ఆయుష్మాన్‌ భవ! | ayurveda | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్‌ భవ!

Published Thu, Oct 27 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఆయుష్మాన్‌ భవ!

ఆయుష్మాన్‌ భవ!

- వేద కాలం నుంచే ఆయుర్వేద వైద్యం
- దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే అవకాశం
- నేడు ఆయుర్వేద దినోత్సవం
 
 
బండిఆత్మకూరు: కాలుష్యం, కల్తీ ఆహారం, ఒత్తిడితో గతి తప్పిన జీవన శైలి. అన్నింటితో అనారోగ్య సమస్యలు. 
ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వేదం తప్పనిసరి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేద భూమి అయిన భారత దేశంలో ఆయుర్వేదంను అధర్వణ వేదమునకు ఉపవేదంగా పేర్కొనబడింది. మానవుని ఆవిర్భావం నుంచి ఆరోగ్యానికి ఉన్న   ప్రాముఖ్యతను విఫులంగా ఇందులో వివరించబడింది. ఆయుస్సును గురించి తెలిపే జ్ఞానమును ఆయుర్వేదం అంటారు. పురాణ ఇతియాసముల ప్రకారం క్షీరసాగర మధనము జరిగినప్పుడు  లక్ష్మీదేవి, చంద్రుడు, ఇంద్రుడు, వాయు దేవుడితో పాటు భగవాన్‌ ధన్వంతరి కూడా ఆశ్వయిజ బహుళ త్రయోదశి నాడుఆవిర్భంవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే «ధన్వంతరి జయంతిని అనాదిగా జరుపుకుంటున్నారు. దీంతో ఈ రోజునే ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్స విధానం గురించి ప్రత్యేక కథనం. 
 
 
 
వేదకాలంలోనే ప్రస్తుత వైద్య విధానం 
భారత దేశంలో అతి పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న వైద్యం.. ఆయుర్వేదం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత  కొంచెం వెనుకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది. ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలి వ్యాధులఽను సైత్యం నయం చేయవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 
ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల జబ్బులకు వేద కాలంలోనే చికిత్సలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ప్రస్తుత వైద్య విధానాన్ని ఎనిమిది విభాగాలు విభజించారు. ఇందులో కాయచికిత్స(జనరల్‌ మెడిసిన్‌), బాలచికిత్స(ప్రసూతి, స్త్రీరోగ, బాలరోగ)లకు సంబంధించింది. గ్రహ చికిత్స(వైరాలజీ–యాంటిబాయటిక్స్‌), ఉర్ద్వా చికిత్స(తల, మెడ),  సెల్యచికిత్స(సర్జరీ),  దంష్ట్ర(పాము, తేలు, పురుగులకు),  జర చికిత్స(ముసలితనంలో వచ్చే రోగాలకు), రసాయన చికిత్స(ఇమ్యూనాలజీ). 
 
పంచకర్మ ప్రసిద్ధి
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స విధానం ఓ విశిష్ట చికిత్స పద్ధతి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మందులకు లొంగని మొండి వ్యాధులను పంచకర్మ ఒక అద్భుత చికిత్స. వ్యాధిని మూలము నుంచి తీసి వేయడానికి ఈ చికిత్స విధానం తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఐదు పద్థతులు ఇవే. స్నేహనము, స్వేదనము, వయనము, విరేచనము, వస్తి ఇందులో స్నేహనము, స్వేదనములను పూర్వ కర్మలు అంటారు. శరీరంలో ఉన్న మలినాలన్నింటిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా మూడు నోటి ద్వారా, విరేచనం ద్వారా జబ్బులను తొలగించడానికి వేస్తారు. అయితే జిల్లాలో ఒక పంచ కర్మ యూనిట్‌ కూడా లేకపోవడం విచారకరమని రోగులు చెబుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో ఇటీవల సుమారు 58 లక్షల నిధులతో పంచకర్మ యూనిట్‌కు నిధులు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 
 
బ్రిటీషుల రాకతో తగ్గిన ఆదరణ
  బ్రిటీషులు రాకతో భారతదేశంలో హల్లోపతి మందుల వాడకం పెరిగింది. ఆంగ్లీయుల సైనికులకు గాయాలైనప్పుడు వారికి త్వరగా నయమయ్యేందుకు ఇంగ్లీష్‌ మందులను ఉపయోగించారు. దీంతో మన దేశంలో ప్రజలు కూడా వారిలాగే త్వరగా నయం కావాలని రోజువారి జబ్బులైన తలనొప్పి, జలుబు, జ్వరం తదితర వాటికి ఇంగ్లీష్‌ మందులను వినియోగిస్తున్నారు. ఈ విధంగా ఆంగ్లీయుల రాకతో ఆయుర్వేద వైద్యాన్ని భారతీయులకు అంటగట్టి బలవంతులను బలహీనులుగా మార్చారని పూర్వీకుల వాదన. అయితే హల్లోపతి మందులతో దుష్పపరిణామాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెలుగులోకి తేవడంతో ప్రజలు మళ్లీ ఆయుర్వేద వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. 
 
 
అన్ని రోగాలకు రకాలకు మందులు .
 ఆయుర్వేదంలో అన్ని రోగాలకు రకాలకు మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  సంతాన సాఫల్యత, ఆడ, మగ హార్మోన్‌ అసమానతలు, కడుపు నొప్పి, రొమ్ములో గడ్డలుమెనోపాజ్‌ తదితర స్త్రీల వ్యాధులకు, బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, ఆసిడిటీ, గ్యాస్‌ట్రబుల్, అజీర్ణం, మలబద్ధత, ఫైల్స్, ఫిషర్స్, సయాటికా, నడుము నొప్పి, కీళ్ల వాతం, చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా మందులు ఉన్నాయి. కాగా 
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే నేషనల్‌ ఆయుర్వేద మిషన్‌(నాం) వద్ద కోట్లాది రూపాయల నిధులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదు. 50 సంవత్సరాలు దాటిన పురుషులు, స్త్రీలకు ఎక్కువగా కీళ్లనొప్పులతో అవస్థలు పడుతున్నారు. ఇందుకు అవసరమైన వైద్యం అందించడానికి తైలం ప్రభుత్వం సరఫరా చేయడం లేదు.  
 
వంటకాల్లో ఎన్నో మూలికలు: యశోధర, ఎండీ, ఆయుర్వేద, బండిఆత్మకూరు 
ప్రస్తుతం మనము ఉపయోగించే వంటకాల్లో ఎన్నో మూలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆవాలు, జీలకర, మిరియాలు, ధనియాలు, ఇంగువా, సొంటిలో ఎన్నో ఔషధ మూలికలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించి ఒక్కో జబ్బుకు ఒక్కో రకం మూలికను ఉపయోగించి మందులను తయారు చేస్తున్నారు. రోగులు జబ్బు వచ్చిన తర్వాత మొదటి సారిగా ఆయుర్వేద వైద్యులను కలిస్తే ఉపయోగంగా ఉంటుంది. అయితే హలో​‍్లపతి, హోమియోపతి ద్వారా చికిత్స చేయించుకున్న తగ్గనప్పుడే ఆయుర్వేదానికి వస్తున్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement