అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘పాములపర్తి’
అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘పాములపర్తి’
Published Mon, Jul 25 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
వరంగల్ : ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ పాములపర్తి రామారావుకు స్థానం కల్పించారు. సంస్థ ఇండియా ప్రెసిడెంట్ నీలం.. గత 23 ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉచిత వైద్య సేవలందిస్తున్న రామారావును గుర్తించారు. అలాగే మెడ, నడుము ప్రాంతా ల్లో ‘డిస్క్‌లు’ జారడం వల్ల వచ్చే నొప్పుల నివారణకు రామారావు స్వయంగా కనుగొన్న ‘మసాజ్ థెరఫీ’కి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల విషయాలను గుర్తించారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి రామారావుకు ‘వండర్ బుక్స్ రికార్డ్స్’లో చోటు కల్పించిన ట్లు ఆయనకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా ప్రశంసాపత్రం, మెమోంటో, గోల్డ్‌మెడల్‌ను ఆయనకు పంపించారు. కాగా, ఈ బహుమతులను సోమవారం కలెక్టర్ వాకాటి కరుణ రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామా రావుకు అంతర్జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమన్నారు. డాక్డర్ రామారావు మాట్లాడుతూ అవార్డుతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నానని, తర్వాత పూర్తి సమయాన్ని రోగులకు కేటాయిస్తానని పేర్కొన్నారు.
Advertisement