univercitys
-
అన్ని వర్సిటీలకు ఉమ్మడి చట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలి పారు. ఐఐఎం, ఐఐటీలకు ఉన్న విధంగా బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్‌పర్సన్స్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించాలని అధికారులకు సూచించారు. సీఎం మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ విధానంలో) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వర్సిటీని ఏర్పా టు చేయాలని ఆదేశించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాల ని చెప్పారు. అధ్యాపకులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు వర్సిటీలను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. నవంబర్‌లోగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానం చేసి డీజీ లాకర్లో చేర్చాలని ఆదేశించా రు. రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థుల స్థూల నమోదు (గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో) 36 శాతం ఉండగా 2029 నాటికి 60 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొన్నారు. పౌర సేవలను సులభతరం చేయండిరియల్ టైమ్ గవర్నెన్స్ సరీ్వసెస్ (ఆరీ్టజీఎస్) ద్వారా పౌర సేవలను సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న ఆరీ్టజీఎస్ సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించి పనితీరును పరిశీలించారు. అనంతరం సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. -
వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి..
విశ్వవిద్యాలయాలు సమాజాన్ని నడిపించే మేధావులను తయారుచేసే కేంద్రాల వంటివి. చరిత్రను మలుపు తిప్పే ఉద్యమ కేంద్రాలుగానూ అనేకసార్లు నిరూపించుకున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ చరిత్రలో యూనివర్సిటీలు నిర్వహించిన పాత్ర అమోఘం. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీలు మలి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది.తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. అయితే ఇదంతా సాకారం చేయటానికి తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన విశ్వ విద్యాలయాల పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారుతోంది.2014లో స్వరాష్ట్రం వచ్చిన నాటి నుండి గడిచిన పదేండ్లలో విశ్వ విద్యాలయాలపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. యూనివర్సిటీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న విధంగా ఉంది. మౌలిక సదుపాయాలు కొత్తగా కల్పించినవి ఏమీ లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు లేక యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. అటెండర్ పోస్ట్ మొదలుకొని అధ్యాపక పోస్టు వరకూ ఎన్నో పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు చాలా యూనివర్సిటీలకు పెద్ద దిక్కు అయిన వైస్ ఛాన్స్లర్లు (వీసీలు) లేరు. ఇన్‌చార్జీలతోనే కాలం గడుపుతూ వచ్చింది గత ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ‘మార్పు కావాలి –కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అనుముల రేవంత్ రెడ్డి సర్కారు సైతం విశ్వవిద్యాలయాలను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోంది. వీసీల నియామకాలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెబుతున్నా అది సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఒకరిద్దరు వీసీ పదవితో పాటూ మరో ఉన్నత పదవినీ నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.విద్యారంగంలో నిష్ణాతులుగా ఉండి, ప్రొఫెసర్‌గా పదేళ్ళ అనుభవం ఉండి, మంచి పాలనా దక్షుడై ఉన్నవారే వీసీ పదవికి అర్హులు. కానీ ఈ ప్రమాణాలతో సంబంధం లేకుండా మంత్రులూ, కాంట్రాక్టర్లూ తమకు అత్యంత సన్నిహితులూ, క్లాస్‌మేట్లూ అయినవారిని కొన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులుగా నియమించాలని పావులు కదుపుతున్నట్లు యూనివర్సిటీ క్యాంపసుల్లో చర్చలు నడుస్తున్నాయి. వీసీల నియామకంలో మంత్రులు తమ తమ సామాజిక వర్గాలవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.దీన్నిబట్టి విశ్వ విద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంత భయంకరంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల జోక్యం తగ్గి, విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ఇప్పటికైనా ఉపకులపతుల ఎంపిక ప్రక్రియ, కేవలం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో, నిష్పక్ష పాతంగా, అందరి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేవిధంగా సాగాలి.అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో తెలియచేసే విజన్ డాక్యుమెంట్లను సైతం సేకరించి విశ్లేషించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి. అలా కాకుండా ప్రమాణాలను తుంగలో తొక్కి, అయినవారికే వీసీ పదవులను వడ్డిస్తే యూనివర్సిటీలు స్వరాష్ట్రంలోనూ బాగుపడవు. ఇక అందులో చదువుకునే యువత ఏవిధంగా తయారవుతారో ఊహించాల్సిందే!– జవ్వాజి దిలీప్; జేఎన్టీయూ పరిశోధక విద్యార్థి, హైదరాబాద్ -
