త్రీడీ ఊపిరితిత్తులు! | 3D Lungs! | Sakshi
Sakshi News home page

త్రీడీ ఊపిరితిత్తులు!

Published Sun, May 14 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

త్రీడీ ఊపిరితిత్తులు!

త్రీడీ ఊపిరితిత్తులు!

న్యూయార్క్‌: మానవుడి ఊపిరితిత్తుల్లాగా పని చేసే అతిచిన్న త్రీడీ అవయవాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శ్వాస కోస సంబంధ వ్యాధు లపై మరింత అవగాహన పొందేందుకు ప్రయో గశాలల్లో అభివృద్ధి చేసిన ఈ అవయవాలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మానవుడి ప్లురిపొటెంట్‌ స్టెమ్‌ సెల్స్‌ (మూల కణాలు) సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్‌ (లంగ్స్‌)ను అభివృద్ధి చేశారు.

మానవుడి దేహంలోని ఊపరితిత్తుల మాది రిగా వీటిలో నిర్మాణాలను ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ) సోకినపుడు ఊపిరిత్తులు ఏ విధంగా స్పందిస్తాయో అదే విధంగా ఈ త్రీడీ ఆర్గనాయిడ్స్‌ కూడా స్పందించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ ఆర్గనాయిడ్స్‌ వివిధ రకాల నూతన ఔషధాలను పరీక్షించడానికి ఉపయోగపడ తాయని కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్‌ హాన్స్‌ విలియమ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement