deseaces
-
జుట్టు రాలడం.. బరువు తగ్గడం జింక్ లోపం కావచ్చు!
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.గాయాలు నయం కాకపోవడం..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.బరువు తగ్గడం..జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.జుట్టు రాలడం..జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.తరచూ జలుబు..జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.చూపు మసక బారడం..ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.అయోమయం..మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.సంతానోత్పత్తిపై ప్రభావం..జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.రోగనిరోధక శక్తి బలహీనం..శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.ఇలా నివారించాలి..జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..?? -
Polio virus: పదేళ్ల తర్వాత పోలియో కలకలం.. తొలి కేసు నమోదు!
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. రాక్లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్రం వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్(ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. ‘ అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు.’ అని పేర్కొంది న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా చేస్తున్న కృషి వల్ల పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. మొత్తం 3,50,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మాత్రం 1960లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. నేరుగా పోలియో సోకిన కేసు 1979లో నమోదైంది. ఇదీ చదవండి: New Polio Virus In London: పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! -
వణుకు
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత – గత ఏడాది కంటే మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు – ఆస్తమా, గుండె జబ్బులుంటే జాగ్రత్తలు తప్పనిసరి సాయంత్రం ఆరు దాటితే చాలు.. చలిగాలి వణికిస్తోంది. రాత్రి 8 గంటలు దాటితే ఇంటికి ఎప్పుడెప్పుడు చేరుకుందామా అనుకుంటున్నారు. రాత్రి 10 గంటలు దాటితే కాలు బయట పెట్టేందుకూ జంకాల్సిందే. ఇక ఉదయం 7 గంటలు దాటినా దుప్పటి తీయాలనిపించదు. ఇదీ ప్రస్తుతం కర్నూలు నగరంలోని వాతావరణ పరిస్థితి. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో నెలరోజులుగా చలితీవ్రత పెరిగింది. మధ్యలో తుపాను ప్రభావం కారణంగా నాలుగు రోజులు విరామం లభించినా మళ్లీ చలి తన పంజా విసురుతోంది. ప్రధానంగా అటవీ ప్రాంతమైన శ్రీశైలం, సున్నిపెంట, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, మహానంది, యాగంటి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరువెళ్ల, బనగానపల్లి, నంద్యాల తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కర్నూలు నగరంతో పాటు డోన్, పాణ్యం, కల్లూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో చలి మధ్యస్తంగా ఉంది. ఆదోని డివిజన్లో కర్నూలు, నంద్యాల డివిజన్ల కంటే కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గాయి. ఆసుపత్రుల చుట్టూ పరుగులు చలి తీవ్రత పెరగడంతో ఆస్తమా, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, గుండె సమస్యలున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు సాయంత్రం 6 గంటలకే ఇంటికి చేరుకుంటున్నారు. మరునాడు ఉదయం 9 గంటల తర్వాత కూడా బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జలుబు, దగ్గు, జ్వరంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పసిపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రధానంగా ఉన్ని దుస్తులను నగరంలోని అవుట్ డోర్ స్టేడియం వద్ద టిబెటియన్లు ఏర్పాటు చేసిన సెంటర్లలో కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆస్తమా రోగులు చలికాలంలో జాగ్రత్త చల్ల గాలిలో వాకింగ్‌కు వెళ్లకూడదు. గుండెజబ్బులు, ఆస్తమా, అలర్జీ ఉన్న వారు చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా ఉన్న వారు కొండ ప్రాంతాలు, చల్లగాలులు అధికంగా ఉండే ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లరాదు. పిల్లలను సైతం చలిగాలి తగలకుండా ఉన్ని దుస్తులు కప్పి ఉంచాలి. – డాక్టర్ నెమలి రవికుమార్‌రెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు రెండేళ్లుగా నవంబర్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు తేదీ 2015 2016 20 21.2 16.6 21 22.4 16.9 22 20.8 15.2 23 21.5 15.4 24 20.6 14.5 25 20 16 26 18.2 17 27 18 17.1 -
ఆయుష్మాన్ భవ!
- వేద కాలం నుంచే ఆయుర్వేద వైద్యం - దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే అవకాశం - నేడు ఆయుర్వేద దినోత్సవం బండిఆత్మకూరు: కాలుష్యం, కల్తీ ఆహారం, ఒత్తిడితో గతి తప్పిన జీవన శైలి. అన్నింటితో అనారోగ్య సమస్యలు. ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వేదం తప్పనిసరి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేద భూమి అయిన భారత దేశంలో ఆయుర్వేదంను అధర్వణ వేదమునకు ఉపవేదంగా పేర్కొనబడింది. మానవుని ఆవిర్భావం నుంచి ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యతను విఫులంగా ఇందులో వివరించబడింది. ఆయుస్సును గురించి తెలిపే జ్ఞానమును ఆయుర్వేదం అంటారు. పురాణ ఇతియాసముల ప్రకారం క్షీరసాగర మధనము జరిగినప్పుడు లక్ష్మీదేవి, చంద్రుడు, ఇంద్రుడు, వాయు దేవుడితో పాటు భగవాన్ ధన్వంతరి కూడా ఆశ్వయిజ బహుళ త్రయోదశి నాడుఆవిర్భంవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే «ధన్వంతరి జయంతిని అనాదిగా జరుపుకుంటున్నారు. దీంతో ఈ రోజునే ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్స విధానం గురించి ప్రత్యేక కథనం. వేదకాలంలోనే ప్రస్తుత వైద్య విధానం భారత దేశంలో అతి పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న వైద్యం.. ఆయుర్వేదం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంచెం వెనుకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది. ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలి వ్యాధులఽను సైత్యం నయం చేయవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల జబ్బులకు వేద కాలంలోనే చికిత్సలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ప్రస్తుత వైద్య విధానాన్ని ఎనిమిది విభాగాలు విభజించారు. ఇందులో కాయచికిత్స(జనరల్ మెడిసిన్), బాలచికిత్స(ప్రసూతి, స్త్రీరోగ, బాలరోగ)లకు సంబంధించింది. గ్రహ చికిత్స(వైరాలజీ–యాంటిబాయటిక్స్), ఉర్ద్వా చికిత్స(తల, మెడ), సెల్యచికిత్స(సర్జరీ), దంష్ట్ర(పాము, తేలు, పురుగులకు), జర చికిత్స(ముసలితనంలో వచ్చే రోగాలకు), రసాయన చికిత్స(ఇమ్యూనాలజీ). పంచకర్మ ప్రసిద్ధి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స విధానం ఓ విశిష్ట చికిత్స పద్ధతి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మందులకు లొంగని మొండి వ్యాధులను పంచకర్మ ఒక అద్భుత చికిత్స. వ్యాధిని మూలము నుంచి తీసి వేయడానికి ఈ చికిత్స విధానం తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఐదు పద్థతులు ఇవే. స్నేహనము, స్వేదనము, వయనము, విరేచనము, వస్తి ఇందులో స్నేహనము, స్వేదనములను పూర్వ కర్మలు అంటారు. శరీరంలో ఉన్న మలినాలన్నింటిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా మూడు నోటి ద్వారా, విరేచనం ద్వారా జబ్బులను తొలగించడానికి వేస్తారు. అయితే జిల్లాలో ఒక పంచ కర్మ యూనిట్ కూడా లేకపోవడం విచారకరమని రోగులు చెబుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో ఇటీవల సుమారు 58 లక్షల నిధులతో పంచకర్మ యూనిట్‌కు నిధులు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. బ్రిటీషుల రాకతో తగ్గిన ఆదరణ బ్రిటీషులు రాకతో భారతదేశంలో హల్లోపతి మందుల వాడకం పెరిగింది. ఆంగ్లీయుల సైనికులకు గాయాలైనప్పుడు వారికి త్వరగా నయమయ్యేందుకు ఇంగ్లీష్ మందులను ఉపయోగించారు. దీంతో మన దేశంలో ప్రజలు కూడా వారిలాగే త్వరగా నయం కావాలని రోజువారి జబ్బులైన తలనొప్పి, జలుబు, జ్వరం తదితర వాటికి ఇంగ్లీష్ మందులను వినియోగిస్తున్నారు. ఈ విధంగా ఆంగ్లీయుల రాకతో ఆయుర్వేద వైద్యాన్ని భారతీయులకు అంటగట్టి బలవంతులను బలహీనులుగా మార్చారని పూర్వీకుల వాదన. అయితే హల్లోపతి మందులతో దుష్పపరిణామాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెలుగులోకి తేవడంతో ప్రజలు మళ్లీ ఆయుర్వేద వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. అన్ని రోగాలకు రకాలకు మందులు . ఆయుర్వేదంలో అన్ని రోగాలకు రకాలకు మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సంతాన సాఫల్యత, ఆడ, మగ హార్మోన్ అసమానతలు, కడుపు నొప్పి, రొమ్ములో గడ్డలుమెనోపాజ్ తదితర స్త్రీల వ్యాధులకు, బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, ఆసిడిటీ, గ్యాస్ట్రబుల్, అజీర్ణం, మలబద్ధత, ఫైల్స్, ఫిషర్స్, సయాటికా, నడుము నొప్పి, కీళ్ల వాతం, చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు ఉన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే నేషనల్ ఆయుర్వేద మిషన్(నాం) వద్ద కోట్లాది రూపాయల నిధులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదు. 50 సంవత్సరాలు దాటిన పురుషులు, స్త్రీలకు ఎక్కువగా కీళ్లనొప్పులతో అవస్థలు పడుతున్నారు. ఇందుకు అవసరమైన వైద్యం అందించడానికి తైలం ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. వంటకాల్లో ఎన్నో మూలికలు: యశోధర, ఎండీ, ఆయుర్వేద, బండిఆత్మకూరు ప్రస్తుతం మనము ఉపయోగించే వంటకాల్లో ఎన్నో మూలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆవాలు, జీలకర, మిరియాలు, ధనియాలు, ఇంగువా, సొంటిలో ఎన్నో ఔషధ మూలికలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించి ఒక్కో జబ్బుకు ఒక్కో రకం మూలికను ఉపయోగించి మందులను తయారు చేస్తున్నారు. రోగులు జబ్బు వచ్చిన తర్వాత మొదటి సారిగా ఆయుర్వేద వైద్యులను కలిస్తే ఉపయోగంగా ఉంటుంది. అయితే హలో్లపతి, హోమియోపతి ద్వారా చికిత్స చేయించుకున్న తగ్గనప్పుడే ఆయుర్వేదానికి వస్తున్నారు.