బ్రిటీష్ కాలేజ్‌లో.. భారతీయ ఆయుర్వేదం
సనాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఇటు ఆధునిక భారతీయులు మాత్రమే కాదు, పాశ్చాత్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో యూకేలోని అతి పురాతన కళాశాలతో మన దేశానికి చెందిన ఆయుర్వేద ఆధునిక సమ్మిళిత వైద్యాన్ని ప్రోత్సహించే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద (పీఎస్ఏ) చేతులు కలిపింది.సాంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద (బీఎస్ఏ)లో మెజారిటీ వాటాను స్వంతం చేసుకునేందుకు వీలుగా అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.ఇందులో భాగంగా.. డాక్టర్ పోలిశెట్టి సాయి గంగా పనాకియా ప్రైవేట్ లిమిటెడ్ విభాగం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద (ఐపీఎస్ఎ)లు.. యూకేలోని పురాతన ఆయుర్వేద కళాశాలలో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో వినూత్న కోర్సులను పరిచయం చేయనుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే జీవనశైలి వేరియబుల్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఇదీ ఒకటి.ఈ కొత్త భాగస్వామ్యం యూకే, భారత్‌ల ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా దాని విస్త్రుతి పెరుగుతుందని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది బాగా తోడ్పడుతుందన్నారు.మా భాగస్వామ్యం ఆయుర్వేద విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక, ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్త్రుత నైపుణ్యాలను అందిస్తుంది. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యులను తయారు చేస్తుందని డాక్టర్ పోలిసెట్టి వెల్లడించారు.యూకే పార్లమెంట్‌లోని ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ ట్రెడిషనల్ సైన్సెస్ సెక్రటేరియట్ అమర్జిత్ భమ్రా సమక్షంలో డాక్టర్ పోలిశెట్టి, డాక్టర్ మౌరూఫ్ అథిక్, డాక్టర్ శాంత గొడగామా ఎమ్ఒయూపై సంతకం చేశారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు దిశగా కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ) చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అటానమస్ ఇన్స్టిట్యూట్ల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీ భవన్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో భారత్ మూడో ర్యాంకులో ఉందన్నారు. అంతేగాక నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో 9వ స్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలన్నారు. ప్రధాని మోదీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు. -
విద్యను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు
-
త్వరలో వర్సిటీల్లో ఖాళీల భర్తీ: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్ : సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడు నెలలకు సమీక్షా సమావేశం ఉంటుందనీ, దాంతో యూనివర్సిటీల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. యూనివర్సిటీలకు వీలయినంత త్వరలో వీసీలు వస్తారని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారనీ, ఇకపై మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో పెట్టేలా ప్రయత్నిద్దామని పేర్కొన్నారు. విద్యా రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడదామని కోరుతూ.. అందుకు ప్రభుత్వ సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు. -
ఎస్కేయూ, ద్రవిడ వీసీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు రాజీనామా చేసినా... ద్రవిడ, ఎస్కేయూ వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతుండడంపై హైకోర్టు వారి వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించే విషయంలో ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలను రద్దు చేసి, యూజీసీ నిబంధనల మేర తాజాగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ప్రొఫెసర్ పి.మునిరత్నంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. తర్వాత పిటిషనర్ తరఫు న్యాయవాది ఉగ్రనరసింహ వాదనలు వినిపిస్తూ, పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినా, ద్రవిడ, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతున్నారని, అందువల్ల వారిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చామన్నారు. దీంతో ధర్మాసనం ఆ ఇద్దరు వీసీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా బీ. మోహన్ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇంఛార్జ్‌గా కిరణ్ నియమితులు కాగా, కాకినాడ జేఎన్టీయూ, కేఎల్ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్‌లకు అప్పగించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా పీ, మురళీ, ఎస్కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
ఇంజిన్ ‘గేర్’ మార్చండి!
నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు.. పక్కన బెంజ్ ఉంది.. నువ్వేం కొంటావ్.. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఓ పెద్ద ప్లాస్మా టీవీ ఉంది.. నువ్వేం కొంటావ్.. అక్క అంబాసిడర్.. నేను బెంజ్.. అది పోర్టబుల్.. నేను ప్లాస్మా.. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్.. ఇది ఓ ఫేమస్ చిత్రంలోని సన్నివేశం.. ప్రస్తుతం ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్ పరిస్థితీ ఇలాగే ఉంది.. అందరికీ కావాల్సింది స్మార్ట్ టీవీలే. కానీ మన కాలేజీలు ఇంకా ఆ పాత పోర్టబుల్ టీవీలనే ఇస్తున్నాయి.. తప్పెవరిది?? శిక్షెవరికి??చింతకింది గణేశ్ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇంజనీరింగ్ విద్యలో రావట్లేదు. మన దేశంలో, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో ప్రవేశ పెట్టిన కోర్సులు మినహా మార్కెట్ అవసరాలకు మేరకు ఒక్క కోర్సునూ ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశించిన మేర లభించట్లేదు. దేశవ్యాప్తంగా ఏటా 17 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరు తుంటే, రాష్ట్రంలో 90 వేల మంది చేరుతున్నారు. రాష్ట్రంలో ఏటా 65వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు 27 శాతానికి మించి ఉండట్లేదు. అందుకే ఇంజనీరింగ్ విద్యలో రీఇంజనీరింగ్ అవసరం ఏర్పడింది. మార్కెట్ అవసరాల మేరకు ఈ విద్యలో సమూల మార్పులు తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇంజనీరింగ్ అంటే విలువలేని పరిస్థితి వస్తోంది. డిమాండున్న కోర్సులు అనేకమున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు అనేకం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి అనేక కోర్సులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రముఖ కంపెనీలన్నీ దృష్టిసారించాయి. సివి ల్, మెకానికల్ రంగాల్లో కూడా అనేక మార్పులొచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. అయినా అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తీసుకురావడంలో యూనివర్సిటీలు విఫలమవుతున్నాయి. కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్ టెక్నాలజీని అనుసరిస్తు న్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ స్కానింగ్ అండ్ ప్రిటింగ్ వంటి వాటిని అమలు చేస్తున్నాయి. అయినా వీటిపై ప్రత్యేక బీటెక్ కోర్సులు లేవు. క్లౌడ్ కంప్యూటింగ్.. మెజారిటీ కంపెనీలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోస్తున్నాయి. ఏఆర్, వీఆర్ అండ్ ఇమ్మర్సివ్ ఆర్కిటెక్చర్ విధానం ప్లానింగ్ రంగంలో కీలకంగా మారింది. బిగ్ డేటా అనాలిసిస్, ఆర్కిటెక్చర్ రొబోట్స్, త్రీడీ ప్రింటింగ్ కూడా కీలకంగా మారాయి. ఇందులో కొన్ని వివిధ కోర్సుల్లో ఓ సబ్జెక్టుగానే ఉన్నాయి తప్ప కోర్సులుగా ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో అయితే అవేవీ సబ్జెక్టుగా కూడా లేవు. ఏఐపై ప్రత్యేక దృష్టి ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐను బీటెక్ కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ చర్యలు చేపట్టింది. దేశంలోని మరే విద్యా సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలే కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ ఇస్తూ వాటిని నేర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఆ దిశగా కసరత్తు చేయట్లేదు. మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా 10 పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ వంటి అంశాల్లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని 700కు పైగా కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బీటెక్ డిగ్రీలతో పాటు వీటన్నింటినీ ప్రత్యేకంగా ప్రవేశపెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాల మేరకు.. రాష్ట్రంలో 198 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 95,235 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 72 వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతోంది. ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న 65 వేల మంది గ్రాడ్యుయేట్లలో 27 శాతం మందికే ఉపాధి లభిస్తుండగా మిగతా వారంతా నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. రాష్ట్రంలో ఫార్మా, సిమెంట్, ఐటీ, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మైన్స్ అండ్ మినరల్స్, టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, హార్టికల్చర్, పౌల్ట్రీ రంగాలు అధికంగా ఉన్నా వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేసి విద్యార్థులను అందించడంలో యూనివర్సిటీలు విఫలం అవుతున్నాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో దాదాపు 2 వేల మందికి పైగా ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పని చేస్తుండటం గమనార్హం. ఇదే సరైన సమయం.. ఇంజనీరింగ్‌లో కొత్త ఇంటర్న్‌షిప్ పాలసీని అమల్లోకి తేవాలని ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్సుల రీఇంజనీరింగ్‌కు చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా కోర్సుల రీడిజైన్‌తో పాటు స్థానికంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సులను తీర్చిదిద్దాలని చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగవుతాయని పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 600–700 గంటల ఇంటర్న్‌షిప్‌ను ఇటీవల ఏఐసీటీఈ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలపై పక్కాగా నేర్చుకునేలా ఇంటర్న్‌షిప్ అమలు చేయాలని చెబుతున్నారు. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్, ప్రాబ్లం సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మోటివేషన్ నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, టైమ్ మేనేజ్మెంట్, న్యూమరికల్ స్కిల్స్ కచ్చితంగా నేర్పించేలా సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. ఇటీవల వెల్లడైన ఇండియా స్కిల్ రిపోర్టు–2019లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లోనూ రెండో స్థానంలో ఉన్న తెలంగాణ విద్యార్థులు మిగతా వాటిన్నింటిలో వెనుకబడే ఉన్నారు. పట్టించుకోని వర్సిటీలు.. మార్కెట్, ఇండస్ట్రీ అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు తీసుకురావాల్సిన యూనివర్సిటీలు ఆ పని మానేశాయి. ఉస్మానియా, జేఎన్టీయూలు కేవలం కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాల మేరకు కోర్సుల రీఇంజనీరింగ్‌ను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తామే కోర్సులను రీడిజైన్ చేసుకుని అనుమతివ్వాలని కొన్ని ప్రైవేటు కాలేజీలు కోరినా.. ‘యూనివర్సిటీ కాలేజీల్లోనే లేదు.. మీకెలా అనుమతిస్తాం’అంటూ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పీజీ ఇంజనీరింగ్‌లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు సిలబస్ రూపొందించుకొని ఓ కాలేజీ అనుమతి కోరినా యూనివర్సిటీ ఇవ్వలేదు. దీంతో ఆ కోర్సును ఆ కాలేజీ ప్రవేశపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ రూపురేఖలు మార్చే కోర్సులివే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బిగ్ డేటా అనలిటిక్స్ ఇకనైనా మారిస్తే మేలు: కృష్ణారావు, చైర్మన్, స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ ఇకనైనా యూనివర్సిటీల తీరు మారాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు తేవాలి. వీలైతే విద్యార్థులకు మొదటి ఏడాది కోర్సుకు సంబంధించి పరిశ్రమల్లోనే పని చేసేలా చర్యలు చేపట్టాలి. లేదంటే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేయాలి. అవసరం లేనపుడు ఎలా వస్తారు: నర్సింహారెడ్డి, ఉన్నత విద్యా మండలి పాలక మండలి సభ్యుడు నల్లగొండలో యాభైకి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌కు సంబంధించి యూనివర్సిటీలో సమావేశమైన ప్రతిసారి వారిని ఆహ్వానించినా వారు రావట్లేదు. ఒకసారి అడిగితే ‘మా పరిశ్రమకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో సిలబస్ లేదు.. మేమొచ్చి ఏం చేయాలి.. మీరు చెప్పే చదువు చదువుకునే విద్యార్థులు మాకు పనికి రారు.. అలాంటపుడు వచ్చి చేసేదేముంది’అని పేర్కొన్నారు. మార్పులపై ప్రభుత్వానికి నివేదిస్తాం: తుమ్మల పాపిరెడ్డి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో అమలు అవుతున్న ఇంజనీరింగ్ విద్య స్థితి గతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తాం. రాష్ట్ర యువతకు నైపుణ్యాల పెంపుదలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం. – దేశవ్యాప్తంగా ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 57 శాతమే. అంటే మరో 43 శాతం మందికి నైపుణ్యాల్లేవు. ఇందులో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 42 శాతం మందిలోనే ఉద్యోగార్హ నైపుణ్యాలున్నాయి. 58 శాతం మందిలో ఆ నైపుణ్యాలు లేవు. ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించిన వాస్తవాలివీ. – చదువుతున్న చదువుకు పారిశ్రామిక అవసరాలకు సంబంధం లేకపోవడం, అవి కోరుకునే విద్యను ఇంజనీరింగ్ కాలేజీలు అందించకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ముందుకు రావట్లేదు. ఫలితంగా ఐటీ, ఐటీ సంబంధ రంగాలు మినహా మిగతా రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించట్లేదు. ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైన అంశాలివీ.. -
విశ్వవిద్యాలయాల నోరునొక్కితే.. దేశానికే నష్టం
సమాజంలో జటిలమౌతున్న సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పులని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామాజిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్ అండ్ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సామాజిక శాస్త్రాలకు ప్రోత్సాహం లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాలి. మానవ నాగరికతా పరిణామంలో గత శతాబ్దకాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. విద్యవైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభి వృద్ధీ, పెరిగిన శాస్త్రీయ ఆలోచనలూ, సామాజిక చైతన్యం వెరసి అసాధ్యమనుకున్నవెన్నో సుసాధ్యమవుతున్నాయి. మానవ వనరుల అభివృద్ధితో పాటు మనిషి సగటు ఆయుర్దాయం పెరిగింది. స్త్రీలకు విద్యావకాశాలు పెరిగాయి. ప్రాథమిక విద్య అయినా కనీసం అందరికీ అందుబాటులోకి వచ్చింది. తలసరి ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనపడు తోంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల మెరుగు ప్రజలను సాంకేతికత దరికి చేర్చింది. దాదాపు 50 శాతం మంది జనం మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఖండాంతరాల్లో ఉపాధి అవకాశాలు రావడంతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. సుదూర తీరాలకు మన యువతరం ఎగిరిపోతోంది. అయితే ఇదంతా నాణే నికి ఒకవైపు మాత్రమే. సంపద, విజ్ఞానం, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నా మరోవైపు నిశితంగా పరిశీలిస్తే విషాదకరమైన పరిస్థితి గోచరిస్తోంది. పైకి అభివృద్ధి కనిపిస్తోన్నా లోపల అంధ కారం గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో 120 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. కొద్దో గొప్పో బాగా ఉంటాయనుకున్న బ్యాంకాక్, మలే íసియా రాజధాని కౌలాలంపూర్లలో సైతం పేద కుటుంబాల్లో పిల్లలకు మంచి ఆహారాన్ని కొనుక్కో లేని స్థితిలో ఉన్నారు. బ్యాంకాక్‌లో మూడోవంతుకుపైగా చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నట్టు 2017 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్లోనైతే దేశం మొత్తంలో కేవలం నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే కనీస ఆహారాన్ని పొందగలుగుతున్నట్టు అక్కడి ప్రభుత్వమే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కల్లా ఆకలిని జయించాలంటే, పౌష్టికాహార లోపాలన్ని అధిగమించాలంటే ఈ రీజన్లో ప్రతి రోజూ 1,10,000 మంది ప్రజలకు సరైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. కనీస పారిశుద్ధ్య వసతు ల్లేక, ఆహార భద్రతకరువై 79 మిలియన్ల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు ఈ రీజన్లో వయస్సుకు తగిన ఎదుగుదల లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన దేశంలోని ఐదేళ్ళలోపు చిన్నారుల్లో 38 శాతం మందికి వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. 21 శాతం మంది ఐదేళ్ళలోపు చిన్నారులు వయసుకి తగ్గ బరువు తూగడంలేదు. మనదేశంలో స్త్రీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. తాజా గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు 2017 జాబితాలో భారతదేశం అట్టడుగు భాగంలో ఉంది. భారత్‌లో 51 శాతం మంది సంతానోత్పత్తి దశలో రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరికంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. రక్తహీనత విషయంలో మన తరువాతి స్థానాలు చైనా, పాకిస్తాన్, నైజీరియా, ఇండోనేíసియాలు ఆక్రమించాయి. 2016 గణాంకాల ప్రకారం మన దేశంలోని స్త్రీలలో 46 శాతం మందిని రక్తహీనత బాధిస్తోంది. కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్య, స్త్రీల సామాజిక సమస్యలకు కారణమవుతోంది. ఇక విద్య సంగతి చెప్పక్కర్లేదు. కనీస జీవన అవసరాలను తీర్చుకోగలిగేపాటి నైపుణ్యం కూడా విద్యార్థులకు ఈ చదువు అందించలేకపోతోంది. ఆకలి, ఆత్మహత్యల నివారణకు చర్యలు మృగ్యమ య్యాయి. అమెరికాలాంటి సంపన్నదేశాల్లో సైతం దారిద్య్రం తొంగిచూస్తోంది. యూరప్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. సమాజంలో జటిలమౌతున్న ఈ సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? అంటే మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పు లని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామా జిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్ అండ్ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సైన్స్ మరియు టెక్నాలజీలకు ఇచ్చే ప్రోత్సాహం సామాజిక శాస్త్రాలకు లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాల్సి వుంది. విదేశాల్లో వ్యాపార సంస్థల పరిశోధనా ఖర్చును సదరు సంస్థలే చూసుకుంటుంటే మన దేశంలో మాత్రం ప్రజాధనంతో పరిశోధన జరిపే విధానం చోటు చేసుకుంది. దేశంలో సామాజిక శాస్త్రాల్లో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసిన జెఎన్‌యు లాంటి యూనివర్సిటీని ధ్వంసం చేసుకుంటున్నాం. ప్రతి రోజూ దానిని వివాదాస్పద అంశాలకు కేంద్ర బిందువుని చేసి అక్కడ స్వేచ్ఛగా జరగాల్సిన మేథోమథనాన్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాం. కేంద్ర యూనివర్సిటీల్లో ప్రభుత్వ జోక్యం పెచ్చుమీరిపోయింది. దళిత బడుగువర్గాల పిల్లలు ఇప్పుడిప్పుడే వాటి గడప తొక్కుతుంటే వారికి అంతరాయం కల్పించే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. పరిశోధక విద్యార్థులకి అందే ఉపకార వేతనాలు కత్తిరించివేస్తున్నారు. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్త్యసేన్ లాంటి వారు సామాజిక శాస్త్రాల వృద్ధి కోసం నలందా యూనివర్సిటీని ఒక నమూనాగా ముందుకు తీసుకురాగా దానికి ఆదిలోనే గండి కొట్టారు. ఈ దేశంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తన పాత్రని ప్రతిభావంతంగా పోషించింది. దాని ఏర్పాటు కోసం తయారుచేయబడిన నియమాలు ప్రైవేటు యూనివర్సిటీల ప్రోత్సాహానికి ఆటంకంగా మారాయని, దానిని రద్దు చేసి ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేశారు. పరిశోధనలు వాటి విచక్షణ మేరకుగాక మార్కెట్ ప్రయోజనాల కోసం జరిగితే ప్రమాదం మరింత పెరుగు తుంది. వీటిల్లో అధ్యాపకుల నియామకాల్లో కూడా రిజర్వేషన్ అమలు నీరుగారిపోయే ప్రమాదముంది. విశ్వవిద్యాలయాలు సమాజపు ఉమ్మడి మెదడు లాంటివి. సామాజిక శాస్త్రాలు ఉమ్మడి మేధ స్సులాంటిది. ఇలాంటి విశ్వవిద్యాలయాలను ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ఈ దేశానికి ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడతాయి. సామాజిక శాస్త్రాల మూలాలను తొలగించడం అంటే సమాజంలో అశాంతిని పెంచి పోషించడమే. దేశంలో అశాంతి పెరిగితే ఈ దేశాన్ని గ్లోబల్ పవర్‌గా తయారు చేయలేకపోగా, ఇప్పటికే సాధించిన ఈ మాత్రం అభివృద్ధినీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య -
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీలను కేంద్ర బడ్జెట్ విస్మరించినా..ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, ఇనిస్టిట్యూషన్లకు కొంత మేర నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు ఎన్ఐటీకి రూ.54 కోట్లు ఐఐటీకి రూ.50కోట్లు ట్రిపుల్ ఐటీకీ రూ.30 కోట్లు ఐఐఎంకు రూ.42 కోట్లు ఐఐఎస్సీఆర్కు రూ.49 కోట్లు దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్‌లకు రూ.3,018 కోట్లు విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32 కోట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు రూ.19.62 కోట్లు స్టీల్ ప్లాంట్‌కు రూ . 1400 కోట్లు ఇక తెలంగాణలో సింగరేణికి రూ 2 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ట్రైబల్ వర్సిటీకి రూ. 2 కోట్లు, ఐఐటీకి రూ 75 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ 32 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. -
వర్సిటీలపై ఆధిపత్యం కోసమే..
సారంగాపూర్ : విశ్వవిద్యాలయాలపై గుత్తాధిపత్యం చెలాయించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ చాన్స్లర్లను నియమించిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్చాన్స్లర్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఉంటే గవరన్నర్ వైఎస్చాన్స్లర్లను నియమించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత నిబంధనలను మార్చుతూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ ప్రభుత్వానికి మెుట్టికాయలు వేసిందన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి రాజకీయాలకు అతీతంగా ఉంటాయన్న విషయాన్ని ప్రభ్వుత్వం గుర్తించాలన్నారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అజమాయిషీ చేయాలని చూస్తే విద్యార్థుల భవిష్యత్తుతో అడుకోవడమేనన్నారు. ఎంసెట్ పేపర్లు లీక్ కావడానికి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.