మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మఠాల జొలికొచ్చే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు ఇంటికి పంపిస్తారని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ హెచ్చరించారు. ఇక్కడి జేఎస్‌ఎస్ ఆయుర్వేద ఆస్పత్రి, జేఎస్‌ఎస్ ఆస్పత్రి ప్రసూతి కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉంటాయని, వాటిని వదిలి మఠాలకు జోలికి రావడం సరికాదని హితవు పలికారు.
విద్య, వైద్య రంగాల్లో మఠాలు అందిస్తున్న సేవలు ప్రభుత్వాలకు మార్గదర్శకం కావాలన్నారు. పురాతన వైద్య విధానాల్లో ఒకటైన ఆయుర్వేదం అంతర్థానమవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలోపతి వల్ల దేహమంతా రసాయనాలతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంస్కృతిని కాపాడడానికి మఠాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
జాతరకు జనమే జనం
సుత్తూరు మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. జాతర అంటే కేవలం పూజా పురస్కారాలు మాత్రమే కాదని, ఆట పాటలు కూడానని ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరిగే జాతర జయప్రదం కావాలంటే, దాని వెనుక ఎంతటి శ్రమ ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ జాతర మహోత్సవం అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా జాతరలో ఓ ఏనుగు కాసేపు అలజడి సృష్టించింది. మావటీ నియంత్రణ నుంచి తప్పించుకుని అటు ఇటు తిరుగుతూ ఆందోళనను కలిగించింది. అయితే ఎవరి పైకి దాడికి దిగకుండా తనదైన శైలిలో కలకలం రేపింది.
మఠాల జోలికొస్తే మటాష్
Published Thu, Jan 30 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement