ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు.
వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు.
అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు.
అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు.
(చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment