బ్రిటీష్ కాలేజ్‌లో.. భారతీయ ఆయుర్వేదం | Indian Ayurveda In British College | Sakshi
Sakshi News home page

బ్రిటీష్ కాలేజ్‌లో.. భారతీయ ఆయుర్వేదం

Published Sat, Jun 1 2024 8:54 PM | Last Updated on Sat, Jun 1 2024 8:54 PM

Indian Ayurveda In British College

సనాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఇటు ఆధునిక భారతీయులు మాత్రమే కాదు, పాశ్చాత్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో యూకేలోని అతి పురాతన కళాశాలతో మన దేశానికి చెందిన ఆయుర్వేద ఆధునిక సమ్మిళిత వైద్యాన్ని ప్రోత్సహించే  పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేద (పీఎస్‌ఏ) చేతులు కలిపింది.

సాంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయికి  తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆయుర్వేద (బీఎస్‌ఏ)లో మెజారిటీ వాటాను స్వంతం చేసుకునేందుకు వీలుగా అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.

ఇందులో భాగంగా.. డాక్టర్‌ పోలిశెట్టి సాయి గంగా పనాకియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విభాగం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్‌ ఆయుర్వేద (ఐపీఎస్‌ఎ)లు.. యూకేలోని పురాతన ఆయుర్వేద కళాశాలలో పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేదంలో వినూత్న కోర్సులను పరిచయం చేయనుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద  జ్ఞానంతో అనుసంధానించే జీవనశైలి వేరియబుల్‌ పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఇదీ ఒకటి.

ఈ కొత్త భాగస్వామ్యం యూకే, భారత్‌ల ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా దాని విస్త్రుతి పెరుగుతుందని డాక్టర్‌ రవిశంకర్‌ పోలిశెట్టి  ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది బాగా తోడ్పడుతుందన్నారు.

మా భాగస్వామ్యం ఆయుర్వేద విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక, ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్త్రుత నైపుణ్యాలను అందిస్తుంది. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యులను తయారు చేస్తుందని డాక్టర్‌ పోలిసెట్టి వెల్లడించారు.

యూకే పార్లమెంట్‌లోని ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ సైన్సెస్‌ సెక్రటేరియట్‌ అమర్‌జిత్‌ భమ్రా సమక్షంలో డాక్టర్‌ పోలిశెట్టి, డాక్టర్‌ మౌరూఫ్‌ అథిక్, డాక్టర్‌ శాంత గొడగామా  ఎమ్‌ఒయూపై సంతకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement