సంప్రదాయ వైద్య విధానాలు, అవి సూచించే జీవనశైలిని సరిగా అనుసరించగలిగితే కరోనా వంటి వైరస్‌లను ఎప్పుడైనా సరే ఎదుర్కోవడం సులభమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డా.విశాఖ మహేంద్రూ చెప్పారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో భాగంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
కోవిడ్ మహమ్మారిని నయం చేయడంలో ఆయుర్వేదం పాత్ర?
కోవిడ్‌ను నివారించడంలో ఆయుర్వేదానికి కీలక పాత్ర ఉంది, అయితే అది నేను వైరస్‌కి చికిత్స అని చెప్పను. గత కొంత కాలంగా కోవిడ్ లక్షణాలను బట్టి ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచే అనేక రకాల మూలికలను పంపిణీ చేశాం. వాటి ద్వారా ఎందరో మంచి ఫలితాలు అందుకున్నారు. వ్యక్తిని బట్టి వైద్యం చేయడం ఆయుర్వేద లక్షణం. కాబట్టి దేనికైనా సరే ముందుగా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించి, ఏమి తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి.
కరోనాతో పోరాడటానికి ఆయుర్వేదంలో ఏదైనా ప్రత్యేకమైన ఔషధం ఉందా?
కరోనా చికిత్సకు మేము ఆయుర్వేదంలో ప్రత్యేకమైన మందులేవీ ఇవ్వలేదు. కానీ కోవిడ్ వ్యాధిని నిరోధించడంలో భాగంగా మేం గిలోయ్, అశ్వగంధ వంటి మూలికలు చాలా సూచించాం. ఆయుర్వేదంలో, మేము నిర్దిష్ట వ్యాధితో కాకుండా వ్యక్తి లక్షణాల ప్రకారం మందులను సిఫార్సు చేస్తాం.
కోవిడ్ లాంటి వైరస్‌లతో పోరాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
సరైన సమయంలో, సరైన సమయంలో తినడంతో సహా అన్ని అంశాలలో ఆరోగ్యంగా ఉండాలని ఆయుర్వేదం సూచిస్తుంది. మనకు తగినంత జీర్ణశక్తి ఉండాలి. ఆయుర్వేదంలో దానిని ’అగ్ని’ అని పేర్కొంటాం. ఇది శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి వ్యాధితోనైనా పోరాడగలం. సరిగ్గా తినకపోతే, సరిగ్గా నిద్రపోకపోతే, పౌష్టికాహారం లేకుంటే ఏ ఔషధం పాత్రయినా పరిమితమే.
అల్లోపతిలో కోవిడ్ కోసం టీకాలు ఉన్నాయి.. మరి ఆయుర్వేదంలో?
ఏ రకమైన అంటువ్యాధి లేదా మహమ్మారి నైనా ముందే రాకుండా పనిచేసే ఔషధం ఉందని నేను అనుకోను. వ్యాక్సిన్ ఏదైనా వ్యాధి లేదా మహమ్మారికి ఖచ్చితమైన మందు కాదు. కోవిడ్, ఓమిక్రాన్ లేదా డెల్టా లేదా ఏదైనా రకమైన వేరియంట్ కారణంగా టీకాలు వేసిన వ్యక్తులు కూడా మళ్లీ వ్యాధి బారిన పడుతున్నారు కదా. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా ఉండడం ముఖ్యం. సరిగ్గా ఆయుర్వేదం ఇచ్చేది అదే.
సులువైన మార్గాల్లో రోగనిరోధక శక్తిని పొందడానికి కొన్ని చిట్కాలు...
రోగనిరోధక శక్తి అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మనం చాలా కాలం నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటేనే ఆకస్మికంగా వచ్చిపడే వ్యాధులపై పోరాడగలం. ముఖ్యంగా మనం ఏమి తింటామో అదే మనం. కాబట్టి సరిగ్గా తినడం, సమయానికి తినడం, సరైన పరిమాణంలో తినడం వంటివి తప్పక పాటించాలి. మనకు అందుబాటులో ఉన్నవే మనం తరుచుగా నిర్లక్షచచేస్తాం. ఉదాహరణకు బాదం.
మన రోజువారీ అభ్యాసంలో భాగంగా కొన్ని బాదంపప్పులను తినడం మేలు చేస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, కాపర్, జింక్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలు తినవద్దు, ఆహారం నిల్వ ఉంచడానికి అవసరమైన దినుసులు వాడి ఉండకూడదు తాజా పద్ధతిలో భోజనాన్ని ఉడికించాలి. పదేపదే ఆహారాన్ని మైక్రోవేవ్ లో వేడి చేయవద్దు. శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment