పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాలి
ఉన్నత విద్యా శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలి పారు. ఐఐఎం, ఐఐటీలకు ఉన్న విధంగా బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్‌పర్సన్స్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించాలని అధికారులకు సూచించారు. సీఎం మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ విధానంలో) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వర్సిటీని ఏర్పా టు చేయాలని ఆదేశించారు.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాల ని చెప్పారు. అధ్యాపకులు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు వర్సిటీలను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.
నవంబర్‌లోగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానం చేసి డీజీ లాకర్లో చేర్చాలని ఆదేశించా రు. రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థుల స్థూల నమోదు (గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో) 36 శాతం ఉండగా 2029 నాటికి 60 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొన్నారు.
పౌర సేవలను సులభతరం చేయండి
రియల్ టైమ్ గవర్నెన్స్ సరీ్వసెస్ (ఆరీ్టజీఎస్) ద్వారా పౌర సేవలను సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న ఆరీ్టజీఎస్ సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించి పనితీరును పరిశీలించారు. అనంతరం సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment