వర్సిటీలపై ఆధిపత్యం కోసమే..
Published Fri, Jul 29 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
సారంగాపూర్ : విశ్వవిద్యాలయాలపై గుత్తాధిపత్యం చెలాయించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ చాన్స్‌లర్లను నియమించిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌చాన్స్‌లర్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఉంటే గవరన్నర్ వైఎస్‌చాన్స్‌లర్లను నియమించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత నిబంధనలను మార్చుతూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ ప్రభుత్వానికి మెుట్టికాయలు వేసిందన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి రాజకీయాలకు అతీతంగా ఉంటాయన్న విషయాన్ని ప్రభ్వుత్వం గుర్తించాలన్నారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అజమాయిషీ చేయాలని చూస్తే విద్యార్థుల భవిష్యత్తుతో అడుకోవడమేనన్నారు. ఎంసెట్ పేపర్‌లు లీక్ కావడానికి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement