బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది. ఒక్కొక్క టీ స్పూన్ వెన్న, ఓట్స్ పొడిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుదేలుతుంది.
అరకప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారాక వడకట్టి నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉదయం, రాత్రి క్రమం తప్పకుండా రెండు వారాలపాటు రాసుకుంటే పగుళ్లు తగ్గి, కాళ్ళు మృదువుగా ఉంటాయి.