transplantation
-
ఆపరేషన్.. ట్రాన్స్ ప్లాంటేషన్..
‘శ్రీశైలం రహదారిలో ఓ స్థల యజమాని తన ప్లాట్‌లో అడ్డుగా ఉన్న రెండు మర్రి చెట్లను కొట్టేసి రోడ్డు పక్కన నిర్జీవంగా పడేశాడు. ఇది చూసిన వృక్ష ప్రేమికులు వందేళ్ల వయసు ఉన్న ఈ చెట్లను కాపాడుకోవాలని భావించారు. మరి, అంత పెద్ద చెట్లు తరలించాలంటే భారీ క్రెయిన్, పెద్ద లారీ, కారి్మకులు అవసరం. వీటి ఖర్చు కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న నాల్గో తరగతి అమ్మాయి స్పందించింది. చెట్లు తరలించేందుకు అయ్యే ఆర్థిక సహాయాన్ని అందించింది. అంతే ఈ చెట్లను అక్కడి నుంచి మణికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ చెట్టు స్కూల్ విద్యార్థులకు నీడనిస్తూ హాయిగా ఉంది.’ ‘ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలో భారీ వర్షానికి చీమ చింతకాయ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టును ఎలాగైనా కాపాడాలని ప్రిన్సిపాల్ భావించారు. భారీ క్రెయిన్ సహాయంతో 300 మంది స్కూల్ విద్యార్థులు చూస్తుండగా ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. ఇక అక్కడి నుంచి ప్రతి ఏటా జులై 23న స్కూల్ విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టుకు రాఖీ కడుతూ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.’ ఇలా ఒకటీ రెండూ కాదు కొత్త సచివాలయం, కూకట్‌పల్లిలో ఫోరం మాల్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న వందలాది వృక్షాలను వాటా ఫౌండేషన్ దత్తత తీసుకుంది. వాటిని భారీ క్రెయిన్లు, లారీలతో వేరే చోటుకు తరలించింది. ఇప్పటి వరకూ 2,500కు పైగా వృక్షాలను వేరే చోటుకు తరలించింది. 2010 నుంచి హైదరాబాద్‌లో వాటా ఫౌండేషన్ చెట్ల దత్తత, తరలింపు సేవలను అందిస్తుంది. 10 మంది వలంటీర్లు ఉన్న ఈ ఫౌండేషన్ ఇప్పటివరకూ కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, గచి్చ»ౌలి, తెల్లాపూర్ వంటి నగరం నలువైపులా సుమారు 2,500 వృక్షాలను దత్తత తీసుకుంది. ఒక చోటు నుంచి వేరే చోటుకు చెట్టును తరలించేందుకు అవసరమైన జేసీబీ, క్రెయిన్, భారీ లారీ, కార్మికులు ఇతరత్రా ఖర్చులను చెట్లను దత్తత తీసుకునే వాళ్లు భరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు చెట్టును మాత్రమే నిర్వహణ చేస్తాం.. ఖర్చు భరించలేం అంటే క్రౌండ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చెట్టును తరలిస్తారు. చెట్టు రూట్ ప్యాకింగ్, కొమ్మలు కత్తిరించడం, జేసీబీ, క్రెయిన్, పెద్ద లారీ వంటి వాహనాల ఏర్పాటు తదితరాల కోసం ఒక్క చెట్టును తరలించేందుకు 3 వారాల సమయం పడుతుంది.సచివాలయంలోని చెట్లు ఫామ్‌హౌస్‌కు.. కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో అక్కడున్న వేప, సుబాబుల్, మర్రి, రావి, పెల్టోఫోరం, కొబ్బరు, కానుగ, గుల్మోహర్, రాయల్ ఫామ్, బాదం, చింత, నేరేడు వంటి చాలా చెట్లను కొట్టేశారు. వీటిలో వంద ఏళ్ల నాటి చెట్లను వేరే చోటుకు తరలించేందుకు వాటా ఫౌండేషన్ ముందుకొచ్చింది. 18 మర్రి చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. ఈ ఖర్చు మొత్తం ఆ ఫామ్‌హౌస్ యజమానే భరించారు. కూకట్‌పల్లిలో ఫోరం మాల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం సమయంలో అక్కడున్న వంద చెట్లను కొట్టేశారు. వీటిలో 70 వృక్షాలను మణికొండ స్మశానం, క్రికెట్ మైదానం చుట్టూ నాటారు.ఫామ్‌హౌస్, ఆఫీసుల్లో ఏర్పాటు.. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల ఇళ్లతో పాటు శామీర్‌పేట, చేవెళ్ల, గండిపేట, మహేశ్వరం, ఘట్కేసర్ వంటి నగరం నలువైపులా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఇంటీరియర్ కోసం ఈ పెద్ద చెట్లను వినియోగి స్తున్నారు. ప్రముఖ దర్శకులు తమ ఫామ్‌హౌస్‌లో 3 మర్రి, 25 రావి చెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రైవేట్ కంపెనీలు వారి కార్యాలయం చుట్టూ, ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఈ చెట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నీళ్లు పోస్తే సరిపోదు..వృక్షాలను ఎండాకాలంలో తరలించ కూడదు. రూట్ ప్యాకింగ్ చేసిన తర్వాత వేర్లు బలంగా, ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేస్తారు. చెట్టు కొమ్మలు కత్తిరించి, చెదలు పట్టకుండా పెస్టిసైడ్స్ పూస్తారు. భూమిలో నుంచి చెట్టను తీసిన తర్వాత గంట వ్యవధిలోపు తిరిగి నాటాలి. లేకపోతే మనుగడ సాగించలేవు. చెట్టును ట్రాన్స్‌లొకేట్ చేసిన తర్వాత రెండేళ్ల పాటు దాని బాగోగులు చూసుకోవాలి. కేవలం నీళ్లు పోయడంతోనే సరిపోదు. చాలా మంది చెట్టుకు ఆకులు రాగానే నీళ్లు పోయడం ఆపేస్తారు.అనుమతిలో జాప్యమెందుకు? రాత్రికి రాత్రే దొంగతనంగా చెట్లు కొట్టేస్తే అడిగేవాళ్లు ఉండరు. కానీ చెట్లు సేవ్ చేస్తామని ముందుకొచ్చే వారికి అనుమతి ఇచ్చేందుకు 2–3 నెలల సమయం తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. దీంతో స్థల యజమాని ఆగలేక చెట్లను కొట్టేసి రోడ్ల మీద పడేస్తున్నారు. నగరంలో చెట్ల సంరక్షణ కమిటీ ఉన్నా తూతూ మంత్రంగా పనిచేస్తోంది. – ఉదయ్ కృష్ణ, కో–¸ûండర్, వాటా ఫౌండేషన్ -
మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ..ఎలా అంటే!
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్‌లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగింది.వివరాల్లోకి వెళితే.. జబల్పూర్లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు. -
అపరాలలోనూ విత్తన మార్పిడి
సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్‌లో కందులులో ఎల్‌ఆర్‌జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా, ఎల్‌ఆర్‌జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా విస్తరణ డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివరిస్తారు. మినుములో ప్రత్యామ్నాయ రకాలు » పీయూ–31కు బదులుగా ఖరీఫ్ సీజన్లో ఎల్బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్8, ఎల్జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. » తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్బీజీ 904 రకం » ఎల్బీజీ 752కు బదులుగా ఖరీఫ్‌లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్ 8, ఎల్బీజీ 904, జీబీజీ1, ఎల్బీజీ 787 » టీ–9కు బదులుగా రెండు సీజన్లలో ఎల్బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్బీజీ 904 రకం ఏపీ సీడ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: » ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 574, ఎల్జీజీ 607,ఎల్జీజీ 630 ఎల్జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు » ఎల్జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 607 రకాలు, ఎల్జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్జీజీ 630, ఎల్జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్‌ఆర్‌జీ 52 స్థానంలో ఖరీఫ్‌లో టీఆర్జీ 59 (తిరుపతి కంది), ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33, పీఆర్జీ 176 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. » ఎల్‌ఆర్‌జీ 41 స్థానంలో ఖరీఫ్‌లో పీఆర్జీ 158, టీఆర్జీ 59, ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 (సౌభాగ్య), పీఆర్జీ 176, ఎల్‌ఆర్‌జీ 52 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 రకాలు » ఐసీపీహెచ్ 2740, ఐసీపీఎల్ 87119, పీఆర్జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105 రకం » ఐసీపీహెచ్ 87063 కు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. శనగలో ప్రత్యామ్నాయ రకాలు శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్‌బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్‌బీఈజీ 776 రకాలు, ఎన్ఈజీ 452 (నంద్యాల గ్రామ్ 452), ఎన్‌బీఈజీ 810 (నంద్యాల గ్రామ్ 810), ఎన్‌బీఈజీ 857 (నంద్యాల గ్రామ్) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప అడగొద్దు: రానా ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి గుర్గావ్లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు. రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్‌లోని మాయో క్లినిక్‌లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు. హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు. 'ప్రకృతే గొప్ప వైద్యం' రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్‌లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది. కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి బ్రెస్ట్ ఇంప్లాంట్..!
ఇంతవరకు మహిళలు తమ అందం కోసం లేదా ఇతర కారణాల వల్ల బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంటుంది. కానీ ఇలా ఓ మనిషి ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఓ వ్యక్తికి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియను నిర్వహించారు. ఇంతకీ ఎందువల్ల ఇలా చేశారు ఏంటీ ? తదితరాల గురించి చూద్దాం! అమెరికాలో సెయింట్ లూయిస్‌కు చెందిన 34 ఏళ్ల డేవీ బాయర్ తనకున్న చెడు అలవాట్ల కారణంగా రెండు ఊపిరితిత్తులు దారుణంగా పాడైపోయాయి. ఎంతలా అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురై చీముతో నిండి ఉన్నాయి. అతడు 21 ఏళ్ల వయసు నుంచే రోజూకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగేసేవాడు. ఆ దురఅలవాటే అతడి ఊపిరితిత్తులను పూర్తిగా హరించేశాయి. చివరికి తీవ్రమైన ఫ్ల్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పలు వైద్య పరీక్షలు చేయగా అతని ఊపిరితిత్తులు దారుణంగా పాడైనట్లు గుర్తించారు. దీంతో ఎంత వరకు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని ఎక్స్‌రే తీసి చూడగా..ఇంకేమి మిగిలి లేదని తేలింది. ఆ ఊపిరితిత్తులు పూర్తిగా ద్రవంలా మారిపోవడం ప్రారంభించాయని గుర్తించారు. దీంతో అతడికి తక్షణమే ఊపిరితిత్తుల మార్పిడి చేయక తప్పదని నిర్ణయించారు వైద్యులు. ఇదొక్కటే మార్గమని లేకపోతే ప్రాణాలతో రక్షించటం అసాధ్యమని అతనికి తెలిపారు. అతని ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేలా రెండు ఊపిరితిత్తులను తొలగించి కృత్రిమ ఊపిరితిత్తులను (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ లేదా ECMO, అవసరమైన వారికి శ్వాసకోశ మద్దతులో భాగంగా) ఉపయోగించారు. అదే టైంలో అతని గుండె పదిలంగా ఉండి సజీవంగా ఉండాలంటే..ఛాతీ కుహరంలో డీడీ బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయక తప్పలేదు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..అతని ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సదుపాయంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
తిరుపతి: తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. 33 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం గుంటూరు నుంచి ప్రత్యేక చాపర్‌లో గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రికి తరలించారు. గుండె తరలింపునకు సీఎం జగన్ చొరవతో ప్రత్యేక చాపర్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చొరవతో రెండేళ్ల కిందటే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తున్నారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అనతికాలంలోనే ది బెస్ట్‌గా గుర్తింపు సాధించింది. ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి -
78 ఏళ్ల వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు. వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు. (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?) -
చెయ్యి తెగితే.. మరొకరి చెయ్యి అతికిస్తారిక్కడ
సాక్షి, హైదరాబాద్: ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మను.. కేరళలోని కొచ్చికు చెందిన ఆయన రైలు ప్రమాదంలో రెండు చేతులనూ కోల్పోయారు. చాలా కాలంపాటు కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికాడు. కానీ ఇప్పుడు ఆయనకు రెండు చేతులూ ఉన్నాయి. అందరిలాగే తానూ పనిచేసుకుని బతుకుతున్నాడు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆయనకు ఈ కొత్త జీవితాన్ని కల్పించింది. ఈ ఆస్పత్రికి చెందిన తల, మెడ, ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విభాగాధిపతి సుబ్రమణ్యం అయ్యర్ దేశంలోనే తొలిసారిగా మనుకు చేతి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తికి చెందిన రెండు చేతులను తీసుకుని మనుకు అమర్చారు. ఇందుకోసం క్లిష్టమైన సర్జరీ చేయడంతోపాటు ఆరు నెలల పాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మను తన ‘కొత్త’చేతులను మామూలుగా వినియోగించడం మొదలుపెట్టారు. ఈ చేతి మార్పిడి తర్వాత.. మరెంతో మంది ఇలాంటి చికిత్సల కోసం వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లోనే ఈ చికిత్సలు మన దేశంలో కిడ్నీ, లివర్, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చాలా ఆస్పత్రులలో జరుగుతున్నాయి. కానీ ఏదైనా ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయిన వారికి ఇతరుల చేతులను అమర్చే శస్త్రచికిత్సలు ఐదారు ఆస్పత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటగా కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో జరిగింది. ఎక్కువ చికిత్సలూ అక్కడే చేశారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 40 మంది రోగులకు చేతులు మార్పిడి చేయగా.. అందులో 14 మంది రోగులకు అమృత ఆస్పత్రిలోనే జరిగాయి. ఈ 14 మందికి కలిపి 26 చేతులను మార్పిడి చేశారు. ఇద్దరికి భుజాలు దెబ్బతినడంతో ఒక్కో చేతిని మాత్రమే మార్పిడి చేశారు. ఇలాంటి ఇన్ని చికిత్సలు చేయడం ప్రపంచంలోనే అమృత ఆస్పత్రిలో ఎక్కువని అక్కడి వైద్యులు చెప్తున్నారు. నాలుగు వైద్య బృందాలతో.. చేతుల మార్పిడి శస్త్రచికిత్స కోసం నాలుగు వైద్య బృందాలు కలిసి పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. రెండు బృందాలు రోగికి చేతిని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తాయని.. మరో రెండు బృందాలు బ్రెయిన్‌డెడ్ వారి నుంచి చేతులను తీసుకోవడానికి సిద్ధం చేస్తాయని వివరించారు. మొత్తంగా దాదాపు 16 గంటల పాటు శస్త్రచికిత్స జరుగుతుందని.. తర్వాత రోగి కొన్నినెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఫిజియో థెరపీ, ఇతర చికిత్సలతో అమర్చిన అవయవం సరిగా పనిచేస్తుందో లేదో చూస్తారని వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికే చెయ్యి మార్పిడి చేయవచ్చని, చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. నాలుగు రోజుల్లో పనిచేయడం మొదలవుతుంది బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచే వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు చేతులను స్వీకరిస్తాం. ఆ వ్యక్తి, అమర్చే వారి బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉండాలి. చెయ్యి మార్పిడి చికిత్స చేసిన నాలుగు రోజుల్లో రోగి ‘కొత్త’చేతులతో మంచినీటి గ్లాసు పట్టుకోగలరు. పూర్తి స్థాయిలో చెయ్యి పనిచేయాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులకు అవసరమైన మేర అవయవాలు దొరకడం లేదు. బ్రెయిన్‌డెడ్ అయిన పేషెంట్ల కుటుంబ సభ్యులు దానానికి ముందుకు రావాలి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన రావాల్సి ఉంది. – డాక్టర్ సుబ్రమణ్యం అయ్యర్, అమృత ఆస్పత్రి వైద్యుడు -
జీఎం ఆవాల విడుదలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) ఆవాల విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జీఎం ఆవాల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు గురువారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈలోగా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోరాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి తెలిపింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు వీలుగా జీఎం ఆవాలను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అరుణా రోడ్రిగ్స్ తన పిటిషన్లో సవాల్ చేశారు. -
అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (GODT)ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు 12వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... " "జీతే జీ రక్తదాన్, మర్నే కే బాద్ అంగదాన్(ప్రత్యక్ష రక్తదానం, మరణానంతరం అవయవ దానం)" అనేది మన జీవితానికి నినాదంగా ఉండాలి. అంతేకాదు మన సంస్కృతి "శుభ్", "లాభ్" లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. (చదవండి: కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి) పైగా ఇక్కడ వ్యక్తిగత శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతో మిళతమవుతోంది. అయితే 2010 నుంచి చనిపోయిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాడానికే ప్రతి ఏడాది భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాదు 2012-13తో పోలిస్తే అవయవదానం రేటు నాలుగు రెట్లు పెరిగింది. ఈ మేరకు దేశంలో సంవత్సరానికి జరిగే అవయవ మార్పిడిల సంఖ్య 2013లో 4990 ఉండగా 2019కి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 12746కి పెరిగింది. అయితే భారత్ ఇప్పుడు యూఎస్ఏ, చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి, ఇతరులు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయాలి" అని ఆరోగ్య మంత్రి మాండవియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) -
ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సంచలనం
పరిశోధకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రయోగం ఫలించింది. ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్‌లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. ఈ సక్సెస్‌తో పంది గుండెను మనిషికి అమర్చే తరుణం కూడా దగ్గరలోనే ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. తాజాగ ప్రపంచంలో తొలిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి చేశారు. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇది పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళా రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు మూత్ర పిండాన్ని దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నేపథ్యంలో ఆమెకు పంది కిడ్నీని అమర్చేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు, కొత్త కిడ్నీని ఆమె రక్తనాళాలకు జతచేశారు. మార్పిడి చేసిన మూత్ర పిండాల పనితీరు, పరీక్షఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని దీనికి నాయకత్వం వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమేరీ తెలిపారు. ఈ ప్రయోగ ఫలితంగా అవయవ మార్పిపై కొత్త ఆశలు చిగురించాయి. జెనోట్రాన్స్ప్లాంటేషన్ కల సాకారంలో ఇదొక కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్‌బ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రతి ఏడాది వేలాదిమంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్‌సేఫ్ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్‌కు చెందిన రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్సేఫ్పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. ఈ మూత్రపిండ మార్పిడి ప్రయోగం ఎండ్-స్టేజ్ కిడ్నీఫెయిల్యూర్ ఉన్న రోగులలో, వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రయల్స్‌కు మార్గం సుగమం చేయాలని, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత అయిన మోంట్గోమేరీ అన్నారు. జంతువుల అవయవాలను మార్పిడి అవకాశంపై దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. పంది గుండె ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే 2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశంపై కూడా ఈయన చర్చించారు. ఒకవేళ మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. యూకేలో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ 40 ఏళ్ల క్రితమే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం విశేషం. కాగా భారతదేశంలో మొట్టమొదటి మానవ మూత్రపిండ మార్పిడి 1965లో బొంబాయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో జరిగింది. అయితే విజయవంతమైన తొలి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1971 ఫిబ్రవరి 2న షణ్ముగం అనే రోగికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి వైద్యులు తొలి విజయాన్ని నమోదు చేశారు. అమెరికాలో దాదాపు 1,07,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇందులో 90వేలకు పైగా రోగులు కిడ్నీ కోసం ఎదురుచూస్తుండగా, రోజుకు 12 మంది చని పోతున్నారు. భారతదేశంలో కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో లేక దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 2 లక్షల మందికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి చేయించు కుంటున్నారు. అలాగే లక్షా యాభై వేల మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఎదురు చూస్తున్నారట. ముఖ్యంగా అవయవ దానంపై అవగాహన లేక పోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆర్గాన్ డొనేషన్‌కి ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. -
మెడికల్ వండర్; రంగు మారింది!
కొచ్చి: ఆసియాలోనే తొలిసారిగా ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఓ యువతికి అతికించిన ఓ యువకుడి రెండు చేతుల రంగు మూడేళ్ల తర్వాత ఆమె చర్మం రంగులోకి మారింది. శ్రేయా సిద్ధనగౌడ చేతుల చర్మపు రంగు ఆమె శరీరం రంగు మాదిరిగా మారిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఇందుకు శాస్త్రీయ కారణాలు వివరించడం కష్టమని పేర్కొన్నారు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2017లో దాదాపు 13 గంటల పాటు శ్రమించి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి చేతులను శ్రేయకు డాక్టర్లు అతికించారు. ఇంతకాలానికి అతడి చేతుల బరువు తగ్గిపోయి.. శ్రేయ సొంత చేతుల మాదిరిగానే మారిపోయాయి. అంతేకాదు చేతులపై వెంట్రుకలు కూడా చాలావరకు తగ్గిపోయాయి. బైక్ యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాలు తగలడంతో సచిన్ అనే 20 ఏళ్ల కుర్రాడికి బ్రెయిన్ డెడ్ అయింది. అతడి చేతులను దానం చేసేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అమృతా ఆస్పత్రి తల, మెడ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ కె.సుబ్రమణియ అయ్యర్ ఆధ్వర్యంలో 20 మంది సర్జన్లు సహా 36 మందితో కూడిన బృందం శ్రేయకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆమె చేతుల రంగు మారేందుకు స్త్రీ హార్మోన్లు ప్రభావితం చేసి ఉండకపోవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ‘చర్మం రంగు విషయంలో స్త్రీ హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపవు. కేవలం మెలనిన్ మాత్రమే ఆ పని చేస్తుంది. మెదడు ఉత్పత్తి చేసే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నియంత్రిస్తుంటుంది. ఈ హార్మోన్ స్థాయుల ద్వారానే ఆ రంగు మారి ఉంటుంది’ అని అయ్యర్ వివరించారు. చేతులపై వెంట్రుకలు క్రమంగా తగ్గిపోవడానికి కారణం టెస్టోస్టిరాన్ హోర్మన్ లేకపోవడమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలిస్ట్ షెహ్లా అగర్వాల్ వెల్లడించారు. చేతులు దానం చేసిన యువకుడు శ్రేయ కంటే సమయం ఎండలో గడపడం వల్లే అతడి చేతులు ముదురు రంగులోకి మారాయని తెలిపారు. శ్రేయకు అతికించిన తర్వాత అతడి చేతులు లేత వర్ణంలోకి మారాయని అభిప్రాయపడ్డారు. (చదవండి: కరోనా తొలి బాధితుడి అనుభవాలు) -
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
-
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
సాక్షి, చైన్నై : నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత పెరిగిందో.. ప్రమాదాల శాతం అంతే పెరిగింది. ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్రంగా గాయపడి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో బతుకు దుర్భరంగా మారుతోంది. అయితే, అలాంటి వారికి సరైన వైద్యం అందితే తిరిగి మామూలు మనుషులయ్యే అవకాశం ఉంది. విద్యుతాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి చేతులను అతికించారు చెన్నై డాక్టర్లు. 