గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స | Panchakarma treatment of gout problem | Sakshi
Sakshi News home page

గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స

Published Sun, Jan 11 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స

గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స

‘గౌట్’ అనేది ఒక రకమైన ఆర్థరైటీస్, దీన్నే ఆయుర్వేదంలో ‘వాత రక్తం’ అంటారు. మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో మోనోపాజ్ దశ తర్వాత కనిపిస్తుంది. ఈ గౌట్ ఆర్థరైటీస్‌ను ఆయుర్వేదంలోని శమన, శోధనతోపాటు పంచకర్మ చికిత్సలతో నివారించవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి.శరీరంలో జరిగే జీవనక్రియల సమతుల్యతలోపం వల్ల ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ రక్తంలో అధిక మోతాదులో చేరటం వల్ల కణజాలం వాపు ఏర్పడుతుంది.
 
వ్యాధి లక్షణాలు: సాధారణంగా కాలి బొటనవేలు గోట్‌కి గురవుతుంది. దీనివల్ల జాయింట్లు, కణజాలం దెబ్బ తింటాయి. రాత్రి సమయంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాపు, మంట, వేడి, ఎరుపుదనంతో కాలి బొటనవేలు  బాధిస్తుంది. మోకాళ్ళు, చీలమండలు, పాదాలు కూడా బాధిస్తాయి. ముట్టుకుంటే భరించలేనంత నొప్పి, వేడిగా ఉండటం, వాపు లక్షణాలు ఉంటాయి. ఇది చేతివేళ్ళు, మణికట్టుకు కూడా వ్యాపిస్తుంది. అలసట, జ్వరం లక్షణాలుగా ఉంటాయి. ఈ వ్యాధి ముదిరితే కీళ్ల దగ్గర చిన్న చిన్న స్ఫటికాలుగా కనిపిస్తుంది.
 
కారణాలు: ఇది కొన్నిసార్లు అనువంశికంగా రావచ్చు. కుటుంబంలో ఒకరికి ఉన్నట్లయితే భావితరాలకు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలు వాడటం వల్ల, మాంసాహారం అధికంగా తినడం వల్ల, అధిక బరువు, ఆల్కహాలు ఎక్కువగా తాగడం వల్ల, క్షయ నివారణ మందుల వల్ల, కేన్సర్ వ్యాధుల వల్ల యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయుర్వేదానుసారం వాతరక్తం, ఆద్యవాతం అంటే.. గౌట్ వ్యాధి, వాతదోషం, పిత్తదోషం, రక్తధాతువు మోతాదులో లవణం, ఆమ్లం, క్షార, ఉష్ణపదార్థాలు తీసుకోవటం వల్ల, నిల్వ పదార్థాలు తినడం వల్ల, పుల్లని పెరుగు, మజ్జిగ వాడటం, నిల్వచేసిన చేపలు, మాంసం తినడం వల్ల, ఉలవలు, అనుములు తీసుకోవటం వల్ల వస్తుంది.
 
రకాలు: వాతరక్తం రెండు రకాలు. ‘ఉత్ధాన వాతరక్తం’ అనే వ్యాధి... చర్మం, మాంసధాతువులో వ్యాపిస్తుంది. ‘గంభీర వాతరక్తం’ అనే వ్యాధి... ధాతువుల లోపల ఎక్కువ మోతాదులో వ్యాపిస్తుంది. బుడిపెల మాదిరిగా ఉంటుంది. ఈ వ్యాధిని తేలికగా తీసుకోరాదు. ఔషధాలు తీసుకోకపోతే బి.పి., మధుమేహం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కీళ్ళవాపు, వంకర్లు పోవటం, మూత్రపిండాల పని మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.
 
పంచకర్మ చికిత్సలు: స్వేహపానం, విరేచనం, అభ్యంగనం, స్వేదం, ఎలకిజి, పిబిజిల్, వస్తి, నవరరిజి... చక్కని ఫలితాలను ఇచ్చి వ్యాధిని తగ్గిస్తాయి. ‘రక్తమోక్షణం’ చక్కని ఫలితాలను ఇస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లయితే వాతరక్తం వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement