
బీట్‌రూట్‌తో ఊపిరి
పరిపరి శోధన
ఊపిరితిత్తులకు బీట్‌రూట్‌తో ఎనలేని మేలు కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ప్రతిరోజూ గ్లాసుడు బీట్‌రూట్ రసం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని బ్రిటన్‌లోని టన్‌బ్రిడ్జ్ జాతీయ ఆరోగ్య సేవల ట్రస్టుకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ సయ్యద్ హుస్సేన్ చెబుతున్నారు.
బీట్‌రూట్ రసంలోని విటమిన్లు రక్తానికి తగినంత ఆక్సిజన్ అందేలా చేస్తాయని ఆయన చెబుతున్నారు. బీట్‌రూట్ రసం తీసుకోవడం ద్వారా తరచు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవారు తేలికగా ఊపిరి తీసుకోవడమే కాకుండా, త్వరగా కోలుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు.