాట్‌పైన వెల్లకిలా పడుకోవాలి.
అరచేతులను నేలపైన బోర్లా ఉంచాలి.
కాళ్లను నిటారుగా ఉంచి, పాదాలను స్ట్రెచ్ చేస్తూ సాధ్యమైనంత వరకు వంచాలి.
తుంటి భాగాన్ని కొద్దిగా ఎత్తి, పిరుదుల కింద చేతులను ఉంచాలి.
తల వెనుక మెడ భాగాన్ని సాగదీస్తూ, నేలపైకి వంచాలి. బరువు ఎక్కువ లేకుండా భంగిమను సరిచూసుకోవాలి. అదే విధంగా వెన్ను భాగాన్ని కూడా కొంత పైకి ఎత్తాలి.
ఈ భంగిమ చేప మాదిరి ఉంటుంది కాబట్టి దీనిని ఫిష్ పోజ్ అంటారు.
నిదానంగా 5 శ్వాసలు తీసుకుంటూ, వదలాలి. తర్వాత తలను యధాస్థానంలో ఉంచి, వెన్నెముకను చాప మీద నిదానంగా ఉంచాలి.
ఆ తర్వాత పాదాలను యధాస్థానంలోకి తీసుకొని, చేతులను తుంటి నుంచి బయటకు తీసి, విశ్రాంతి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల....
∙ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది. ఊపిరితిత్తులు సాధ్యమైనంతవరకు ప్రాణ వాయువును పీల్చి, కొంత సమయం ఉంచగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి.
వెన్ను, మెడ భాగాలు స్ట్రెచ్ అవడం వల్ల వాటి బలం పెరుగుతుంది.
ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు నిపుణుల సాయం తీసుకోవడం మేలు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి..
-జి.అనూష,
యోగా గురు
Comments
Please login to add a commentAdd a comment