అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విశాఖవాసి మృతి | Vizag resident dies in road accident in New jersey | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విశాఖవాసి మృతి

Published Thu, Jun 16 2016 7:48 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విశాఖవాసి మృతి - Sakshi

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విశాఖవాసి మృతి

అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నామాని మధు మృతి చెందారు. ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన మధు కారు హైవే మీద సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి, అతని భార్యకు సమాచారం అందించారు. అప్పటికే బాగా ఆలస్యమై, రక్తస్రావం కావడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మధు మృతి చెందారు.

మధు ఇటీవలే ఉద్యోగం నిమిత్తం అమెరికాలోని న్యూజెర్సీకు వచ్చారని, ఇక్కడే భార్యతో పాటు ఉంటున్నారని.. తల్లిదండ్రుల వీసా కోసం ప్రయత్నాల్లో ఉండగా ఈ ఘోరం జరిగిందని అతని స్నేహితుడు హరికృష్ణ 'సాక్షి'కి తెలిపారు. కాలిఫోర్నియాలో ఉన్న మధు అన్నయ్యకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన మధు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మధు మృతదేహాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్టణానికి తరలించేందుకు నాటా ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement