అవయవ దానానికి ఈ సారి విశాఖ వేదికైంది.
విశాఖపట్టణం: అవయవ దానానికి ఈసారి విశాఖ వేదికైంది. స్థానిక కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 29 సంవత్సరాల ఆలపాటి సూర్యనారాయణ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే ఈసారి మృతుని గుండె అవయవమార్పిడికి పనికి రాదని డాక్లర్లు తేల్చడంతో .. లివర్, ఊపిరిత్తిత్తులను, కిడ్నీలు, కార్నియాలను సేకరించారు. వీటిలో లివర్, కిడ్నీలను స్థానిక, అపోలో, కేర్ అసుపత్రిలోని పేషెంట్లకు అమర్చనున్నారు.
కాగా ఊపిరితిత్తులను చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమరో వ్యక్తికి రెండు ఊపిరితిత్తులను అమర్చనున్నారు. ప్రత్యేక ఎయిర్ ఆంబులెన్స్లో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.