resident
-
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్‌ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్‌కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్‌తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్‌లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్‌ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
78 ఏళ్ల వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు. వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు. (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?) -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్‌షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విశాఖవాసి మృతి
అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నామాని మధు మృతి చెందారు. ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన మధు కారు హైవే మీద సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి, అతని భార్యకు సమాచారం అందించారు. అప్పటికే బాగా ఆలస్యమై, రక్తస్రావం కావడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మధు మృతి చెందారు. మధు ఇటీవలే ఉద్యోగం నిమిత్తం అమెరికాలోని న్యూజెర్సీకు వచ్చారని, ఇక్కడే భార్యతో పాటు ఉంటున్నారని.. తల్లిదండ్రుల వీసా కోసం ప్రయత్నాల్లో ఉండగా ఈ ఘోరం జరిగిందని అతని స్నేహితుడు హరికృష్ణ 'సాక్షి'కి తెలిపారు. కాలిఫోర్నియాలో ఉన్న మధు అన్నయ్యకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన మధు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మధు మృతదేహాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్టణానికి తరలించేందుకు నాటా ఏర్పాట్లు చేస్తోంది. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల పదవీకాలానికి సోమవారం హెచ్ఐ ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ముష్తాక్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన మరియమ్మ కోషీ సీనియర్ ఉపాధ్యక్షురాలుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారి జస్టిస్ అరుణా సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలకు భారత ఒలింపిక్ సంఘం తరఫున పరిశీలకులుగా కుల్దీప్ వాట్స్ హాజరయ్యారు. తనపై నమ్మకముంచిన సభ్యులకు బాత్రా కృతజ్ఞతలు తెలిపారు.