ఊపిరితిత్తుల్లో బొద్దింక! అదెలా సాధ్యం అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం వైద్యులే ఆ బొద్దింకను గుర్తించి కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..కేరళకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మాములుగానే తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ సమస్య ఉన్నటుండి ఒకరోజు మరింత దారుణంగా ఉంది. ఇక అతడు తాళ్లలేక ఆస్పత్రిని ఆశ్రయించాడు. శ్వాసకోశ సమస్యలున్న ఆ వ్యక్తి ఆస్పత్రి చేరేటప్పటికీ పరిస్థితి మరింత దిగజారి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడమే చాల కష్టతరమయ్యింది. ఎందువల్ల ఇలా జరిగింది? అని పల్మనాలజీ వైద్య బృందం అతడికి పలు వైద్య పరీక్షలు చేశారు. చివరికి స్కానింగ్‌లో సుమారు 4 సెంటిమీటర్ల బొద్దింక ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు.
దీనివల్ల అతడి శ్వాసకోశ సమస్యలు మరింత జఠిలంగా మారాయని తెలుసుకున్నారు. ఇక వెంటనే వైద్యులు దాదాపు ఎనిమిది గంటలు శ్రమించి అతడికి సర్జరీ చేసి ఊపరితిత్తుల్లో ఉన్న బొద్దింకను తొలగించారు. అయితే ఇలా బొద్దింక వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. మరీ అతని ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా చేరిందని వైద్యులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
ఆ రోగికి ఉన్న శ్వాసకోస సమస్యలు కారణంగా మెడలో శ్వాసనాళం అమర్చి దాని గుండా ఆక్సిజన్‌ని తీసుకునే ఏర్పాటు చేశారు వైద్యులు. అయితే అతడు రాత్రి పడుకునేటప్పుడూ ఆ ట్యూబ్‌ని మూసేయడం మరిచిపోవడంతో బొద్దింక లోపలకి ప్రవేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు డాక్టర్లు.
(చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment