న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ) చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఆర్థిక సాయాన్ని పొంది అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. టెక్నాలజీ భవన్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో భారత్ మూడో ర్యాంకులో ఉందన్నారు. అంతేగాక నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో 9వ స్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలన్నారు. ప్రధాని మోదీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment