International Wonder Book of Records
-
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మంది స్టెప్పులు! వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
-
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మందితో రికార్డు
Bullettu Bandi Song New Record: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన భోగరాజు పాడిన ఈ సాంగ్.. బారాత్‌లో ఓ పెళ్లికూతురి డ్యాన్స్‌తో సోషల్ మీడియా దృష్టిని ఆకట్టుకుంది. ఆపై రకరకాల వెర్షన్లతో క్రేజీ సాంగ్‌గా మారిపోయింది. తాజాగా ఈ సాంగ్ మరో ఫీట్ అందుకుంది. ఈ పాటకు జగిత్యాల పట్టణంలో 1000 మందితో నృత్యం చేయించి మరో మెట్టు ఎక్కించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భాగంగా రవి మచ్చ యూట్యూబ్ ఛానెల్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో మహిళలు, యువతులు, చిన్నారులు మొత్తం వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేష్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుల్లెట్ బండి సాంగ్‌ను రచయిత లక్ష్మణ్ రాయగా.. ఎస్కే బాజి సంగీతం అందించారు. -
పేపర్ గణపతికి ‘రికార్డు’ గుర్తింపు
యాకుత్‌పురా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేపర్‌తో చేసిన వినాయకుడిని నెలకొల్పిన పాతబస్తీ గౌలిపురా అంబికానగర్ ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థి ఆర్.చంద్రకాంత్ చారికి లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఇతడు మూడేళ్లుగా పేపర్ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ స్థానికంగా గుర్తింపు పొందాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 20 కిలోల న్యూస్ పేపర్లు, గోధుమ పిండి, వెదురు బొంగులతో 8.4 అడుగుల విగ్రహాన్ని రూపొందించాడు. సోమవారం రాత్రి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ గుర్రం స్వర్ణశ్రీ.. చంద్రకాంత్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. -
అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘పాములపర్తి’
వరంగల్ : ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ పాములపర్తి రామారావుకు స్థానం కల్పించారు. సంస్థ ఇండియా ప్రెసిడెంట్ నీలం.. గత 23 ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉచిత వైద్య సేవలందిస్తున్న రామారావును గుర్తించారు. అలాగే మెడ, నడుము ప్రాంతా ల్లో ‘డిస్క్‌లు’ జారడం వల్ల వచ్చే నొప్పుల నివారణకు రామారావు స్వయంగా కనుగొన్న ‘మసాజ్ థెరఫీ’కి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల విషయాలను గుర్తించారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి రామారావుకు ‘వండర్ బుక్స్ రికార్డ్స్’లో చోటు కల్పించిన ట్లు ఆయనకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా ప్రశంసాపత్రం, మెమోంటో, గోల్డ్‌మెడల్‌ను ఆయనకు పంపించారు. కాగా, ఈ బహుమతులను సోమవారం కలెక్టర్ వాకాటి కరుణ రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామా రావుకు అంతర్జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమన్నారు. డాక్డర్ రామారావు మాట్లాడుతూ అవార్డుతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నానని, తర్వాత పూర్తి సమయాన్ని రోగులకు కేటాయిస్తానని పేర్కొన్నారు.