photocredits: INDIATODAY
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్‌ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.
బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.
మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment