
ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 3డి విధానంతో తయారైన కృత్రిమ దవడను 10 సంవత్సరాల బాలుడికి అమర్చారు వైద్యులు. చైనాకు చెందిన చిన్‌చాంగ్ అనే 10 సంత్సరాల బాలుడి దవడలో ట్యూమర్ ఉందని గుర్తించిన వైద్యులు దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. అయితే అప్పటినుంచి కింది దవడ పనిచేయటం మానేసింది. దీంతో 3డి విధానంలో తయారు చేసిన దవడను బాలుడికి అమర్చాలని నిశ్చయించుకున్నారు వైద్యులు. బాలుడి దవడకు సరిపోయేలా టైటానియంతో 3డి దవడను తయారుచేయించి అతనికి అమర్చారు. జినాన్‌లోని షాంగ్‌డాంగ్ యూనివర్శిటీ వైద్యులు మూడు గంటల పాటు కష్టపడి చికిత్సను పూర్తి చేశారు. మూడు నెలల తర్వాత బాలుడు మామూలు స్థితికి చేరుకుంటాడని వైద్యులు తెలిపారు.