సాక్షి, హైదరాబాద్ : సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడు నెలలకు సమీక్షా సమావేశం ఉంటుందనీ, దాంతో యూనివర్సిటీల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. యూనివర్సిటీలకు వీలయినంత త్వరలో వీసీలు వస్తారని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారనీ, ఇకపై మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పెట్టేలా ప్రయత్నిద్దామని పేర్కొన్నారు. విద్యా రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడదామని కోరుతూ.. అందుకు ప్రభుత్వ సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment