కొన్ని చెట్లకి ఆశ్చర్యకరంగా మన పురాణాల్లోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఐతే ఇప్పుడు మీరు వింట్ను చెట్లు పేరు కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అయిన అర్జునుడు పేరుతో పిలుస్తారు ఆ చెట్టుని. ఆ చెట్టు బెరడునను ఆయుర్వేదంలో తప్పనసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్లులో ఉండే ఔషధ గుణాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు.
అర్జున చెట్టు బెరడు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సిరలు, ధమనుల్లో రక్తం ప్రవాహం సాపీగా జరిగేలా చూస్తుంది. గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటుని నియంత్రింస్తుంది. ఒత్తిడి, దుఃఖం వల్ల కలిగే శారీరక ఒత్తడిని నియంత్రిస్తుంది
- పోగాకు, దూమపానం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షస్తుంది కూడా.
- ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి దివ్యౌషధం. కాలేయ వ్యాధి ముఖ్య లక్షణమైన స్టీటోసిస్‌ను ఎదుర్కొవడంలో అర్జునోలిక్ యాసిడ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది.
- అధిక కొలస్ట్రాల్ స్థాయిలకు గట్టి ప్రత్యర్థి అర్జున బెరుడు. హైపోకొలెస్టెరోలేమిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. లిపోప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ ఉనికిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- తరుచుగా గుండెల్లో మంటగా అనిపించే ఫీలింగ్‌కు చెక్ పెడుతుంది. మంచి డైజిస్టివ్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. శక్తిమంతమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాలను కలిగి ఉంది.
- కణుతుల పెరుగుదలను నియంత్రిస్తుంది.
గమనిక: అయితే అర్జున బెరడుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించడం మంచిది.
(చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..)
Comments
Please login to add a commentAdd a comment