బీట్‌రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయెజనాలు లభిస్తాయి. పచ్చిగా తినవచ్చు. లేదా కూర చేసుకొని తినవచ్చు. ఇంకా బీట్‌రూట్‌తో జ్యూస్ చేసుకొని తాగవచ్చు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అలాగే మలబద్దకానికి మంచి మందు. వెరైటీగా బీట్‌రూట్‌తో వఫెల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!
కావలసినవి: ఓట్స్ –100 గ్రాములు; శనగపిండి లేదా ఉప్మా రవ్వ– 25 గ్రాములు; బీట్‌రూట్– చిన్న దుంప; పచ్చిమిర్చి –2; అల్లం– అంగుళం ముక్క; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ఆమ్‌చూర్ పౌడర్– అర టీ స్పూన్ ; జీలకర్ర పొడి– అర టీ స్పూన్; నెయ్యి– టీ స్పూన్.
తయారీ: ఓట్స్‌ను మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్ చేయాలి. పొడి అయిన తర్వాత అందులో శనగపిండి లేదా రవ్వ వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే ఆమ్‌చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిసే వరకు ఒకసారి తిప్పి ఒక పాత్రలో వేసి పక్కన ఉంచాలి మిక్సీ జార్‌లో బీట్‌రూట్, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్– శనగపిండి మిశ్రమంలో పోసి కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే తగినంత నీటిని చేర్చి ఉండలు లేకుండా కలపాలి
వఫెల్స్ చేసే ఇనుప పాత్రకు నెయ్యి రాసి వేడి చేసి అందులో పైన కలుపుకున్న ఓట్స్– బీట్‌రూమ్ మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది మూత పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి. మూత తీసి చూసుకుని పిండి చక్కగా కాలిన తర్వాత దించేయాలి. ఈ వఫెల్స్‌కి పుదీన చట్నీ లేదా సూప్, చీజ్ మంచి కాంబినేషన్.
Comments
Please login to add a commentAdd a comment