vc Appointment
-
డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వీసీ నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) నియామకం కోసం సోమవారం రిజిస్ట్రార్ (ఎఫ్ఏసీ) డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచారు. అర్హులైన వైద్యులు దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాలి. ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చు. వీసీ ఎంపికకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. గవర్నర్ నామినేట్ చేసిన విశ్వభారతి వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ గజ్జల వీరాంజిరెడ్డి, విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ నామినేట్ చేసిన శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, వీసీ డాక్టర్ వెంగమాంబ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
వర్సిటీలపై ఆధిపత్యం కోసమే..
సారంగాపూర్ : విశ్వవిద్యాలయాలపై గుత్తాధిపత్యం చెలాయించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ చాన్స్లర్లను నియమించిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్చాన్స్లర్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఉంటే గవరన్నర్ వైఎస్చాన్స్లర్లను నియమించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత నిబంధనలను మార్చుతూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ ప్రభుత్వానికి మెుట్టికాయలు వేసిందన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి రాజకీయాలకు అతీతంగా ఉంటాయన్న విషయాన్ని ప్రభ్వుత్వం గుర్తించాలన్నారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అజమాయిషీ చేయాలని చూస్తే విద్యార్థుల భవిష్యత్తుతో అడుకోవడమేనన్నారు. ఎంసెట్ పేపర్లు లీక్ కావడానికి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.