13 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌తో గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ డాక్టర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వివరాలు.. హైదరాబాద్‌లోని దుండిగల్‌కు చెందిన నారాయణ స్వామి మేస్త్రీ పని చేసేవాడు. 2015లో ఓ ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో అతను రెండు చేతులూ కోల్పోయాయి అవిటివాడయ్యాడు. ఈ క్రమంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తికి చెందిన రెండు చేతులను నారాయణ స్వామికి చెన్నై డాక్టర్లు ట్రాన్స్‌ప్లాంట్ చేసి అతికించారు. ఈ ఆపరేషన్ గత ఫిబ్రవరిలో జరగగా.. నారాయణ స్వామి, డాక్టర్లు తాజాగా మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడడం, తేలిక పాటి వస్తువులు ఎత్తడం వంటి పనులు చేస్తున్నాడిప్పుడు నారాయణ స్వామి. నిజంగా వైద్యో నారాయణో హరియే కదా..!! కాగా, తమిళనాడు చరిత్రలో ఇదే తొలి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కావడం విశేషం. -
ఒక్క‘ట్రీ’ బతకలేదు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఆటంకంగా మారిన ఏళ్లనాటి వృక్షాలను తొలగించిన అధికారులు.. వాటిని శాస్త్రీయ పద్ధతిన సంరక్షించేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. 2017 జూన్‌లో ఆర్ అండ్ బీ, అటవీశాఖ అధికారులు తొలగించిన చెట్లకు ప్రాణం పోసేందుకు చేసిన కృషి మట్టిపాలైంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా నాటిన 55 చెట్లు బతకలేదు. మొత్తం 300 వృక్షాలకు పునరుజ్జీవం పోసేందుకు రూ.36 లక్షలు కేటాయించగా.. 55 చెట్లను క్రేన్ల సాయంతో మట్టితో సహా పెకిలించి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో నాటారు. సంరక్షణ చర్యలు విస్మరించడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఏళ్లనాటి చెట్లు ఎండిపోయాయి.. పట్టణంలో 20 – 30ఏళ్ల క్రితం చెట్లు రోడ్డు విస్తరణలో తొలగించాల్సి వచ్చింది. ఫారెస్ట్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలు తొలగించి, వేర్లతో సహా పెలించారు. అయితే, మట్టి వాటి వేర్లకు అంటుకుని ఉండకపోవడంతో చెట్లు వాడిపోయాయి. వాటిని నాటిన ప్రాంత భూసారం, అవి పెరిగిన ప్రాంత భూసారానికి తేడా ఉండడంతో వృక్షాలు జీవం పోసులేకపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు అప్పట్లో చెట్లను రక్షించేందుకు చేపట్టిన చర్యలు అభినందనీయం కాగా.. ఆ చెట్లు ఒక్కటీ దక్కకపోవడం బాధాకరం. కొన్ని నాటి ఆపేశాం జిల్లాకేంద్రంలో 300 చెట్లను తరలించాలని భావించాం. కానీ కొన్ని చెట్లను తరలించిన తర్వాత అవి బతికే అవకాశం లేదని తెలిసింది. వేర్లకు మట్టి అంటుకుని ఉండలేదు. ఇది గుర్తించి మిగితా వాటిని నాటకుండానే వదిలేశాం. కొత్త విధానంలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. – విఘ్నేశ్వర్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ -
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా...
బీజింగ్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 3డి విధానంతో తయారైన కృత్రిమ దవడను 10 సంవత్సరాల బాలుడికి అమర్చారు వైద్యులు. చైనాకు చెందిన చిన్చాంగ్ అనే 10 సంత్సరాల బాలుడి దవడలో ట్యూమర్ ఉందని గుర్తించిన వైద్యులు దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. అయితే అప్పటినుంచి కింది దవడ పనిచేయటం మానేసింది. దీంతో 3డి విధానంలో తయారు చేసిన దవడను బాలుడికి అమర్చాలని నిశ్చయించుకున్నారు వైద్యులు. బాలుడి దవడకు సరిపోయేలా టైటానియంతో 3డి దవడను తయారుచేయించి అతనికి అమర్చారు. జినాన్లోని షాంగ్‌డాంగ్ యూనివర్శిటీ వైద్యులు మూడు గంటల పాటు కష్టపడి చికిత్సను పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత బాలుడు మామూలు స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు. -
చేతిలో చెవిని పెంచారు..!!
టెక్సస్ : వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనడానికి టెక్సస్‌లో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఓ వ్యక్తి శరీరంలో ఏదైనా అవయవం పాడైపోతే.. దాని స్థానంలో మరో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని అమర్చుతున్నారు. కానీ అమెరికా మిలిటరీ వైద్యులు చెవిని కొల్పోయిన ఓ మహిళ శరీరంలోనే కొత్త చెవిని పునరుత్పత్తి చేశారు. వివరాల్లోకి వెళితే... ఆర్మీలో పనిచేస్తున్న షమిక బ్యూరేగ్ అనే అధికారిణి 2016లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో ఆమె తన చెవిని కొల్పోయారు. వినికిడి శక్తిని కోల్పోయారు. దీంతో ఆమెను తిరిగి ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని భావించిన మిలిటరీ వైద్యుల బృందం సహజసిద్ధమైన చెవిని తిరిగి ఏర్పరచాలని భావించారు. ఇందుకోసం 2012లో తొలిసారి జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీలో సహజసిద్ధంగా చెవిని తిరిగి సృష్టించి.. దానిని అమర్చిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మిలటరీ వైద్యులు ఆ దిశగా అడుగులు వేశారు. టెక్సస్‌లోని విలియం బ్యూమెంట్ మెడికల్ సెంటర్లో షమిక పక్కటెముకల నుంచి మృదులాస్థిని తీసుకొని దాన్ని చెవి ఆకృతిలోకి మార్చారు. ఆ తర్వాత దానిని ఆమె ముంజేతిలో అమర్చి.. స్వతహాగా అది వృద్ధి చెందించడంతో పాటు కొత్త రక్త నాళాలు, స్పందనలు ఏర్పడేలా చేశారు. తర్వాత శస్త్ర చికిత్స ద్వారా చెవిని తిరిగి షమికకు అమర్చారు. దీనిపై షమిక మాట్లాడుతూ.. ‘మొదట్లో నేను దీనికి ఇష్టపడలేదు. వైద్యులు, ఆర్మీ అధికారులు దీని గురించి పూర్తిగా వివరించిన తర్వాత బాగుంటుందేమో అనిపించింది. అవయవ మార్పిడి భయం కలిగించినప్పటికీ నాకు చెవి ఉంటే బాగుంటుందని అనిపించడంతో ఇందుకు ఒప్పుకున్నాను’ అని పేర్కొన్నారు. -
యశోద హాస్పిటల్లో అరుదైన చికిత్స
-
ఈసారి విశాఖ నుంచి చెన్నైకి..
విశాఖపట్టణం: అవయవ దానానికి ఈసారి విశాఖ వేదికైంది. స్థానిక కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 29 సంవత్సరాల ఆలపాటి సూర్యనారాయణ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే ఈసారి మృతుని గుండె అవయవమార్పిడికి పనికి రాదని డాక్లర్లు తేల్చడంతో .. లివర్, ఊపిరిత్తిత్తులను, కిడ్నీలు, కార్నియాలను సేకరించారు. వీటిలో లివర్, కిడ్నీలను స్థానిక, అపోలో, కేర్ అసుపత్రిలోని పేషెంట్లకు అమర్చనున్నారు. కాగా ఊపిరితిత్తులను చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమరో వ్యక్తికి రెండు ఊపిరితిత్తులను అమర్చనున్నారు. ప్రత్యేక ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.