సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీలను కేంద్ర బడ్జెట్ విస్మరించినా..ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, ఇనిస్టిట్యూషన్‌లకు కొంత మేర నిధులు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు
ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు
గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు
ఎన్‌ఐటీకి రూ.54 కోట్లు
ఐఐటీకి రూ.50కోట్లు
ట్రిపుల్ ఐటీకీ రూ.30 కోట్లు
ఐఐఎంకు రూ.42 కోట్లు
ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49 కోట్లు
దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్‌లకు రూ.3,018 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32 కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు రూ.19.62 కోట్లు
స్టీల్ ప్లాంట్‌కు రూ . 1400 కోట్లు
ఇక తెలంగాణలో సింగరేణికి రూ 2 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ట్రైబల్ వర్సిటీకి రూ. 2 కోట్లు, ఐఐటీకి రూ 75 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ 32 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment